అమెరికా ఫార్మా సంస్థ తయారుచేసిన టాబ్లెట్‌ కు బ్రిటన్ ఆమోదం తెలిపింది

కరోనా మహమ్మారిపై  అన్ని దేశాలు అలుపెరగని పోరాటం చేస్తున్నాయి. వివిధ రకాల వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రావడంతో వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఆయితే అమెరికాకు చెందిన మెర్క్, రిడ్జ్ బ్యాక్ బయోథెరప్యుటిక్స్ సంస్థలు సంయుక్తంగా రూపొందించిన  ఒక టాబ్లెట్‌ (Covid Tablet) కరోనా మహమ్మారికి చెక్ పెట్టనున్నదని తెలుస్తుంది. మాత్ర వినియోగానికి అనుమతిస్తున్నట్టు బ్రిటన్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది.
మోల్నుపిరావిర్ పేరుతో తయారైన ఈ మాత్రను కోవిడ్ పాజిటివ్‌గా వచ్చిన ఐదు రోజుల్లోపు తీసుకోవడం ప్రారంభించాలని బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ (ఎమ్‌హెచ్ఆర్ఏ) సూచించింది. . ఈ టాబ్లెట్‌పై అమెరికాలో సమీక్షలు జరుగుతుండగా,  బ్రిటన్ ఈ సంచలన నిర్ణయం తీసుకొని వినియోగానికి అవసరమైన అనుమతులు జారీ చేసింది.

మోల్నుపిరావిర్‌  వల్ల వ్యాధి తీవ్రత తగ్గి ఆస్పత్రిపాలయ్యే ప్రమాదం దాదాపు 50 శాతానికి పైగా తగ్గిపోతుంది అని తెలుస్తుంది.

Add new comment

1 + 4 =