అమెరికా అత్యున్నత పౌర గౌరవాన్ని అందుకోనున్న కథోలిక కన్యస్త్రీ

కథోలిక కన్యస్త్రీసైమన్ కాంప్‌బెల్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వచ్చే వారం ఆ దేశ అత్యున్నత పౌర గౌరవాన్ని కథోలిక కన్యస్త్రీకి   ప్రదానం చేయనున్నారు.

సైమన్ కాంప్‌బెల్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్‌ను అందుకోనున్నట్లు వైట్ హౌస్ శుక్రవారం ప్రకటించింది. సిస్టర్ క్యాంప్‌బెల్ గత సంవత్సరం వరకు కథోలిక సామాజిక న్యాయ లాబీయింగ్ సంస్థ నెట్‌వర్క్‌కు అధ్యక్షురాలిగా వ్యహరించారు.

అమెరికాలో అభివృద్ధి, విలువలు లేదా భద్రతకు ఆదర్శప్రాయమైన కృషి చేసిన అమెరికన్లకు ఈ అవార్డు ఇవ్వబడుతుంది.  సిస్టర్ క్యాంప్‌బెల్‌ను "ఆర్థిక న్యాయం, ఇమ్మిగ్రేషన్ సంస్కరణలు మరియు ఆరోగ్య సంరక్షణ విధానానికి ప్రముఖ న్యాయవాది"గా అభివర్ణిస్తూ వైట్ హౌస్ నుండి ఒక ప్రకటన వెలువడింది. 

జూలై 7న జరిగే వైట్ హౌస్ వేడుకలో పతకాన్ని అందుకోనున్న 17 మందిలో సిస్టర్ క్యాంప్‌బెల్ ఒకరు.

దీనిపై సిస్టర్ క్యాంప్‌బెల్ ట్విట్టర్‌లో స్పందిస్తూ, "ఈ ఊహించని గుర్తింపుతో నేను చాలా గౌరవించబడ్డాను" అని వ్రాసారు.

అమెరికా రాజకీయాల్లో  సిస్టర్ క్యాంప్‌బెల్ సుపరిచితమైన వ్యక్తి . 2012 మరియు 2020లో రెండు డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్‌లలో ప్రసంగించారు. ఆమె "నన్స్ ఆన్ ది బస్"ను నిర్వహించింది, ఆమె మరియు ఇతర కన్యస్త్రీలను అమెరికాలోని వందలాది కార్యక్రమాలకు  తీసుకువెళ్లారు.  సిస్టర్ క్యాంప్‌బెల్ స్థోమత రక్షణ చట్టం 2010లో అమలులోకి వచ్చినప్పుడు దానికి తీవ్రమైన మద్దతుదారుగా ఉన్నారు మరియు ఇటీవల, ఆమె 2020 ఎన్నికలలో చురుకుగా పనిచేసారు, అధ్యక్షుడు ట్రంప్‌కు ఓటు వేయవద్దని కథోలికులను కోరారు.

ఇతర గ్రహీతలలో ఒలింపియన్ సైమన్ బైల్స్; సాండ్రా లిండ్సే, క్లినికల్ ట్రయల్స్ వెలుపల కోవిడ్-19 వ్యాక్సిన్‌ను స్వీకరించిన మొదటి వ్యక్తి అయిన క్రిటికల్ కేర్ నర్సు; మరియు రిచర్డ్ ట్రుమ్కా, గత సంవత్సరం మరణించిన కార్మిక సంఘం నాయకుడు. నటుడు డెంజెల్ వాషింగ్టన్, ఫాదర్ అలెగ్జాండర్ కార్లౌట్సోస్, అమెరికా గ్రీక్ ఆర్థోడాక్స్ అగ్రమేత్రాసనం మాజీ వికార్ జనరల్ మరియు దివంగత సెనేటర్ జాన్ మెక్‌కెయిన్‌లకు కూడా పతకాలు అందజేయనున్నారు.

Add new comment

1 + 1 =