అమెరికాలో క్రిస్మస్ పరేడ్‌‌పై దూసుకెళ్లిన వాహనం

 అమెరికాలో క్రిస్మర్ పరేడ్‌పైకి వాహనం దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. విస్కోన్సిన్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనలో పలువురు చనిపోగా, 20 మందికిపైగా గాయపడినట్టు పోలీసులు తెలిపారు. వీరిలో చిన్న పిల్లలు కూడా వున్నారు.  వౌకేషా పట్టణం మిల్వాకీ శివారు ప్రాంతంలో స్థానిక కాలమాన ప్రకారం ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు క్రిస్మస్ పరేడ్ జరుగుతుండగా  ఈ సంఘటన చోటుచేసుకుంది. నిందితుడు ఉద్దేశపూర్వకంగానే దాడికి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు.

Add new comment

1 + 3 =