అమెజాన్ సినడ్ అక్టోబర్ 6 ,2019 న ప్రారంభం

Amazon SynodAmazon Synod

అమెజాన్ సినడ్ అక్టోబర్ 6 ,2019 న ప్రారంభం

 

ఆదివారం అక్టోబర్ 6 న సెయింట్ పీటర్స్ బాసిలికా లో ఉదయం దివ్యపూజాబలితో ఫ్రాన్సిస్ పాపు గారు అమెజాన్  సినడ్ ను ప్రారంభించారు. దేశీయ ప్రజల ప్రతినిధులు అనేక సంఖ్యలో ఈ సినడ్ లో పాల్గొన్నారు. వీరిలో కొందరు సినడ్ హాల్ లో జరుగు ప్రత్యేక చర్చలో కూడా పాల్గొంటారు.

అమెజాన్ లోని దేశీయ సంప్రదాయాలను ప్రభావితం చెయ్యకుండా వాటిని గౌరవిస్తూ దేవుని వాక్య పరిచర్య ఎలా ప్రజలవద్దకు తీసుకువెళ్లాలి అనే అంశం సినడ్ లో చర్చనీయాంశం కానుంది. "క్రొత్త విధమైన వలసవాదం నుండి ఆ పరమ తండ్రి మనలను సంరక్షించు గాక. ఈ మధ్య కాలం లో అమెజాన్ లో రగిలిన విధ్వంసకర అగ్ని, సువార్త ప్రేరేపితం కాదు. తండ్రి వలన పుట్టు వెచ్చని అగ్ని అందరిని ఆకర్షించి, వారిని ఐక్యత గా నడిపిస్తుంది. "అని పాపు గారు ప్రభోదించారు.

అమెజాన్ లో శతాబ్దాలనుంది సువార్త సేవకు తమ ప్రాణాలను అర్పించిన వారిని పాపు గారు స్మరించారు.

ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ "మా ప్రియమైన కార్డినల్ హుమ్స్ గారి మాటలను ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలనుకొంటున్నాను. అమెజాన్ లోని చిన్న చిన్న పల్లెలను ఆయన సందర్శించినప్పుడు అక్కడి చనిపోయినవారిలో సువార్త సేవకొరకు మరణించినవారి సమాధులను సందర్శించి అక్కడ ప్రార్ధించేవారు. సువార్త కొరకు తమ ప్రాణాలను బలి ఇచ్చిన వారికి క్రీస్తు తరుపునుండి ఇది ఒక కృతజ్ఞతా సంజ్ఞ." అని అన్నారు.

సినడ్ కొరకు నియమించిన మేత్రాణులందరు హాజరు కాగా, వీరిలో 113 మంది అమెజాన్ లో పని చేస్తున్నవారే. అమెజాన్ ప్రాంతంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లు, వ్యతిరేకతలు బాగా తెలిసిన వారు కనుక ఈ సినడ్ ద్వారా ఒక పరిష్కారం కనిపిస్తుందని వారు ఆశిస్తున్నారు.

జేవియర్ మార్టినెజ్ బ్రోకల్
అనువాదకర్త: అరవింద్ బండి

Add new comment

6 + 9 =