అదిలాబాద్ మేత్రాసన ఉపగురువులకు పట్టాభిషేకం.

15 మే 2022న అదిలాబాద్ మేత్రాసనం, మంచిర్యాల, యేసు తిరుహృదయ దేవాలయము నందు డీకన్ పట్టాభిషేక మహోత్సవం జరిగింది.

అదిలాబాద్ మేత్రానులు మహా పూజ్య. అంథోని ప్రిన్స్ గారు మరియు విశ్రాంత పీఠాధిపతులు మహా పూజ్య. జోసఫ్ కున్నత్ గార్లు బ్రదర్ అరుణ్ కందతిల్ మరియు బ్రదర్ వినోద్ కున్నపల్లి లను ఉపగురువులుగా అభిషేకించారు. 
బ్రదర్ శ్రీకాంత్ దుర్గం సబ్ డీకన్ పట్టాను మరియు నలుగురు గురువిద్యార్థులు పఠన పరిచర్య పట్టాను స్వీకరించారు.

అదిలాబాద్ మేత్రాసనంలో అనేకులు దైవ పిలుపు పొంది, గురువులుగా సేవ చేసి విశ్వాసులను ప్రభువు వైపు నడిపించాలని మరియు ఉపగురువులుగా పట్టాను పొందిన వారికి  
అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం వారి శుభాకాంక్షలు.

Add new comment

8 + 8 =