అంతర్జాతీయ యోగా దినోత్సవం

అంతర్జాతీయ యోగా దినోత్సవం

అంతర్జాతీయ యోగ దినోత్సవము ప్రతి సంవత్సరం జూన్ 21 న జరుపుకుంటారు.[1] 2014 సెప్టెంబరు 27న భారత ప్రధాని నరేంద్రమోడి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకొనుట గురించి ప్రతిపాదన చేశారు.ఈ తీర్మానానికి 193 ఐరాస ప్రతినిధులలో 175 మంది మద్దతు ఇచ్చారు. భద్రతా కమిషన్‌లో శాశ్వత సభ్యులుగా ఉన్న అమెరికా , ఇంగ్లాండ్ , చైనా , ఫ్రాన్స్ , రష్యా వంటి దేశాలు కూడా ఈ తీర్మానానికి సహ ప్రతినిధులు. విస్తృతమైన చర్చల తరువాత డిసెంబర్ 2014 లో ఆమోదించబడింది.2015 జూన్ 21 న, మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు.

యోగా ప్రాధాన్యతను నలుగురికీ తెలిసేలా చేయడమే యోగా దినోత్సవం ఉద్దేశ్యం. యోగా అనేది ప్రజల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా..రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. నిజానికి మానవుని యొక్క అనంతమైన మేధాశక్తి..ఆత్మశక్తిల కలయికనే యోగ అంటారు.

నిత్యం యోగా చేయడం వల్ల శరీరాన్ని మనస్సును మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అందుకే ఒత్తిడిని అధిగమించడానికి శారీరక ఆరోగ్యం కోసం  ప్రపంచం మొత్తం యోగాను తమ జీవన విధానంలో భాగంగా చేసుకుంటోంది.

భారతీయ ఆరోగ్య వర ప్రదాయిని ‘యోగా’ ఔన్నత్యం ప్రపంచ నలుమూలలకూ వ్యాప్తి చెందింది. యోగాలో చాలా రకాలున్నాయి. రాజ యోగ, భక్తి యోగ, కుండలినీ యోగ, కర్మ యోగ, స్వర యోగ, మంత్ర యోగ, హరి యోగ, అష్టంగమంత్ర యోగ.. ఇలా చాలా రకాలుగా యోగాను ఆచరించవచ్చు. ఒక్కో ప్రక్రియ వల్ల ఒక్కో ఫలితం ఉంటుంది.

 

Add new comment

1 + 8 =