అంతర్జాతీయ పుణ్యక్షేత్రం'గా గుర్తించిన యాంటిపోలో దేవాలయం

యాంటిపోలో సిటీలోని అవర్ లేడీ ఆఫ్ పీస్ అండ్ గుడ్ వాయేజ్‌ దేవాలయాన్ని "అంతర్జాతీయ పుణ్యక్షేత్రం"గా వాటికన్ ప్రకటించింది.
యాంటిపోలో పీఠాధిపతులు మహా పూజ్య ఫ్రాన్సిస్కో డి లియోన్ గారు శనివారం మాట్లాడుతూ, మేత్రాసన కథెడ్రల్ పుణ్యక్షేత్ర ప్రత్యేక హక్కు పిటిషన్‌ను వాటికన్ ఆమోదించిందని తెలియజేశారు.
"జూన్ 18 ,2022న, మా జాతీయ పుణ్యక్షేత్రం అంతర్జాతీయ పుణ్యక్షేత్రంగా గుర్తించబడుతుందని రోమ్ నగరం నుంచి వచ్చిన లేఖలో స్పష్టం చేయబడిందని పీఠాధిపతులు లియోన్ గారు తెలియపరిచారు.
మేత్రాసన 39వ వ్యవస్థాపక వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దివ్యబలిపూజలో పీఠాధిపతులవారు తన ప్రసంగంలో పుణ్యక్షేత్ర ప్రకటన చేశారు.
అయితే మేత్రాసన అధికారిక ప్రకటన పత్రాన్ని ఇంకా అందుకోలేదని చెప్పారు.
యాంటిపోలో పుణ్యక్షేత్రం ఆసియాలో ఖండంలో మూడవదిగా, భారతదేశం మలయత్తూర్ లోని సెయింట్ థామస్ దేవాలయం తరువాత 11వ అంతర్జాతీయ పుణ్యక్షేత్రంగా నిలుస్తుంది.
యాంటిపోలో అంతర్జాతీయ పుణ్యక్షేత్రం ఆసియా ఖండంలో మొదటి మరియతల్లి పుణ్యక్షేత్రంగా ప్రపంచంలో ఆరవ పుణ్యక్షేత్రంగా గుర్తించబడింది.

Add new comment

2 + 5 =