అంతర్జాతీయ నావికుల దినోత్సవం, జూన్ 25 , 2020

Seafarer Day
అంతర్జాతీయ నావికుల దినోత్సవం, జూన్ 25 , 2020

అంతర్జాతీయ నావికుల దినోత్సవం, జూన్ 25 , 2020

 

తమ జీవితాలను తమ కుటుంబ భవిష్యత్తును ఫణంగా పెట్టి, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థకు మరియు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు నావికులు చేస్తున్న అపారమైన సేవను గుర్తించి, ఐక్యరాజ్యసమితి జూన్ 25 ను అంతర్జాతీయ నావికుల దినోత్సవంగా కొనియాడుతుంది.

అంతర్జాతీయ నావికుల దినోత్సవాన్ని అర్ధవంతంగా మరియు సజావుగా కొనియాడాలని అన్ని దేశాలకు, ప్రభుత్వాలకు, నావికా సంస్థలకు మరియు నావికులకు ఐక్యరాజ్య సమితి ప్రతిపాదన చేసింది. 

STCW వారు 2010 లో ఫిలిప్పీన్స్ లోని మనిల్లా లో జరిపిన సదస్సులో అంతర్జాతీయ నావికుల దినోత్సవాన్ని కొనియాడాలని నిర్ణయించి, మొట్టమొదటిగా 2011 అంతర్జాతీయ నావికుల దినోత్సవాన్ని కొనియాడారు. 

ఇప్పుడు అంతర్జాతీయ నావికుల దినోత్సవాన్ని ఐక్యరాజ్య  సమితి దినోత్సవాలలో చేర్చి, ప్రతి సంవత్సరం ఈ రోజును కొనియాడుతున్నారు.

2011 లో ఈ దినోత్సవాన్ని గూర్చి ఫేస్ బుక్, ట్విట్టర్, లింక్డ్ ఇన్ మరియు యు ట్యూబ్ వంటి   
సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం చేసారు. 

అంతర్జాతీయ నావికుల దినోత్సవం  ద్వారా  ప్రపంచంలోని 1 . 5 మిలియన్ల నావికులందరికి మన కృతఙ్ఞతలు తెలిపే అవకాశం లభిస్తుందని ఐక్యరాజ్య సమితి భావిస్తుంది. నావికులు మనకు నేరుగా కాకపోయినా పరోక్షంగా ఎంతో సహాయం చేస్తున్నారు కనుక మనందరం ఈ నావికులకు తప్పకుండ కృతఙ్ఞతలు తెలపాలి.

Add new comment

7 + 1 =