వాతావరణ మార్పులు - తెలుగు రాష్ట్రాలలో వాతావరణ పరిస్థితులు.

మూడు కాలాలు

ఆంధ్ర ప్రదేశ్ వాతావరణం వర్షాల పై ఆధార పడి ఉంటుంది. అందు వలన తెలుగు రాష్ట్రాల వాతావరణాన్ని ఉష్ణమండల ఋతువాతావరణం అంటారు.

శీతాకాలం:

వాతావరణం నవంబర్ మాసం చివరి నుండి చల్లగా మారి, ఫిబ్రవరి చివరి వరకు చలిగా ఉంటుంది. అనంతపూర్, చిత్తూర్, హైరాబాద్ ,నిజామాబాదు మరియు విశాఖపట్నం జిల్లాలు మిగిలిన జిల్లాల కంటే ఎక్కువ చలిగా ఉంటాయి.

రాత్రి సమయంలో పొగ మంచు కూడా కురుస్తుంది. హైదరాబాద్ లో అత్యల్పంగా 8 వరకు ఉష్ణోగ్రతలు పడిపోతాయి.
ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో “ఆంధ్ర ఊటీ” గా  పేరు గాంచిన అరకు ప్రాంతములో గల లంబసింగి లో 0 నుండి  – 4   వరకు ఉష్ణోగ్రతలు పడిపోతాయి. కోస్తా జిల్లాలలో పొగ మంచు చాల ఎక్కుగా ఉంటుంది. మార్చ్ మధ్య లో నుండి వాతావరణం వేడి గా మారుతుంది.

వేసవి కాలం:

వేసవి కాలం మార్చ్ నెల మధ్య లో నుండి జూన్ మొదటి వారం వరకు ఉంటుంది. కోస్తా ప్రాంతానికి మిగిలిన ప్రాంతానికి వాతావరణ వ్యత్యాసం ఉంటుంది. పగటి సమయంలో బాగా వేడి గా ఉన్నా రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలు రాత్రి సమయంలో చల్లబడతాయి.

కోస్తా ప్రాంతాలలో వేడి వడ గాలులు వీస్తాయి. కోస్తా ప్రాంతాలలో అత్యధికంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. సహజంగా జూన్ రెండవ వారం లో నైరుతి రుతు పవనాలు బంగాళాఖాతం నుండి ఆంధ్రప్రదేశ్ ను చేరుతాయి.

వర్షాకాలం:

జూన్ రెండవ వారంలో వచ్చు నైరుతి రుతు పవనాలుతో ఆంధ్ర రాష్ట్రాలకు వర్షా కాలం మొదలౌతుంది. ఈ రుతుపవనాలు జూన్ నెలాఖరు కల్లా ఆంధ్ర, తెలంగాణ అంతటా వ్యాపిస్తాయి.

ఈ రుతుపవనాల వల్ల తెలంగాణ ప్రాంతానికి అధిక వర్షపాతం ఉంటుంది. 800 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు అవుతుంది. ఈ సమయంలో కోస్తా ఆంధ్రకు 400 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే ఉంటుంది. కానీ అక్టోబర్ మాసంలో వచ్చు దక్షిణ రుతుపవనాల వల్ల కోస్తా ఆంధ్ర కు కూడా వర్షపాతం ఉంటుంది.  

మరల నవంబర్ మాసం చివరి నుండి శీతాకాలం ఆరంభం అవుతుంది.

Add new comment

1 + 7 =