ప్రపంచ UFO దినోత్సవం | World UFO day|

 గ్రహాంతరవాసులు / ఏలియన్లు ఉన్నారా? వాళ్లు తరచూ యూఎఫ్ఓల్లో భూమికి దగ్గరగా వస్తున్నారా?
 
ప్రపంచ UFO దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై 2 న జరుపుకుంటారు. దీనిని యుఎఫ్‌ఓ వేటగాడు హక్తన్ అక్డోగన్ స్థాపించారు. మొట్టమొదటి ప్రపంచ UFO దినోత్సవం 2001 లో జరుపుకుంది మరియు గుర్తించబడని ఎగిరే వస్తువుల కోసం స్కానింగ్ చేస్తున్న స్వర్గాలను చూసేందుకు ప్రజలలో అవగాహన కలిగించింది.
ఏలియన్లు ఉన్నారా? వాళ్లు తరచూ యూఎఫ్ఓల్లో భూమికి దగ్గరగా వస్తున్నారా? ఇవి ఇప్పటి వరకు అంతుచిక్కని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. కానీ కొంతమంది యూఎఫ్ఓ హంటర్స్ మాత్రం ఏలియన్స్ ఉన్నారని బల్లగుద్ది మరీ వాదిస్తున్నారు.

World UFO day సందర్భంగా మీకోసం ....

2,50,000 సంవత్సరాల క్రితమే భూమిపైకి వచ్చిన ఏలియన్స్?

భూమి పైన చాలా ఏళ్ల క్రితమే ఏలియన్స్ (గ్రహాంతరవాసులు) సంచరించారా? అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఏలియన్స్ ఇక్కడ సంచరించారనేందుకు మరో ఆధారం లభించిందని చెబుతున్నారు సైంటిస్ట్‌లు. 1970లో రోమేనియాలో దొరికిన పెద్ద లోహం శాస్త్రవేత్తలకు ఆధారంగా మారింది. ఇటీవల స్విజర్లాండ్‌లోని లాసనే లాబరేటరీలో దీనిని శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఇందులో షాకింగ్ వాస్తవం తెలిసింది. ఈ లోహం 2.50,000 నాటిదిగా గుర్తించారు.

లోహం 90 శాతం అల్యూమినియంతో తయారు చేసి ఉండడం ప్రతీ ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అల్యూమినియాన్ని కేవలం 200 సంవత్సరాల నుంచి మాత్రమే తయారు చేస్తున్నామని, 2,50,000 క్రితం అల్యూమినియం లభించే అవకాశమే లేదంటున్నారు. మేనియన్ యుఎఫ్‌ఓ లాజిస్టిక్స్ అసోషియేషన్ డిఫ్యూటీ డైరెక్టర్ ఘోర్జీ కోహెల్ దీనిపై మాట్లాడారు. ప్రస్తుత టెక్నాలజీ ప్రకారం ఇలాంటి లోహాలు తయారీ అసాధ్యమన్నారు. రెండు ఎముకల గూడుల మధ్యలో ఈ లోహం లభించిందని, ఇది గ్రహాంతర వాసులకు సంబంధించిన లోహంగా భావిస్తున్నామన్నారు. గ్రహాంతర వాసులు భూమిపై సంచరిస్తున్నారనడానికి ఇదే ఉదాహరణ అని తెలిపారు.

గ్ర‌హాంత‌ర వాసుల ఆచూకీ లభించిందా?

నాసా మార్స్‌ రోవర్‌ అంగారకుడిపై తీసిన ఓ ఛాయాచిత్రంను నిశితంగా పరిశీలిస్తే, అదొక మహిళా యోధురాలి శిల్పాన్ని తలపిస్తోన్న రాయిగా కనిపిస్తోంది. ఈజిప్టు కళాకృతిని తలపించేలా ఆ శిల్పం ఉండటంతో.ఆ విగ్రహం ఆ దేశానికే చెందినదై ఉంటుందని భావిస్తున్నారు. అయితే అది అంగారకుడి మీదకు ఎలా వెళ్లిందన్నది ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం. ఈ నేపథ్యంలో దీని వెనకాల గ్రహాంతర వాసులు ఉన్నారా? అన్న ప్రశ్న రేకెత్తుతోంది.
నిజానికి గ్రహాంతర వాసుల ఉనికిని కనుగొనేందుకు నాసా కెప్లర్ టెలిస్కోప్ సహాయంతో 2009 నుంచి పరిశోధనలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలకు భూమిని పోలిన 2500కు పైగా గ్రహాలు కనిపించాయట.
కెప్ల‌ర్ టెలిస్కోప్ గుర్తించిన గ్ర‌హాల‌ను గూగుల్ సంస్థ అందించిన మెషిన్ లెర్నింగ్ విధానం ద్వారా నాసా శాస్త్రవేత్తలు అధ్య‌య‌నం చేశారు. ఈ గ్ర‌హాల‌న్నీ 'గోల్డీలాక్ జోన్‌'లోనే ప‌రిభ్ర‌మిస్తున్నాయ‌ని, జీవ‌జాలం అభివృద్ధికి ఈ గ్ర‌హాల ప‌రిస్థితులు అనుకూలిస్తాయ‌ని గ‌తంలోనే వెల్ల‌డించారు.

చైనా : ఏలియన్లతో మాటలు, రేడియో డిష్ ఏర్పాటు, వినాశనమేనా?

ఏలియన్లతో సంభాషించేందుకుగాను అతి పెద్ద రేడియో డిష్ ప్రాజెక్టును చైనా ఏర్పాటు చేసి దాదాపు ఏడాది కావస్తోంది. అయితే దీని ద్వారా అంతరిక్ష రంగంలో ప్రపంచంలోనే అన్ని దేశాల కంటే ముందుండాలని చైనా ప్రయత్నాలు చేస్తోంది.
ప్రపంచంలో అన్ని దేశాల కంటే తానే అన్ని రంగాల్లో ముందున్నట్టుగా చూపించాలనే చైనా ప్రయత్నం ప్రపంచానికి ఇబ్బందులను కల్గించే అవకాశాలను కల్పిస్తోంది.2016లో టియాంగ్‌గాంగ్‌-2 ను ప్రయోగించి అమెరికా, రష్యాలను వెనక్కినెట్టి అతిపెద్ద స్పేస్‌ ఎక్స్‌ ప్లోరర్‌ పవర్‌హౌజ్‌గా నిలిచింది చైనా .ఇప్పుడు అతిపెద్ద రేడియో డిష్ ద్వారా మరో ఘనత సాధించాలని యత్నిస్తోంది.
వందల కోట్ల ఖర్చుతో 500 మీటర్ల గోళాకార రేడియో డిష్‌ను నెలకొల్పగా.. ప్యూర్టో రికోలో ఉన్న దానికంటే ఇది రెండింతలు పెద్దదని తేలింది. ఈ రేడియో డిష్ ఖగోళంలోని సూదూర ప్రాంతాలకు సిగ్నల్స్‌ను పంపగలదని తెలుస్తోంది. తద్వారా సుదూర పాలపుంతల్లోని ఏలియన్స్‌ ఉనికిని తెలుసుకునే వెసులుబాటు ఉంటుందని చైనా భావిస్తోంది.
గత వారం ఫ్లైయింగ్ సాసర్‌ చైనా గోడ వద్ద కనిపించిందన్న పుకార్ల నేపథ్యంలో అధికారులు మరింత దూకుడు ప్రదర్శించి ఈ రేడియో డిష్‌లోని కొన్ని విభాగాలను యాక్టివ్‌ చేశారు . చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్ కూడా ఈ విషయంలో కొంత ఆసక్తిని చూపుతున్నారనే వార్తలు వస్తున్నాయి.
అయితే దీనిపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ ఎలియన్స్ తో మానవాళికి చాలా ప్రమాదకరమని హెచ్చరించారు . అవి మనిషికంటే తెలివైనవని, వాటితో ప్రపంచానికి ముప్పు ఏర్పడవచ్చని ప్రకటించారు. మరోవైపు చైనాకే చెందిన రచయిత, గ్రహాంతరవాసులపై సుదీర్ఘ అధ్యయనాలు చేసిన పరిశోధకారుడు లియూ సిక్సిన్‌ ఒక్కసారి ఎలియన్లు-మానవాళి ఎదురుపడితే.. ఇక సృష్టి వినాశనమే అని అభిప్రాయపడ్డారు.
కానీ, చైనా మాత్రం తమది ఓ సాహసామంటూ గొప్పగా చెప్పుకుంటోంది. గత వారం మనిషికి తోడుగా మరోజీవి ఉందన్న విషయం నిర్ధారణ అవుతుందని వారు పేర్కొంటున్నారు.

ఏలియన్స్‌తో జాగ్రత్త, స్పందించొద్దు: స్టీఫెన్ హాకింగ్ వార్నింగ్

ప్ర‌ముఖ బ్రిటీష్ భౌతిక శాస్త్ర‌వేత్త స్టీఫెన్ హాకింగ్ గ‌్ర‌హాంత‌ర‌వాసుల సందేశానికి స్పందించ‌డం చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని ఎపుడో చెప్పారు . ఏలియన్స్.. మ‌నుషుల కంటే ఎంతో అత్యాధునిక టెక్నాల‌జీ క‌లిగి ఉండే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న అభిప్రాయపడ్డారు. మ‌న‌కంటే ఎంతో ముందున్న నాగ‌రిక‌త‌తో మ‌న ప‌రిచ‌యం ప్ర‌మాద‌క‌ర‌మేన‌ని హాకింగ్ స్ప‌ష్టంచేశారు. స్థానిక అమెరిక‌న్లు తొలిసారి కొలంబ‌స్‌ను చూసిన త‌ర్వాత ఏమైందో ఇదీ అలాంటిదేన‌ని ఆయ‌న అన్నారు. హాకింగ్ త‌న కొత్త ఆన్‌లైన్ ఫిల్మ్ స్టీఫెన్ హాకింగ్స్ ఫేవ‌రెట్ ప్లేసెస్‌లో ఈ హెచ్చరిక చేశారు. ఈ ఫిల్మ్ వీక్ష‌కుల‌కు విశ్వంలోని ఐదు కొత్త ప్ర‌దేశాల‌ను ప‌రిచ‌యం చేయ‌నుంది. ఎస్ఎస్ హాకింగ్ స్పేస్‌క్రాఫ్ట్ ద్వారా ఆయ‌న ఫేవ‌రెట్ ప్లేసెస్‌ను వీక్ష‌కులు చూడ‌వ‌చ్చు. ఈ ఆన్‌లైన్ ఫిల్మ్ ద్వారానే హాకింగ్ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. మ‌న‌కు 16 కాంతి సంవ‌త్స‌రాల దూరంలో అచ్చూ భూమిలాంటి గ్ర‌హంగా ఉన్న‌ గ్లీజ్ 832సీని ఉదాహ‌ర‌ణ‌గా తీసుకొని హాకింగ్ గ్ర‌హాంత‌ర‌వాసుల‌తో వ‌చ్చే ప్ర‌మాదాన్ని వివ‌రించారు.

Add new comment

4 + 6 =