Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
డ్రగ్స్‌కు చెబుదాం టాటా
INTERNATIONAL DAY AGAINST DRUG ABUSE AND ILLICIT TRAFFICKING
నేడు అంతర్జాతీయ మారకద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా పలు ప్రాంతాల్లో యాంటీ డ్రగ్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. మారక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను యువతకు వివరించారు. యుక్త వయస్సులో ఉన్నప్పుడే కొందరు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారు. కొత్త ప్రయోగాలతో ప్రమాదాలు తెచ్చుకుంటున్నారు.
ఎక్కువగా ఇలాంటి సమయంలోనే మత్తు పదార్థాలకు అలవాటు పడుతుంటారు. ఆడ మగా అని తేడా లేదు అమ్మాయిలు కూడా మత్తుకు బానిసలవుతున్నారు. ఒక్కసారి అలవాటు పడితే మత్తు ముంచేస్తుంది. దీని బారిన పడి ఎంతో మంది చిక్కుల్లో పడుతున్నారు. తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
తల్లిదండ్రులు పట్టించుకోకపోడం, ఉద్యోగ సమస్య వంటివి యువత మత్తుకు అలవాటు పడేందుకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. చిన్న వయసులోనే పిల్లలు మత్తుకు అలవాటు పడుతున్నారు. ఇంట్లో గొడవలు, పెంపకంలో లోపాలు, తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరికి అలవాటు ఉండటం పిల్లల్ని మత్తుపదార్థాల వైపు చూసేలా చేస్తున్నాయి. ఒకసారి బానిసైతే చాలు దుష్ప్రభావాలు ఉంటాయి.
Add new comment