ఎటు పోతున్నాము మనం ??

ఎటు పోతున్నాము మనం ??
భూమి పై రోజు రోజు కు సూర్యుని ప్రతాపం పెరిగిపోతాగుంది .ఒక్క ఎండాకాలం లోనే కాదు ,ప్రతి కాలంలోను ఎండలు మండి పోతున్నాయి .తాగేందుకు గ్రుక్కెడు నీరు కూడా దొరకడం లేదు .
ఎండలతో పాటు ,రసాయనాలు నీళ్ల లో కలపడం ,ప్లాస్టిక్ వాడకం ఎక్కువ అవ్వడం తో భూమి మొత్తం ప్లాస్టిక్ మాయం అవుతుంది .
పక్క పక్కన వుండే ప్రతి ఇంటికి బోరులు వేయడం భూగర్భ జలాలను తోడేస్తున్నాము తప్ప ఇంకుడు గుంతలు ,రైన్ వాటర్ స్టోరేజ్ కోసం ఎవరు కూడా చర్యలు తీసుకోవడం లేదు .
కార్లు ,ac, లు వాడకం ఎక్కువ అవడంతో కార్బన్ పదార్దాలు భూమి మొత్తం ఆక్రమించేశాయి .
మరి కొన్నాళ్లు ఇలానే ఉంటే నీటి మట్టం తగ్గిపోతుంది ,మంచు కరిగి సముద్రాలూ పెరిగిపోతుంటాయి .
ఇప్పటికే సమతుల్యం లోపించింది ,ఎపుడు వర్షాలు పడతాయో ,ఎపుడు పడదో అర్ధం కాదు .
తినడానికి తిండి లేక మనిషి దారుణ బాధలు పడుతున్నాడు .మరో 10,20, ఏళ్ళ లో భూమి పై మనిషి మనుగడ ప్రమాదంలో పడిపోయే పరిస్థితి వుంది .

Add new comment

3 + 5 =