SAINT OF THE DAY - SEPTEMBER 26 పునీత కాస్మాసు మరియు పునీత దమియాను | STS. COSMOS & DAMIAN

కవల సోదరులు, వైద్యులు. వైద్య నిపుణులు, ఫిజిషియనులు, మంగలివారు, ఔషధ విక్రేతల పాలక పునీతులు క్రీ॥శl| - 303. పునీత కాస్మాసు మరియు పునీత దమియానుగార్లు 3 శతాబ్దాంతంలో అరేబియా దేశంలో కవల సోదరులుగా జన్మించారు. ఉత్తమ క్రైస్తవులు. సిరియాలో వైద్య వృత్తి విద్యలో శిక్షణ గడించారు. అనంతరం ఎగియె, సిలిసియ పట్టణాల్లో జీవించారు. వ్యాధి పీడితులకు మంచి వైద్య సేవలు ఉచితంగా అందిస్తూ తమ వృత్తి నైపుణ్యంతో దూర ప్రాంతాలకు కూడ పేరు ప్రతిష్టలు వ్యాపింపజేసుకున్నారు.

రోగులకు శారీరక వైద్యం చేస్తూనే వారి ఆత్మ సౌందర్యముపట్ల కూడ సద్బోధ చేసేవారు. విధంగా పాపాత్ము లెందరికో మనస్సు మార్చి వారు విగ్రహాలు సృష్టి వస్తువులను పూజించకుండా నచ్చ జెప్పి, నిజమైన దేవుడు సర్వ సృష్టికర్తనే ఆరాధించాలని ప్రబోధించేవారు. మనుజావతారి యైన ఏసుక్రీస్తు సోదర ప్రేమ దైవ ప్రేమ సిద్దాంతంగూర్చి నూరిపోసేవారు. తమ అద్భుత హస్తాలతో ఆశ్చర్యకరమైన స్వస్థతలు, ఆత్మశాంతి, సమస్యల పరిష్కారం గావించారు. తద్వారా ప్రజలెందరో క్రైస్తవులుగా మారిపోయారు.

దేశవాళీ దేవతా విగ్రహాలు పూజించకుండ క్రైస్తవంకు అంకితమైన కాస్మాసు మరియు దమియాను వైద్య సోదరులను అచటి దియోక్లేషియన్ రాజు తన భటులచే నిర్భంధింప చేశాడు. క్రీస్తు సాక్షులను మట్టుబెట్టే పనిలో ఉన్న రాజు ముందు వెనుకలు ఆలోచింపక పుణ్యాత్ములైన వైద్య సోదరుల తలలను నిర్దాక్షిణ్యంగా నరికించి సంహరించాడు. సంఘటన క్రీ|||| 303లో జరిగింది. వారికిగల ముగ్గురు సోదరులు అంతిమసు, యుప్రెపియసు, లియోంతియసుకూడ వేదసాక్షి మరణం పొందడం విశేషం.

పరిశుద్ధ సోదరుల ఖ్యాతి లోకమంతట ప్రాకిపోయింది. క్రీస్తు సాక్షులుగా మరణించినందుకు విశ్వాసులచే జోహార్లు అందుకున్నారు. శ్రీసభ పూజల్లోకూడ వారి పేర్లు ఉచ్చరింపబడే ఏర్పాటు జరిగింది. వారి మధ్యవర్తిత్వాన ప్రార్థించిన వారికి వరిబీంరోగులకు స్వస్థత, మేలులు అనుగ్రహింపబడ్డాయి. ఔషధాల పంపిణీదార్లు, వైద్యులు, పంటి డాక్టర్లు, శస్త్ర చికిత్స చేయువారు మంగలివారు కవల సోదరులను తమ పాలక పునీతులుగా వందించి వరాలు పొందుతున్నారు. పునీత లూకాగారి తర్వాత వైద్య వృత్తిదారుల పాలక పునీతులు కవల సోదరులైన కాస్మాసు, దమియానుగారలే.

Sts. Cosmas and Damian were brothers, born in Arabia, who had become eminent for their skill in the science of medicine. Being Christians, they were filled with the spirit of charity and never took money for their services. At Egaea in Cilicia, where they lived, they enjoyed the highest esteem of the people. When the persecution under Diocletian broke out, their very prominence rendered them marked objects of persecution. Being apprehended by order of Lysias, governor of Cilicia, they underwent various torments about the year 283. Their feast day is September 26th. They are patron saints of pharmacists.

Add new comment

6 + 2 =