SAINT OF THE DAY - January 15 భక్త బ్రదర్ జోసఫ్ తంబి | BLESSED JOSEPH THAMBY

(అస్సిసి ఫ్రాన్సీసువారి మూడవ సభ బ్రదరు. తమిళియను బ్రహ్మచారి, పంచగాయాలు పొందిన అవుటపల్లి అద్భుత వ్యక్తి, మతసాక్షి క్రీ||శ|| 1883 - 1945) భక్త బ్రదర్ జోసఫ్ తంబిగారు భారతదేశం తమిళనాడు రాష్ట్రంలో పాండిచేరి పట్టణంలో పుట్టు క్రైస్తవులును ఉన్నతులైన ‘తంబీ' కుటుంబలో క్రీశ 1883, సెప్టెంబరులో జన్మించారు. వారి చిన్నతనంలోనే తల్లిని కోల్పోగా తండ్రి రెండవ పెండ్లి చేసుకున్నాడు. సవతి తల్లితో పొసగని చిన్ని జోసఫ్ ఇల్లు విడిచి వెళ్లిపోయారు.

ప్రక్కనున్న రాష్ట్రాలలో సంచరించి కొన్ని సంవత్సరాలు కేరళరాష్ట్రంలో గడిపారు. ఇల్లు విడిచిన తర్వాత వారు అష్టకష్టాలు అనుభవించారు. వారు లాటినుభాషలో ప్రార్థనలు చెప్పుకోవడాన్ని బట్టి చూస్తే ఏదొక సన్యాసి మఠంలోనో, దేవాలయ పరిచారకునిగానో చేరి ఉండవచ్చని భావింపబడింది. కొన్నేండ్లు గడిచాక జోసఫ్ తంబిగారు తమ యవ్వనదశలో తిరిగి పాండిచెరికి చేరుకున్నారు. పెరిగినగడ్డం, తొడిగిన గోధుమరంగు అంగీ, నడుముకు త్రాడు అచం ఒక సాధువు లేక స్వామిజీలా కన్పించారు. వారు 1928లో పునీత ఫ్రాన్సిసు అస్సిసివారి మూడవ సభ సభ్యుడుగా చేరారు.

ఆ సభగురువులు ధరించే రంగు దుస్తులు ధరించి క్రీస్తు సువార్తా ప్రచారంచేస్తూ క్రైస్తవ ఆదర్శాలతో, పేదరికంను అనుసరింప అనుమతిపొందారు. గుర్తుపట్టకుండా ఏదో పరాయి సన్యాసిలా పాండిచేరి దేవాలయాలవద్ద సంచరిస్తున్న జోసఫ్ తంబిగాల్ని నిలదీయడంతో వారు వాస్తవాల్ని ఒప్పుకున్నారు. తద్వారా బంధువుల ఆహ్వానం పై స్వగృహంలోను బంధువుల ఇండ్లలోను కొన్నాళ్లు గడిపారు. ఎంతైనా తన భక్తి శ్రద్ధలలో ఎలాంటి మార్పులేదు. పిమ్మట పాండిచేరి మేత్రాసనంలో అనేక గ్రామాల్లోని దేవాలయాలకు వెళ్లి అక్కడి క్రైస్తవులలో వారి విశ్వాస పటిష్టతకు తన ప్రార్థన, పవిత్ర జీవితంద్వారా మాతృక చూపారు.

క్రీశ 1933లో తమిళనాడులోని తంజావూరు జిల్లా కుంభకోణం మేత్రాసనంలోని మైకల్పిటి విచారణలోని 'మణత్తిడల్లో అనే చిన్నగ్రామంలో ప్రత్యక్షమయ్యారు సాధువైన జోసఫ్ తంబీగారు. ఆ గ్రామంలో తన ప్రేషిత కార్యాన్ని ప్రారంభించారు. సత్యోపదేశ బోధనం, సామూహిక ప్రార్థనల నిర్వహణలతోపాటు వ్యాధిగ్రస్తులను కలసికొని పరామర్శించేవారు.వారికి ఏవో ఆయుర్వేద మందులిచ్చి ఏసునామమున ప్రార్థిస్తూ స్వస్థత చేకూర్చుతుండేవారు. వారి ప్రయత్నంవల్ల 'మణత్తిడల్లో గ్రామంకు ఆథ్యాత్మిక సేవలు నిరంతరం అందించడానికి ఒక గురువును ఏర్పరచడం జరిగింది. 1935 సెప్టెంబరు 1వ తేదీన నూతనంగా వచ్చిన గురువు బాధ్యతలు తీసుకుని బలిపూజనర్పించారు.

బ్రదర్ జోసఫ్ తంబిగారి కృషిని కొనియాడుతూ విచారణ రికార్డుల్లో నమోదుచేశారు కూడ. విశ్వాసుల ఆనందానికి అవధుల్లేవు. ఆ తరువాత క్రీ||శ|| 1936లో సాధు జోసఫ్ తంబిగారు అదే మేత్రాసనంలోని తొండమనదురై విచారణలోని పచ్చమలై గిరిజన గ్రామం చేరుకున్నారు. క్రిస ప్రేమవాక్యాన్ని విన్పించారు.వారి అర్ధనగ్న శరీరాలు వస్త్రం తొడిగి ఉంచుకోవాలని సోదర ప్రేమతో జీవించాలని నేర్పించారు. కాని తంబీగారి ప్రయాస ఆ అనాగరా లలో అరణ్య రోదనే అయ్యింది. అటు పిమ్మట వారు ఆ వూరు ఈ వూరు తిరుక్రీస్తు జ్యోతులు మన ఫనీతులు క్రీస్తుబోధ విన్పిస్తూ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టారు. నెల్లూరుజిల్లాలోని బిట్రగుంట ఊల్లో కొంతకాలం ఉండి సువార్తా బోధగావించారు. అక్కడ రైల్వే శాఖలో పనిచేసే తమిళులకు బాగా పరిచయస్తుడై తమ మాతృకతో వారిని బాగా ఆకర్షించారు.

క్రీ||శ|| 1937 చివరికాలంలో నెల్లూరు జిల్లాలోని చిట్రగుంటలో పాదం మోపి, ఆ తర్వాత సాధు జోసఫ్ తంబిగారు విజయవాడ మేత్రాసనంలో పెద్దావుటపల్లి విచారణలోని 5 మైళ్లదూరంలో ఉన్న కేసరిపల్లి' అనే గ్రామంలో కనిపించారు. అక్కడగల పునీత పాదుకా అంతోనివారి గుడి ఆవరణలో ఉంటూ ఏవో కొన్ని తెలుగు మాటలు నేర్చారు.క్రైస్తవుల గృహాల్ని సందర్శిస్తూ వచ్చీరాని మాటలు, సైగలతో క్రీస్తు ప్రభుని సందేశాల్ని తెలియజేశారు. వారి పారవశ్యపు ప్రార్థనలు, ధ్యానం పవిత్ర నడవడి ప్రజల్ని బాగా ఆకట్టుకున్నాయి. కేసరిపల్లి గుడిలో ప్రతి ఆదివారం దివ్యబలిపూజ ఉండేది కాదు. కాన బ్రదరుగారు ఆసక్తిరేకెత్తించి విశ్వాసుల్ని పదుల సంఖ్యలో పెద్దావుటపల్లి గుడికి 5 మైళ్లు కాలినడకనే తీసుకొనివచ్చి ఆదివార పూజల్లో పాల్గొన జేసేవారు.

గ్రామస్తులతో కలసి పొలంపనిచేయడం, నాటు వైద్యంతో రోగులను స్వస్థపర్చేవారు. కుల మత వ్యత్యాసాలు లేకుండా అందరిలో కలివిడిగా తిరిగేవారు. తమ గ్రామములో కూడ ఉండి తమను అలరించవలసిందిగా అవుటపల్లి క్రైస్తవులు తంబీగార్ని అడుగుతుండేవారు.ఈ విషయాల్ని పెద్దావుటపల్లి విచారణలో 40 సంIIలు సుదీర్ఘకాలం తమ గురుత్వ సేవలందించిన ఇటాలియా పి.మె.సభ క్రైస్తవ మిషనరీ అయిన ఫాదర్ జాన్ కల్టరారోగారు తమ వ్రాతల్లో పేర్కొన్నారు.

ఆ తర్వాత బ్రదర్ జోసఫ్ తంబిగారి మకాం అవుటపల్లికి మారింది. పెద్దస్వామి ఫాదర్ కల్టరారోకాగా చిన్న స్వామి ఫాదర్ రాజీ (పిమె) ఉండేవారు. వారి ఆశీస్సులతో తంబిగారు గుడి ప్రక్కనేగల ఒక పాకలాంటి మట్టిగోడల ఇంటిలో బస ఏర్పాటైంది. అవుటపల్లి గ్రామంలో బోయపాటి బసవయ్య సీతారమణమ్మగారి కుటుంబం ఉంది.వారు అగ్రవర్ణంవారు శ్రీమంతులుకూడాను. వారి ఆహ్వానం పై వారి ఇంటికి వెళ్లి కాలు విరిగి అమిత బాధతో దుఃఖిస్తున్న వారి బంధువురాలిని దర్శించారు. వారికోరికపై ఆ యమ్మ కాలుపై సిలువ గుర్తు వేయగానే ఎంతో ఉపశమనంపొంది ఆమె తంబిగార్ని ప్రశంసించింది. మరికొద్ది దినాలకు కాలినొప్పి తగ్గిపోయి పూర్తి స్వస్థత చేకూరింది. వారి కృష్ణతా ప్రదర్శన కు కొదవలేదు.

ఈ అద్భుతం నోటిమాటద్వారా బహుళ ప్రచారమైంది. ఆ ఉన్నత కుటుంబంవారికి నలుగురు ఆడపిల్లలే కావడంతో మగసంతానం కావాలని బ్రదర్ తంబిగారికి తమ కోరిక విన్నవించుకోగా వారిని ముందుగా  జ్ఞానస్నానం తీసుకొని క్రీస్తు ప్రేమ ఫలాల్లో భాగస్తులుకండి. వారికి తప్పక మగ సంతానం ప్రాప్తిస్తుందని ప్రవచనం చెప్పారు. అలాగే వారు సమాజానికి జడిసి అర్ధరాత్రి క్రీ||శ|| 1939 జూలై 22న బప్తిస్మం పుచ్చుకున్నారు.

వారి జ్ఞానతండ్రిగా సాధుజోసఫ్ తంబిగారే నిలవడం విశేషం. వారికి ఫ్రాన్సీసు అస్సిసివారీ సభల్లో ముఖ్యులైన ఫ్రాన్సీసు, క్లారమ్మ అను పేర్లు నూతనంగా ఇవ్వబడ్డాయి. ప్రవచనం నెరవేర దైవ కృపవల్ల ఆ దంపతులకు క్రీ||శ|| 1940 మే 6వ తేదీన మగ సంతానం కలిగింది. బాలస్వామి అని జ్ఞానస్నానం ఇప్పించుకున్నారు. తంబిగారి ప్రార్థనలవల్ల ఎలాంటి సాంఘిక సమస్యలు తలెత్తలేదు. పైగా క్రీ||శ|| 1939 మరియు 1940లో చాలామంది ఉన్నత కులాలవారు కుటుంబాలకు కుటుంబాలే క్రీస్తు విశ్వాసంలో ప్రవేశించారు. బోయబాటి బాలస్వామి తమ నలుగురు పిల్లలతో ప్రభు కృపావరాలతో తమ ప్రభుసాక్ష్యం విన్పిస్తూనే ఉన్నారు.

పరలోక రాజ్యంచేర ప్రజలందరూ ప్రభుఏసు విశ్వాసులు కండని ఆహ్వానిస్తున్నారు. సాధు జోసఫ్ తంబిగారు విజయవాడ పీఠాధిపతి గ్రాసిగారి సలహా మేరకు గోధుమరంగు అంగీ ధరించుటమాని పేద దుస్తులు ధరించారు. అవుటపల్లి చుట్టు ప్రక్కల గ్రామాలైన తేలప్రోలు, ఉయ్యూరు, మానికొండల్లో సువార్తా ప్రచారంచేశారు.క్లారమ్మగారి తమ్ముడు వేమూరి సుబ్బయ్యగారి మానికొండలో వారి తీవ్ర వ్యాధినుండి స్వస్థత కలిగింపగా వారు కుటుంబసమేతంగా జ్ఞానస్నానం స్వీకరించారు. అప్పటికీ కొందరు అగ్రవర్ణాలవారు అడ్డు చెప్పినా తర్వాత తర్వాత చాలామంది క్రీస్తు బిడ్డలుగా మారిపోయి ప్రభు ఆజ్ఞలు పాటిస్తున్నారు. .

బ్రదర్ జోసఫ్ తంబిగారి ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3 గం||లకు పంచగాయాలు బహిర్గతమై రక్తం స్రవించేవి. బహుబాధను ఒక గంటపాటు అనుభవించేవారు. కొన్ని శుక్రవారాల్లోను పెద్ద శుక్రవారం రోజున వారికి రక్త చెమట చెమర్చేది. దీనికి ఫాదర్ పగానో, ఫాదర్ అంద్ై, ఫాదర్ జార్జిగార్లు కండ్లారా చూసిన ప్రత్యక్షసాక్షులు. ఇంకా ఇవిచూసిన విశ్వాసులు కూడ ఎందరో ఉన్నారు.తంబిగారు వైద్యం చేస్తుంటారు కాన ప్రతిరోజు ముఖ్యంగా శుక్రవారాల్లో బ్రదరుగారు అవుటపల్లిలో తప్పక ఉంటారని రోగులు పదులసంఖ్యలో వస్తుండేవారు. ఏదో నాటుమందు ఇచ్చి ప్రార్థించి పంపేవారు. అద్భుతంగా వారికి నయమయ్యేది. కాలికి పెద్దగా గాయమై చీముపట్టి నయంకాక బాధతో వచ్చి రోగిపై బ్రదరుగారు ప్రార్థనచేసి గాయాన్ని తన నాలుకతో నాకారు.

ఇది కట్టరా స్వామి వంట మనిషి, మాదాను శౌరయ్య చూసి అసహ్యించుకుని స్వామికి తెలుప'' వారు వచ్చి బ్రదరుగార్ని చివాట్లు పెట్టారు. ఆ గాయం నయం కావడానికి అంతటి ఏపం ప్రాయశ్చిత్తం అవసరం కాబోలు ! ఏదో నాలుగు అకులు నలిపి గాయం కసి కటు కట్టి పంపగా మూడవరోజున గాయం పూర్తిగా నయమైంది. ఇదో కాపు అద్బుతంగా ప్రజలందరూ నేటికీ చెప్పుకుంటూనే ఉంటారు.కొందరు పునీతుల్లో ఒకేసారి రెండు ప్రదేశాల్లో దర్శనం కావడం చదువుతుంటాం. బ్రదర్ తంబిగార్కి మాత్రం 'తక్షణ గమనం' అనే దైవ వరం ఉండేదని అలా నాలుగు పర్యాయాలు ప్రదర్శితమైనట్లు చెప్పబడింది. ఏదో ఒక అద్బుతహస్తం వారి వీపుతట్టి వారు కోరుకున్న ప్రదేశంకు క్షణంలో తీసుకెళ్తుందని వారే స్వయంగా ఫాదర్ జార్జిగార్కి వెల్లడించారు.

బ్రదరుగార్కి వర్తమాన భవిష్యత్కాలాలు బాగా తెలిసేవి. రెండవ ప్రపంచయుద్ద విశేషాలు తక్షణం చెప్పకలిగేవారు. మరునాటి వార్తా ప్రతికల్లో ఆ వార్తలు అలాగే కన్పించేవి. ఆవుటపల్లిలో గొప్ప అగ్నిప్రమాదం జరుగబోతోందని ముందుగానే చెప్పారు. బోయపాటి ప్రాన్సీసుగారిది తప్ప చుట్టు ప్రక్కల ఇళ్లు అలాగే దగ్ధమయ్యాయి.ఎదుటి వ్యక్తి మనసులోని ఆలోచల్ని వారు తెలుసుకోకలిగి వారిని సరిదిద్దే సలహాలిచ్చేవారు. వారు తమ వద్దకు వచ్చినవారికి భోజనం పెట్టి పంపిస్తుండేవారు. వారి ఆశీర్వాదంతో పెట్టిన కొద్ది భోజనం పెరుగుతూ ఉండేది. వారు ఎప్పుడు వండుకునేవారో ఎప్పుడు తినేవారో ఎవరికీ తెలీదు. ఎవరిసాయం తీసుకున్నట్లూ లేదు.

కాని వారికి నల్లకాఫీ అని డికాక్షను అంటే ప్రీతి. వారి ఇంటి దాపునే గుడి ఆవరణ ప్రహారీగోడకు ఆనుకుని నివాసముంటున్న కాకుమాను ఇన్నయ్య, స్లీవయ్య సోదర ద్వయం (ఈ రచయిత కాకుమాను ఇన్నయ్య గారి తాతయ్యలు) వార్ల ఇంటికి అప్పుడప్పుడు వచ్చి కాఫీ డికాక్షను అడిగి చేయించుకుని త్రాగి వెళ్లేవారని చెప్పారు.తంబిగార్కి అవసరపడితే భిక్ష అడగడం, తనవద్ద ఉంటే ధర్మంచేయడం కూడ చేసే వారని చెప్పబడింది. పిల్లలు వారితో ఆడేవారు ఎవరి పై అయినా ఆగ్రహిస్తే వెంటనే క్షమాభిక్ష కోరేవారు.బ్రదర్ తంబిగారు మోకాళ్లూని లాటినుభాషలో ముఖ్యంగా రాత్రుళ్లు అధికంగా ప్రార్థించేవారు.

కటిక ఉపవాసాలు ఆచరిస్తుండేవారు. దళిత ప్రజలను ఆదరించేవారు. తనపట్ల గౌరవం లేని వారికి దీనతతో కన్పించేవారు. వారు శరీర వర్ణపరంగా నలుపు అయినా కాంతివంతంగా కళగా ఉండేవారు. సంతోషం ఉట్టిపడుతుండేదని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. పూర్వం జోసఫ్ తంబీగారు ఒకసారి ఏనాటికైనా ఫ్రాన్సీసు సభ వారు అవుటపల్లి వస్తారని చెప్పినమాట నెరవేరిందికూడా. కఠోర సన్యాసి జీవితంలో ధన్యులైన తంబిగారు మూడు నెలలు ముందుగానే తమ మరణంగూర్చి తెల్పారు. శవ పేటికనుకూడ చేయించుకున్నారు. క్రీ.శ. 1945 జనవరి 15వ తేదీన వారి కోరిక ప్రకారం బోయపాటి ఫ్రాన్సీసుగారి ఇంట దివంగ తులయ్యారు. అవస్థ ఇవ్వడానికి వచ్చిన గురువు కల్గరారోగారు వారి మృతదేహాన్ని మాత్రమే చూశారు.

16వ తేదీన ఎందరో కతోలికులు అన్యులు హాజరుకాగా గుడి ఆవరణలోనే సమాధుల వాటికలో వారి భౌతిక కాయాన్ని సమాధిచేశారు. ఆ సమాధిపై “బ్రదర్ జోసఫ్ తంబి, వయస్సు 65 సం||లు మరణం 15-1-1945' అని వ్రాయబడిఉంది. భక్త బ్రదర్ జోసఫ్ తంబిగారి మధ్యవర్తిత్వాన ప్రార్థించి సంతాన ప్రాప్తి, వ్యాది నివారణలు, సమస్యల పరిష్కారం, పరీక్షలు నెగ్గడం, ప్రమాదాలు తప్పడం వంటి వరాలు మేలులు పొందుతున్నట్లు సాక్షులు పల్కుచున్నారు. ఇట్టి మేలులను విశ్వ కతోలిక శ్రీసభ గుర్తించి జూన్ 24, 2007న విజయవాడ పీఠాధిపతి ఘన! మల్లవరపు ప్రకాశ్ సుమారు మూడు వేలమంది భక్తులమధ్య దివ్య పూజాబలి సమర్పించి వారిని “దైవ సేవకుడు”గా ప్రకటించారు. ఇంకా వారికి ధన్యతాపట్టాకై ముందస్తు తంతు జరుగుచున్నది.

జోసఫ్ అంటే దేవుడు అధికము చేయును, కలుపుకొనుట అని అర్థం. వీరికి ధన్యతా పట్టాను జూన్ 24, 2007లో అధికారికంగా పెద్దావుట. పల్లిలో సాయం సంధ్యలో అర్పించిన దివ్యబలిపూజలో విజయవాడ బిషప్ మల్లవరపు ప్రకాశ్ ప్రకటించారు.

Add new comment

7 + 6 =