SAINT OF THE DAY - February 15 పునీత క్లోడ్ దె లా కొలంబియేరు / ST. CLAUDE DE LA COLUMBIERE

అందుకు అవిగ్నోను పట్టణంలో నెలకొని ఉన్న నొవిషియేటులో ప్రవేశించారు. అక్కడే గురుశిక్షణలో తొలి సౌవార్తిక వ్రతాలను స్వీ(గురువు, మతసాక్షి, ఏసుతిరుహృదయ అపోస్తులుడు క్రీ.శ. 1641-1682) క్లోడ్ కొలంబియేరు ఫ్రాన్సుదేశ దక్షిణ ప్రాంతమైన “సెయింట్ సింఫోరియన్ జోన్ అనుబడు గ్రామంలో జన్మించారు. తండ్రి బెటాంకొలంబియేర్. తల్లి మార్గరేట్ కొ ఇన్ డాట్. వీరు ప్రాథమిక విద్యను తమ స్వగ్రామంలోనే అభ్యసించారు. తర్వాత లియోనుపట్నం విద్యాకళా శాలలో తత్వశాస్త్రాన్ని చదువుకున్నారు. తన దైవపిలుపును నిజంచేసుకోవడానికి ఏసు సభలో చేరాలనుకున్నారు.
కరించారు. అటుపిమ్మట అయిదు సంవత్సరాలపాటు అవిగ్నోన్ పట్టణ కళాశాలలో ఆచార్యునిగా పనిచేశారు. తన గురు విద్యను ముగింపదలచి 1666లో పారిసునగరంలోని క్లేర్మో కళాశాలలో చేరారు. అక్కడే వేదాంత దైవశాస్త్రాన్ని అధ్యయనంచేసి పరిశుద్ద గురుపట్టాభిషిక్తులయ్యారు. తదుపరి వారు నియమింపబడిన ప్రకారము లియోనుపట్టణంలోని కళాశాలలో బోధింపవెళ్లారు. మంచి ప్రొఫెసరుగాను, ప్రసంగీకులుగాను, మేరిమాత భక్తిసభల మార్గచూపరిగాను సేవలందించి మంచి పేరుప్రతిష్ఠలను గౌరవాభిమానాన్ని బడశారు.

క్రీ||శ|| 1674లో ఫాదర్ క్లోడ్ మఠజీవితంలో కఠిన పరీక్షాసమయం ఎదురైంది. ఒక ఏడాదిపాటు తన ఆంతరంగిక గురు దీక్షను పటిష్ఠపరచుకోడానికి సమయాన్ని వినియోగించుకున్నారు. ఉపవాసము తపోక్రియలు, ప్రార్థనలలో గడిపి ఆథ్యాత్మిక జీవితంలో ముందంజవేశారు. తన భావిజీవితానికి గట్టిపునాది వేసుకున్నారు. 1675 ఫిబ్రవరి 2న పారెలేమోనియలు కళాశాల రెక్టరుగా నియమింపబడినారు. అందువల్ల, కన్యస్త్రీయైన పునీత మార్గరేటు మరియమ్మ అలకోకుగార్కి ఇవ్వబడిన తిరుహృదయ ఏసుని దర్శనాల్లో “నాకు విశ్వాసపాత్రుడైన సేవకుని, పరిపూర్ణ స్నేహితుని నీకు పంపుదును” అని ప్రభువు ఇచ్చిన వాగ్దానం ఇలానెరవేరింది. ఫాదర్ క్లోడ్ రావడంతో సిస్టర్ మార్గరేటు మేరి అలకోకుగారి ఆధ్యాత్మిక చింతన ద్విగుణీకృతమైంది.

ఫాదర్ క్లోడ్ ను తన జ్ఞానగురువుగా నెంచుకొని తన మనస్సులోని తలంపులను, హృదయంలోని సున్నిత భావాలన్నింటిని వారికి తెలియజెప్పింది ఏసు తిరుహృదయ సందేశాన్ని వారికి వివరించింది. ఫాదర్ క్లోడ్ కొలంబియేరు తన అమూల్య సలహాలను ఆమెకు అందించి మంచి మార్గదర్శకులైనారు. ఆత్మీయ సురక్షిత జీవితబాటను అవలంబించడానికి వారిరువురికి ఇది దోహదం చేసింది. తద్వారా వారిద్దరూ “ఏసు తీరుహృదయ ప్రేమసందేశాన్ని ప్రచారం చేయడానికి కంకణం కట్టుకున్నారు. పారెలెమోనియలులో ఫాదర్ క్లోడ్ కేవలం ఒకటిన్నర సంవత్సరాలు మాత్రమే పనిచేశారు. కొద్ది కాలంమాత్రమేయైనా ఆ సమయం అనిర్వచనీయమైన ఏసు తిరుహృదయ కారుణ్య ప్రభావాన్ని అనుభవించిన అపూర్వతరుణం. తన భవిష్యత్ గురుత్వజీవితంలో ఎన్ని ఇడుములు ఎదురైనా ధైర్యంగా దృఢంగా నిలబడటానికి సేవచేయడానికి తోడ్పడింది.

1676లో ఫాదర్ క్లోడ్ లండనుకు పంపబడ్డారు. అక్కడ వీరు మెర్కు యువరాణికి ఆథ్యాత్మిక గురువుగాను, రాజభవనంలో నున్నవారికి విశ్వాస సందేశకులుగాను, సలహాదారుగాను పనిచేశారు. ఆరోజులు క్రైస్తవంలో కొంత క్లిష్టపరిస్థితులు నెలకొని ఉన్నాయి. ప్రొటెస్టెంటు వాదనలు మితిమీరి క్రైస్తవశాఖలు ఆవిర్భవించాయి. అట్టి గడు రోజుల్లో ఫాదర్ కోడ్ ప్రసంగాలు విని, సలహాలననుసరించి ప్రొటెస్టాంటులుగా చీలిన అనేకమంది తిరిగి సత్య శ్రీసభలోకి మరలివచ్చారు. ఇది గమనించిన రాజకీయవేత్తలు కేవలం పోపుగారిదూత' అయిన ఫాదర్ క్లోడ్ రాజకీయాల్లో తలదూరుస్తున్నారని అభండాలువేసి చెరసాలలో బంధించారు. ప్రొటెస్టెంటు పోకడలనే ఆలింగనం చేసుకున్న బ్రిటిషు రాజశాశనం వారిని రాజద్రోహి, దేశద్రోహిగాను అన్యాయపు తీర్పువిధించి వారిని దేశ బహిష్కారం చేసింది.

1681లో వేసవిరోజుల్లో ఫాదర్ క్లోడ్ పారలేమోనియలు చేరుకున్నారు. అక్కడే వారికి ఆరోగ్యం క్షీణించి మెదడులో రక్తస్రావం వల్ల 1682 ఫిబ్రవరి 15వ తేదీన పరలోక ప్రాప్తిచెందారు. క్రీస్తునాధుడు వెల్లడిచేసిన అపారమైన ప్రేమ, కరుణ అనే సౌవార్తిక బాటలో ఆత్మలను నడిపించి దేవునిచెంతకు చేర్చడమే వీరిలక్ష్యం” అని సిస్టర్ మార్గరేటు మేరిగారు ఫాదర్ క్లోడ్ గురించి నుడివారు. 1926 జూన్ 16వ తేదీన 11వ పయస్ (భక్తిగాధ) పోపుగారు ఫాదర్ క్లోడ్ ధన్యజీవిగా ప్రకటించారు. 1992 మే 31వ తేదీన రెండవ జాన్ పాల్ జగద్గురువులు వీరికి పునీత పట్టాను ప్రధానం చేశారు. ఆ సందర్భంగా దివ్యబలిపూజనర్పిస్తూ పోప్ జాన్ పాల్ తమ దివ్య సందేశంలో ఇలా పేర్కొన్నారు. “మహోన్నత త్రియేక దేవుని మహిమార్థం, కతోలిక విశ్వాసం, క్రైస్తవ మతాభివృద్ధి నిమిత్తం మన ప్రభువైన ఏసుక్రీస్తు అధికారం వలనను, పునీత పేతురు, పౌలు, అపోస్తులుల అధికారంతో దైవసహాయంలో సమగ్రవిచారణను జరిపి, మేత్రాణుల సంఘంలోను నాసహోదంపీఠాధిపతులతో సముచిత సంప్రదింపులు నెరిపినమీదట ధన్యజీవి కోడ్ కొలంబియేరును పునీతునిగా నిర్వచించి, సకల పునీతల జాబితాలో చేర్చుతూ శ్రీసభలో వారికి తగు భక్తి మర్యాదలను అందరూ కనబరచ నిర్దేశిస్తున్నాను.”

రెండుగంటల సేపుసాగిన వారి పూజా పవిత్రసాంగ్యంలో జగద్గురువు 2వ జాన్ పౌలుగారు పునీత క్లోడ్ కొలంబియేరుగార్ని “ఏసు తిరుహృదయ అపోస్తులుడ”ని పదేపదే ప్రకటించారు. వారి సద్గుణ సంపదను వేనోళ్లప్రశంసించారు”. “ఏసు పవిత్రప్రేమను నిండు హృదయంతో స్వీకరించి, సౌవార్తిక వ్రతజీవితం ద్వారా ఏసు పరిశుద్ధ హృదయానికి పరి పూర్ణంగా అంకితమై పటుతర విశ్వాసం నమ్మిక త్యాగనిరతితో వర్తించి, కడకు పరమ ప్రభునిప్రేమ సేవకోసం తమజీవితాన్ని అర్పణచేసిన మహనీయుడని నొక్కివక్కాణించారు. ఈ ఉత్తముని జీవితసందేశాన్ని మనమందరం అంగీకరించి, సదా క్రీస్తునాధుని ప్రేమయందు నిలకడగా ఉండమని ప్రబోధించే ఈ ఆదర్శప్రాయుని అనుసరించాల”ని పరిశుద్ధ పోపుగారు ఉద్భోధించారు.

A jesuit and confesser St. Margaret Mary Alacoque actively promoted the devotion to the Sacred Heart of Jesus with St. Margaret Mary. The emphasis on God’s love for all was an antidote to the rigorous moralism of the Jansenists, who were popular at the time. In 1674, after 15 years of life as a Jesuit, Colombière did his period of probation known as the Tertianship, which was to prove decisive in his life. As a result of this experience of the Spiritual Exercises, he made a personal vow, as a means of attaining the utmost possible perfection, to observe faithfully the Rule and Constitutions of the Society under penalty of sin. Those who lived with him attested that this vow was kept with great exactitude. Claude showed remarkable preaching skills long before his ordination in 1675. Two months later he was made superior of a small Jesuit residence in Paray-le-Monial. It was there he first encountered Margaret Mary Alacoque. For many years after he served as her spiritual friend and confessor.

In 1676 Colombière was sent to England as preacher to Mary of Modena, then the Duchess of York. He took up residence at the Court of St. James, where he still observed all his religious duties as a member of the Society. He preached by both words and by the example of his holy life, converting a number of Protestants. Although encountering many difficulties, he was able to guide Alacoque by letter. Colombière's zeal and the English climate soon combined to weaken his health and a pulmonary condition threatened to end his work in that country. In November 1678 he was suddenly arrested and thrown into prison, denounced as being a part of the Popish Plot alleged by Titus Oates against the English throne. Caught up in the anti-Catholic hysteria which resulted from this alleged plot, he was confined in severe conditions where his fragile health took a turn for the worse. He was ultimately banished, and returned to Paray-le-Monial but by then his health had been ruined. He died in 1682. Pope John Paul II canonized Claude de la Colombière in 1992.

Add new comment

3 + 2 =