SAINT OF THE DAY - April 7 పునీత జాన్ బాప్టిస్ట దే లా సాల్లే |ST. JOHN BAPTIST DE LA SALLE 

@pjsri

(ఉపాధ్యాయులకు పాలక పునీతుడు, ఆధునిక బోధనా శాస్త్ర పితామహుడు,మతసాక్షి క్రీ||శ|| 1651-1719) ఫ్రాన్స్ దేశంలో రేయిమ్స్' అనే నగరం ఉంది. ఈ నగరం యొక్క ప్రజా ప్రతినిధి కుమారుడే ఈ జాన్ బాప్టిస్ట దె లా సాల్లేగారు. వీరు 1651 ఏప్రిల్ 30న జన్మించారు.దేవునియందు భయ భక్తులతోను వినయవిధేయతలతోను పెరిగారు. అందుకే తమ పదహారవ ఏటనే స్థానికంగా ఉన్న రేయిమ్స్ నగర కేథడ్రల్ (పెద్దగుడి)లో ఆరాధనా కార్యక్రమాల పర్యవేక్షకులుగా నియమింపబడ్డారు. 

వీరి ఆసక్తిని బట్టి సెమినరీకి పంపబడగా తన 27వ ఏట పరిశుద్ద గురువుగా పట్టాభిషిక్తులయ్యారు. వీరు మంచి సుగుణ సంపదగల ఆదర్శగురువుగా పేరుగాంచారు. వీరు చేస్తున్న సేవను బట్టి పేదలపై అమితాభిమానం పెంచుకున్నారు. పేదల సేవే తమ జీవిత పరమావధిగా ఎంచుకున్నారు. వీరు జీవిస్తున్న రోజుల్లో 'జాన్సన్' అను నతను అనేక వక్రభాష్యాలు చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తూ కతోలిక మతంలో చీలికను తెచ్చి విజృంభిస్తున్నాడు. అదే సమయంలో తరచూ విదేశీదండయాత్రలు వల్లను, స్వదేశంలో చెలరేగిన అంతర్యుద్ధాల వల్ల ఫ్రాన్సు దేశమంతటా కరువు దాపురించి విలవిల్లాడుతోంది. 

ఫ్రాన్సుదేశం యావత్తు నష్టాల ఊబిలో కూరుకుపోయి శోకతప్తంతో శిథిలావస్థకు చేరుకుంది. ఇట్టి దుస్థితిలో సామాన్యుల బ్రతుకులు దుర్భరమయ్యాయి. విద్య వైద్య సేవలకు తీవ్రగండి పడింది. తత్ సంబంధిత సంస్థలు కూడా దాదాపు మూతపడ్డాయి: ఈ అలజడితో పాటు అజ్ఞానం అవినీతికి రెక్కలొచ్చాయి.ఇలాంటి దయనీయ సమయంలో పేదసాదలకోసం కనీసం రెండు పాఠశాలలనైనా ప్రారంభించమనీ జాన్ బాప్టిస్టగార్ని చాలామంది అర్థించారు. అందుకు అంగీకరించి వారు విద్యాసంస్థల్ని నెలకొల్పారు. శక్తి కొలది శ్రమించారు. మంచి ప్రవర్తన బోధనా పటిమగల ఉపాధ్యాయులను నియమించారు. 

నూతన పద్దతులతో వినూత్న ఒరవడితో విద్యావ్యవస్థ విధానం తీర్చిదిద్దారు. తన నివాసంలోనే నిరు పేదపిల్లలకు ఆశ్రయం కల్పించారు. అతి తక్కువ వ్యయంతో విద్య, భోజన వసతులు కల్పించి వారి పాలిట దేవుడయ్యారు. ఈ విధంగా క్రైస్తవ పాఠశాలల్ని నిర్వహించే క్రైస్తవ బ్రదర్ల సంస్థ క్రీశ11 1680లో ఆవిర్భవించింది. దీనత, సేవ, త్యాగం, దైవకృప అనే ముఖ్యమైన సూత్రాలపై ఆధారపడి ఈ సంస్థ పనిచేసింది. ఎన్ని అవాంతరాలు ఒడుదుడుకులెదురైనా విద్యాసంస్థ ఉన్నత ప్రమాణాలతో కొనసాగింది. 

స్వతహాగా పునీత జాన్ బాప్టిస్ట్ దె లా సాల్లేగారు గొప్ప మేధావి. విద్యారంగంలో వినూత్న సంస్కరణల్ని ప్రవేశ పెట్టి విద్యా పండితునిగా సుజ్ఞాన విశారదునిగా గణుతికెక్కారు. కాలానుగుణ అవసరాలకు అనుగుణంగా ఆధునాతనమైన ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాల విద్యావిధానంను రూపొందించి సమర్థవంతంగా అమలు చేశారు. వీరి క్రైస్తవ బ్రదర్లసంస్థలో గురువులు లేరు. దేవుని సేవకు విద్యా సేవకు అంకితమైన వ్రతదీక్షా బ్రదర్లే ఈ సంస్థ పేరట విద్యావ్యాప్తికి నిరంతరం కృషిచేశారు. ఆరోజుల్లో లాటిను భాషా మీడియం పాఠశాలలే నడపబడేవి. 

కాని జాన్ బాప్టిస్టగారు స్థానిక భాషలలో కూడ విద్యను గరి పేలా చర్యలు గైకొని తమ సంస్థల్ని ప్రజలకు మరింత దగ్గరయ్యేలా చేశారు. సాధారణ విద్యతో పాటు నైతిక విద్యను కూడా ప్రవేశపెట్టి పిల్లల్లో మానవతా విలువల్ని పెంచారు. అలాగే క్రమశిక్షణ నేర్చిన తమ విద్యార్థుల ద్వారా వారి తల్లిదండ్రులకు కూడ క్రైస్తవ జీవన విధానం నీతి శాస్త్ర అనుసరణం అబ్బేలా చేయడంలో కృతకృత్యులయ్యారు.వివిధ సాంకేతిక వృత్తి విద్యల్ని అభ్యసించదలచిన ధనిక కుటుంబాల విద్యార్థులకొసం వీరు ఒక కళాశాలను కూడ నెలకొల్పారు. మరియు వయోజనుల నిమిత్తం వారి మానసిక ప్రవృత్తికి తగ్గట్లు 'సండే అకాడమీ' అనే వేరొక క్రొత్త సంస్థకు అంకురార్పణచేసి అందులో గణితం, చిత్రలేఖనం, గృహ నిర్మాణ శాస్త్రం సబ్జెక్టులను పూర్తి అవగాహన కలిగేలా అభ్యసింప జేసేవారు. 

ఆధునిక పద్ధతులలో విద్యాబోధన జరిపేందుకు ఉపాధ్యాయ తర్ఫీదు సంస్థను కూడ ఏర్పాటు చేసిన ఘనత పునీత జాన్ దెలా సాల్లెగారికే దక్కుతుంది.వీరు శాస్త్రీయ బోధనా ప్రక్రియకు సంబంధించి ప్రాథమిక సూత్రాలతో ఒక శాస్త్రాన్ని రచించారు. అలాగే క్రైస్తవ ప్రవర్తన అలవాట్లు, క్రైస్తవ విశ్వాస సత్యోపదేశం వంటి అంశాల పై కూడ ఉత్తమ గ్రంథాల్ని ఆవిష్కరించారు. గురువుగా, విద్యాకోవిదునిగా, గొప్పరచయితగా నిస్వార్థ ఆదర్శ సేవలందించిన వీరు శాస్త్రీయ విద్యకు పునాది వేసిన వైతాళికుడు. వీరు 1719 ఏప్రిల్ 7న పవిత్ర శుక్రవారం రోజున తన 67వ ఏట అసువులు బాసి దేవుని చేరుకున్నారు. 1900 సం||లో వీరు 13వ లియోపోపుగారిచే పునీతులుగా ప్రకటింపబడినారు. 

వీరి విశ్వజనీన విద్యా ఉద్దేశ్యంనుబట్టి 12వ భక్తినాథ పోపుగారు వీరిని ఉపాధ్యాయులందరికి పాలక పునీతునిగా వెల్లడించి గౌరవించారు. ఆధునిక బోధనా విధానకర్తగా, క్రీస్తు ప్రతిరూపుడుగా వర్ణించారు.


Complete dedication to what he saw as God's will for him, dominates the life of John Baptist de LaSalle. Founder of the Brothers of the Christian Schools, or Christian Brothers, he was canonized in 1900. In 1950 Pope Pius XII named him patron of schoolteachers.Saint John Baptist was born of the nobility of Rheims in 1651, and after a very pious youth was ordained a priest at the age of 27, becoming at once a Canon of the Cathedral there. It was said that to see him at the altar was sufficient to give an unbeliever faith in the Real Presence of Our Lord. 

The people would wait for him to come from the church to consult him. His life was marked by a rule he set for himself, to maintain perfect regularity in all his duties. He became interested in the creation of gratuitous schools for poor and abandoned children. He himself was invited to help in their education; and after directing the teachers for four years, decided to join them. In this he was opposed by most of the city, for whom such a life was very humiliating for a Canon of the Cathedral.

His spiritual director, a virtuous Franciscan Minim priest, encouraged him, saying that for teachers, whose vocation is to aid the poor to walk in the footsteps of Jesus, the only suitable inheritance is the poverty of the Savior.Saint John Baptist divested himself of the patrimonial wealth he still controlled, then took religious vows with his co-workers. His tender and paternal charity soon sanctified the house and the labors; peace reigned, and the members of the new society loved one another sincerely.

The Institute developed and spread amid a thousand difficulties and persecutions; these, by humiliating its members, brought down graces on them and made the Providence of the Lord more evident.The blessed Founder died in 1719; a religious superior said of him that his humility was universal; he never acted without taking counsel, and the opinion of others always seemed better to him than his own. He listened to others in conversation, and was never heard to say any word tending to his own advantage. Indeed it is God who elevates those who take the last place for themselves, to place them among the first.

Add new comment

1 + 2 =