SAINT OF THE DAY –July 2 పునీత ప్రోసెస్సు మరియు పునీత మార్టీను|St. Processus and Martinian

@pjsri

మరియు 40 మంది అనుచరులు (వేదసాక్షులు క్రీ||శ|| 1వ శతాబ్దం) క్రీ||శ|| 4వ శతాబ్దంకంటే ఇంకా ముందుకువెళితే రోము క్రైస్తవులు పునీత ప్రోసెసు. పునీత మార్టీను అను పుణ్యాత్ముల పేర్లు స్మరించి గౌరవింస్తుండేవారు. వారి పుట్టు పూర్వోత్తరాలు తెలియ రాకున్నాగాని, రోమను వేదసాక్షుల జాబితాలో వీరినిగూర్చి పేర్కొనబడింది. ఈ ఇద్దరూకూడ మమిటైన్ చెరసాలకు కావలివారు. 1వ శతాబ్దంలో మనం రాయప్ప చిన్నప్పగార్లని చెప్పుకునే పునీత పేతురు, పునీత పౌలు అపోస్తలులను బంధించింది ఈ చెరసాలలోనే.వీరు ఈ చెరసాలలో నిర్బంధితులై ఉండగా ఆ చెరశాల కావలివారు, మరియు మరో 40 మంది నిర్బంధితులుకూడ రాయప్ప చిన్నప్పగార్ల వేదబోధలు విన్నారు. వారి అద్భుతాలు కండ్లారా చూశారు. వారి దైవస్తుతులు వీనులవిందుగా ఆలకించారు.

ఒళ్లు పులకరించిపోయారు. తమ తమ ఆత్మలు దేవాదిదేవునకు అర్పించుకున్నారు. క్రీస్తు నిజమై దేవుడు. నరులను రక్షించడానికి దైవచిత్తం నెరవేర్చిన మనుష్యావతారియైన దైవపుత్రుడు అని నమ్మారు. 42 మంది కలసి తమకు జ్ఞానస్నానం ఇమ్మని పట్టుబట్టారు. అక్కడున్న ఒక బండ పై అపోస్తులు చిన్న స్లీవగుర్తు వేయగానే ఒక కుళాయిలా పైకి నీళ్లు చిందడం మొదలు పెట్టింది. ఆ నీటితో 42 మందికి జ్ఞానస్నానాలు ఇచ్చారు. దేవుని బిడ్డలుగాను, క్రీస్తు శరీరమైన శ్రీసభలో సభ్యులుగాను వారు మారిపోయారు. భువి దివిగా మారిపోయింది వారికి.

జైలు అధికారి అయిన పౌలీను వచ్చి ప్రో సెస్సు, మార్టీనుగార్లను ఈ క్రొత్త విశ్వాసంలోకి వెళ్లవద్దని చెప్పిచెప్పి విఫలమయ్యాడు. పెద్దలకు పిర్యాదుచేశాడు జూపిటరు అనగా బృహస్పతి గ్రహదేవతకు మొక్కమని వారికి ఆదేశాలువచ్చాయి. అందుకు ఈ విశ్వాసులు శిరసావహించనందుకు హింసింపబడ్డారు కొరడాల కొట్టబడ్డారు. అంత పెద్ద దేవుని విడిచి పెట్టి ఆయన సృష్టిలో అల్పవస్తువైన గ్రహానికి మొక్కడం అంత మూర్ఖత్వం మరొకటి లేదని ఎదురు మాట్లాడార అందరూ క్రీస్తును దేవుడుగా రాజుగా అంగీకరించాలని “దేవుని పరిశుద్దనామము స్తుతింపబడునుగాక !” అని సవినయంగా మనవి చేశారు. ప్రతిఫలంగా వారికి మరణశిక్ష విధింపబడింది. ప్రోసెస్సు, మార్టీనుగార్ల తలలు కత్తివేటుకు నేలకు ఒరిగాయి. లూసియాన అను పుణ్యస్త్రీ వారి పవిత్ర వేదసాక్షి కళేబరాల్ని తన స్వంతపొలములో సమాధిచేయించుకుంది.

4వ శతాబ్దంలో వారి సమాధులపై ఒక పెద్ద దేవాలయం నిర్మంపజేసి పోప్ గ్రెగొరి ఘనుడుగారు వారి ఉత్సవంరోజున గొప్ప అర్చనా ప్రసంగంచేశారు. ఆ సమయంలో వేలాదిగా హాజరైన ప్రజల్లో అనేక ఆశ్చర్యకర స్వస్థతలు, మేలులు విస్తారంగా చోటుచేసుకుని అందరూ విస్తుపోయినంత పనైంది. అతి బిగ్గరగా దైవ స్తుతులు సల్పారు.9వ శతాబ్దంలో పునీత 1వ పస్కాల్ జగద్గురువులు పునీతులు ప్రోసెస్సు, మార్టీనుగార్ల అవశేషాల్ని తెప్పించి పునీత పేతురు పెద్దగుడిలో వారికొరకై ప్రత్యేకంగా నిర్మింపజేసిన పూజాబలిపీఠం క్రింద భద్రపరుపజేశారు. గొప్పగా గౌరవ వందనంచేశారు. మార్టీను అనగా మార్స్ (అంగారక) గ్రహసంబంధమైన అని అర్థం.


Martyrs buried on the Aurelian Way. According to tradition, they were two Roman martyrs who were much venerated in the Eternal City, including having a basilica on the Aurelian. They joined the Apostles Peter and Paul in the Mamertine Prison in Rome before their executions.

A spring flowed miraculously in the prison, and Processus and Martinian, both wardens, were baptized in the miraculous waters. Their relics are preserved in St. Peter's Basilica. Their cults have been limited to local calendars since 1969.

Add new comment

8 + 4 =