SAINT OF THE DAY – SEPTEMBER 6 పునీత ఎలియుతేరి|ST. ELEUTHERIUS

మఠాధిపతి మతసాక్షి క్రీIIశII - 585 పునీత ఎలియుతేరియసుగారు ఇటలీదేశంలో ఆరవ శతాబ్దంలో జీవించారు. వీరు నిరాడంబరతకు పశ్చాత్తప్త హృదయానికి ప్రతీక. వీరు 'పరిశుద్దుడైన ఎలియుతేరి తాతయ్య' అని ప్రేమగా పిలువ బడుతుంటారు. భక్తి విశ్వాసాలు మెండుగా గల గురువు. అట్టివీరిని స్పొలేటో పట్టణదాపులోని పునీత మార్కు మఠాలయంకు పెద్దగా వ్యవహరింప ఎంపిక చేయబడ్డారు.

ఒకసారి ఎలియు తేరిస్వామి ఒక కాన్వెంటులో మతవాసినుల కు ఉపదేశాలివ్వడానికి వచ్చారు. అక్కడ ఆ రాత్రి బసచేసినప్పుడు వారి దగ్గరకు ఒక అభాగ్య పిల్లవానిని తీసికొని రావడం జరిగింది. ప్రతిరోజు రాత్రి ఆ పిల్లవాణ్ని ఒక దుష్టాత్మ పట్టి పీడిస్తుందని, కానీ అతణ్ని గురువు జాగ్రత్తలో ఉంచాలని తమ కోరికనీ వెల్లడించారు. ఆ రాత్రి ఆ పిల్లవాడు ఎటువంటి కలత లేకుండ హాయిగా నిద్రపోయాడు. తెల్లవారిన పిదప పరిస్థితిని గమనించిన ఎలియుతేరిగారు “ఈ బాలుడు దైవ సేవకుల మధ్యలో ఉన్నాడు. అందుకే అతన్ని చేరడానికి దయ్యానికి ధైర్యంలేకపోయింది.” అని తెలిపారు.

ఈ మాటలకు దుష్టాత్మ ఖంగుతిన్నాడు. తిరిగి యథాప్రకారం ఆ బాలుణ్ని సటి పీడించడం మొదలు పెట్టాడు అందుకు ఏలీయులు గురువు తన తప్పును వహించి ఖిన్నులయ్యారు. వెంటనే (ఉపవాస ప్రార్థనలు మొదలు పెఓరు. అక్కడి మతవాసినులు కూడ వారితో కలసి ప్రభుని బ్రతిమాలుకున్నారు, ఆ డయ్యుం అని శాశ్వతంగా వదలిపొయేంతవరకు ప్రార్థనలు కొనసోగా. బోలుడు స్వేచ్ఛాపూరితుడై క్షేమంగా తల్లిదండ్రులను చేరుకున్నాడు. ఇంకెప్పుడూ ఏ దయ్యమూ దరిచేరలేదు. “పేదరికంయొక్క అంతర్గతాన్ని నేను పడుకీ కనుగోన్నాను” అని పునీత ఎలియుతేరిగారు పశ్చాత్తాపంగూర్చి అడిగితే చెప్పారు. “కోపం, గర్వం, సోమరితనంను అసహ్యించు కుంటూ ఎన్నో రోజులు కృషిచేసి పాపాన్ని దరిజేరనీయలేదు. నన్ను నేను ప్రేమించుకొనడాన ఆధ్యాత్మికంగా వికృత రూపం ధరించాను. 'నేను' అనే అహంకార భావాన్ని కట్టడిచేశాను. అప్పుడే 'పాప పశ్చాత్తాపం అనే సుగుణాన్ని అలవరచుకున్నాను' అని అడిగిన వారికి చెప్తుండేవారు ఆ మహనీయ పుణ్యాత్ముడు.

ఒక పర్యాయము పునీత గ్రెగోరి ఘనుడు అనగా పెద్ద గ్రెగోరి జగద్గురువులు ఒక పెద్ద శనివారం రోజున అధిక బలహీనత నీరసంవల్ల ఉపవాసం ఉండలేకపోతున్నట్లు పునీత ఎలియుతేరిగారి తెలియజేశారు. తనతో పాటు పునీత అంద్రెయ దేవాలయంకు వచ్చి దైవ ప్రార్థనలో తమ స్వస్థతకై వేడుకోవలసిందిగా కోరారు. విశ్వాసులందరితోకూడి ఎలియుతేరిగారు పాప పశ్చాత్తాప ప్రార్థనలు సలిపారు. కన్నీటితో ప్రభుని వేడుకున్నారు. మరికొంత సేపటికి జగద్గురువులు దేవాలయంనుండి వెలుపలకు వచ్చి ప్రజలను కలుసుకున్నారు. తన దేహంలో తెలియరాని శక్తి ఆకస్మికంగా ప్రవేశించిందని తానుకూడ ఉపవాసము ఉండగలనని పలికి ఉపవాస ప్రార్థనల్లో మునిగిపోయారు. ఎలియుతేరిగారి భక్తి ప్రార్జనలకు హృదయంలోనే కృతజ్ఞతలు తెల్పుకొని దేవునికి ధన్యవాదాలర్పించారు. పునీత ఎలియుతేరిగారు రోములో ఉన్న పునీత అంద్రెయ మఠాలయంలోనే క్రీIIశII 585లో పరలోక ప్రాప్తినొందారు. 


A wonderful simplicity and spirit of compunction were the distinguishing virtues of this holy sixth century abbot. He was elected to preside Saint Mark's monastery near Spoleto, and favored by God with the gift of miracles.

A child who was confided to the monastery, to be educated there after having been delivered by the Abbot from a diabolical possession, appeared to everyone to be entirely exempt from further molestations. And Saint Eleutherius chanced to say one day: Since the child is among the servants of God, the devil dares not approach him. These words seemed to savor of vanity, and thereupon the devil again entered into and tormented the child. The Abbot humbly confessed his fault and undertook a fast, in which the entire community joined, until the child was again freed from the tyranny of the fiend.

Saint Gregory the Great, finding himself unable to fast on Holy Saturday on account of extreme weakness, called for this Saint, who was in Rome at the time, to offer up prayers to God for him that he might join the faithful in the solemn practice of that day's penances. Saint Eleutherius prayed with many tears, and the Pope, when they came out of the church, felt suddenly strengthened and able to accomplish the fast as he desired. The same Pope, remarking that the Abbot was said to have raised a dead man to life, added: He was so simple a man, one of such great penance, that we must not doubt that Almighty God granted much to his tears and his humility! After resigning his abbacy, Saint Eleutherius died in Rome in Saint Andrew's monastery, about the year 585.

Add new comment

3 + 1 =