SAINT OF THE DAY – SEPTEMBER 4 విటేర్బొపురి పునీత బాలరోజమ్మ |ST. ROSE OF VITERBO

@pjsri

(మఠకన్య క్రీ||శ|| 1235 - 1252) పునీత రోజమ్మగారు ఒక పేదకుటుంబంలో ఇటలీలో విటెర్బో అనబడే ఒక నగరంలో జన్మించారు. భౌతికంగా వారు పేదవారైనా ఆథ్యాత్మిక బలసంపన్నులు. క్రైస్తవ విశ్వాసం, భక్తి మిన్న. అందువల్ల పునీత రోజమ్మగారు కూడ బాల్యంనుండే పవిత్రతలో అభివృద్ధి చెందుతూ వచ్చారు. వారు తమ ఏడవ ఏటనుండే పెద్దవారు చేసేటంత ఘనంగా త్యాగకృత్యాలను ఆచరిస్తూ ఏకాంతంగా ప్రార్థించడం చేసేవారు. బాల తపస్విగా పేర్గాంచారు.

ఒక రోజు మేరిమాత వారికి దర్శనమై దేవుడైన తన కుమారుడు క్రీస్తుని రక్షణ భాగ్యాన్ని ఇంకా ఎక్కువమందికి అందించ కలగాలంటే వారు ఫ్రాన్సీసుగారి మఠంలో చేరాలని అనుజ్ఞనిచ్చారు. రోజమ్మ గారికి కేవలం పండ్రెండేండ్ల ప్రాయమే. అయిననూ తన దర్శన విషయాన్ని చెప్పి ఫ్రాన్సీస్ వారి సభలో ప్రవేశించారు. సభ కట్టుబాట్లను పాటిస్తూ కొద్దికాలంలోనే మఠకన్యదీక్షను భక్తితో చేపట్టారు. వీరు నిర్భయంగా 'వెటెర్బొ' నగర వీధుల్లో కలియ తిరుగుతూ “బహిరంగ ప్రాయశ్చిత్తం” గూర్చి విశేషంగా బోధిస్తూ వచ్చారు. పాప క్షమాపణపొంది పరమానందంతో ఈ భూలోకంలోనే పరలోక సంపదను సంపాదించు కొండని ఎంతో ఆకర్షణీయంగా నచ్చచెప్తుండేవారు.

ఆ రోజుల్లో జర్మనీ చక్రవర్తి అయిన రెండవ ఫ్రెడరిక్ శ్రీసభకు, పోపుగారికి అనుకూలంగా లేడు. అందుకు రోజమ్మగారు చక్రవర్తిని ప్రతిఘటిస్తూ విశ్వాసులెల్లరు పరిశుద్ద పోపుగారి అధికారానికి లోబడాలని, ఆనాటి 9వ గ్రెగోరి జగద్గురువులకు విశ్వాసంగా ఆలంబనంగా నిలవాలని దాదాపు రెండు సంవత్సరాలు తమ ఆథ్యాత్మిక వేద ప్రచారాన్ని కొనసాగించారు. చాలా చిన్న బాలిక ఇంత ఉధృతిగా ఆధ్మాత్మిక శక్తితో అధికార పూర్వకంగా ఉపదేశించడం వల్ల చక్రవర్తి అధికారులు అనుచరుల్లో కలకలం చెలరేగింది. ఇదిలా కొనసాగనిస్తే చక్రవర్తి అధికారానికే ప్రమాదం ఏర్పడే పరిస్థితి తప్పదని భావించారు. వెంటనే రోజమ్మగార్ని వారి యావత్ కుటుంబాన్ని విటెర్బొనగర బహిష్కారం గావించారు.

అయితే రోజమ్మగారు మరింత పట్టుదలతో దీక్షతో ఆ చుట్టు ప్రక్కల ఊళల్లోను, నగరాల్లోను పర్యటిస్తూ స్వార్థపరుల భూటకపు బోధలకు, వక్రభాష్యాలకు దారితప్పవద్దని, ప్రొటెస్టెంటులుగా మారవద్దని ప్రచారంచేస్తూ పోపుగారికి అనుకూలంగా మద్దతుకూడ గడుతూవచ్చారు. భక్తిపరురాలైన రోజ్గారికి భవిష్యత్తును గ్రహించి జరుగబోయే సంఘటనలను ముందుగానే వివరింపగల వరం కలిగి ఉన్నారు. అందువల్లనే పెడసరియైన చక్రవర్తి కేవలం పదిరోజుల్లో మరణిస్తాడని ముందుగానే తెల్పారు. అది అలాగే సంభ వించింది.

ఆ కాలంలో 'విటోరియానో' పట్టణంలో ఒక మంత్రగత్తెఉంది. దబ్బర దేవుళ్లను సృష్టివస్తువులనే భగవంతుడని ఆరాధించే ఆ క్షుద్రదేవతోపాసకురాలు ప్రజలకు కల్లబొల్లి మాటలు చెపూ తప్పు త్రోవ పట్టిస్తూ చెడగొడుతోంది. ఈ విషయం తెలుసుకున్న పునీత రోజమ్మగారు అక్కడకు వెళ్లి క్రైస్తవ విశ్వాసాన్ని వారికి బోధించి, రక్షణ ఇవ్వలేని దేన్నీ పూజించడం అనుసరించడం తగదని నిరూపిస్తూ వచ్చారు. అందుకు ఉదాహరణగానే దేవుని మహిమని ప్రజలకు చూపి వారిలో పరివర్తన కొనితెచ్చేందుకుగాను రోజమ్మగారు మండుచున్న చితి పై మూడు గంటలపాటు ఉండి సురక్షితంగా బయటకు వచ్చారు. ఈ అద్భుతాన్ని చూచిన ప్రజలంతా ఆయమ్మ బోధనను విశ్వసించి క్రైస్తవులయ్యారు.

జర్మనీ చక్రవర్తి పీడ విరగడైపోయి క్రీశ 1251లో విటెర్బొనగరంలో పోపుగారి అధికారం పునఃస్థాపింపబడింది. దాంతో రోజ్ గారు తమ స్వంత నగరానికి తిరిగి చేరుకున్నారు. తర్వాత పేద క్లరెన్స్ మఠంలో ప్రవేశించేందుకు అనుమతినిమ్మని అభ్యర్థించారు. కాని వారి అభ్యర్ధన మన్నింపబడలేదు. రోజమ్మగారు పట్టణం వెలుపల ఉన్న చిన్న గదిలో నివశించేందుకు వెళ్లిపోయారు. తన మరణం తాను కోరుకున్న ఆ కాన్వెంటులోనే ప్రవేశం లభిస్తుందని జోస్యం చెప్పారు. వారి ప్రవచనం ప్రకారమే, ఆ తర్వాత వచ్చిన వసంత ఋతువులో తమ 17వ ఏట అతి చిన్న వయస్సులోనే క్రీ||శ|| 1252 మార్చి 6న స్వర్గస్తులయ్యారు. 1454లో 5వ నికోలాసు పోపుగారు పునీతపట్టా ఇచ్చారు.

పునీత రోజమ్మగారి మరణవార్త తెలుసుకున్న అప్పటి 4వ అలెగ్జాండర్ జగద్గురువులు ఆయమ్మగారి భౌతిక కాయాన్ని పేద క్లేర్స్ మఠంలో భూస్తాపితం చేయాల్సిందిగా ఆజ్ఞ చేశారు. పునీత రోజమ్మగారి మృత శరీరం నేటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉండటం గొప్ప అద్భుతం. ప్రతి ఏడాది సెప్టెంబరు నాల్గవ తేదీన వారి ఉత్సవ రోజున అరవై అడుగుల ఎత్తు ఉన్న చెక్క గోపురంగల రథం పై పునీత రోజమ్మగారి పవిత్ర దేహాన్ని ఉంచి డెబ్బది మంది భక్తులు దాన్ని లాగుతూ విటేర్బొనగర వీధుల్లో ఊరేగించడం ఆనవాయితీగా వస్తోంది. రోజమ్మ అంటే గులాబి పువ్వు అని అర్థం.


Saint Rose was born in the spring of 1235 at Viterbo, capital of the patrimony of Saint Peter. In those days the emperor Frederick II was oppressing the Church, and many were faithless to the Holy See. But this infant at once seemed filled with grace; she never cried; with tottering steps she sought Jesus in His tabernacle; she knelt before sacred images and listened to sermons and pious conversation, retaining all she heard, and this when she was scarcely three years old. One coarse habit covered her flesh; fasts and disciplines were her delight.

At the age of seven she wished to enter a monastery of nuns; but God had other designs for her, and she resolved to create a solitude in her father's house, where she would forever spend all her days. Her mortifications there seem incredible to our time of laxity; she gave herself the discipline three times a day until she fainted from fatigue and loss of blood, and she scarcely ate at all. To those who urged her to mitigate her austerities, she explained so perfectly that happiness consists in suffering for God, that no one could doubt this was so for her.

Nonetheless she fell ill and nearly died of consumption. She was close to the final agony when suddenly she beheld the Mother of God, and said to those attending her: All of you here, why do you not greet the Queen of the world? Do you not see Mary, the August Mother of my God, coming forward? Let us go to meet Her, and prostrate ourselves before Her majesty! Everyone turned toward the door and knelt down, and the Mother of God spoke to Rose, telling her she must enter the Third Order of Saint Francis, then go out to reprove, convince, exhort and bring back the erring to the paths of salvation. If your endeavors bring upon you sarcasm and mockery, persecution and labor, you must bear them patiently... Those who assist you will be enriched with all the graces of the Lord.

To defend the Church's rights was already Rose's burning wish. When hardly ten years old, she arose after her reception into the Franciscan habit, went down to the public square at Viterbo, called upon the inhabitants to be faithful to the Sovereign Pontiff, and vehemently denounced all his opponents. She returned to her house only to redouble her flagellations and macerations; she saw her Saviour on the Cross and nothing could arrest her ardor thereafter. So great was the power of her word and of the miracles which accompanied it, that at the end of several months the Imperial party, after threatening her in vain to stop her preaching, in fear and anger drove her from the city.

Saint Rose and her parents moved to Soriano, a fortified city, where she continued to do as she had been told by the Mother of God. Then Rose went on by herself to Vitorchiano, where she had understood there was need for her, and continued to win souls by her aspect as much as by her words. She went barefoot and wore a poor tunic at all times, until after some eighteen months, when the emperor had died, she and her parents returned to Viterbo. Innocent IV was brought back in triumph to Rome and the cause of God was won.

A number of young girls came to her for instruction at Viterbo, and she taught them the principles of modest prudence and faithful love of God. Rose fell ill again and recognized that her end was approaching; she prepared, rejoicing, in solitude for her glorious destiny, and died in her eighteenth year. Not long afterward, she appeared in glory to Alexander IV, and bade him to translate her intact body. He found it fragrant and beautiful, as if still in life. For more than 700 years it has remained supple and unchanged, save for its color, darkened after a fire in the chapel where it reposed.

Add new comment

2 + 11 =