SAINT OF THE DAY – SEPTEMBER 30 పునీత జెరోమ్ / ST. JEROME

(గురువు, శ్రీసభ పండితుడు, బైబిలు శాస్త్ర పితామహుడు గ్రంథాలయాల నిర్వాహకుల పాలక పునీతుడు క్రీ||శ|| 341 - 420) పునీత జెరోమ్ గారు గురువు, శ్రీసభ పండితులు. వీరు పాశ్చాత్య శ్రీసభ కోవిదులైన పునీతులు. అంబ్రోసు, అగస్టీను, పెద్ద గ్రెగోరి అనువార్లతో సరితూగగల విధ్వాంసులు. సకల విజ్ఞాన వరసంపదలఘని. అన్ని కాలాల బైబిలు శాస్త్ర పండితులుగా చెప్పుకోదగిన వారు. గొప్ప గ్రాంథిక భాషాభిమాని. వ్రాతల్లో ఉత్తమ శైలికి ఒరవడి దిద్దిన పితామహులు.

పునీతుల్లో కూడ తప్పులుంటాయా అని పరిశీలిస్తే జెరోమ్ గారు కనబడతారు. వీరు ముక్కోపి. వాక్యము ప్రేరేపించే సత్యము ప్రేమ అనబడే యదార్ధాన్ని కుండలు బద్దలు కొట్టినట్లు మాట్లాడేవారు. ఈ విషయంలో తనతో వాదించే వారిపై తన మాటలతో వ్రాతలతో విరుచుకుపడే మనిషి. అందువల్ల గట్టిగా వాదించే శక్తిగల వీరు తన మాటకు కట్టుబడే వ్యక్తిగా ఎందరో మిత్రులను కలిగి ఉన్నాగాని, శత్రువులను విమర్శకులనుకూడ సంపాదించుకున్నారు. కాని తన దుర్గుణాలను త్యజించటానికి రెట్టింపు పశ్చాత్తాప క్రియలను ఆచరించిన వ్యక్తిగా శ్రీసభలో వీరికి పెరుంది. తన 80 ఏళ్ల జీవితంలో 40 ఏళ్లు ఏకాంత వాసంలోనే మునిగి ప్రార్థన, పఠనము, ఎలాంటి సుఖ మెరుగని కఠోరని, తపోదీక్షనే పాటించారు. తన తప్పులు మన్నింపుమని సిలువపై వ్రేలాడుతున్న క్రీస్తుని ధ్యానించి తరించారు.

యుగోస్లావియాలో 'దల్మాతియా' ప్రాంతానగల అక్విలియా పీఠంలోని స్ట్రిడోనియస్ అనే చిన్నపట్నంలో పునీత జెరోమ్ గారు క్రీ||శ|| 341లో జన్మించారు. వీరి పూర్తి పేరు యు సేబియుస్ హిరోనిముస్ సొఘనియుస్. జెరోముగారు ఒక సింహం బొమ్మ గుర్తుతో కలపి ప్రదర్శింపబడుతుంటారు. ఎందుకంటే,ధైర్యసాహసాలుగల విశ్వాసయోధుడు కావడాన వీరికి 'దల్మాతియాసింహం' అని బిరుదు ఉంది. వీరి తండ్రి ధనవంతుడు, ఉత్తమ క్రైస్తవుడు. కుమారుణ్ని క్రమశిక్షణలో పెంచాడు. జెరోమ్ గార్ని వారి 12వ ఏట ప్రామాణిక విద్య నేర్పేనిమిత్తం రోమునగరానికి పంపించాడు. జెరోముగారు వ్యాకరణ దిట్ట అయిన డొనాటస్ మరియు మంచి వక్త అయిన విక్టోరినస్ వంటి అధ్యాపకుల వద్ద చదువుకున్నారు. తన 19వ ఏట అనగా క్రీ|| శ|| 360లో లిబేరియన్ పోపుగారి ద్వారా జ్ఞానస్నానం పొందారు. లాటిను, గ్రీకు భాషల్లో పండితుడయ్యారు. ఆ రోజుల్లో తన యవ్వన ఆసక్తి చొప్పున విందు వినోదానందాలకోసం సమయం వ్యర్ధంచేశారు. పిమ్మట వీరు జర్మనీలోని 'త్రిదెస్' పట్టణానికి వెళ్లారు.

ప్లాటుస్, తెరింతియస్, విర్జిల్, సిసిరో వంటి ప్రసిద్ధ గ్రంథకర్తల రచనలు పఠించారు. వీరికి తమ 35వ ఏట బాగా జ్వరం వచ్చి చనిపోతారేమో అనుకునే సమయంలో వీరికి ఒక కలవచ్చింది. ఆ వివరాలు వారి స్వంత మాటల్లో పశిద్దాం.“నేను పరలోకానికి తీసికొనిపోబడినాను. పరలోక తీర్పరి ప్రభువు ఎదుట ముఖాముఖిగా నిలబడి ఉన్నాను. ఆ దివ్య వెలుగుముందు నా కళ్లు జిగేల్ మంటున్నాయి. తల పైకెత్తలేకపోతున్నాను. “నీవెవరవు ?” క్రీస్తు ప్రభువు ప్రశ్నించారు. “జెరోమ్. ఒక క్రైస్తవుడను.” జవాబిచ్చాను. “నీవు అబద్దం చెప్తున్నావు !” నా చెంపలు చెళ్లు మనిపించినట్లయ్యింది. “నేను మాత్రం క్రైస్తవుడనే !” బిగ్గరగా అన్నాను. “నీవు వింతలుగూర్చి చెప్పే పండితుడులా కనిపిస్తున్నావు. కాని క్రైస్తవునిలా అగుపించడంలేదు” అని హెచ్చరించారు.

కలత చెందిన జెరోముగారు తన 38వ ఏట అంతియోకుకు 8 కి.మీ. దూరంలోని చాల్సి లోని ఫీర్స్ అనే సిరియా ఎడారికి వెళ్లి అక్కడ ఒక యూద సన్యాసి చెప్పుచేతల్లో ఉండి ఘోరతపస్సు చేశారు. తన తప్పులు పాపాలకోసం రోదించి కఠిన ఉపవాసాలతో శరీరాన్ని రాళ్లతో కొట్టుకొని ఆ మండుటెండల ఎడారిలో సొమ్మసిల్లారు. సైతానుని దరి చేరనీయక పవిత్రాత్మను శాశ్వతంగా పొందారు. అక్కడే యూద సన్యాసి వారినుండి హిబ్రూ భాషను బాగా అథ్యయనం చేశారు. తదనంతరం క్రీ||శ|| 380లో తన 39వ ఏట జెరోముగారు సిరియా దేశంలోని అంతియోకు పీఠాధిపతులైన పునీత ఫౌలీనస్ వారి హస్తాలు మీదుగా పరిశుద్ధ గురు పట్టాభిషిక్తులయ్యారు. ఆ వెంటనే వారు ఇటలీలోని కాన్‌స్టాంటి నోపిల్ వెళ్లి అక్కడి బిషప్ పునీత గ్రెగోరి నజీయెంజెన్ వారివద్ద సువార్తా మత గ్రంథాల ప్రబోధాల్ని అవళింపు చేసుకున్నారు. రెండు సంవత్సరాల తర్వాత శ్రీసభకు 37వ పోపుగారుగా పాలిస్తున్న దమాస గారు ఫాదర్ జెరోముగార్ని రోమునగరంలో జరుగ బోతున్న కౌన్సిలు సమావేశాలకు కార్యదర్శిగా వ్యవహరింప ఆదేశించారు. ఫాదర్ జెరోముగారి గొప్ప పాండిత్యం, అకుంఠిత విశ్వాసం సువార్తా గ్రంథాల యెడ గట్టి పట్టును బట్టి పోపుగారు వీరిని తమ వ్యక్తిగత కార్యదర్శిగా నియమించుకున్నారు.

పోపుగారివద్ద అయిదేండ్లు వీరు సేవలందించారు. పోపుగారి ఆదేశాల చొప్పున వీరు గ్రీకు మూలభాషలోనున్న నూతన నిబంధనను లాటిను భాషలోకి తిరగవ్రాశారు. ఇది కతోలిక ప్రామాణిక గ్రంథంగా శ్రీసభ వాడుకుంటోంది.కీర్తనల గ్రంథాన్ని కూడ లాటిన్ భాషలోకి పునః తర్జుమా చేశారు. రోములో ఒక గ్రంథాలయాన్ని ప్రారంభించారు. రోమునగరంలోని కొంతమంది భక్తిగల మహిళల్ని పోగుచేసి పవిత్ర గ్రంథాన్ని వారు పఠించేందుకు తోడ్పడ్డారు. పునీత పౌలా, వారికుమార్తె పునీత యుసేబి యుమ్ లు ఆ మహిళా బృందంలో ఉండటం విశేషం.

క్రీ||శ|| 384లో పోప్ దమాస గారు గతింపగా, నిర్మోహమాటంగా మాట్లాడే ఫాదర్ జెరోముగారి) కొందరు రోము మతాధికారులు తీవ్రంగా విమర్శించడం ప్రారంభించారు. రోములో ప్రతికూల వాతావరణం ఏర్పడడంలో వారు పరిశుద్ధ నగరమైన బెల్లెహేముకు ప్రయాణం కట్టారు రోమునగరంలో పవిత్ర జీవనం గడిపే పురుషులు మహిళా భక్తులు కొందరు కూడా వారిని అనుసరించారు. వారు సైప్రస్, సిరియాదేశ అంతియోకును దాటిపోయి బెల్లె హేములో ఏసుప్రభువు జన్మించిన చోటుకు క్షేమంగా చేరుకున్నారు. అక్కడ బసిలికా అనగా పెద్ద పుణ్యస్థల దేవాలయం దాపులో ఒక పురుష సన్యాసుల మఠ భవనాన్ని నిర్మంచారు. అలాగే మూడు సభలకు చెందిన మహిళల కోసం ఆశ్రమాలను కట్టించారు. ఫాదర్ జెరోముగారు మాత్రం ప్రభువు పుట్టిన స్థలానికి దాపులో గొల్లలు తమ గొర్రెలు కాచుకునే కొండల్లోకి వెళ్లి ఒక పెద్ద గుహను చూసుకొని తన ఏకాంతవాసానికి ప్రార్థనా జీవితానికి భంగం కలగకుండ నివాసం ఏర్పరచుకున్నారు. ఫాదర్ జెరోముగారు ఒక ఉచిత పాఠశాలను కట్టించి నిర్వహించారు. అక్కడకు విరివిగా వచ్చే యాత్రీకుల సౌకర్యార్ధం ఒక సువిశాల సత్రాన్ని కూడ స్థాపించారు. తద్వారా “మరొకసారి మరియ యోసేపులు రావడమే తటస్థిస్తే వారు బసచేయడానికి స్థలం లేదనే ప్రశ్నే ఉత్పన్నం కాకూడదు” అని నారు తలపోశారు. బెల్లె హేంలోనే ఫాదర్ జెరోముగారు ముప్పది సంవత్సరాలు నివశించి చిరస్మరణీయమైన రచనల్ని పూర్తి చేశారు. ముఖ్యంగా హిబ్రూ మూల భాషలోనున్న పూర్వ నిబంధనను కీర్తనల గ్రంథాన్ని శ్రీసభ గుర్తింపు భాషయైన లాటిన్ భాషలోకి తిరగ వ్రాశారు. పలు భాషల పై గొప్ప పాండిత్యం, బైబిలులో పేర్కొనబడిన అనేక పవిత్ర స్థలాలను స్వయంగా దర్శించిన అనుభవం, సుదీర్ఘ ప్రయాణాలు, కఠోర విశ్వాస మఠజీవితం అనేవి వీరు పవిత్ర గ్రంథాన్ని వ్రాయడంలోను, ఆ లోతైన భావాలను వివరణాత్మకంగా చెప్పడంలోను బాగా ఉపయోగపడి పరిపూర్ణతను కొనితెచ్చాయి. నభూతో నభవిష్యతి అన్నట్లు ఈ పవిత్ర కార్యం నెరవేర్చారు. పద్దెనిమిదేండ్లు నిర్వరామ కృషిచేసి క్రీ||శ|| 404లో పూర్తి బైబిలును సిద్ధం చేశారు. పవిత్ర గ్రంథంగూర్చి తెలియక పోవడమంటే క్రీస్తును గురించి తెలియక పోవడమేనని వారు వెల్లడించారు. ఈ బైబిలును శ్రీసభ అధికారికమైందిగా ట్రెంట్ మహాసభ ఆమోదించింది.

రెండు సంవత్సరాలు సుదీర్ఘ జబ్బుతో ఫాదర్ జెరోముగారు క్రీ॥శ|| 420 సెప్టెంబరు 30న ప్రశాంతంగా ప్రభువును చేరుకున్నారు. ప్రభువు పుట్టిన బెల్లె హేం బసిలికా దేవాలయంలోనే వీరి మృతశరీరాన్ని ఖననంచేశారు. ఆ తర్వాత పదమూడవ శతాబ్దంలో వీరి భౌతిక కాయాన్ని రోమునగరం గొనిపోబడింది. అక్కడ పునీత మరియ మజోర్ బసిలికా దేవాలయంలో సిస్టెన్ మందిరంలో భద్రపరచబడింది.

#rvatelugu #saints #isidore #saintoftheday

St. Jerome was born in Dalmatia in year 329, and attended school at Rome. His boyhood was not free from fault. His thirst for knowledge was excessive, and his love of books a passion. He had studied under the best masters, visited foreign cities, and devoted himself to the pursuit of science.    But Christ had need of his strong will and active intellect for the service of His Church. St. Jerome felt and responded to Christ's call, made a vow of celibacy, fled from Rome to the wild Syrian desert, and there, for four years, learnt in solitude: penance, prayer, and new lessons of divine wisdom. The Pope soon summoned him to Rome, and there put upon the now famous Hebrew scholar the task of revising the Latin Bible. The revision became St. Jerome's magnum opus and a blessing of the Holy Spirit. Retiring thence to his beloved Bethlehem, the eloquent hermit illuminated our Christian faith for the next thirty years.

 

Add new comment

18 + 0 =