Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
SAINT OF THE DAY – SEPTEMBER 28 పునీత వెన్సెక్లాస్ | ST. WENCESLAUS, MARTYR
(బో హేమియా రాజు, వేదసాక్షి, బొ హేమియా, చెకొస్లోవేకియాల పాలక పునీతుడు క్రీ||శ|| 907 - 929) పునీత వెన్సెక్లాస్ (లేక వన్ స్లావ్) గారు చెకొస్లోవేకియా దేశ రాజధాని ప్రాగ్ (లేక ప్రేగ్) నగరంలో క్రీ||శ|| 907లో పుట్టారు. తండ్రి రతిస్లావ్. బొహేమియా రాజ్యంకు ప్రభువు. ఉత్తమ లక్షణాలుగల క్రైస్తవ విశ్వాసి. తల్లి ద్రహోమిరా. అవిశ్వాసి కఠినాత్మురాలు. అయితే క్రైస్తవుడైన తండ్రి ప్రోద్బలంవల్ల మంచి విశ్వాసభక్తురాలైన వెన్సెస్లావ్ నాయనమ్మ అయిన పునీత లూద్మిలగారి పెంపకంలో పెట్టడం జరిగింది. ఇకనేం ఆ పునీతురాలి హస్తాల్లో ఆ బాలుడు పున్నమినాటి చంద్రునివోలె దిన దిన ప్రవర్ధమాన మవుతూ పూవు పరిమళించినట్లు మంచి సుగుణాలతో విద్యలోను భక్తిలోను పెరిగారు. వారి రాజ్యంలో క్రైస్తవ చట్టాలు వెల్లివిరిసి శ్రేయో పాలన గుభాళించింది.
అయితే వెన్సెస్లాస్ తండ్రి రతిస్లావ్ మ్యాగ్యర్స్ లో క్రీ||శ|| 920 యుద్ధంలో చనిపోవడం జరిగింది. పిల్లలు చిన్నవాళ్లు కావడంతో పరిపాలనా పగ్గాలను రాజు భార్య ద్రహోమిరా చేపట్టింది. ముందుగా తన అత్తగారును, వెన్సెస్లావ్ పోషణ చేస్తున్న పునీత లూద్మిలను చంపించింది. క్రైస్తవ చట్టాలను రద్దు చేసింది. తన రాజ్యంలో క్రైస్తవాన్ని వ్యాపింపజేస్తున్న జర్మనీదేశ మిషనరీ గురువులందరిని రాజ్య బహిష్కారంగావించింది. అవిశ్వాసపు చేష్టలే రాజ్యమేలాయి.
ఈ దుష్పరిపాలనను సహింపజాలని విశ్వాసులు ప్రజలు ఆందోళన చేపట్టారు. తమకు వెన్సెస్లావ్ యువరాజే ప్రభువుగా ఉండ అర్హుడని వత్తిడిచేశారు. ఇంతలో రాణిగారి ముఠాలోని ఒక అసంతృప్తి బృందం ఆమెను తప్పుకునేలా చేశాయి. ఇక యువరాజు వెన్సెస్లావ్ బొహేమియా రాజ్యా నికి క్రీ||శ|| 922లో ప్రభువుగా పట్టాభిషిక్తుడయ్యారు. తండ్రి మార్గంను చేపట్టారు. అవిశ్వాస చట్టాలన్నింటిని తొలగించి క్రైస్తవ శాసనాల్ని అమల్లో పెట్టారు. జర్మనీ మిషనరీల బహిష్కారాన్ని రద్దుపరచి తిరిగి తమరాజ్యంలోకి రావాల్సిందిగా స్వాగతించి వారికి కావాల్సిన సౌకర్యాలు ఏర్పరచారు. పరిపాలనలో దృఢ వైఖరిని అవలంభించి, తన వ్యతిరేకు లను అక్రమాలను అణచివేశారు. బోహేమియా సంస్కృతి, క్రైస్తవ మతం, నీతి ప్రవర్తన, వ్యాపార ప్రమాణాలు అభివృద్ధి పరచారు.
తన సత్పరిపాలనతో 1వ ఒట్టో చక్రవర్తిచే వెన్సెస్లాన్ “బొహేమియా రాజు” అని ఆమోద ముద్రపొందారు. ఈ సందర్భంలోనే వెన్సెక్లాసు ఒక కుమారుడు పుట్టాడు. ఇక వెన్సెక్లాసు రాజ్యపాలన దీర్ఘకాలం తప్పదని గ్రహించిన వ్యతిరేక ముఠావారు రాజు తమ్ముడైన బొలెస్లాస్ ను ప్రోత్సహించి కొంత అలజడి అయోమయం సృష్టించారు. వెన్సెస్లాస్ తర్వాత ఆయన కుమారుడే రాజు అవుతాడు. కాన బోలె స్లావ్ కు అసలు రాజు అయ్యేయోగమే ఉండదు. ఏదొకటి చేయాలని కుట్రపన్నారు.
ఆ కుట్రలో భాగంగా బొలెస్లావ్ రాజైన తన అన్నగారు వెన్సెస్లో గార్ని బొహేమియాలోని బొలెస్లావియా నగరంకు మత సంబంధమైన పండుగలో పాల్గొన ఆహ్వానించాడు. రాజు పండుగకు హాజరై అక్కడే విశ్రాంతి తీసికొని ఉదయాన్నే గుడికి వెళ్లి దివ్యబలి పూజలో పాల్గొనాలని బయలుదేరారు. అంతే మార్గం మధ్యలో తమ్ముడైన బొలెస్లావ్ మరియు ఆయన అనుచరులు దాడిచేసి ఆ పుణ్యాత్ముని రక్తాన్ని నేల పారింపజేశారు. ఈ విధంగా వెన్సెక్లాస్ గారు క్రీ||శ|| 929 సెప్టెంబరు 20న తమ 21వ ఏట పిన్నవయసులో వేదసాక్షి మరణం పొందారు. వారు చెకొసోవేకియా దేశ పాలక పునీతుడుగా నియమింపబడి గౌరవింపబడుచున్నారు. వెన్సెక్లాస్ అంటే బలమైన సంరక్షకుడు అని అర్థం.
#rvatelugu #saints #isidore #saintoftheday
St. Wenceslaus was the son of a Christian Duke of Bohemia, but his mother was a hard and cruel pagan. Through the care of his holy grandmother, Ludmilla, herself a martyr, Wenceslaus was educated in the true faith, and imbibed a special devotion to the Blessed Sacrament. On the death of Wenceslaus' father, his mother, Drahomira, usurped the government and passed a series of persecuting laws. In the interests of the Faith, Wenceslaus claimed and obtained, through the support of the people, a large portion of the country as his own kingdom. His mother secured the apostasy and alliance of her second son, Boleslas, who became her ally against the Christians. Wenceslaus, meanwhile, ruled as a brave and pious king, provided for all the needs of his people, and when his kingdom was attacked, overcame in single combat the leader of an invading army.
St. Wenceslaus was martyred following a banquet at his brother's palace. As he went to pray before the Tabernacle at midnight, his killer struck the death blow. Although passing away on the feast of the Angels, year 936, St. Wenceslaus received a martyr's crown and eternal life in Jesus Christ.
Add new comment