Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
SAINT OF THE DAY – SEPTEMBER 27 పునీత విన్సెంట్ దె పాల్ |St. VINCENT de PAUL
(ఫ్రెంచి గురువు, విన్సెంటేనియనులసభ స్థాపకుడు, సిస్టర్స్ ఆఫ్ చారిటిసభ స్థాపనకు దోహదకారి, దాన దాతృత్వసంఘాల పాలక పునీతుడు క్రీశ 1581 - 166) పది సంవత్సరాలుకూడ నిండని బాలుడు ఎంతో పొదుపుగా తనకు కొనుక్కో డానికి తల్లిదండ్రులిచ్చే డబ్బును పర్సులో దాచుకునేవాడు. ఇలా నెలల తరబడి దాచిన నాణేలను రోజూ లెక్క పెట్టుకునేవాడు. ఒక రోజు ఆ బాలుడు వీధిలో నడుస్తుండగా ఒక బాల భిక్షకుడు జీర్ణవస్త్రాలతో బక్కచిక్కిన శరీరంతో కన్పించాడు. ఎంతో కరుణ ప్రేమగల ఆ బాలుడు తన పర్సులోని నాణేలన్నీ ఆ బాలభిక్షకుని దోసిట్లోపోసి ఇంటికొచ్చాడు. ఆనందంతో నిండిన పక్షి పిల్లలా గంతులేశాడు.
తనకున్నదంతా ఇలా ధర్మం చేసిన ఆ బాలుడే పునీత విన్సెంట్ దె పాగారు. తన అనితకాలమంతా పేదలు, బలహీనులు, అనాధలు, అణగారిన ప్రజల ఉదరణకోసమే వెచ్చించి తన కారుణ్య ప్రేమను ధారపోసి కతోలిక శ్రీసభకు ఎనలేని సేవచేసి కడకు పునీతుడయ్యారు. పునీత ఫ్రాంన్సీస్ దె సేల్స్ గారు వీరికి సమకాలీనులు.ఫ్రాన్స్ దేశంలో గాస్కొని ప్రాంతంలోగల డక్స్ పట్టణదాపులోని 'పొయి' గ్రామంలో క్రీ.శ|| 1576 ఏప్రిల్ 24న పుట్టారు. తండ్రి జీన్ దె పాల్. తల్లి బెర్ట్రాండ్ దె మోరస్. పేద రైతుకుటుంబం. వీరికి గల నలుగురు మగ పిల్లలు ఇద్దరు కుమార్తెల్లో విన్సెంట్ గారు మూడో సంతానం. బాగా తెలివిగల బాలుడు. అందుకే తండ్రి వారిని డక్స్ పట్టణంలోగల ఫ్రాన్సిస్కన్సభ వారి విద్యాలయంలో చేర్పించారు. అనంతరం సరగోస్సాలోని స్పానిష్ కళాశాలలో చదివారు. వారి ఫీజుల నిమిత్తం తల్లిదండ్రులు ఖరీదైన రెండు ఎద్దులనుకూడ అమ్మివేశారు.
పిమ్మట విన్సెంట్ గారు తామొక మంచి గురువు కావాలని తగు అనుమతుల నొందారు. ఫ్రాన్స్ లోని ఫ్రాన్సిస్కన్నారి సభలో సభ్యుడయ్యారు. కౌలౌస్ నగరంలోని విశ్వవిద్యాలయంలో తమ విద్యను కొనసాగించి తమ 24వ ఏట క్రీ||శ|| 1600 సెప్టెంబరు 23న శ్రీసభ జూబిలీ సంవత్సరంలో పవిత్ర గురుపట్టాభిషిక్తులై ఒక కొండమీదగల పరిశుద్ధ కన్యమరియాంబ దేవళంలో తమ ప్రథమ దివ్య బలిపూజనర్పించారు. మరో నాలు గేళ్లు అదే విశ్వవిద్యాలయంలో చదివి వేదాంత శాస్త్రంలో డాక్టరేటు పట్టాను సాధించారు.విన్సెంటుగార్కి తమ 28వ ఏట ఒకవిధమైన సాహసంతో కూడిన జీవితం ప్రారంభ మైంది. క్రీ॥శ॥ 1605లో కౌలౌస్ నగరంలో తమ విద్యను ముగించుకొని ఇంటిముఖం పట్టారు. అందుకై మార్సిల్లెస్ ఓడరేవులో ఒక పడవనెక్కి నార్బొన్నెకు పయన మయ్యారు. మార్గమధ్యంలో ఆ పడవను మూడు ఓడల్లో సముద్ర దొంగలు చుట్టు ముట్టారు. పడవలోని వారందర్ని హింసించారు. బాణాలతో కొట్టిన వారి హింసలకు పడవ ప్రయాణీకులు కొందరు చనిపోగా ఎందరో ఎక్కువగా గాయపడ్డారు. విన్సెంటుగారును గాయాల పాలయ్యారు. ఆ సముద్ర దొంగలు బ్రతికి ఉన్న ప్రయాణీకులందర్నీ కట్టిపడేసి ఆఫ్రికా దేశంలోని (టునిస్) టునీషియా పట్టణంకు గొంపోయి అక్కడి వీధులన్నీ త్రిప్పి సంతకు తీసుకొచ్చి పశువులను అమ్మినట్టు బానిసలుగా వారిని వేలంవేసి అమ్మేశారు.
విన్సెంట్ గార్ని ఒక జాలరికొన్నాడు. కాని సముద్రంలో చేపలు పట్టడంపల తరచు సముద్ర వ్యాధికి గురౌతున్న విన్సెంట్ గార్ని తిరిగి అమ్మివేశాడు. ఈ సారి కంసాలి పనిచేసే ఒక వృద్ద ముస్లిం వ్యక్తి కొన్నాడు. ఆయన మరణానంతరం విన్సెంట్ గారు మరోసారి అమ్మబడినారు. ఈ తఫా క్రైస్తవం విడిచి ముస్లింగా మారిన, ఒక ఇటలీ దేశస్థుడు కొన్నాడు. అతనికి ముగ్గురు భార్యలు. అందులో ఒకామె టర్కీ పౌరురాలు. బానిసగా ఉన్న విన్సెంట్ గారు పూజ చేయడానికి, బ్రెవరీ అనబడే గురు పఠన పుస్తకం చదవడానికి వీలుకాలేదు. అందువల్ల బానిసపని చేసుకుంటు తనకు వచ్చిన కీర్తనల గ్రంథ పాటలను పాడుకునేవారు. విన్సెంట్ గారి భక్తి విశ్వాసాలకు ముగ్గురాలైన ఆ యజమాని టర్కీ భార్య సిఫారసువల్ల విన్సెంటుగారు బానిసతనం నుండి విడుదల పొందారు. రెండు సంవత్సరాలు బానిస బ్రతుకు బ్రతికి క్రీ||శ|| 1607లో తమ 26వ ఏట ఫ్రాన్స్ కు తిరిగి చేరుకున్నారు.
మార్గమధ్యంలో ఫ్రాన్సులో ఒక లాయరువద్ద కొన్నాళ్లు పనిచేస్తూ జీవించారు. ఆ సమయంలో లాయరు గృహంలో దోపిడీ జరిగింది. ఆ నేరం విన్సెంటుగారి పై బడింది. వినయంతో తానా పనిచేయలేదని మొర పెట్టుకున్నా ఎవరూ నమ్మలేదు. “నిజం దేవుడెరుగు” అని మిన్నకుండిపోయారు. ఆరేళ్ల అనంతరం అసలు దొంగ దొరికాడు. కాని అంతవరకు విన్సెంటుగారు సిగ్గుమాలిన అవమాన భారం అనుభవించాల్సి వచ్చింది. గురువుగా వచ్చినా వారి గత చరిత్రనుబట్టి ఏ విచారణ ప్రజలుకూడ వారిని అంగీకరించ లేదు. కడకు పారిస్ నగరంలోని ఒక పెద్ద ఆసుపత్రిలో వారు రోగుల సేవ చేయడానికి అనుమతింపబడ్డారు. విన్సెంటుగారి విద్య, పనితనం, భక్తి ఎరిగిన 8వ లూయీరాజు క్రీ|శ|| 1619లో విన్సెంటు గురువర్యులను అల్మొనర్ జనరల్ గా నియమించారు. ఆరోజుల్లో జైళ్లలోని ఖైధీల భయంకర దుస్థితిని మార్చేందుకు, రాజుగారి ఓడలలో తెల్లువేసే బానిసల జీవితాల్ని మెరుగు పరచేందుకు వీరికి అవకాశం లభించింది. ఆ సమయంలో వారు ఆసుపత్రుల్ని నిర్మింపజేశారు. ఆ విధంగా ఆథ్యాత్మిక భౌతిక సేవల్ని అందిస్తూ పలువురి అభిమానాన్ని చూరగొన్నారు. అనేకుల్ని వారు క్రైస్తవం వైపు మరల్చారు. క్రీ||శ|| 1626లో పునీత విన్సెంట్ గారు మత ప్రచారం, విద్య, స్వస్థత సేవలందించేందుకు ఒక గురువులసభను స్థాపించారు. ఉత్సాహవంతులైన అనేక మంది యువకులు, గురువులు ఈ సభ పేరట సామూహికి భక్తి జీవితాన్ని
కోనసాగించేందుకు ఆసక్తి కనబరచారు. గ్రామీణ పేదల విముక్తి కోసం తమను అంకితం చేసుకున్నారు. కొందరు పీఠాధిపతుల కోరిక మేరకు ఈ సభకు చెందిన గువులు సెమినరీలను నిర్వహించే బాధ్యతనుకూడ చేపట్టారు. ఈ సభనే వెంటుగారి మరణానంతరం లాజరిస్టులు లేక విన్సెంటేనియనులసభ అని పిలువబడింది. ఫ్రెంచి విప్లవం వచ్చిన ఫ్రాన్సులోని అనేక సంస్థల బాధ్యతలు ఈ సభ గురువులే నిర్వహించడం విశేషం. పారిస్ నగరంలో సెయింట్ లాజరెవద్ద ఉన్నసభ ప్రధాన కేంద్రం. వినెంటుగారు తరచు జ్ఞాన వడకాలను నిర్వహించేవారు. వీటిలో గురువులు, సామాన్య క్రైస్తవులు పాల్గొనే వారు. ప్రజల్లో ఆథ్యాత్మిక జీవితాన్ని అభివృద్ధి పరచేందుకు ఈ ధ్యాన వడకాలు బాగా తోడ్పడేవి.
ఈ సేవలతోపాటు పారిస్ నగరంలోని పేదల మధ్య ఆధ్మాతిక సేవలతోపాటు దాతృత్వపు సేవలుకూడా అందించడం ప్రారంభించారు. ధనిక వర్గంలోని మహిళలలో సామాజిక స్పృహను తీసుకువచ్చి డాటర్స్ ఆఫ్ చారిటీ అనగా “దాతృత్వపు మహిళలు” అనే సభను పునీత లూయిసె దె మరిల్లాక్ అను కన్యామణి వారి నేతృత్వంలో ఒక సభను స్థాపింప చేయడంలో విన్సెంటుగారు కృషిచేశారు. ఈ సభవారు అందించిన విరాళంతో పారిలో పెద్ద వైద్యశాలను నిర్వహించారు. ఇక్కడ అనేకమంది అనాథలకు ఆశ్రయం కల్పించారు. పని, ప్రార్థన సౌకర్యాలను ఏర్పరచారు. వీటితోపాటు అనాథ శిశువుల ఆశ్రమం. వృద్ధుల శరణాలయం స్థాపించారు. ఒక పిచ్చాసుపత్రిని, కుష్ఠరోగుల సంక్షేమ సంస్థనుకూడ విన్సెంట్ గారు ఏర్పాటు చేశారు. వీటి ఆలన పాలన చారిటీ మఠకన్యలు చూసుకునేవారు. పలు అపాయాలనుండి సంరక్షించేందుకు యువతులకు, దిక్కులేని స్త్రీలకు మఠాలలో ఆశ్రయం కల్పించారు.
రొట్టెలు, సూపు తయారీ కేంద్రాన్నికూడ నెలకొల్పారు. ఇందు మంచి పోషకాలు ఉండేట్లు విన్సెంటుగారు చనలిచ్చేవారు. రైతులకు విత్తనాలు, ఆర్ధికసాయం అందించే ఏర్పాటుకూడ చేశారు.ట్యూనిస్, అల్జీర్స్, బిజెర్రి నగరాల్లో ఉన్న ముప్పదివేలమంది క్రైస్తవ బానిసల ఆథ్యాత్మిక అవసరాల్ని తీర్చేందుకు వారి కుటుంబాల సంక్షేమం పట్ల చర్యను గైకొనేందుకు తమసభ గురువుల్ని ప్రతినిధులుగా దూతలుగా పంపారు. ఆ రోజుల్లో విన్సెంటుగారు సేకరించిన ధనంతో 1200 మంది బానిసల్ని దాదాపు ఎనిమిదికోట రూపాయలు చెల్లించి విడిపించారు.
ప్రార్థన, ధ్యానాలు, ఆథ్యాత్మిక సాధన, విన్సెంటుగారి ఉత్సాహం పలువురికి మాతృకయై దాతృత్వాన్ని పోషించాయి. ఉదాహరణకు మదర్ తెరిస్సాగారే. విన్సెంటుగారు దేవుని పై గొప్ప నమ్మకాన్ని పెట్టేవారు. ఎన్నో సేవలందిస్తున్నా వారు ఎలాంటి ప్రచారాన్ని అంగీకరించ లేదు. స్నేహరహితులకు స్నేహితులుగా, నిర్భాగ్యులకు హితులుగా, సాంఘిక సేవ ద్వారా ఆచరణాత్మకంగా క్రీస్తు బోధల్ని ప్రదర్శించారు. ఆ ధ్వేయంతోనే వారనేక ధార్మిక సంస్థల్ని నడిపి తన చివరి రక్తపు బొట్టువరకు దీనజనోద్దరణ చేసి క్రీ|| శ|| 1660 సెప్టెంబరు 27న శాశ్వతంగా ప్రభుచెంతకు చేరుకున్నారు. వారి పవిత్రశరీరం పారిలోని సెయింట్ లాజరె దేవళంలో పదిలపరచబడింది. 13వ బెనడిక్ట్ పోపుగారు 1729లో ధన్యత పట్టానివ్వగా 1737లో 12వ క్లెమెంటు పోపుగారు పునీత పట్టా ప్రకటించారు. 13వ లియో (సింహరాయులు) పోపుగారి ద్వారా దాతృత్వపు సేవలకు అంకితమైన అన్ని సంస్థలు, సంఘాలకు పునీత విన్సెంట్ దె పాల్ గార్ని పాలక పునీతులుగా శ్రీ సభ ఏర్పాటు చేసింది.
#rvatelugu #saints #saintoftheday #rvapastoralcare
St. Vincent was humble, but full of the Holy Spirit. In later-years, when adviser to the queen and oracle of the Church in France, he loved to recount how, in his youth, he had guarded his father's pigs. St. Vincent's trials began soon after his ordination. He was scarcely made priest when was captured by corsairs, and carried into Barbary. He then converted his renegade master and escaped with him to France. Appointed chaplain-general of the galleys of France, St. Vincent's charity brought hope to prisons where despair had a foothold. His charity embraced the poor, provinces desolated by civil war, and Christians enslaved by Mohammedans. The poor and bedraggled man was to him the image of Christ. "Turn the medal," he said, "and you will see Jesus Christ."
St. Vincent also taught rich people to do works of mercy. When the work for orphaned youth was in danger from lack of funds, he received aid from the ladies of the Association of Charity. One narrator paraphrases him saying, "Compassion and charity made you adopt these little creatures as your children. You became their mothers according to grace, when their own mothers abandoned them. Cease to be their mothers, and you may become their judges..." The tears of the assembly were his only answer, and the work was continued.The Society of St. Vincent, the Priests of the Mission, and twenty-five thousand Sisters of Charity still serve the afflicted to this very day.
Add new comment