SAINT OF THE DAY – SEPTEMBER 24 బంధితుల విముక్తిమాత| Our Lady of Ransom or of Mercy

స్పెయిన్లో పరిశుద్ధ కన్యమరియాంబ దర్శనం కారుణ్యమాత సభ స్థాపనకు మూలం (పండుగ స్థాపన 1696) క్రీ.శ. 1233లో స్పెయిన్ దేశంలోని బార్సెలోన పట్టణంలో కారుణ్య మరియమాత సభను పునీత పేతురునొలస్కా, పునీత న్యాహారు రేపుండు మరియు అరగాన్ పాలకుడు జేమురాజు అను ముగ్గురు తమ పవిత్ర హస్తాలమీదుగా ఈ సభను స్థాపించి చేయూతనందించారు. తల్లి దేవమాత స్పెయిన్లో దర్శనమై ఈ సభస్థాపనకు సలహానిచ్చి నట్లు వేదసాక్షుల నమోదు పుస్తకంలో ఆగష్టు 10వ తేదీలో వ్రాయబడి ఉంది. ఆ రోజుల్లో 'సరా సెన్' అనబడు దోపిడీగాండ్రు దండెత్తి ఎందరో క్రైస్తవ విశ్వాసులను చెరపట్టి బానిసలుగా అమ్మడంచేశారు. కఠోరమైన, మిక్కలి దయనీయమైన పరిస్థితుల్లో మనుష్యులను పశువులనుగా చేసి బానిసలుగా అమ్ముగా అట్టినిర్భాగ్య క్రైస్తవులను విముక్తం చేయడానికి ధనం ప్రోగు చేయబడింది. “బంధితుల విముక్తి పురియమాత” పేరట ధనం చెల్లించి క్రైస్తవులను విడిపించడం పిమ్మట ఆ దయామయి తల్లికి కృతజ్ఞతా స్తోత్రములు అర్పిస్తూ పండుగ జరుపబడింది. ఈ ఆచారం స్పెయిను, ఫ్రాన్సుదేశాల్లో విస్తరించి ఘనంగా జరుపబడుచుండగా క్రీ||శ|| 1696లో ఈ పండుగ ప్రపంచమంతట కొనియాడబడే విధంగా 13వ ఇన్నోసెంటు జగద్గురువులు ఉత్తర్వులు జారీచేశారు.

“విముక్తమాత” లేక “కారుణ్యమాత” పేరట దేవమాత మధ్యవర్తిత్వాన ప్రత్యేకంగా ప్రార్థనలు కొనసాగుతుండేవి. ఇంగ్లాండులో వివిధ ప్రొటెస్టాంటు సవ శాఖలు ఆవిర్భవిస్తున్న కారణంగా “వరప్రసాదమాత” పేరట ఈ దుర్నీతిని అరికట్లు నిమిత్తం ప్రార్థనలు కొనసాగాయి. పాపాత్ములుగా జీవిస్తున్నవారు తమ చెడుమార్గంనుండి దురభ్యాసాలనుండి విముక్తం కావడానికి మరియు సైతాను చెరలో శోధనలతో సతమతమవుతున్న దురదృష్టవంతులను సంరక్షించుకోవడానికి, ఇంకా ఉత్తరించు స్థలంలో ఉన్న దిక్కులేని మానవ ఆత్మల విమోచనకోసం దేవుని మొర పెట్టుకోవడానికి మరియమాత మధ్యవర్తిత్వాన్ని అర్థిస్తూ నేటి రోజుల్లోకూడ ఆ తల్లిని వేడుకోవడం జరుగుతోంది.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని 11వ పయస్ (భక్తినాధ) జగద్గురువులు ఇట్లు నుడువుచున్నారు. “మనందరం ఆ పరిశుద్ద దేవమాతమ్మ తల్లిని శరణువేడాలి. శ్రీసభకు ఆపదలు కష్టాలు దాపురిస్తున్న రోజుల్లో, దానధర్మాలు క్షీణించి విశ్వాసం సన్నగిల్లుతున్న సమయాల్లో మానవుని ఆంతరంగిక మరియు బహిరంగ ప్రవర్తన పాడైపోతున్న సందర్భాల్లో, కతోలిక సత్యసభకు బెదిరింపులు అనర్థాలు అధికమై సాంఘిక జీవనం కష్టతర మవుతున్నప్పుడు మనమంతా ఆయమ్మ సంరక్షణలోకి వెళ్లి సహాయ సహకారాలకై అర్ధించాలి”

మరియు “చివరకు మన మరణావస్థలో ఆశ, ఆలంబన ఎక్కడ దొరకని దుస్థితిలో మన దుఃఖపూరిత నేత్రాలను పైకి ఆ తల్లివైపుకు త్రిప్పి, వణకుతున్న హస్తాల్ని జోడించి ఆ తల్లి ద్వారా ఆమె కుమారుడైన క్రీస్తు ప్రభుని క్షమాపణను అనంతమోక్ష రాజ్యం చేరుకొను అనుగ్రహంను కోరుకుందాం” అంటున్నారు ఆ జగద్గురువులు.


The story of Our Lady of Ransom is, at its outset, that of Saint Peter Nolasco, born in Languedoc about 1189. At the age of twenty-five he took a vow of chastity and made over his vast estates to the Church. After making a pilgrimage to Our Lady of Montserrat, he went to Barcelona where he began to practice various works of charity. He conceived the idea of establishing an Order for the redemption of captives seized by the Moors on the seas and in Spain itself; they were being cruelly tormented in their African prisons to make them deny their faith. He spoke of it to the king of Aragon, James I, who knew him well and already respected him as a Saint; for the king had already asked for his prayers when he sent out his armies to combat the Moors, and he attributed his victories to those prayers.

In effect all the Christians of Europe, and above all of Spain, were praying a great deal to obtain from God the remedy for the great evil that had befallen them. The divine Will was soon manifested. On the same night, August 1, 1218, the Blessed Virgin appeared to Saint Peter, to his confessor, Raymund of Pennafort, and to the king, and through these three servants of God established a work of the most perfect charity, the redemption of captives.

On that night, while the Church was celebrating the feast of Saint Peter in Chains, the Virgin Mary came from heaven and appeared first to Saint Peter, saying that She indeed desired the establishment of a religious Order bearing the name of Her mercy. Its members would undertake to deliver Christian captives and offer themselves, if necessary, as a gage. Word of the miracle soon spread over the entire kingdom; and on August 10th the king went to the cathedral for a Mass celebrated by the bishop of Barcelona. Saint Raymund went up into the pulpit and narrated his vision, with admirable eloquence and fervor. The king besought the blessing of the bishop for the heaven-sent plan, and the bishop bestowed the habit on Saint Peter, who emitted the solemn vow to give himself as a hostage if necessary.

The Order, thus solemnly established in Spain, was approved by Gregory IX under the name of Our Lady of Mercy. By the grace of God and under the protection of His Virgin Mother, the Order spread rapidly. Its growth was increased as the charity and piety of its members was observed; they very often followed Her directive to give themselves up to voluntary slavery when necessary, to aid the good work. It was to return thanks to God and the Blessed Virgin that a feast day was instituted and observed on September 24th, first in this Order of Our Lady, then everywhere in Spain and France. It was finally extended to the entire Church by Innocent XII.

Add new comment

1 + 2 =