SAINT OF THE DAY – SEPTEMBER 12 పునీత గై |ST. GUY

దేవాలయ పరిచారకుడు, “అండర్లెకు పేదమనిషి" మతసాక్షి క్రీ.శII - 1002 'అండరులెక్టు పేదమనిషి' అని పేర్గాంచిన పునీత గైగారు బెల్జియం దేశంలోని బ్రస్సెల్సు నగరదాపులోని అండర్ లెకు గ్రామంలో ఒక నిరు పేద కుటుంబంలో 11వ శతాబ్దంలో పుట్టి జీవించారు. చదువుకున్న వారుకాదు. కాని గొప్ప క్రైస్తవ భక్తి విశ్వాసాల్లో పెంచబడినారు. వృద్దతో బియా తన కుమారునికి ఇచ్చిన సందేశాన్నే పునీత గ్రెగారికిని వారి తల్లిదండ్రులు తరచు చెప్తుండేవారు. అదేమంటే "దైవభీతి ఉంటే మనకు ఎన్నో మేలులు సమ కూరుతాయి" అని.

పేదరికంలో పుట్టి పేదరికంను ప్రేమించి సంతోషంగా జీవించారు పునీత ? గారు. కష్టాలు ఎదురైనా సహించారు. తనకు ఉన్నదానిలో ధర్మంచేసేవారు. తాను ఉపవాసము ఉండి పేదలకు భోజనం పెట్టే స్వభావంవారిది. పునీత గై గారు ఒక రైతు ఇంట్లో జీతగాడిగా పనిచేస్తున్న రోజుల్లో యజమానికి నష్టంరాకుండా పొలంపనులు శ్రద్దగా చేస్తుండేవారు. పశువులకు జబ్బుచేస్తేకూడ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునేవారు.

ఒకసారి రైతు పునీత గై గార్నీ పొలంనుదున్ని అదునుగా ఉన్నకాలంలోనే విత్తనాలు చల్లి మంచిపంట తీయమని కోరాడు. గై గారు ఎన్నిసార్లు పొలం వెళ్లినా వాతావరణ ఇబ్బందులవల్ల పనిసాగలేదు. విత్తనాలు చల్లబడలేదు. రైతుకు కోపం వచ్చింది. తన వ్యాపారాల వత్తిడివల్ల వ్యవసాయం అప్పగిస్తే తనకు నష్టం కలిగిస్తావా ? తానే రేపు పొలంవెళ్లిచూసి వస్తానని చీవాట్లు పెట్టాడు. గైగారు దేవుని పై భారంవేసి తన పై వచ్చిన అపవాదును తొలగింప పరిపరి విధాలుగా ఆ రాత్రంతా దేవుని వేడుకున్నారు. రైతు తెల్లవారింతర్వాత పొలంకు వెళ్లి చూడగా పొలంనిండా పైరు పచ్చపచ్చగా కన్పించింది. పంటకు ఎదిగి కోతకు సిద్దంగా ఉంది. ఈ అద్భుతానికి రైతు వారి బంధుమిత్రులంతా ఆశ్చర్యంలో మునిగిపోగా పునీత గైగారు దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు. గారికి దేవునికోసం పనిచేయాలని ఆశకలిగింది. రైతు వద్ద సెలవు పుచ్చుకుని వారు “లాకెను' పట్టణంచేరుకున్నారు. అది బ్రస్సెల్ నగరానికి సమీపంలోనే ఉంది. అక్కడ ఒక చిన్నపాటి దేవమాత పుణ్యక్షేత్ర దేవాలయం ఉంది. గ్రెగారి కోరిక పై ఆ విచారణస్వామి వారికి గుడిలో పరిచారకునిగా ఉండ నియమించారు. పూజా సామాగ్రిని భద్రపరచడం గుడి ఊడ్చి తుడ్చి శుభ్రంగా ఉంచే ‘సక్రిస్తను' ఉద్యోగమది. అది వారికి బాగానచ్చింది. సంతృప్తికరంగా తన దైవ సేవలందించారు. పేదలతో స్నేహంచేసి వారిని పరామర్శిస్తుండేవారు.

ఒకరోజు ఒక వర్తకుడు గైగారి దగ్గరకు వచ్చి “మీరు మీ సంపాదనను పేదలకు దానంచేస్తున్నారుకదా ! ఆ డబ్బు తన వ్యాపారంలో పెట్టుబడి పెడితే ఇంకా అధికధనం సంపాదించి దాన్ని ఇంకా ఎక్కువమంది పేదలకు దానం చేయవచ్చు” అని మాయమాటలు చెప్పి గైగారికి ఇష్టం లేకున్నా వారివద్ద ఉన్న డబ్బును తీసుకొన్నాడు. గైగారికి సోమవారం చేతినిండా పని ఉంటుంది. మిగతా రోజుల్లో ఉండేదికాదు. కాన మంగళవారం నుండి శనివారం వరకు వ్యాపారంచేసి ధనం సంపాదించి పేదలకు రోగులకు మరింత ధనసాయం చేయాలనుకున్నారు. గ్రెగారు మరియు వ్యాపారి ఇద్దరూ కలసి తమ వర్తకం నిమిత్త సరుకులకై ఒక ఓడను ఎక్కి కొన్ని రోజులు ప్రయాణం చేయగా పెనుతుఫాను ఎదురైంది. ఓడ మునిగిపోగా

గైగారు ఎలాగో ఒడ్డుకు కొట్టుకు వచ్చారు. బ్రతికి బయట పడ్డారు. లాకెను పట్టణ దేవాలయంకు చేరగా అక్కడ తనస్థానంలో మరొక వ్యక్తి నియమీతులుకాగా చాల నిరాశపడ్డారు.

ఇక దైవ చిత్తం తెలుసుకునేందుకు వారు అధికంగా ప్రార్థింపగా వారిలో దేవుడు ఒక మంచి ప్రేరణ కలిగించారు. ఆ ప్రేరణ ప్రకారం గ్రెగారు తమ తప్పుకు ప్రాయశ్చిత్తం చేసేందుకు పవిత్ర పాలస్తీనాకు బయలుదేరారు. నెలల తరబడి కాలినడకన ప్రయాణంచేసి పాలస్తీనా చేరుకున్నారు. జెరుసలే ము, ఓలీవుకొండవంటి పవిత్ర ప్రదేశాల్ని దర్శించి ప్రభువు క్షమాపణ కోరి తాను చూచిన స్థల వివరాలతో తమ స్వస్థలం బెల్జియంలోని అండర్ లేక్టుకు చేరుకుని సువార్త చెప్పాలని ఆశించారు.

చాలా నెలలు కాలినడకనే ప్రయాణంచేసి అలసిసొలసి స్వస్థలం చేరుకున్నారు. కాని వారికి పూర్తి నీరసంవల్ల అనారోగ్యానికి గురియై ఆసుపత్రి పాలయ్యారు. తన అనుభవాల్ని తనను దర్శించిన వారికి చెప్తూ వారి విశ్వాసాన్ని బలపరస్తూ దైవ ధ్యానం చేస్తూనే తన ఆత్మను ప్రభుని పాదాలచెంత అర్పణగా సమర్పించుకున్నారు. గురువులను ఖననంచే సే సమాధుల స్థలంలో వారి మృతదేహాన్ని కూడ ఖననంచేశారు విశ్వాసులు. అక్కడ అనేక ఆశ్చర్యకర సంఘటనలు జరుగుటవల్ల అది పునీత గైగారి పేరట గొప్ప పుణ్యక్షేత్రంగా మారింది.


Saint Guy was born at Anderlecht, a village near Brussels, in the tenth century. As a child he had two loves, the Church and the poor, and he wished to be himself among that special little flock of Christ, the poor. While still very young he visited and cared for the sick, and he was regarded by the villagers as a young Saint.

As he grew older, love of prayer increased in him in a prodigious manner. One day when he was praying in the church of Our Lady at Laeken, a short distance from Brussels, he manifested such devotion before Our Lady's shrine that the priest, drawing him into conversation, prayed him to stay and serve the Church. Thenceforth his great joy was to be constantly in the church, sweeping the floor, polishing the altars, and cleansing the sacred vessels. He spent entire nights in the church in prayer. By day he still found time and means to befriend the poor, so that his almsgiving became famous throughout the entire region.

A merchant of Brussels, hearing of the generosity of this humble sacristan, was prompted by a demon to go to Laeken and offer him a share of his business, telling him he would have the means thereby to give more to the poor. Guy had no desire to leave the church, but the offer seemed providential and he accepted it. The first ship bearing a cargo in which Guy had an interest, however, was lost, and he realized he had made a mistake. When he returned to Laeken, he found his place at the church filled. The rest of his life was one long penance for his inconstancy. For seven years he made pilgrimages of penance, visiting Rome and the Holy Land and other famous shrines. About the year 1012 he returned to Anderlecht in his native land. When he died in that same year, a light shone round him, and a voice was heard proclaiming his eternal reward. He was buried in the cemetery of the canons of Anderlecht.

Add new comment

8 + 8 =