SAINT OF THE DAY – SEPTEMBER 11 పునీత పఫ్ నున్సియసు|St. Pophnutius the Great

పీఠాధిపతి, మతసాక్షి (క్రీ.శ. 350) ఇతడు ఈజిప్టు దేశీయుడు. నాలుగవ శతాబ్దము ప్రథమార్థంలో మన అంతోని వారి మార్గ నిర్దేశకత్వంలో తపస్సు చేసిన వ్యక్తి. వీరి భక్తి జ్ఞానము చురుకుదనమునుబట్టి పెద్ద తెబెయిడ్ ప్రాంతంకు పీఠాధిపతిగా నియక్తులయ్యారు. ఆ రోజులలో క్రైస్తవ వేదహింసలు అధికంగా జరిగేవి. అందులో భాగంగా క్రూర రాజైన మాక్కిమిను త్రాక్సుయొక్క సైనికులు చేసిన స్వైర విహారమునకు క్రైస్తవులు ఎందరో బలైనారు. ఈ దుష్టసందర్భములోనే పఫనున్షియసుకూడ తన కుడి నేత్రమును ఎడమ మోకాలును పూర్తిగా పోగొట్టుకొని వికలాంగుడయ్యాడు. అట్లే శిక్షగా గనులలో పనిచేయ ఆజ్ఞాపింపబడినాడు. కొన్నాళ్లకు శాంతి చేకూరగా, పఫ్ నున్సియసు తన పీఠాధిపత్య బాధ్యతల్ని తిరిగి స్వీకరించి క్రైస్తవ వేదవ్యాప్తికి కృషి చేశాడు. ఆ రోజులలో అలెగ్జాండ్రియా (ఈజిప్టు)లో అరియసు అను ఒక విజ్ఞాని క్రీస్తు ప్రాత్వేక దేవునిలో ఒక వ్యక్తి కాడను వితండ వాదమును లేవనెత్తెను. తన ప్రభావము చూ పెను. ఇట్టి వాదనా శాఖవారి వ్యతిరేకతకు పీఠాధిపతి నానా అగచాట్లు పడాల్సి వచ్చింది.

క్రీ.శ. 325లో టర్కీలోని నైసియానగరంలో క్రైస్తవ పీఠాధిపతుల సార్వత్రిక సమావేశం జరిగింది. అందులో హాజరైన పునీత కాన్స్టంటైన్ చక్రవర్తితో స్నేహానికి గుర్తుగా పఫ్ నున్షియసు ఘనంగా సన్మానించబడి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ పీఠాధిపతి సలహాలంటే ఆ చక్రవర్తికిగురి. ఆయన గుడ్డి కన్ను వద్దను, కుడి మొండి మోకాలు వద్దను గౌరవ భావంతో ముద్దాడాడు.ఈ సమావేశములోనే గుర్తుపట్టమునకు ముందు వివాహ మాడిన గురువులు తమ భార్యలను తప్పని సరిగా విడనాడవసరములేదు. అది వారి అభీష్టము. కాని ఇక పై గురుపట్టము పొందచూ పేవారు. బ్రహ్మచారులై యుండవలెనని పనున్షియసు ప్రతిపాదించిన తీర్మాణము నెగ్గి అమలులోకి వచ్చెను.

క్రీ.శ. 335లో టైర్ మహా నగరంలో జరిగిన బిషప్పుల సినడ్ సమావేశములో పఫ్గనున్షియసు తనతోడి పీఠాధిపతియు, వేదాంత పండితుడైన అతనాసియసుతో కలసి ఎలియన్ శాఖవారి వితండ వాదనను, వారు పెట్టుబాధలను బహిరంగముగా ఎండగట్టారు. క్రీ.శ. 350లో ఈయన ప్రశాంతతగా పరలోక ప్రాప్తి నొందాడు. ఆ కాలములో 1వ జూలియన్ జగద్గురువుల తిరుసభను పాలించారు.


The holy monk Paphnutius was an Egyptian who, after having spent several years in the desert under the direction of the great Saint Anthony, was made bishop in Upper Thebaid. He was one of the confessors under the tyrant Maximin Daia, who lost their right eye and were afterwards sent to work in the mines.

When peace was restored to the Church, Paphnutius returned to his diocese and his flock. The Arian heresy was entering into Egypt, and he was seen to be one of the most zealous defenders of the Catholic Faith. For his eminent sanctity and his glorious title of confessor, that is, one who had confessed the Faith before the persecutors and under torments, he was highly esteemed at the great Council of Nicea in 325. Constantine the Great, during the celebration of that synod, sometimes conferred privately with him in his palace, and never dismissed him without kissing respectfully the place which had once held the eye he had lost for the Faith.

Saint Paphnutius remained always in close union with Saint Athanasius, and accompanied him to the Council of Tyre in 355. We have no particular account of the death of Saint Paphnutius, but his name is recorded in the Roman Martyrology on the 11th of September.

Add new comment

6 + 1 =