Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
SAINT OF THE DAY – October 9 పునీత జాన్ లియోనార్డు|ST. JOHN LEONARD
(ఇటాలియాగురువు, దేవమాత నిత్య సేవక గురువులసభ వ్యవస్థాపకుడు, మతసాక్షి క్రీ||శ|| 1541 - 1609) పునీత జాన్ లియోనార్డు గారు ఇటలీలోని లూక్కాపట్టణంలో క్రీ||శ|| 1541లో పుట్టారు. వారి బాల్యం రోజుల్లో ట్రెంట్ మహాసభ తమ తీర్మానాల్ని సమగ్రంగా క్రోడీకరిస్తోంది. ఈ సంస్కరణలు భవిష్యత్తులో కతోలిక శ్రీసభకు ఒక క్రొత్త ఊపునిచ్చి ఎంతో ప్రభావితం చేయగలవు. సెమినరీలో చేరిన లియోనార్డు తన గురువిద్యను దిగ్విజయంగా ముగించి క్రీ||శ|| 1572లో గురుపట్టం స్వీకరించారు. అటు తర్వాతవారు ట్రెంటుసభ ఆదేశాల్ని క్రియా రూపంలో వేగవంతంగా అమలు చేసేటందుకు ఒక ప్రత్యేక గురువులసభను ఏర్పరచారు. ఆ సభనే క్రీ||శ|| 1595లో దేవమాత నిత్య సేవక గురువులసభ (క్లర్క్స్ రెగ్యులర్ ఆఫ్ ది మదర్ ఆఫ్ గాడ్) అనే పేరుతో 8వ క్లెమెంటు జగద్గురువులు ఆమోదించి గుర్తింపునిచ్చారు.
తర్పీదునివ్వడానికి తమ గురువులకు శిక్షణనిచ్చారు. ఈ విధంగా క్రైస్తవ వేదప్రచారం ముమ్మరమై ప్రతి ఒక్కరికి క్రీస్తు గూర్చి తెలిసేలా కృషిసల్పారు. క్రైస్తవుల సంఖ్యను గణనీయంగా పెంచారు. పునీత ఫిలిప్ నేరిగారు కూడ పునీత లియోనార్డుగారి మత సేవలను బహుగా ప్రోత్సహించారు. లియోనార్డు నిజమైన సంస్కరణలవాదియని శ్లాఘించారు. పునీత లియోనార్డుగారు ఒక సెమినరీనికూడ స్థాపించారు. ప్రపంచమంతటా వెళ్లి సువార్తను ప్రబోధించడంలో కావాల్సినంత శిక్షణను ఆ సెమినరీ గురువిద్యార్థులకు ఇవ్వడమే వారి ధ్యేయం. వారి ప్రయత్నాలు సఫలీకృతమయ్యేలా 1603లో రోములో “విశ్వాస ప్రచారక కళాశాల" స్థాపనకు దారితీసింది. గతమూడు శతాబ్దాలుగా వేలాదిమంది మిషనరీ గురువులు ఇక్కడ తయారయ్యారు.
పవిత్రాత్మ పిలుపును విని అవిశ్రాంతంగా శ్రమించి పవిత్ర శ్రీసభ సంస్కరణకు వ్యాప్తికి కృషిచేసిన అగ్రగణ్యులలో లియోనార్డుగారును ఒకరు. రోమునగరంలో వ్యాపించిన ప్లేగువ్యాధివల్ల వారు రోములోనే క్రీ||శ|| 1609 అక్టోబరు 9న దేవునియందు శాశ్వతంగా నిద్రించారు. లియోనార్డు అంటే సింహంవలె ధైర్యంగల అని అర్థం.
St. John Leonardi was born in Tuscany about 1541. He was ordained priest, and founded a community to teach the young and to instruct adults against the Protestant Reformers. He went to Rome and worked with Philip Neri for a time. In preparing priests for mission work, he laid the foundations of the Congregation for the Propagation of the Faith.He died in 1609.
Add new comment