SAINT OF THE DAY – October 6 పునీత బ్రూ నొ |ST. BRUNO

(జర్మనీ దేశ గురుసన్యాసి. గొప్ప వేదాంత పండితుడు, రుతేనియా ప్రదేశంకు దయ్యము పట్టిన వారికి పాలక పునీతుడు. మతసాక్షి క్రీ॥శ॥ 1030 - 1101)

జర్మనీ దేశంలోని కొలోగ్నె (న్య) పట్టణంలో పునీత బ్రూనోగారు హర్ట్ఫ స్ట్ అనబడు గొప్ప కుటుంబంలో వారసుడుగా క్రీ||శ|| 1030లో జన్మించారు. రీమ్స్ పట్టణంలోని కెథెడ్రల్ పాఠశాలలో చదివారు. తిరిగివచ్చి వారి 25వ ఏట క్రీ||శ|| 1055లో కొలోన్య స్వగ్రామంలో పవిత్ర గురుపట్టాభిషేకం పొందారు. కొలొన్య పట్టణంలోనేగల పునీత కునిబెర్ట్ దేవాలయాధి పతిగా విచారణలో చేశారు. అయితే ఒక ఏడాది గడచిన పిమ్మట రీమ్సు పట్టణ మేత్రాణుల పిలుపుతో క్రీ||శ|| 1056లో బ్రూనో గురువర్యులు రీము పట్టణంకు తిరిగివచ్చి, అక్కడే తాను చదివిన విద్యాశాలలో వేదాంత శాస్త్ర ప్రొఫెసరుగా పనిచేయ కోరబడ్డారు. ఆ విద్యాశాలలో బ్రూనోగార్కి బోధకుడుగా పనిచేసిన పుణ్యాత్ముడు హెరిమన్ గారు దైవధ్యానం చేసుకునే నిమిత్తం ఒక మఠాలయంలో ప్రవేశించారు. ఆ స్థానంలో బోధకుడుగా వచ్చిన బ్రూనొస్వామి ఆ విద్యాశాలకు డైరెక్టరయ్యారు. ఆ రీమ్సు మేత్రాసనంలోని పాఠశాలలన్నింటికి పర్యవేక్షకుడుగా నియమితులయ్యారు.

కష్టతరమైన మరియు బాధ్యతాయుతమైన తమ పదవిలో పునీత బ్రూనోగారు 20 ఏండ్లు తమ అమూల్య సేవలు అందించారు. శ్రీసభ అదేశముల చొప్పున మంచి విద్యా ప్రమాణాలను బోధనా సంప్రదాయాలను నెలకొల్పారు. వారి 45 ఏట క్రీ|||| 1075లో వారికి మంచి మిత్రుడైన బిషప్ జెర్వయిస్ గారిచే రీమ్సు మేతాసనంకు ఛాన్సలరుగాను, వేదాంత సలహాదారుగాను నియమితులయ్యారు. ఒక సంవత్సరం గడచిన పిమ్మట బిషప్ జెర్వయిస్ గారి మరణానంతరం 1076లో మనాస్పెస్ గారు బిషప్పు అయ్యారు. తమ మేత్రాసనంలోని గురువులు ఉండాల్సిన విధానాన్ని సంస్కరించడం, వారికి ఉన్న అధికారాల పైగల విమర్శలను తొలగిం చే పనిపై బ్రూనొస్వామిని నియమించారు.

కాని బిషపుగారి కఠినస్వభావం నియంతృత్వ పోకడలవల్ల బ్రూనో 1076లోనే రీమ్సు మేత్రాసనం విడచి తమ స్వపట్టణం కొలోన్యకు వెళ్లారు. 1080లో బిషప్ మానాస్సెస్ గారు పదవీచ్యుతులు కాగా బ్రూనొస్వామిగారు తిరిగి రీమ్సు పట్టణంకు వచ్చారు. వారిని బిషప్ గా చేయాలని ప్రజలు వత్తిడి చేశారు. కాని బ్రూనోగారు అందుకు సున్నితంగా తిరస్కరించారు. మరో నాలుగేండ్లు గడచిన తర్వాత 1084లో బ్రూనోగారు క్రీస్తు ఆరాధనకై మరింత విరక్తుడై ఒక మునీశ్వరునిగా ఏకాంత జీవితం, ధ్యాన ప్రార్థనా జీవితం జీవింప నిర్ణయించుకున్నారు. తనతో పాటు మరో ఆరుగురు సహచరుల్ని వెంటబెట్టు కొని సేచె ఫౌంటెన్ గ్రామంలో మొలెస్మస్ గారి నేతృత్వంలో నిర్వహింపబడుతున్న పునీత రాబర్ట్ మఠాశ్రమంలో సభ్యులుగా ప్రవేశించారు. ప్రాంతం గ్రెనోబుల్ మేత్రాసనం పరిధిలో ఉంది. దానికి పునీత హ్యూగ్ గారు బిషప్పుగా సేవలందిస్తున్నారు. వారు బ్రూనోగార్కి మంచి సన్నిహితులయ్యారు. బ్రూనోగారి బృందానికి తపస్సు చేసుకునే నిమిత్తం చార్ ట్రేయూస్ ఎడారి ప్రదేశాన్ని నిర్ణయించారు. అక్కడ ఒక జపమందిరం గదులు కూడ నిర్మించి యిచ్చారు. మందిరంలోనే పునీత బ్రూనోగారు కర్తుసియన్ గురువుల సభను స్థాపించారు. సన్యాసి తపః జీవితం ధ్యేయంగా సభ ముందుకు సాగింది. పునీత బెనెడిక్టుగారి సభ నియమనిబంధనలనే అనుసరించారు వారు.

పునీత బ్రూనోగారు రీమ్సు కేథెడ్రల్ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేసిన కాలంలో వారి విద్యార్ధిగా ఉన్న ఒకరు 2 అర్బన్ పోపుగారుగా రోము నగరంలో ఉన్నారు. క్రీ|||| 1090లో వారు బ్రూనోగార్ని తమ సలహాదారుగా పదవి స్వీకరింపుమని ఆహ్వానం పంపించారు. కాని బ్రూనోగారు గౌరవ పదవులన్నింటి పట్ల విరక్తి విముఖత చూపారు. రిజియోపీఠంకు బిషప్పుగా నియామకాన్ని కూడ సున్నితంగా కాదన్నారు. దైవ సాన్నిధ్యంలో ఏకాంతంగా గడపడమే తనకు సమ్మతమన్నారు. వృద్దాప్యలో తాను విశ్రాంతి తీసుకుంటు పోపుగారి కోరికపై ఇటలీలోనే కలబ్రియ పట్టణంలో ఉంటూ ప్రాంతంలో పునీత మేరీమాత, పునిత స్టెఫెనుగార్ల పేరట రెండు ఋష్యాశ్రమాలు (పర్ణశాలలు) నిర్మింపజేశారు. వారు కలబియాలోనే క్రీ||శ|| 1101 అక్టోబరు 6న తమ 66వ ఏట స్వర్గస్తులయ్యారు.

Saint Bruno was born in Cologne in about the year 1030, of an illustrious family. He was endowed with rare natural gifts, which soon shone with outstanding brilliance in Paris, though he was studying among other gifted young men. Ordained at Cologne, his native city, he became a Canon of its cathedral, and then was a Canon at Rheims, where the direction of studies in theology was entrusted to him. He already had a very strong distaste for honors, and a great desire for the life of contemplation.

On the death of the excellent Gervais, Archbishop of Rheims, the region fell for a time into evil hands, and Bruno, who had resisted the decay of religion, became the object of a persecution. He stood firm and called for a papal legate; a council was assembled at Autun, of which Bruno was the soul, and the intruder at Rheims was repulsed, to die later in total obscurity. Bruno was not yet forty years old, but all desired that he assume the charge of the see; yet he could not bring himself to accept this honor. He retired from Rheims, and resolved to forsake the world definitively, to live a life of retirement and penance. Others joined him in retreat, desiring the pursuit of perfection, according to the means Christ prescribed. If you will be perfect, go, sell all that you have and give it to the poor, and you shall have treasure in heaven; and come, follow Me. (Matthew 19:21) Saint Bruno aspired to a desert and, inspired by God, looked towards the Alps of the east.

With six companions, four priests and two laymen, Saint Bruno applied to Hugh, Bishop of Grenoble, who led them to a wild solitude called the Chartreuse. There they lived in poverty, self-denial, and silence, each apart in his own cell, meeting only for the worship of God, and employing themselves in copying books. From the name of the solitude the Order of Saint Bruno was called the Carthusian Order. Six years later, Urban II called Bruno to Rome, that he might benefit from his counsel. Bruno tried to live there as he had lived in the desert; but the echoes of the great city disturbed his solitude, and, after refusing high dignities, he finally obtained, by force of persuasion, the permission of the Pope to resume his monastic life, this time in Calabria, with only a few companions. There he lived, in humility and mortification and great peace, until his blessed death occurred, in the arms of his faithful monks, in 1101.

Add new comment

3 + 1 =