SAINT OF THE DAY – October 4  పునీత ఫ్రాన్సిస్ అస్సీసి ST. FRANCIS OF ASSISI

(ఫ్రాన్సిస్ సభ వ్యవస్థాపకుడు, పంచగాయాలు పొందారు. ప్రకృతి ప్రేమికుడు, ఇటలీదేశ మరియు కతోలిక క్రియల పాలక పునీతుడు, క్రీ||శ|| 1182 - 1226) ఫ్రాన్సిసుగారు ఇటలీ దేశంలోని అస్సీసి పట్టణంలో క్రీ||శ|| 1182లో ఉద్భవించారు. తండ్రి పీటర్ బెర్నార్డిన్. తల్లి పీకా. తమ కుమారుని తల్లి జాన్ అని పిల్చేది. కాని తండ్రి ఫ్రాన్సిస్ అని నామకరణం చేయించారు. తండ్రి బెర్బార్డిన్ పెద్ద బట్టల వ్యాపారి. ఫ్రాన్సిస్ గారు తమ చిన్నతనంలో తండ్రి చేతి క్రింద పనిచేసేవారు. మంచి తెలివిగలవాడు. జ్ఞాపక శక్తిమెండు. చలాకీగా కలుపు గోలుతనంగా వ్యాపారంలో తోడ్పడేవారు. కాని ఫ్రాన్సీగారు విందులు వినోదాలకు ఆధికంగా ఖర్చుచేసేవారు. ఈ విధంగా యువజనల్లో నాయకుడుగా చలామణి అయ్యేవారు. ఎంత తిరుగుబోతు అయినా చెడ్డమాటలు మాట్లాడడు,స్త్రీలంటే ఎనలేని గౌరవం. దానధర్మాలకు వెనుదీసేవారుకాదు. తల్లి ప్రభావం వారి పై బాగా ఉండేది.

ఫ్రాన్సిసుగారు తమ 20సం||ల ప్రాయంలో క్రీ||శ|| 1201లో అస్సీసియనులు మరియు వారి ప్రక్కనగరమైన పెరూజియనుల మధ్య యుద్ధం జరిగింది. అస్పీసియనులు ఓడింపబడి కొందరు ఖైదీలుగా పట్టుబడ్డారు. అందులో ఫ్రాన్సీసుగారు కూడ ఒకరు. అయితే చెరసాలలో కూడ అందరితో కలివిడిగా తిరిగాడుతూ చతురోక్తులతో నవ్వించేవారు ఫ్రాన్సిస్. నిత్య సంతోషి వీరు.

చెరనుండి విడుదలై ఇంటికి వచ్చాక కొద్దిరోజులకే ఫ్రాన్సిసుగారు తీవ్ర జబ్బున పడ్డారు. కొన్ని నెలలపాటు తల్లి వారికి సపర్యలు చేసింది. క్రమంగా కోలుకున్నాక వారు మిలటరీలో చూపిన ఉత్సాహం శౌర్యంకు బహుమతిగా సైనికాధికారిగా పదోన్నతి లభించింది. అపూలియ పట్టణంలో పదవీ నిర్వహణకు వెళ్లాలని ఆదేశింపబడ్డారు. వారు 'సాల్వెతో' పట్టణం చేరేసరికి తిరిగి జ్వరం తిరగబెట్టింది. ఒకరాత్రి వారు విశ్రాంతి తీసు కుంటుండగా పరిశుద్ధ పౌలు దమాస్కునగరం వేలే త్రోవలో ప్రభువు స్వరం విన్నరీతిగా ఫ్రాన్సిసుగార్కినీ అదే స్వరం విన్పించింది.

“ఫ్రాన్సిస్ ! ఎక్కడికి వెళ్తున్నావు ?” స్వరం పలికింది "సైనికాధికారిగా పదవీ బాధ్యతలు స్వీకరించడానికి" ఫ్రాన్సిస్ జవాబు. “నీకు ఎవరు మంచి ఫలం ఇవ్వ కలుగుతారు ? ధనవంతుడైన యజమానుడా ? లేక పేదవాడైన సేవకుడా ? " పశించింది అదృశ్యవాణి. "ధనవంతుడైన యజమానుడు” సమాధానమిచ్చాడు. “అయితే నీవు యజమానుని వదలి సేవకుడైన ఒక మనిషిని సేవింప వెళ్తున్నావెందుకు ?” “నా ఏలినవారా ! నా రక్షకా ! ఇప్పుడు నన్నేమి చేయమంటారు? అని సాగిలపడగా “నీవు నీ స్వంత నగరానికి వెళ్లు. నీవు ఏమి చేయాలో అక్కడ తెలుసుకుంటావు" అని పలికి వెలుగుతున్న ఆ స్వరం అదృశ్యమైంది.

ఫ్రాన్సిసుగారు అస్సీసి తిరిగి వచ్చారు. ఎదురొచ్చిన స్నేహితులు సాదరంగా ఆహ్వానిస్తూ “వినోదాల రాకుమారుడు” అని బిరుదునిస్తూ ప్రదక్షిణగా తోడ్కొని వస్తున్నారు. ఫ్రాన్సిసుగారు ఏదో పరధ్యానంలో మునిగిపోయారు. ఆత్మలో ఏదో విప్లవం అంతర్మథనం ఆరంభమైంది. తన జీవితం నిరర్ధకం. ఈ లోక రాజుల సేవ నిష్ప్రయోజనం నిష్ఫలం అని తీర్మానించుకున్నారు. నిర్లిప్తంగా ఉన్న ఫ్రాన్సిసుగార్ని స్నేహితులు “ఏమిటి ఫ్రాన్సిస్ ! కలలు కంటున్నావా ! పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా !” అని భుజం తట్టి అడిగారు. అందుకు వారు “ఔను నాకు మహా ఉన్నతురాలు, మహాధనవంతురాలు, మహా అందమైన యువతిని పెండ్లాడాలని ఉంది” అన్నారు. తాను సేవించాల్సింది యజమానియైన ఏసు క్రీస్తును. తాను వరించేది ఏసు చూపిన పేదరికం పరిత్యాగమనే యువతిని అని ఫ్రాన్సిసు ఒక స్థిర నిర్ణయానికి వచ్చారు.

అప్పటి నుండి ఫ్రాన్సిసుగారు సువార్త ధ్యానం మొదలెట్టారు. అడవికి వెళ్లి ఏకాంతంగా ప్రార్థిస్తూ శోధనలను జయింప ప్రభు సాయం అర్థించారు. తన ఖర్చులకైన సొమ్మునంతా పేదలకు దానం చేయడం, పూజ పాత్రలు కొని గుడికి కానుక చేయడం చేశారు. రోమువెళ్లి ప్రథమ జగద్గురువు పేతురుగారి సమాధి పై వ్రాలి తన సర్వస్వం ప్రభువుకే నని అంకితమయ్యారు. పేదలు, రోగులు ముఖ్యంగా కుష్టువ్యాధిగ్రస్తులకు, అనాథలకు పరోపకార సేవలందించాలని తీర్మానించుకుని చేతల్లో పెట్టారు.

ప్రార్థించేందుకు ఫ్రాన్సిసుగారు తరచు పునీత దమియాను గుడికి వెళ్లేవారు. చాలా శిధిలావస్థలో ఉంది. అందులోని చెక్క సిలువనుండి ఒక వాణి “నా ఇల్లు శిధిలావస్థలో ఉంది. దీన్ని బాగుచేయి.” అని వారికి విన్పించింది. తన తండ్రి సొమ్ముతో, స్వయంగా తానే రాళ్లుమోసి, భిక్షమెత్తి ఆ దేవాలయాన్ని పునర్నిర్మించారు. ఇది తెలుసుకున్న తండ్రి పీటర్ బెర్నార్డిన్ ఫ్రాన్సిసుగార్ని అస్సీసి పీఠాధిపతిగారి యొద్దకు తీసికొనిపోయి తన సొమ్మును కొడుకు ఎలా వృథా చేస్తున్నది చెప్పి బుద్ది గరపమని కోరారు. గుడి పునర్నిర్మాణం, భిక్షకులకు దానధర్మాలు కూడదని పీఠాధిపతి చెప్పలేక పోయారు. అప్పుడు ఫ్రాన్సిస్ తమ తండ్రితో “మీరు నా తండ్రిగా భావించాను. కాని ఆ దేవాది దేవుడే నా తండ్రి అని గ్రహించాను. వారికే నా జీవిత సర్వస్వం" అని చెప్పగానే “అయితే నా సొమ్ముతో కొన్న నీవు ధరించిన వస్త్రాలు కూడ ఇచ్చేయ్” అని తండ్రి గద్దింపగానే ఫ్రాన్సిసుగారు తన వస్త్రాలన్నీ ఇచ్చేశారు. మేత్రాణులే ఫ్రాన్సిసుగారి పై ఒక వస్త్రాన్ని కప్పి దీవించారు. ఫ్రాన్సిస్ దేవునికి స్తుతిగానం చేస్తూ అక్కడనుండి వెళ్లిపోయారు.

ఫ్రాన్సిసుగారిపై అనేక ఆశలు పెంచుకున్న వారి తండ్రి, తన కుమారుడు గొప్ప ఉన్నత పదవులు చేపట్టాలని ఆశించాడు. కాని అతను ఆశించిన జీవితవిధానమే మారిపోవడంతో, తన ఆస్తికి ఫ్రాన్సిసుగారు వారసుడుకాదని బహిరంగంగా ప్రకటించాడు. ఫ్రాన్సిస్ గారు కూడా తనకున్న కొద్దిపాటి ఆస్థి పాస్తులన్నింటిని వదలుకుని ఒక మునిగా జీవించడం ప్రారంభించారు. పేదలకంటే నిరు పేదగా గడిపాడు. క్రీ||శ|| 1206లో తాను సంపూర్తిగా దేవాంకితుడుగా జీవింపసాగారు. భిక్షమెత్తుతూనే ఆ సొమ్ముతో అస్సిస్సిలో మూడు దేవాలయాల్ని బాగుచేయించారు.

క్రీ||శ|| 1209 ఫ్రిబ్రవరిలో పునీత దమియాను గుడిలో పూజలో పాల్గొనియుండగా పూజ గురువు డ్పా యెత్రాగారు మత్తయి సువార్త పదవ అధ్యాయంలోని 7 నుండి 9వ వచనం వరకు చదివి ఉపదేశించారు. అందు ఏసుప్రభువు తన శిష్యులను బోధించుటకు వెళ్లమని ఆజ్ఞాపించిన విధం ప్రాన్సీసువారిని మిక్కిలి ఆకర్షించి ఆ వాక్కులే తనకూ మూల సూత్రంగా నెంచుకున్నారు.

ఒకసారి 3వ ఇన్నోసెంట్ పోపుగారు “నిజంగానే దేవుని రాజ్యాన్ని బోధనల ద్వారా, క్రియలద్వారా విస్తరింప జేయగల వ్యక్తి ఉన్నారని” కలగన్నారు. అలాగే మరోకలలో తమ పునీత యోహానుగుడి పడిపోతుండగా, తాము నిస్సహాయులుకాగా, ఒక వ్యక్తి వచ్చి భుజంమోపి ఆ గుడిని నిలబెడతాడు.

అయితే ఫ్రాన్సిసుగార్ని ఆనుసరింప దలచుకున్నవాళ్లు కొద్దిమంది వారితో చేరారు. వారంతా ధనవంతులే, ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్లే.  పోర్యాంకులలో అప్పటికి వీరి సంఖ్య పన్నెండుకు చేరుకుంది. అంతట ఫ్రాన్సిసుగారు 1209 ఏప్రిల్ 16న తన శిష్యులందరకు తనవలెనే ఒకే విధమైన దుస్తులను ధరింపజేసి అస్సీసి నుండి రోమునగరానికి 3వ ఇన్నోసెంటు పోపుగారిని కలసికొనవెళ్లారు. అక్కడే ఉన్న అస్సీసి మేత్రాణులు, మరియు కార్డినల్ జాగారు ఫ్రాన్సిస్ గారి పనిని ఆశీర్వదించి వీరికి ఇతర గురువుల వలె మానవుల రక్షణార్ధము పాటుపడుటకు అనుమతి నివ్వాల్సిందిగా పరిశుద్ధ పోపుగారికి విన్నవించారు. 3వ ఇన్నోసెంటు పోపు గతంలో తమ కలలో గాంచిన సదుణ వ్యక్తిని చూచి ఆనందపర వశులయ్యారు. ఆత్మల రక్షణార్ధము ప్రాయశ్చిత్తాన్ని అంతటా బోధించేందుకు భిక్షమెత్తుకొని దైవ సేవచేయుటకు అంగీకరించారు. ఫ్రాన్సిసుగారికి డీకను పట్టాకూడ ఇచ్చారు. గురుపట్టా కూడ ఇవ్వ సమ్మతించారు కాని ఫ్రాన్సిసుగారే తానట్టి పరిశుద్ధ అంతస్తుకు అర్హుడను కానేమోనని తనను తగ్గించుకున్నారు.

ఫ్రాన్సిసుగారి నేతృత్వంలో తమ పన్నెండుమంది శిష్యులతో ఏర్పడిన సభను పోపుగారు ఆశీర్వదించారు. వారు రోమునుండి 1210లో అస్సీసి చేరుకున్నారు. బోధనం ద్వారా, ధ్యానములద్వారా, తపస్సులద్వారా అనేక వేల ఆత్మలను ఏసు జెండా క్రిందకు తీసికొని వచ్చారు. క్రీ||శ|| 1219 కల్లా ఫ్రాన్సిస్ గారి అనుచరుల సంఖ్య ఐదువేలకు పెరిగింది. సభ ఇబ్బడిముబ్బడిగా అభివృద్ది పొందసాగింది. దేవుని సేవలో ఫ్రాన్సిసుగారు గొప్ప బోధకుడని దేశమంతటా ప్రాకింది. వారి బోధలు హృదయస్పందనను కలిగించేది. ఒకసారి ఫ్రాన్సిసుగారు బోధించుటకు గుచ్చియో నగరం వెళ్లారు. అడవిలోనుండి తరచు ఒక క్రూర తోడేలు నగరంలోకి జొరబడి చిన్నపిల్లల్ని, గొర్రెలు, మేకలు వంటి జంతువుల్ని చంపి తింటూ హాని తల పెడుతూందని ఫ్రాన్సిసుగారు అక్కడి ప్రజలద్వారా తెలుసుకున్నారు.

ఫ్రాన్సిసుగారు అడవికి వెళ్లి "తోడేలు సోదరా ! నీవు ఇక పై మాంసాహారం ముట్టరాదు. నీ క్రూరత్వం కాదుగాని నీ ఆకలి వలన అట్లుచేస్తున్నావు. కాని ఇకపై శాకాహారమే భుజింపుము" అని ఆజ్ఞాపించారు. ఆ క్రూర తోడేలు సాధువై కుక్కలా మారిపోయింది. ప్రజలు అందించే భోజనం మాత్రమే తింటూ అందరితో కలివిడిగా తిరగసాగింది. వృద్ధాప్యంలో అది మరణింపగా ప్రజలు దానినెంతో గౌరవంతో ఖననంచేసి ఫ్రాన్సిసుగారి గొప్ప తనాన్ని పొగిడారు.

ఫ్రాన్నీసుగారు రుచికర భోజనం తినుటకు అర్హుడకానని ఒక్కోసారి భోజనంలో బూడిద కలుపుకుని భుజించేవారు. చలికాలంలో కూడ చన్నీటి స్నానం చేసేవారు. ఒక్కోసారి రాత్రుళ్లు ముళ్లపొదల్లో పడుకునేవారు. మఠవాసుల అవసరాలను పట్టించుకోవడంలో శ్రద్ధగా ఉండేవారు. వీరు ప్రకృతి ప్రేమికులు. దేవుని సృష్టియైన ఈ ప్రకృతి ద్వారా దేవుని నుహిమను కీర్తించేవారు. ముఖ్యంగా సృష్టిలో సూర్యుణి ప్రసాదించినందుకు సూర్యస్తోత్రగీతంద్వారా దేవుని ఎంతగానో శ్లాఘించారు. భిక్షమెత్తడం, సేదలకు తోడ్పడటం, మూర్ఖులమనస్సు త్రిప్పటం, పాపులకు

ప్రాయశ్చిత్తం కలిగించడం, సోమరులకు బుద్ధిమాటలు చెప్తూ “పనిచేయని వాడు తినడానికి అనర్హుడు" అనే పునీత పౌలుగారి మాటల్ని వాళ్లకు గుర్తు చేసేవారు.

అస్సీని నగరంలోనే క్లారా అనే ఒక గొప్పింటి యువతి ఉండేది. ఆమె ఫ్రాన్సిసుగారి బోధలు విని దైవ పిలుపుకు స్పందించింది. క్రీ.శ|| 1215లో “పూర్ క్లేర్స్" అనబడే 'పేద కన్యాస్త్రీల మఠం”కు ఆమె సుపీరియర్ గా ఫ్రాన్సిస్ గారు నెలకొల్పారు. క్లారా పేదల సేవలోనే పునీతురాలుకూడా అయ్యారు. అలాగే క్రీ||శ|| 1221లో ఫ్రాన్సిసుగారు లౌకికులకొరకు మూడవ అంతస్తుసభను ఏర్పాటుచేశారు. దీనిననుసరించువారు ఆయుధాలు ధరింపరాదు. ఎలాంటి ప్రమాణాలు చేయరాదు. వ్యాజ్యాలలో పాల్గొనరాదు. సాధువుగా ప్రార్థన పరోపకారంతో బ్రతకాలి. మంచి పేషితులుగా వేద వ్యాపకం చేయాలి తమ లౌకిక జీవితం జీవిస్తూనే.వారు మర్చి పోపుగారు జహాన్ని క్రీ॥శ॥ 1221లో జరిగిన మాట్స్ మహా సమావేశంలో ఫ్రాన్సిసుగారు తమ మఠాధినేత పదవిని త్యజించారు. 1224 సెప్టెంబరు 14న ఏసు సిలువ సంస్మరణ దినంనాడు ఫ్రాన్సిసుగారు ప్రార్థిస్తుండగా వారికి పంచగాయాలు పొడసూపి రక్తం స్రవించడం, బాధ అనుభవించారు. వీరు తమ వృద్ధాప్యంలో 1226 అక్టోబరు 3న ఇటలీలోని అస్సిస్సి పట్టణంలోనే స్వర్గస్తులయ్యారు. వారు మరణించిన రెండేళ్లకే వారిని పునీతులుగా శ్రీ సభ ప్రకటించింది. 11వ పయస్ (భక్తినాథ) పోపుగారు “నేడు కావాల్సింది ఫ్రాన్సిసుగారి జీవితాదర్శాలను అనగా ఈ లోక వస్తువుల పై వ్యామోహాన్ని త్యజించి ఏసుని ప్రేమకై నిర్భాగ్యుల సేవలో ఆనందాన్ని పొందటంను మాతృకగా తీసికొని ఆచరిస్తే నేడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టాలు వాటంతటవే పరిష్కారం అవుతాయి” అని ఫ్రాన్సిసుగారి గురించి వ్రాశారు.

#saintoftheday #rvatelugu #francis #assisi

Saint Francis, the son of a merchant of Assisi, was born in the year 1182 in a poor stable, his birth already prophesying the Saint who would preach poverty to a world seduced by luxury. Though chosen by God to be for the world a living manifestation of Christ's poor and suffering life on earth, in his youth he was generous, always of equal humor, and much appreciated by his friends; he was fond of splendors, fine clothing, and good company, and easily won the affection of all who knew him. More than once various holy persons foretold for him a future of glory, but in veiled terms. Francis did not understand these predictions, and supposed he would become the leader of a large militia.

The military life he had adopted ended when Jesus told him he was destined to fight another kind of combat, one against the demon and sin; that the grandeurs predicted were spiritual, not temporal — and to return home. He became inspired with a great esteem for poverty and humiliation. The thought of the Man of Sorrows, who had nowhere to lay His head, filled him with holy envy of the poor, and constrained him to renounce the wealth and the worldly station which he had come to abhor. One day, while on horseback, he met a leper begging alms who inspired him with repugnance, and he took a path to avoid him. Then, repenting, he turned his horse around and returned to embrace him and give him a generous alms, as was his custom for all beggars. He continued on his way, but looked back, and nowhere on the plain could the stranger be seen, though there were no trees, no refuges anywhere. He was from that day a completely transformed person.

He decided to use his wealth to care for the poor and the sick, and dedicate himself in person to the same works. When he prayed one day in the little chapel to do only what God willed of him, the Saviour spoke again to him, repeating three times the mysterious words: Go, Francis, and repair My house which is falling into ruin. He then undertook to repair the old church of San Damiano where he had heard these words, retiring for refuge to a grotto. He was regarded as a fool by the people, when he returned to the city in the clothing of a poor beggar. This was indeed the folly of the Cross.

Francis renounced his heritage definitively, to beg thereafter his daily sustenance and what he needed for the repair of the church, and left the city singing the praises of God. He repaired two other churches. The love of God which was burning brightly in the poor man of Assisi began to give light and warmth to many others also, and it was not long before several came to join him. One of them was a very wealthy man of Assisi, the second a Canon of the Assisi cathedral, and the third the now Blessed Brother Gilles. They adopted the absolute poverty of Francis, and the foundations of the Franciscan Order were laid. They were first called the penitents of Assisi. No counsels could make Francis change his resolution to possess nothing at all. God revealed to him then that he was to found a religious Order.

Pope Innocent III, when Francis with his first twelve companions journeyed to Rome, after first rebuffing them, recognized him as the monk God showed him in a vision, supporting on his shoulders the Church of Saint John Latran, which was growing decrepit. He received the profession of Francis and his twelve companions, and in 1215 they were formally constituted as a religious Order, which then spread rapidly throughout Christendom.

In 1216, Saint Francis after assembling his religious, sent them out to preach in France, Spain, England and Germany, where they established monasteries, lasting proofs of the efficacy of their missions. A second general Chapter was held in 1219 on the feast of Pentecost, and the little Brothers gathered from all over the world at Saint Mary of the Angels, the church which Francis and his first twelve disciples had received only nine years earlier. Cabins of reeds and tents were put up all over the countryside. The Cardinal who visited them exclaimed, with tears in his eyes, O Brother, truly this is the camp of the Lord! They were more than 5,000 in number. Saint Francis exhorted his brethren: My Brothers, above all, let us love the Holy Church; let us pray for her exaltation, and never abandon poverty. Is it not written, Trust in the Lord, and He Himself will sustain you'?

Francis, after visiting the Orient in a vain quest for martyrdom, spent his life like his Divine Master — now in preaching to the multitudes, now amid the desert solitudes in fasting and contemplation. His constant prayer was My God and my All! During one of these retreats on Mount Alverno, he received on his hands, feet, and side the imprints of the five wounds of Jesus. With the cry, Welcome, sister Death! he passed to the glory of his God, October 4, 1226, at the age of 44 years.

 

Add new comment

6 + 1 =