SAINT OF THE DAY – OCTOBER 30 పునీత అల్పోన్సస్ రోడ్రిగ్వెజ్|ST. ALPHONSUS RODRIJ

(బ్రదర్, సేవాతత్పరుడు, మతసాక్షి క్రీ||శ|| 1533 - 1617) మజోర్కా అనబడే దీవి ఒకటుంది. అక్కడ ఏసుసభ గురువులు తమ సేవలందిస్తుండే వారు. ఒకరోజు సభ ప్రాంతీయాధిపతియైన గురుపు సందర్శనార్ధం వచ్చారు. భోజన సమయంలో సభ సభ్యులందరు బల్లలచుట్టూ భోజనానికి కూర్చున్నారు. భోజనమునకు ముందు ఒకరు బైబిలు గ్రంథ పఠనంచేయడం వారికి రివాజు. ఆ రోజు పఠనం ముగిసిన వెంటనే ప్రాంతీయాధిపతియైన గురుపు అల్ఫోన్సస్ గారియొక్క వినయవిధేయతల్ని పరీక్షింపగోరి “బ్రదర్ అల్ఫోన్సస్ ! నీవు లేచి లాటిసుభాషలో చిన్న ప్రసంగమిస్తావా ?” అని అడిగారు. అల్పోన్సస్ గార్కి లాటినుగాని గ్రీకుగాని రాదు. ఏమవుతుందో ఏమో ! పెద్దలిలా అడుగుతున్నారని తోడి సభ్యులు తొట్రుపడ్డారు. ఇంతలో అల్పోన్సస్ గారు లేచి, ధైర్యంగా ప్రసంగ వేదిక నెక్కి నిబ్బరంగా "కీరియేలైసోస్ (ఏలిన వారా ! దయచూపండి), క్రీస్తే లైసోస్ (క్రీస్తువా దయచూపండి)” అని బిగ్గరగా అవే మాటలను మళ్లీ మళ్లీ పల్లెవేయసాగారు.

అధిపతి గురువు తమ నవ్వును ఆపుకోలేకపోయారు. “బ్రదర్ ! ఇక చాలు. వేదిక దిగిరా !” అని పిల్చారు. చూపించిన విధేయతకు ఎంతగానో మెచ్చుకున్నారు. పెద్దలు ఏదైనా మాటచెబితే దానిని దేవుని ఆజ్ఞగా భావించి విధేయించడమే ప్రభువుకు ఆనందదాయకమని అల్పోన్సస్ గారి నమ్మకం. దైవ చిత్రానికి లోబడటం అనే పుణ్యం ఎందెందు వెదికినా కానరాదనుకునేవారు వీరు. అల్పోన్సస్ స్పెయిన్ దేశంలోని 'సెగోవియా' అనుచోట క్రీ||శ|| 1533

జూలై 25న చిన్న కుమారుడుగా జన్మించారు. తండ్రి పేరు డియిజో. ఉన్ని మరియు బట్టల వ్యాపారముతో కుటుంబ పోషణ జరిపించేవాడు. పునీత లొయెలా ఇన్యాసివారి సహచరుడైన గురుశ్రీ పీటర్ ఫేబర్ గారినుండి అల్పోన్సస్ జపాలు, సంక్షేపం నేర్చుకున్నారు. వారి చేతులమీదుగానే తమ ప్రథమ దివ్యసత్రసాదం లో కొన్నారు. కొద్దికాలం తర్వాత తండ్రి చనిపోగా అల్కాలా పాఠశాలలో తన చదువును అంతటితో ఆపేసి కుటుంబాన్ని గడుపుటకు తన తండ్రి వ్యాపారాన్ని తానే కొనాసాగించారు. తన 23వ ఏట 'మరియ సువారెస్' అను సుందరాంగిని పెండ్లి చేసుకుని ముగ్గురు పిల్లలకు తండ్రి అయ్యారు. దురదృష్ట మేమోగాని వారి

భార్య ముగ్గురు పిల్లలు వరుసగా మరణించారు. తన వ్యాపారంలోకూడ ఎదుగు... లేక నష్టాలే ఎదురయ్యాయి. తానొకటి తలంచితే దేవుడింకొకటి తలంచాడు.ఒంటరివారైన అల్పోన్సస్ పలు సమస్యలతో చితికిపోయి తొమ్మిదేళ్లు మానసిక వేదన ననుభవించారు. చివరకు తమ గురుపీఠం స్వామి వద్దకు వెళ్లి తన కషాలు కడగండ్లన్నీ ఏకరవు పెట్టారు. తన హృదయభారాన్ని కొంత వరకు దింపుకున్నారు. కాని ఆ గురువు సలహా మేరకు తన ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో ధ్యానంలో గడుపుతూ దేవునికి దగ్గరయ్యారు. ఏమైనా తన శేషజీవితాన్ని దైవ సేవారంగంలో వెచ్చించడమే శ్రేయస్కరమని తలపోశారు. అందుకుగాను ఏసుసభ గురు మఠాలయంలో ప్రవేశం కోరారు. తనకు అప్పటికే 45 ఏండ్ల ప్రాయం. వయో భారం వల్లను, బలహీన ఆరోగ్య కారణాలవల్లను తిరస్కరింపబడ్డారు. కనీసం బ్రదరుగానైనా తన సేవలంగీకరింపుమని బ్రతిమాలారు. అందుకుకూడ అంగీకరింపబడలేదు. అయితే సభ ప్రాంతీయాధిపతియైన గురువు “అల్పోన్సస్ గురువు కావడానికి అనర్హుడు కావచ్చు బ్రదరుగా ఉండటానికి యోగ్యుడు కాకపోవచ్చు. కాని పునీతుడు కావడానికి తగనివాడు కాదు కదా !" అని పలికి బ్రదరుగా ఉండటానికి ఏసు సభలోకి తీసుకున్నారు. తగిన శిక్షణ నిచ్చిన పిదప బ్రదర్ అల్ఫోన్సస్

రోడ్రిగ్వెజ్ గారిని స్పెయిన్ దేశం నుండి మొజోర్కా దీవికి పంపించారు. అక్కడ నెలకొని ఉన్న మోంటె సియోన్ కళాశాలలో నియమింపబడ్డారు. అక్కడే వీరు తమ 46వ ఏట అనగా క్రీ॥శ॥ 1579లో ఏసుసభ గురు నిలయం భవన ప్రధాన ద్వారం వద్ద అనుమతి నిచ్చు ద్వార పాలకునిగా నుండ పని నిర్దేశింపబడింది. ఇది తలనొప్పి పని. 24 గంటలూ ఓర్పూ నేర్పూతో పనిచేయాలి. ఎంతోమంది గురువుల సలహాలకై ప్రార్థనా సాయంకై, స్వస్థతాభిషేకముకై వస్తుంటారు. వారందరిని సాదరంగా ఆహ్వానించి వారి అవసరాలను తీర్చేవారు అల్ఫోన్సస్. కొందరు సమయా సమయాలు పాటింపక వచ్చేవారు. వారికి నచ్చ జెప్పబోతే అమర్యాదగా మాట్లాడి అవమాన పర్చేవారు. కాని అల్పోన్సస్ గారు ఏసు దీన ముఖారవిందాన్ని మనసుముందుంచు కొని సహించేవారు. గురువుల ఆదేశానుసారం వారి విరామ, భోజన, నిద్ర సమయాల్ని పాటిస్తూ ద్వార పాలకునిగా మంచి పేరు తెచ్చుకున్నారు. కొందరు పోకిరి పిల్లలు ఏదో అవసరం ఉన్న వారిలా గంట మ్రోగించి దాక్కొవడమో పారిపోవడమో చేసే వారు. అల్పోన్సస్ వేగిరమే తలుపు తెరచి వెలుపలకు వచ్చి కలియ జూచి ఎవరూ కానరానప్పుడు తమలో తాము నవ్వుకునేవారేగాని ఏకోశానా గొణిగేవారుకాదు.

వెలుపల గంట మ్రోగినప్పుడెల్లా సాక్షాత్తు దేవుడే వేచి పిలుస్తున్నారన్నట్లు భావించి “ప్రభూ ! నేను వస్తున్నాను” అంటూ త్వరగా వచ్చి తలుపు తెరిచేవారు.ఓపిక వినమ్రత సౌమ్యత ఎరిగిన వేలాదిమంది సందర్శకులు ఈ ద్వారపాలకుని మరిచపోయేవారుకాదు. వారిని విసుగుచెందని విక్రమార్కుడని ఆదర్శవంతునిగా ఆదరించేవారు. భక్తి ప్రపూరిత వ్యక్తిగా గౌరవించేవారు. గురువులెవరెనా అందుబాటులో లేనప్పుడు అల్పోన్సగారికే తమ సమస్యలు బాధలు చెప్పుకొని తగు సలహాలనొంది ఉపశమనం పొందేవారు. ఇలా వచ్చే విద్యార్ధులైతే లెక్కేలేదు. ఈ విద్యార్థులే భావి జీవితంలో గురువులుగా మఠవాసులుగా వ్యాపారులుగా, సంసారులుగా ఏదొక పథంలో స్థిరపడినను అప్పుడప్పుడు బ్రదర్ అల్పోన్సస్ గారి దగరకు వచ్చి తమ స్నేహబంధ ప్రేమను పంచుకునేవారు. జీవిత సమస్యలను ముచ్చటించుకుని ఉపశమనం పొందేవారు.

బ్రదర్ అల్పోన్సస్ రోడ్రిగ్వెజ్ గార్కి మరియమాత యెడ మహాగౌరవం. చేతిలో జపమాల లేకుండ ఎవరికి ఎప్పుడూ కనిపించలేదని ప్రతీతి. దేవమాత అమలోద్భవియని శ్రీసభ సాధికారికంగా ప్రకటించడానికి కొన్ని ఏండ్లకు క్రితంనుండే అలోన్నగారు ఆ తలి పరిశుద్ధ జననం గూర్చి ప్రసంగాన్నిస్తుండేవారు. వారికెలా ఈ సంగతి తెలుసని అడిగితే ఆ తల్లే స్వయంగా తనకు తెలియచెప్పిందని వినమ్రులై నుడివేవారు.దేవమాత సొడాలిటి సభలనేర్పరచి బాలురకు ఆ తల్లి పై ఎక్కువ భక్తి భావం చూపేటట్లు చేయకలిగారు. దేవమాత ప్రార్థనలు వ్రాసి ఇచ్చేవారు. మత సంబంధ విషయాలపై సంభాషణా శైలిలో వ్యాసాలు వ్రాసి ఎందరినో దేవునిబాటలో పయనింప జేశారు. బ్రదర్ అల్పోన్సస్ రోడ్రిగ్వెజ్ గారు చూసుకునే విద్యార్థుల్లో పీటర్ క్లావె గారు ఒకరు. వీరి సలహాలను పొందే పీటర్‌ వెగారు కొలంబియా దేశంకు వెళ్లి గురువై 44 ఏండ్లు నీగ్రో బానిసల సేవచేసి పునీతులయ్యారు.

ఈ విధంగా ఒక సాధారణ ద్వారపాలకుని కర్తవ్యాన్ని అసాధారణ తీరుగా నెరవేర్చి దేవుని చిత్తాన్ని తలదాల్చిన అల్పోన్సస్ తన అవసానదశలో రెండేళ్లు వృద్దాప్య భారాన్ని బాధల్ని భరించి 'రెయు మాటాయిడ్' వ్యాధికి గురియై తమ 84వ ఏట క్రీ||శ|| 1617 అక్టోబరు 31న ఏసు మరియ పవిత్ర నామములను ఉచ్చరిస్తూ స్వర్గస్తుడైనారు. 13వ లియో (సింహరాయులు) పోపుగారు 1888 జనవరి 15న వీరిని పునీతులని చాటారు. ' దీనత' అనే పుణ్యవరం యొక్క ఘనతను కొనియాడారు. అల్ఫోన్సుస్ అంటే ఘనముగా ప్రకాశించు అని అర్థం.#rvatelugu #saint #dailysaint

Saint Alphonsus Rodriguez was born in Spain in 1531, of a well-to-do commercial household of Segovia, the third of eleven children. When Alphonsus was eleven years old, he and his older brother were sent to a Jesuit college which had just been founded. He had already manifested great joy in serving the Jesuits when they had given a mission in Segovia and lodged in his father's country home; now he rejoiced in the one year of study he was able to undertake, before the death of his father interrupted these pursuits. His brother, after certain affairs were settled, returned to school, but Alphonsus was obliged to remain at home, destined one day to replace his father.

He accepted this lot and in 1557 married a virtuous wife; they were blessed with a daughter and two sons. But God intended to sanctify this soul of predilection by great and heroic sufferings. Only five years later he was already a widower, with only one little boy of three years remaining for him to raise. He believed this calamity must have come upon him for his sins, and he developed a great horror of sin; he asked God to let him bear even the torments of hell here below, rather than fall into a single mortal sin. He offered himself entirely to God, for whatever He might desire of him. Then he began a life of severe penance. A year later his mother died. He looked at his beautiful and innocent child, the only bond which still attached him to the earth; and he prayed to God that if ever that child should offend Him, to take him at once. His prayer was granted before long.

Alphonsus left Segovia and went to Valencia, where a Jesuit priest he had loved and admired earlier in Segovia was then stationed. This priest helped him to attain a loving confidence in God. He was thirty-eight years old when he requested his admission to the Order, but insufficient instruction and his unstable health, affected by his austerities, were regarded as obstacles. For two years he was employed as a preceptor of the young by two families of that city; finally, when he renewed his request for admission, he was accepted.

His religious life was spent primarily as a porter in a Jesuit college on the island of Majorca; his interior life was a succession of moral tortures, borne with perfect humility and love of God. The demons would not leave alone this holy man who made it his joy to take upon himself all the most humble and fatiguing offices. He cast himself, as it were, into the abyss of the love of Jesus Crucified. Twice he was thrown down a cement staircase by the adjured enemies of man's salvation; but his love for his crucified Saviour was proof against all such attempts on his virtue. He was afflicted with various illnesses, which plunged him into a sort of preliminary purgatory but did not change his life of effacement and service.

In 1591 he was already 60 years old when he received an order to sleep thereafter in a bed; until then he had contented himself with a few hours of sleep on a table or in a chair. He served a chapel where the elderly or infirm fathers celebrated late Masses. He was told to write the story of his life, which work he began with hesitation in 1604. He was not spared the trial of being misunderstood and underestimated by a new Superior, but he found only joy and consolation in the public reproaches he received. He wrote in his book of maxims: In the difficulties which are placed before me, why should I not act like a donkey? When one speaks ill of him — the donkey says nothing. When he is mistreated — he says nothing. When he is forgotten — he says nothing. When no food is given him — he says nothing. When he is made to advance — he says nothing. When he is despised — he says nothing. When he is overburdened — he says nothing... The true servant of God must do likewise, and say with David: Before You I have become like a beast of burden.

The story of his association in his old age with Saint Peter Claver, the novice whose future mission he saw by a vision and foretold to him, is written into the annals of the Church in letters of gold; the two Saints were canonized together by Pope Leo XIII after more than two centuries.

Saint Alphonsus died in 1617; already he was known and loved as a Saint by the population. In 1825 he was beatified, and in 1888 Pope Leo XIII closed the inquiries after two new miracles had been verified, and proceeded to the ceremonies of canonization in Rome. The memory of Saint Alphonsus remains in benediction in the Order and in the hearts of those who know the value of the Cross of Christ and its perpetuity in His Mystical Body.

Add new comment

1 + 13 =