SAINT OF THE DAY – OCTOBER 29 పునీత నర్చీసు| ST Narcissus

గ్రీకు జాతీయుడు, జెరుసలేము పీఠాధిపతి కురువృద్ధుడు క్రీ||శ|| 110 - 222 గురు శ్రీ తిమోతి డెలనెగారు క్రొత్తగా గురుపట్టం పొంది విచారణ చేస్తున్న రోజుల్లో తమను దర్శించే వారికి సందేశాలిస్తుండేవారు. తన అనుదిన సందేశాన్ని ఒక పుస్తకంలో వ్రాసేవారు. ఒక రోజు సందేశంలో “గురువు అనేవారు సేవచేయడానికి పిలువబడిన వ్యక్తి. భాధపడుతున్న ప్రజలతో కలసి తానూ బాధపడుతారు. సంతోషంగా ఉన్న వారితో కలసి తానూ ఆనందం పంచుకుంటారు." అని వ్రాశారు. గురువుగాను బిషప్పుగాను జీవించిన ఈ క్రింది శతాధిక వృద్ద పునీతునికి ఈ సందేశం అక్షరాలా నప్పుతుంది.

పునీత నర్చీసుగారు గ్రీకు జాతీయుడు. వారి పుణ్యజీవితం, అద్భుతాలు చేయగల శక్తివల్ల క్రీ||శ|| 185లో వారు జెరుసలేము మేత్రాసనంకు పీఠాధిపతిగా ఎన్నుకోబడినారు. వృద్ధాప్యంలో ఉన్నాకాని వారు నవయువకుడులా పీఠంను నడిపించారు. క్రమశిక్షణ విషయంలో పట్టుదలగా ఉండేవారు. క్రీ||శ|| 198లో వారు ప్రాంతీయ శ్రీసభ సమావేశం ఏర్పరచి ఈస్టరు పండుగను ఆదివారం రోజునే రోమను ఆచారం రీత్యా జరుపబడే విధంగా ఆదేశించారు. అంతేగాని ఆసియా మైనరు (టర్కీ) ప్రాంతలో మాదిరిగా యూదుల ఆచారం చొప్పున మాత్రం కాదని నొక్కిపలికారు.

వృద్ధాప్యంలో ఉన్నాగాని ఇంత కఠినంగా ఆజ్ఞను జారీచేసిన బిషప్ నర్చీసుగారిపట్ల పాత నజరేతు క్రైస్తవుల ఆచారాలను పాటించేవారు, మరికొందరు యూదులు గట్టిగా తమ వ్యతిరేకతను చాటుమాటుగా వెల్లడించసాగారు. ఎందుకంటే వారిపట్ల అందరికి గొప్ప భయభక్తులు ఉండేవి. ఇది గ్రహించిన నర్చీసుగారు తమ పీఠంలో ప్రజలు ఆచారాలను బట్టి రెండుగా చీలిపోకూడదని భావించి, వారి మధ్య ఐక్యత శాంతి సమాధానాలు ఉండాలంటే తానే ఎటైనా వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నారు. దాపులోని అడవిలోకి వెళ్లి ఒక మునిలా తపోజీవితం ఆరంభించారు.

జెరుసలేము పీఠంకు ముగ్గురు పీఠాధిపతుల పాలన ముగించిన పిమ్మటకూడ నర్చీసుగారు నిక్షేపంగా జీవించియే ఉన్నారు. ఇరుగుపొరుగు బిషప్పులు, విశ్వాసులు కూడబలుకుకుని నర్చీసుగారి వద్దకు వెళ్లి తమ రాజీనామా ఉపసంహరించుకుని తిరిగి జెరుసలేము పీఠాధిపత్యం స్వీకరింపుడని ప్రాధేయపడ్డారు. అంతట వారు ప్రేమతో పీఠంకు తిరిగివచ్చారు. అప్పటికి వారి వయస్సు 110 సం||లు ఉండవచ్చు. ఇంతలో మిక్కిలి భక్తి పరుడు శ్రీసభ చట్టంపట్ల అచంచల విశ్వాసంగల కప్పదోసియా బిషప్పు అయిన అలెగ్జాండరుగారు తీర్థయాత్ర నిమిత్తం జెరుసలేముకురాగా నర్చీసుగారు వారిని తనకు సహాయకుడుగా ఉండమని బ్రతిమలాడారు. కురువృద్ధులైన నర్చీసుగారికి విధేయించాలని అందుకువారు సమ్మతించారు.

ఒక మేత్రాసన బిషప్పు మరో మేత్రాసనంకు మారడం, సహ ఒపప్పగా లేక సహాయక బిషప్పుగా ఏర్పాటు శ్రీసభలో మొదటగా జెరుసలేములోనే ఆరంభింపబడినట్లు చెప్పబడుతోంది. పాలెస్తీనా శ్రీసభాధిపత్యం ఈ ఏర్పాటును గుర్తించి తమ ఆమోద ముద్ర వేసిందికూడ. ఒకసారి ఈస్టరు పండుగ రోజున నిడివియైన సాంగ్యాలు జరుగుతున్నప్పుడు ఈస్టరు దీపంలోకి నూనె తీసికొని రాబడటం ఆలస్యంకాగా బిషప్ సర్చీసుగారు నీటిని ఆశీర్వదించి అద్భుత రీతిగా నూనెగా మార్చి దీపంలో పోసి పవిత్ర గ్రంథ పఠనం ఆరంభించినట్లు వారిగూర్చి అద్భుత గాథ చెప్పబడింది. అట్టి మహనీయుడు క్రీ||శ|| 222లో తమ 112వ ఏట దివంగతులైనారు. నర్చీసు అంటే పసుపు వర్ణపు గడ్డిపూవు అని అర్థం.

Saint Narcissus from his youth applied himself with great care to the study of both religious and human disciplines. He entered into the ecclesiastical state, and in him all the sacerdotal virtues were seen in their perfection; he was called the holy priest. He was surrounded by universal esteem, but was consecrated Bishop of Jerusalem only in about the year 180, when he was already an octogenarian. He governed his church with a vigor which was like that of a young man, and his austere and penitent life was totally dedicated to the welfare of the church.

In the year 195, with Theophilus of Cesarea he presided at a council concerning the celebration date of Easter; it was decided then that this great feast would always be celebrated on a Sunday, and not on the day of the ancient Passover.God attested his merits by many miracles, which were long held in memory by the Christians of Jerusalem. One Holy Saturday the faithful were distressed, because no oil could be found for the church lamps to be used in the Paschal vigil. Saint Narcissus bade them draw water from a neighboring well and after he blessed it, told them to put it in the lamps. It was changed into oil, and long afterwards some of this oil was still preserved at Jerusalem in memory of the miracle.

The virtue of the Saint did not fail to make enemies for him, and three wretched men charged him with an atrocious crime. They confirmed their testimony by horrible imprecations. The first one prayed that he might perish by fire, the second that he might be wasted by leprosy, the third that he might be struck blind, if the accusations they made against their bishop were false. The holy bishop had long desired a life of solitude, and at this time he decided it was best to withdraw to the desert and leave the Church in peace. But God intervened on behalf of His servant, when all three of the bishop's accusers suffered the penalties they had invoked. Narcissus could then no longer resist the petitions of his people; he returned to Jerusalem and resumed his office. He died in extreme old age, bishop to the last.

Add new comment

1 + 2 =