SAINT OF THE DAY – OCTOBER 28 పునీత సీమోను, పునీత యూదాతద్దయి|STS. SIMON, JUDE TADDEUS

(అపోస్తలులు, వేదసాక్షులు -మొదటి శతాబ్దం ) ఏసుప్రభుని పన్నిద్దరు అపోస్తలుల జాబితాలో పది, పదకొండవ పేర్లు గలవారు పునీత సీమోను (సైమన్) మరియు పునీత యూదాతద్దయి (తద్దెయుస్ లేక లెబ్బాయుస్) గార్లు. ఈ ఇద్దరు అపోస్తళ్లు ఒకే సమయంలో ఒకేచోట జతగా ప్రాణత్యాగం చేసిన వేదసాక్షులవడంవల్ల వీరిరువురి ఉత్సవాన్ని కలిపి కొనియాడటం జరుగుతోంది. వీరి చరిత్ర అంతస్పష్టంగా తెలీదు. కాని కొద్దిపాటి ఆధారాలను బట్టి అటు ఇటుగా తెలుస్తోంది.

పునీత సీమోను:

సువార్తా రచయితలైన పునీత మార్కు, పునీత లూకాగారు వ్రాసినట్లే పునీత మత్తయి గారు కూడ అపోస్తలుడైన సీమోను ఒక 'కాననేయుడు' అని వ్రాశారు. సువార్తలోను, అపోస్తలుల కార్యములలోను సీమోను జీలట్ (The Zealot) అని వ్రాయబడి ఉంది. దీన్నిబట్టి సీమోనుకూడ నతానియేలు లేక బత్తలోమయిలవలె గలిలీ 'కానా వాసులని అర్థమవుతుంది. ఆ రోజుల్లో రోమను రాజ్యం విస్తరించి ఉంది.

రోమనులు తమ ఆధిపత్యం కోసం యూదులను హింసించి చంపేవారు. 70లో పదిలక్షల మందికి పైగా యూదుల వ్యధకు కారణమైన యెరూషలేము విధ్వంసానికి ఈ రోమను సైన్యమే కారణం. ఈ విధ్వంసానికి ముందు సంవత్సరాలలో యూదుల ప్రత్యేక సంరక్షణార్ధం. జిలట్ సంస్థ ఉండేది. ఈ సంస్థతో సంబంధం ఉండి, కార్యకలాపాలు నిర్వహించే వారిని జిలట్లు (జెలోత్) అనడం ఆనవాయితీ. జిలటంటే “పట్టుదల గలవారు, అత్యుత్సాహం కలవారు" అని అర్థం. వీరిలో దేశభక్తి ఉరకలు వేస్తుంటుంది. రోమను వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తుండేవారు. ఏసు ఒక నాయకుడులా కనబడుతున్నారు. అద్భుతాలు చేస్తున్నారు. ప్రజలను బాగా ఆకర్షిస్తున్నారు.

కాన ఏసు నాయకత్వంలోనే కనీసం ఏసు పేరట యూదులకు ప్రత్యేక రాజ్యం , సంరక్షణ ఏర్పడగలదని ఈ ఇంట్ సంస్థ ఆశించింది. ఇందు సభ్యులైన పునీత యూదాతద్దయి, మరియు

మరో ఏసు శిష్యుడైన యూదా ఇస్కారియోతులు అందుకే ఏసు శిష్యులైనటు తోస్తుంది. ఏసుకు సిలువ మరణమప్పుడు ఇరు ప్రక్కలున్న నేరస్థులు కూడ జిలట్ సంస్థ సభ్యులై ఉండి. వారి తీవ్రవాద కార్య కలాపాలనుబట్టి రోమనులు పట్టి బంధించి సిలువ శిక్షకు కారకులయ్యారు. అందుకే వారిరువురిలో ఒకడు “మనం చేసిన దానికి శిక్ష అనుభవిస్తున్నాం” (లూ. 23:41) అంటాడు.

దేవ దూతలు క్రీస్తు పుట్టిన శుభవార్తను ప్రకటించినపుడు వినిన గొల్లవాళ్లలో సీమోను ఒకడని కొన్ని కధలవల్ల తెలుస్తుంది. మరికొన్ని కధలవల్ల సీమోను మరియు యూదాతద్దయిలు అన్నదమ్ములని (లూ. 6:15-6) అల్ఫయి కుమారులని అర్థమవుతుంది. ఏసు బహిరంగ జీవితాన్ని ప్రారంభింపక మునుపు తనతల్లి మేరీమాతతో కలసి గలిలీయ మండలంలోని 'కానా' అనే గ్రామంలో జరిగిన వివాహానికి వెళ్లారు. ఆ వివాహంలో పెండ్లి కుమారుడు సీమోనుగారని కూడ చెప్పబడుతోంది. ఈ సందర్భంలోనే ఏసు నీటిని ద్రాక్షారసంగా మార్చి తన తొలి అద్భుతాన్ని చేశారు. దీన్ని కండ్లారా చూసిన సీమోను ఏసుపట్ల ఆకర్షితుడై ఆ తర్వాతి రోజుల్లో శిష్యుడైనట్లుగా కూడ చెప్పబడుతోంది.

సీమోనుగారు ఈజిప్టు, లిబియా, మౌరిటేనియా, ఆఫ్రికాలలోను చివరగా బ్రిటన్లోను సువార్తను బోధించారని ఇరాన్లో వేదసాక్షి మరణం పొందారని చెప్పబడుతోంది. కట్టె పుల్లలు కొట్టేవారికి, చర్మాలు శుభ్రం చేసేవారికి పునీత సీమోను పాలక పునీతులు. పునీత యూదాతద్దయి (జూడ్)అపోస్తలుడైన పునీత యూదాతద్దయిగారి పుట్టుపూర్వోత్తరాలగూర్చి అంతగా తెలీదు. కాని వీరు అపోస్తలుడైన పునీత చిన్న జేమ్స్ (యాకోబు లేక యాగప్ప) సోదరుడు, వీరిద్దరూ ఏసుప్రభువుకు పెద్దమ్మ కుమారులు. యూదాగారు ఏసును “ప్రభూ మీ గురించి మాకు తెలియజేశారు. కాని లోకానికెందుకు తెలవనీయడం లేదు.” (యో. 14:22) అని ప్రశ్నిస్తారు. ఇస్కారియోతు కాని 'యూదా' ఇలా అడిగినారని సువార్తలో వ్రాయబడింది. అప్పుడు ఏసు తన మీద ప్రేమలేని వారికి తన కార్యక్రమాలు అర్థం కావని అంటారు. తన ఆజ్ఞలను పాటిస్తూ విశ్వాసంగా ఉన్నవాళ్లకు మాత్రమే తాను అర్థమవుతాను, అగుపిస్తానని ప్రభువంటారు.

ఏసుప్రభువు జీవించి ఉన్న నాటి నుండే యూదాకు సువార్త ప్రచారంలో మంచి అనుభవం ఉండటం వల్లనే, ఏసు మోక్షారోహణం జరిగాక యూదాగారే ముందుగా సువార్తా సేవకు పంపబడినారు. యూసియుస్ అను చరిత్రకారుడు "పకారం అపోస్తలుడైన తోమాసుగారి గురించి వ్రాసిన అధ్యాయంలో మధ్య వారు ప్రాంతపు అనగా ఒళోన్లోని టోపార్చ్, ట్రిగ్రెస్, యూఫ్రిట్రీస్ నదుల మధ్యగల రాజ్యపు రాజు అయిన 5వ అబార్ ది బ్లాక్ అను ఒకడు ఏసుప్రభుకు ఒక ఉత్తరం వ్రాశాడు. తన వ్యాధిని నయం చేయడానికి రమ్మని బతిమాలుతూ ఆహ్వానం పంపాడు. అయితే ఏసు తన అపోస్తులలో ఒకరిని పంపిస్తామని ఆ ఉత్తరం తెచ్చిన వార్తాహురునికి మాట ఇచ్చి పంపారు.

అబార్ ఏలుతున్న చిన్న రాజ్యం యొక్క రాజధాని ఎడిస్సా నగరం యెరూషలేముకు ఈశాన్యంగా ఆకాశ మార్గానే నాలుగు వందల మైళ్ల దూరం ఉండి కొండలు రాళ్లతో నిండి ఉంది. ఏసు మోక్షారోహణం, పెంతెకోస్తు తర్వాత యూదాగారే అక్కడకు వెళ్లి రాజును కలిశారు. రాజుయొక్క విశ్వాసానికి సంతృప్తి చెంది “ప్రభువు పై నీకు విశ్వాసం ఉంది. కనుక ఏసుక్రీస్తు పేరట ప్రార్థించి నీ తల పై నా చేయి ఉంచుతున్నాను” అన్నారు. మరుక్షణమే ఏ వైద్యుడు నయంచేయలేని జబ్బును ఆ 29 ఏళ్ల రాజు నుండి తొలగింపబడింది. స్వస్థుడైన రాజు ఆశ్చర్యంతో ఆనందంతో నిండిపోయాడు. తరువాత పునీత యూదాగారు ఆ రాజు ఆ ఆస్థానంలో ఉన్న వ్యాధిగ్రస్తులందరినీ స్వస్థపరిచారు.

ఏసు గురించి అడిగిన రాజుకు వారి కొలువులో ఉన్నవారందరికి యూదాగారు ఇట్లు బోధించారు. “ఏసుక్రీస్తు ప్రభువు తనను తాను ఎంతో వినమ్రునిగా చేసుకున్నాడు. తన దివ్యత్వాన్ని ప్రదర్శించుకున్నాడు. సిలువలో కొట్టబడి మరణం పొందాడు. కాలం పుట్టినప్పటినుండి ఎన్నడు చెరగని వాటిని చెరిపి వేశాడు మృతులను బ్రతికించాడు. భువికి ఒక్కడే దిగి వచ్చాడు కాని స్వర్గానికి వెళ్లేటప్పుడు మాత్రం తన తండ్రికి ఎంతోమంది భక్తుల్ని తయారు చేసుకుని మరీ వెళ్లాడు. స్వర్గ లోకంలో మహా వైభవంగా తండ్రియైన దేవుని కుడి ప్రక్కన ఆశీనుడయ్యాడు. జీవించి ఉన్న వారినీ, మృతులనూ విచారించి న్యాయ తీర్పు విధించేందుకు మహాశక్తితో ఏసుక్రీస్తు ప్రభువు మళ్లీ వస్తాడు” అని ప్రధానంగా వివరించారు. ఇది అపోస్తలుల బోధన లేక విశ్వాస సంగ్రంగా ఉందికదూ! ఆ రాజ్యమంతటా యూదాగారు క్రీస్తు దైవత్వాన్ని బోధించారు. ఈ వివరాలను యూసిబియస్ ఉరిత్రకారుడే ఎడిస్సాలోని ప్రాచీన పత్రాలనుండి సేకరించి చరిత్రకెక్కించాడు.

సువార్తా గ్రంథంలో యూదాగారు వ్రాసిన లేఖ ఒకటి కన్పిస్తుంది. ఆ లేఖలో వచనంలో కొందరు తమ అవినీతికర ప్రవర్తనను సమర్థించుకోడానికి క్రీస్తు యొక్క వారి అపోస్తులయొక్క బోధలకు వక్ర బాష్యం చెప్పి శ్రీసభకు వ్యతిరేకంగా పోతున్నారని హెచ్చరించారు. 8వ వచనంలో వారు “పైనున్న దివ్య జీవులను అవమానింతురు” అని వ్రాశారు. అనగా ఆ అపార్ధాలు పలికే వారు పునీతులను, వారి సంబంధ ప్రయోజన మును విశ్వసించుటలేదని అందువల్ల 13వ వచనం ప్రకారం దేవుడు వారికి అగాధమైన కటిక చీకటియందు స్థలము ఏర్పరచెను” అని చెప్పారు. తిరిగి 22, 23 వచనాల్లో అట్టివారి పై దయచూపమని వారిని రక్షింప ప్రయత్నింపుడని నుడువుచున్నారు. క్రీస్తు భక్తుల్ని ఆదేశిస్తున్నారు.

ఈ పునీత యూదాగారు తన 20, 21వ వచనాల్లో క్రైస్తవులకిస్తున్న ప్రధాన సందేశంలో విశ్వాసాన్ని దృఢంగా నిలుపుకొని పవిత్రాత్మ ప్రభావంతో ప్రార్థిస్తూ మోక్షభాగ్యం పొందేంతవరకు దైవప్రేమతో నిలిచిపొండని తమమాటగా హితవు చెప్తున్నారు.ప్రారంభంలో యూదాగారు పాలస్తీనాలోనే సువార్త ప్రచారం చేసినట్లు చరిత్ర వెల్లడిస్తుంది. తర్వాత పర్షియా (ఇరాన్), అర్మేనియాలలో బోధించారు. ఈ దేశంలో అంద్రియ, సీమోను జిలట్, బర్తలో మయి మత్యాసు అను నలుగురు అపోస్తులు బోధించారు. క్రీ||శ|| 300ల్లో అర్మేనియా పూర్తి క్రైస్తవ రాజ్యంగా వెలుగొందింది. క్రీ||శ|| 66లో పునీత యూదా, పునీత సీమోను జిలట్ గారును ఇరాన్ (పర్షియా)లో బోధించడానికి వెళ్లారు. అక్కడ క్రీ||పూ|| 600 సం||ము నుండి జురాస్ట్రియన్ మతం అభివృద్ధి పొందింది. ఒకే దేవుడున్నారని, నీతి జీవితం పాటించాలని అనేవారు. కాని మంత్ర తంత్ర శక్తులను విపరీతంగా నమ్మేవారు. కాన వీరు క్రైస్తవ మతం విదేశీ మతం అన్యసిద్ధాంతం అంటూ తిరస్కార భావం ప్రచారం చేశారు. అయినాగాని క్రీ||శ|| 79లో ఇరాన్లోని సువనీర్ నగరానికి వెళ్తూ మార్గమధ్యమంలో యూఫ్రటిస్ నది సమీపంలోని బాబిలోన్ నగరం దాని చుట్టు ప్రక్కల క్రీస్తు బోధవిన్పించి వారిలోని మూఢనమ్మకాలు పోగొట్టి మంత్రాలు తంత్రాలు రక్షణ నివ్వలేవని బోధించి వారిని విశ్వాసులను చేశారు. దాదాపు అరవై వేల మందికి జ్ఞానస్నానాలిచ్చారు. సంఘాల్ని స్థాపించారు. పిమ్మట సువనీర్ పట్టణం చేరుకున్నారు.

అంతకుముందే సువనీర్ పట్టణ ప్రాంతంలో బర్తలోమయి అపోస్తలుడు తన ప్రార్థనా శక్తితో మంత్రశక్తులను, సైతానులను వెడలగొట్టి మంత్రగాళ్ల విలువను తగ్గింప చేశారు. ఇప్పుడు ఈ ఇద్దరు అపోస్తలులు రావడంతో 'మేజ్'లనబడే మంత్రగాళ్లు, సాతానోపాసకులు తమ విలువ ఇంకా ఎంత పడిపోతుందోయని భయపడి తమ అనుచరులను ప్రజలను రెచ్చగొట్టారు. ఆ మూర్ఖులు దాడిచేసి అతను త న 830 ఇద్దరు అపోస్తళ్లను రాళ్లతో కొట్టారు. ఒకడు యూదాగార్ని బల్లెంతో పొడిచాడు. కొందరు సీమోనుగారిని ముక్కలు ముక్కలుగా నరికారు. ఈ విధంగా ఇరాన్ దేశంలోనే ఈ ఇద్దరు అపోస్తళ్ల జీవితాలు రక్తపాతంతో ముగిసినట్లు తెలుస్తుంది.

పునీత యూదాగారు ఆసుపత్రులకు పాలక పునీతులు. రోగి పరిస్థితి తీవ్ర రూపం దాల్చినప్పుడు ఇతర క్లిష్ట పరిస్థితుల్లోను వీరిని ప్రార్థిస్తే రోగం శాంతిస్తుందని భక్తుల నమ్మకం. పోయిన వస్తువులను తిరిగి ఇప్పించే పునీతుడు వీరనికూడ ప్రతీతి వీరు నిరాశా జీవులకు ఆశాకిరణం అనికూడ పేర్కొనబడుతున్నారు. 18వ శతాబ్దంలో ఫ్రాన్సు, జర్మనీలోను భక్త యూదాగారి పట్ల పూజ్యభావం పెరిగింది. సీమోను అంటే దేవుడు ఆలకించెను అని, జూడ్ అనగా కీర్తింపబడే వ్యక్తి లేక స్తుతి అని అర్థం.

Simon was a simple Galilean, a brother of Jesus, as the ancients called one's close relatives — aunts, uncles, first cousins; he was one of the Saviour's four first cousins, with James the Less, Jude and Joseph, all sons of Mary, the wife of Alpheus, or Cleophas, either name being a derivative of the Aramaic Chalphai. The latter was the brother of Saint Joseph, according to tradition. All the sons of this family were raised at Nazareth near the Holy Family.Simon, Jude and James were called by Our Lord to be Apostles, pillars of His Church, and Joseph the Just was His loyal disciple.

Saint Simon the Zealot or the Zealous, was the name this Apostle bore among the twelve. He preached in Egypt, Mauritania (Spain), and Lybia, leaving behind him the fertile hills of Galilee, where he had been engaged in the healthful cultivation of the vineyards and olive gardens. He later rejoined his brother, Saint Jude, in Persia, where they labored and died together. At first they were respected by the king, for they had manifested power over two ferocious tigers who had terrorized the land. With the king, sixty thousand Persians became Christians, and churches rose over the ruins of the idolatrous temples.

But the ancient enemy, who never sleeps, rose up, and when the two went elsewhere the pagans commanded them to sacrifice to the sun. Both Apostles, just before that time, had seen Our Lord amid His Angels. Simon said to Jude, One of the Angels said to me, I will take you out of the temple and bring the building down upon their heads. I answered him, Let it not be so; perhaps some of them will be converted. They prayed for mercy for the people and offered their lives to God. Saint Simon told the crowd that their gods were only demons, and ordered them to come out of the statues, which they did, revealing themselves under hideous forms. But the idolaters fell on the Apostles and massacred them, while they blessed God and prayed for their murderers.

Saint Jude has left us a short but powerful epistle, written after the death of his brother James, bishop of Jerusalem, and addressed to the new Christians being tempted by false brethren and heretics.

Add new comment

1 + 0 =