SAINT OF THE DAY – OCTOBER 27 పునీత ఫ్రుమెన్షియసు |ST. PROMENTIUS

బిషప్పు , మతసాక్షి (క్రీ॥శ॥ 308-380) ఫొయెనేసియాదేశంలోని తైరె (టైర్) పట్టణంలో- ఇద్దరు గ్రీకు బాలురు ఉండేవాళ్లు. వారు సోదరులు. ఒకని పేరు ఫ్రుమెన్షియసుకాగా వేరొకని పేరు ఐదేసియసు. వారు తమ 8వ ఏట క్రీ॥శ|| 316లో తమ బాబాయిలతో కలసి ఓడను ఎక్కి ఎర్రసముద్రంగుండా ప్రయాణిస్తున్నారు. కొంతదూరం వెళ్లాక ఓడ ప్రమాదానికి గురియై పగులుటవల్ల నీళ్లు లోనికి రాసాగాయి. ఎలాగోలా ఆ ఓడ ఇతియోపియా దేశంలోని ఆబిస్సీనియా రాజ్యపు సముద్ర ఒడ్డుకు చేర్చబడింది. అయితే ఆ తీర ప్రాంత మూర్ఖప్రజలు ఆయుధాలతో ఆ ఓడ పైబడి ప్రయాణీకులను చంపి వస్తుసామాగ్రిని దోచుకున్నారు.

కాని చిన్నారులైన ఫ్రుమెన్షియసు, ఐదేసియసులను చంపలేదు. వారిని నిర్భంధించి అక్సుంపట్టణముకు తీసికొని పోయి అబిస్సీనియా రాజుకు అప్పగించారు. ముద్దులొలికే ఆ పిల్లల్ని చూసి రాజు తన మందిరంలోనే ఉంచాడు. ఐదేసియసును తన పాన పాత్ర సేవకునిగను, ఫ్రుమెన్షియసును తన చేతిక్రింద సేవకునిగను ఏర్పరుచుకున్నాడు. అక్కడే ఆపిల్లలిద్దరు పెరిగి పెద్దవారయ్యారు. ఇంటివద్ద నేర్చుకున్న క్రైస్తవ పద్దతులను భక్తిని వారు పెద్దయ్యే వరకుకూడ విడనాడలేదు. క్రమశిక్షణ, విధేయత, విశ్వాస ప్రార్థనకు వారు కట్టుబడి జీవించారు.

వారు పెద్ద అయిన పిమ్మట రాజు వారికి స్వేచ్చనిచ్చాడు. రాజు కొలువులో మంచి పదవులు ఇచ్చాడు. పునీత ఫ్రుమెన్షియసుగారు ఆ రాజ్యంకు కోశాధికారిగా ముఖ్యపదవి నెరవేర్చారు. మరి కొన్నాళ్లకు రాజు చనిపోగా ఆయన భార్య రాజ్యంను పాలించింది. తన రాజకుటుంబ పిల్లల్ని తీర్చిదిద్దే పనిని రాణి ఫ్రుమెన్షియసు ఐదేసియసుగారికే అప్పగించింది. కోశాధికారిగా బాధ్యతలు సక్రమంగా నెరవేర్చుతున్న ఫ్రుమెంతియసుగార్ని తమ రాజ్యంలో క్రైస్తవ విశ్వాస వ్యాప్తికి తమపూర్తి కృషి సలుపమని కోరింది. తద్వారా శాంతి భద్రతలు వాటంతట అవే వర్ధిల్లుతాయని రాణి నమ్మకం.

కాలక్రమంలో రాజకుమారులు అబ్రేహ మరియు అస్బేహ పెద్దవారై రాజ్యపాలనా పగ్గాలు చేపట్టగా ఫ్రుమెంతియసు, ఐదేసియసుగారు తమ పదవులకు రాజీనామాచేసే స్వేచ్ఛాజీవులయ్యారు. ఐదేసియసుగారు తిరిగి తమ సొంత పట్టణమైన తైరెకు వెళ్లి కొన్ని సంవత్సరాలకు అక్కడే గురువై దైవ సేవచేశారు. ఫ్రుమెషియసుగారు మాత్రం తాను ఉన్న అబిస్సీనియా రాజ్యంలో క్రైస్తవ మత వ్యాప్తి చేయాలని తలంచారు. వెంటనే ఈజిప్టులోని అలెగ్జాండ్రియానగరంకు చేరుకుని అక్కడ పీఠాధిపతిగా ఉన్న పునీత అతనాసియసుగార్ని కలసికొని అబిస్సీనియా రాజ్యానికి గురువులను పంపమని అర్థించారు. అంతట అతనాసియసుగారు ఆలోచించి ఫ్రుమెన్షియసుగారే గురుత్వానికి యోగ్యులని తెలుసుకొని అబిస్సీనియా రాజ్యంలోని అక్సుంపట్టణం కేంద్రంగా ఒక మేత్రాసనాన్ని ఏర్పరచి, ఆ పీఠంకు పీఠాధిపతిగా ఫ్రుమెన్షియసుగార్ని అభిషేకించారు.

బిషప్ ఫ్రుమెన్షియసుగారు అక్సుంపీఠంలో పాదంమోపి అధికార పూర్వకంగా క్రైస్తవ మత వ్యాప్తికి కృషిచేశారు. అక్కడ రాజు ముందుగా జ్ఞానస్నానం స్వీకరించారు. ప్రజలు కూడ విస్తారంగా క్రైస్తవమతం పుచ్చుకున్నారు. అనేక దేవాలయాలు నిర్మింపబడ్డాయి. రాజ్యమంతటా క్రైస్తవ మతమే వర్ధిల్లింది. బిషప్ ప్రుడెన్షియసు గారు నూతన నిబంధనను ఇతియోపియా భాషలోకి అనువదించారు. ప్రజలు వారిని ప్రేమతో అబూనా (తండ్రీ) లేక అబ్బాసలమా (శాంతి పిత) అని పిల్చారు. ఇథియోపియా శ్రీసభలో అగ్రపీఠాధిపతిని ప్రజలు నేటికీ ఈ విశేష పేర్లతోనే పిలుస్తున్నారు.

Saint Frumentius was still a child when his uncle, a Christian philosopher of Tyre in Phoenicia, took him and his brother Edesius on a voyage to Ethiopia. In the course of their voyage the vessel anchored at a certain port, and the barbarians of that country slew with the sword all the crew and passengers, except the two children.

Because of their youth and beauty they were taken to the king at Axuma, who, charmed with the wit and sprightliness of the two boys, took special care of their education, and later made Edesius his cup-bearer and Frumentius, who was a little older, his treasurer and secretary of state. The king, on his deathbed, thanked them for their services and in reward gave them their liberty.

After his death the queen begged them to remain at court and assist her in the government of the state until the young prince came of age; this they did, using their influence to spread Christianity. When the young king reached his majority, Edesius desired to return to Tyre, and Frumentius accompanied him as far as Alexandria. There he begged Saint Athanasius, its Patriarch, to send a bishop to the country where they had spent many years; and the Patriarch, considering him the best possible candidate for this office, in the year 328 consecrated him bishop for the Ethiopians.

Vested with this sacred character he gained great numbers to the Faith by his discourses and miracles, and the entire nation embraced Christianity with its young king, thus fulfilling a famous prophecy of Isaiah, uttered 800 years before Christ. (Isaiah 45:14) Saint Frumentius continued to feed and defend his flock until it pleased the Supreme Pastor to call him home and reward his fidelity and labors, in about the year 383.

We may note that the date of October 27th is also the feast day of a king of Ethiopia, Saint Elesbaan, who after overcoming the enemies of Christ, sent his royal diadem to Jerusalem in the time of the Emperor Justinus, and embraced monastic life. He died 250 years after Saint Frumentius, in 523.

Add new comment

6 + 0 =