SAINT OF THE DAY – OCTOBER 24 పునీత అంతోని మేరీ క్లారెట్|ST. ANTHONY MARY CLARET

(స్పెయిన్ దేశ గురువు, క్లరేషియన్సభ వ్యవస్థాపకులు, శాంటియాగో దె క్యూబా ఆర్చిబిషప్పు, రచయిత, మతసాక్షి క్రీ||శ|| 1807 - 1870) పునీత అంతోని మేరీక్లారెట్ గారి పేరులో మధ్యన 'మేరి' అని ఒక పురుషనికి జ్ఞానస్నానం పేరు ఇవ్వబడటం విచిత్రంగానే ఉంటుంది. వీరు తమ జీవితంలో చాలా చురుకైన పాత్ర నిర్వహించారు. వీరు సెమినరీలో గురువిద్యార్థిగా ఉన్నప్పుడు మరియమ్మగారి మధ్యవర్తిత్వమున ప్రార్థింపగా నీట మునిగి చనిపోవాల్సిన యువకుడు సురక్షితంగా ఆ గండంనుండి బయట పడగలిగారు. వారు మంచి వక్త, బోధకుడుగా పేర్గాంచారు. “దివ్యసత్రసాదం ఆరాధనయందు అనురక్తి, మరియ నిష్కళంక హృదయం యెడ భక్తి” వీరి బోధనలో ప్రత్యేక చోటుచేసుకునేవి. అందుకే వీరు స్థాపించిన క్లరేషియను వేదబోధసభ వారిని, మరియ నిష్కళంక హృదయ పుత్రులు అనికూడ పిలువ బడటం కద్దు.

పునీత అంతోని మేరీ క్లారెట్ గారు స్పెయిన్ దేశంలోని కతాలోనియా ప్రాంతంలోని 'సాల్లెన్డ్' అనే ఊళ్లో క్రీ॥శ|| 1807లో ఉద్భవించారు. వారి తండ్రి ఉన్ని వ్యాపారం చేసేవారు. క్లారెట్ గారుకూడ తండ్రికి తోడ్పడుతూ కొన్నాళ్లు నేతపని చేస్తూనే జీవనం కొనసాగించారు. తరువాత వారు దైవ పిలుపుకు లోబడి గురుశిక్షణాలయంలో చేరారు. అందుక్కావాల్సిన శాస్త్రాలను పఠించి గురువిద్యలో ఉత్తీర్ణులుకాగా క్రీ||శ|| 1835లో తమ 28వ ఏట గురువుగా అభిషేకితులయ్యారు. మొదట్లో వారు తమ స్వదేశమైన స్పెయిన్ అంతటా తిరుగుతూ సువార్తా ప్రచారం చేశారు. ఆ తర్వాత కొంతకాలం కానరీ ద్వీపంలో అజ్ఞానంగా ఉన్న ప్రజలకు మత సేవ ద్వారా వారిని విగ్రహ ఆరాధననుండి క్రీస్తు భక్తివైపు మరల్చకలిగారు. తానొక్కడే ఈ విస్తారంగా ఉన్న పంటను కోయడం కష్టసాధ్యమని తలంచి కారెట్ గారు క్రీ||శ|| 1849లో కొందరు ఉత్సాహవంతులైన గురువులను సమీకరించి “మిషనరీ సన్స్ ఆఫ్ ది ఇమ్మాక్యులేట్ హార్ట్ ఆఫ్ మేరీ” అనే సభను ఏర్పాటుచేశారు.

వీరినే క్లారెట్ గారి పేరట క్లరేషియన్ లేక క్లాంటైన్ గురువులు అనబడినారు. వారుచేసిన శ్రీసభ సేవలు అసామాన్యమైనవి. క్రీ||శ|| 1851లో అంతో నిగారు శాంటియాగో దె క్యూబ నగరానికి అగ్రపీఠాధిపతిగా నియమింపబడ్డారు. ఇదొక ద్వీపంలాంటిది. అక్కడ ఆరేళ్లపాటు తమ అమూల్య సేవలందించారు. తమ పీఠం పరిధిలో ఉన్న గురు విద్యాలయాన్ని సమూలంగా సంస్కరించారు. గురువులలో నియమనిబంధనలను కఠినతరంచేసి క్రమశిక్షణను పటిష్టపరచారు. ఇంకా తమ గురుపీఠంలోని విచారణలు, మత ప్రచార కేంద్రాల్ని దర్శించి వేలాది అక్రమ జంటల వివాహాలను క్రమబద్ధం చేశారు. ఆ ద్వీపంలో ఋణ పరపతి సంఘాలను ఏర్పరచి పేద రైతాంగాన్ని ఆదుకున్నారు.

అయితే క్రీ||శ|| 1857లో ఈ ఆర్చిబిషప్ అంతో నిగారు, 9వ పయస్ (భక్తినాధ) జగద్గురువుల కోరిక మేరకు స్పెయిన్ దేశం వెళ్లి, అక్కడ 2వ ఇసబెల్లా మహారాణిగారి ఆథ్యాత్మిక సలహాదారుగా నియమితులై తమ విలువైన సేవలందించారు. ముఖ్యంగా ఆ రోజుల్లో పునీత అంతోని మేరీక్లారెట్ బిషప్పుగారు సువార్తా సేవలను ఎంతో దీక్షతో చేస్తుండటంవల్ల స్పెయిన్, శాంటియాగో దె క్యూబా ద్వీపంలోని కొందరు రాజకీయ నాయకుల ద్వేషానికి గురయ్యారు. వారు అంతో నిగారిని తుదముట్టించడానికి చాలాసార్లు ప్రయత్నించారు. కాని దైవానుగ్రహంవల్ల వారు సురక్షితంగా బయటపడ్డారు.

వారు బార్సలోనా నగరంలో గొప్ప ఆథ్యాత్మిక గ్రంథాలయాన్ని స్థాపించారు. ప్రాచీన, ఆధునిక రచయితల ఉత్తమ కతోలిక గ్రంథాల లక్షలాది ప్రతులను తర్జుమాలను అతి చౌకగా ముద్రించి పంపిణీ చేయడమే ఆ గ్రంథాలయం చేసేపని. పునీత అంతోనిగారు సువార్తా సేవ పనిపై ఏ ఊరు వెళ్లినా అనేక కతోలిక మత గ్రంథాలను తనతోపాటు తీసుకు వెళ్లి పంచి పెట్టేవారు. వారు 200 వరకు పుస్తకాలు, కరపత్రాలు వ్రాసి ప్రచురింపజేశారు. పదివేలకు పైగా ప్రసంగ సందేశాలందించి ప్రజాళిని దైవం దెసకు మరల్చారు. అయితే క్రీ||శ|| 1868లో స్పెయిన్లో వచ్చిన విప్లవంవల్ల రాణిగారితో పాటు దేశాంతర వాసంచేశారు. మేరీ క్లారెట్ గారు ఫ్రాన్సుదేశానికి వలసపోయి అక్కడే తమ పవిత్ర శేష జీవితాన్ని గడపి క్రీ||శ|| 1870లో నర్బోన్నె పట్టణంలోని కి స్టెర్షియన్ మఠంలో తమ తుది శ్వాసను విడిచి దైవ రాజ్యం చేరుకున్నారు. క్రీ||శ|| 1897లో వారి మృతావశేషాలను మరొక చోటికి మార్చినపుడు వారి గుండె కాయ మాత్రం యథాతథంగా శిథిలమవకుండా ఉండిపోవడం ఎల్లరకు ఆశ్చర్యం కలిగించింది. దివ్యసత్రసాద ఏసు, మరియమాత నిలయంగా మార్చుకున్న వారి హృదయంను దర్శించడానికి ఎంతోమంది తరలివచ్చి కన్నులారాగాంచి దేవుని మహిమను వేనోళ్ల శ్లాఘించారు. క్రీ||శ|| 1950లో అంతోని మేరీ క్లారెట్ గారికి జగద్గురువులు 12వ పయస్ పోపుగారి ద్వారా పునీత పట్టం ఇవ్వడం జరిగింది.#rvatelugu #saint #dailysaint

Founder of the Claretian Fathers and the Sisters of Mary Immaculate (1807-1870) Saint Anthony Mary Claret is the Founder of the Claretian Fathers, or the Congregation of the Sons of the #Immaculate Heart of Mary. Born in 1807 in Spain, he was a very pious child. He later wrote that, already at the age of five, my little heart trembled at the thought of hell, and I said to myself: Will those who fall into hell never stop suffering? No, never. Will they always suffer? Yes, always. This thought remained profoundly engraved in my mind, and I can say that it is ever present to me. That is what has animated me to work for the conversion of sinners. Why? Because I received [from God] so tender a heart that I cannot see a misfortune without assisting it. The young #Anthony practiced his father's trade, the weaving of fabrics, in which he excelled, until one day in church, All the efforts I made not to voluntarily entertain thoughts of my trade were in vain; I was like a wheel turning with great speed, which cannot be stopped all at once... There were more machines running in my head than there are Saints on the altars. He entered the local seminary in the same year, 1829.

As a young priest he went to Rome to place himself at the disposition of the Congregation of the Propaganda; there the director of a retreat counseled him to enter the Society of Jesus. He did so but was obliged to leave it soon afterwards because of poor health. He returned to Spain, and for nine years preached everywhere the word of God and promoted the Catholic Press. In 1848 he founded a publishing house at Barcelona, and soon afterwards established his Claretian congregation of priests. The six priests of this Congregation had just received the formal approbation of the bishop of Vich, and completed a retreat at the Seminary in July of 1848, with the Exercises of Saint Ignatius; on August 11th, while their new Superior was preaching a mission to the clergy of the diocese, he received a royal decree nominating him Archbishop of Santiago, in Cuba.

He was inclined to refuse it categorically and attempted to do so, but was not heard; he asked his five companions to pray for light for several days, then to advise him as to their reply — should he or not accept the nomination? They were unanimous in saying they believed he should accept, and he did.For six years he dedicated himself to the organization and evangelization of his diocese. In Cuba he founded another new congregation, the Sisters of Mary Immaculate, dedicated to the instruction of the young. A School of Arts and Trades was opened there, and Latin America saw established its first common funds resources. Abuses vanished under his strict and persevering disciplinary measures.

In Cuba an attempt was made on his life; he received a severe wound of the head which limited his preaching capacity for a time, and he was recalled to Spain, summoned by Queen Isabella II to replace her deceased confessor. He continued to travel to various places on the peninsula, preaching everywhere in Andalusia and elsewhere. In 1862, from September 12th until October 29th, during one royal visitation, one of the Queen's servants counted the sermons he had given — two hundred and five: 16 to the clergy, nine to the seminarians; 95 to the various groups of Sisters; thirty-five to the poor in the various houses of charity; and twenty-two others to the people in general in the churches.

He created the Academy of Saint Michael for the Catholic intellectuals, called to sustain the influence of the Church; he founded popular libraries and saw to the diffusion of good literature; he accompanied the exiled Queen to Rome and took part in the First Vatican Council, 1869. Finally he settled in France, where he died in 1870. He was commanded to write his life by his spiritual director; this he did, beginning in 1861. We are fortunate to possess this autobiography of an extraordinary soul, both contemplative and active in the love and service of God. It serves for the formation of missionaries, since his director told him it should be conceived with that purpose. In this book he wrote a paragraph which has become classic, to describe what an apostle of the Gospel should be. In it the paths he followed himself are made articulate:

A son of the Immaculate Heart of Mary is a man who is consumed with love and who sets on fire everything in his path. He is a man who unceasingly expends himself to light the fire of divine love in the world. Nothing stops him; he places his joy in privations, he undertakes all works for the glory of God; he embraces willingly every sacrifice, he is happy in the midst of calumnies; he exults in torments. He can think of but one thing — working, suffering, and seeking at all times the greater glory of God and the salvation of souls, to imitate Our Lord Jesus Christ.

Add new comment

5 + 2 =