SAINT OF THE DAY – OCTOBER 23 పునీత జాన్ కపిస్తానొ|ST. JOHN KAPISTHANO

(గురువు, వివిధ శ్రీసభ బాధ్యతలు నెరవేర్చిన వ్యక్తి, మతసాక్షి క్రీ|శ|| 1386 - 1456) దేవుడు చేసే పనులు మానవ మాత్రులకు అంతు చిక్కదు. అటువంటి కోవకు చెందిన జీవిత చరిత్రగలవారే పునీత జాన్ కపిస్తానొ. వారు మధ్య ఇటలీలోగల అబుజ్జి పర్వత శ్రేణి ప్రాంతంలోగల కపిస్తానో అను పేరుగల ఊల్లో క్రీ||శ|| 1386లో ఉద్భవించారు. వీరిది కాస్త కలవారి కుటుంబమే. జాన్ గారు పెరూజియా పట్టణంలోని కళాశాలలో చదివి న్యాయశాస్త్రంలో మొదటి శ్రేణిలో పట్టాపుచ్చుకున్నారు. తమ 27వ ఏట వారు పెరూజియా పట్టణం గవర్నరుగా నియమితులయ్యారు. పరిశుద్ద పోపుగారి పాలనలో గల భూ భాగమది.బాగారి పరిపాలన విషయంలో దృఢ వైఖరి వహించే వారు. అందుకే కొంతమంది అధికారుల్లో పేరుకు పోయిన అవినీతి జాఢ్యాన్ని వదలగొట్టారు. అన్యాయం అక్రమం అంటే కొరడా ఝుళిపించేవారు.క్రీ||శ|| 1416లో మలబెస్టామండల పాలకులు పెరూజియా పై దండెత్తి వచ్చారు. యుద్ధం జరిగింది. ఆ సమయంలో జాన్ గారు శాంతి సంభాషణలకై మలటెస్ట్రావెళ్లారు. వారి సదుద్దేశ్యాని అపార్థం చేసుకున్న విద్రోహులు వారిని బంధించి బందీఖానాలో పడవేశారు. ఆ చీకటి కొట్లో బందీయైన జాన్ గారు తమ ఆత్మసంబంధ పరిస్థితి పై తీవ్రంగా సింహావలో కనంచేశారు. అయితే పెద్దమొత్తం ధనం చెల్లింపగా జాన్ గారు చెరసాలనుండి విడుద లయ్యారు. వారు చెరసాలలో ఒంటరిగా ఉండి తమ పాపాల విషయమై ఎంతో పశ్చాత్తాపంచెందారు.

వారికి పునీత అస్సీసి ఫ్రాన్సిసుగారు దర్శనమయ్యారు కూడా. తత్ఫలితంగా జాన్ గారిలో పెనుమార్పు కలిగింది. ఈ లోక సంబంధమైన ఆశలు ఆశయాలన్నీ ఒక్కసారిగా త్యజించి పునీత ఫ్రాన్సిసుగారిని అనుసరించాలని దృఢంగా భావించారు.జాన్ గారు చెరసాలలో వేయబడటానికి కొద్ది రోజుల ముందుగానే జాన్ గారికి ఒక పెరూజియన్ పడతితో వివాహం జరిగింది. అయితే ఇప్పుడు వారికి కలిగిన విరక్తివల్ల తన వివాహాన్ని రద్దు చేయించుకొని ఆ సంబంధంను పరిసమాప్తి చేసుకున్నారు. అటుపిమ్మట వారు ఫ్రాన్సిస్కస్ సన్యాసుల సభలో ప్రవేశం సంపాదించారు. అప్పటికి వారి వయస్సు కేవలం 31 సం||లు.ఆ సభాధిపతియైన పునీత సియెనా బెర్టర్డీన్ గురువర్యుల అనర్గళ సందేశాలు జాన్ గార్ని ముగ్ధుణ్ని గావించేవి. ఆ ప్రధాన గురువుగారికి తానొక అనుంగు శిష్యుడుగా పేరొందారు. వీరికి తోడి శిష్యుడుగా మార్చెస్ నగర పునీత జేమ్ముగారు ఉండేవారు. వారు కూడ తనవలె న్యాయశాస్త్రంలో విద్యగడించినవారే. వీరు జాన్ గార్కి జీవితాంతం వరకు గట్టి మద్దతు దారుగా నిలచి వారి మిషనరీ జీవితం, ఫ్రాన్సిసు వారి సభలో మంచి సంస్కరణలు ప్రవేశ పెట్టడంలో మిక్కిలిగా తోడ్పడ్డారు. పునీత బెర్నర్టీనుగారి సువార్త ప్రచార ప్రయాణంలో పునీత జాన్ కపిస్రా నొగారు జతగా ఉండి 9 సం||లు తమ సహాయ సహకారాలందించారు. అనంతరం క్రీ॥శ|| 1425లో తమ 39వ ఏట వారు పవిత్ర గురుపట్టాభిషిక్తులయ్యారు.

ఇక వారే స్వయంగా ఇటలీలోని ప్రధాన నగరాలలో పర్యటించి సువార్తా బోధలు చేయడం ప్రారంభించారు. వారు పెద్ద పెద్ద ప్రజాకూడళ్లలో ప్రభువు రక్షణ వాక్యాన్ని లోతైన భావాలతో బలంగా తమ కంచు కంఠంతో ధారాళంగా విన్పించేవారు. శ్రోతలు 20 లేక 30 వేలమంది ప్రోగవుతుండేవారు. వారు నిర్వహించే ప్రదక్షిణల్లో గురువులు విశ్వాసులు లౌకిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనేవారు. ఆ ప్రదర్శన రోజున ఆ ప్రదేశ వ్యాపార పనులన్నీ స్థంభించిపోయేవి. ఉత్తర ఇటలీలోని బ్రెస్సియా నగరంలో వారు ప్రసంగించిన ఒక సమావేశానికి ఒక లక్షా 26 వేలమంది ప్రజానీకం హాజరై నిశ్శబ్దంగా వారి ప్రభు ప్రబోధాన్ని ఆలకించారు. జాన్ గారు చక్కని లాటిన్ సాహిత్యంలో ప్రసంగిస్తే దుబాసీలు ప్రజలకు అర్ధమయ్యే గ్రామ్య భాషలో తర్జుమా చేసి విన్పించేవారు.

జాన్ గారి సందేశ సమయంలో వేలాదిగా ప్రజలు అద్భుతంగా స్వస్థతలు, మేలులు పొంది క్రీస్తు సాక్షులుగా మారుతుండేవారు. ఆ విధంగా జాన్ గారి పేరు ప్రతిష్ఠలు దేశ విదేశాలకు ప్రాకాయి. ఒక సందర్భంలో వ్యాధి గ్రస్తుల కోరిక పై వారి తల పై జాన్ గారు సిలువ గుర్తు వేయగా వారు బాగుపడి క్రైస్తవ వేదంలోకి ప్రవేశించడం విశేషం.తమకు ఆదర్శంగా ఉన్న పునీత సియెనా బెర్నర్గీనుగారివలె జాన్ కపిస్తానోగారును పవిత్ర ఏసునామ భక్తిని వ్యాపింపజేశారు. ఆ రోజుల్లోప్రొటెస్టెంటుల ప్రభావం అధికం కావొచ్చింది. ఫ్రెటి సెల్లి అనబడే ఒక వితండవాది దక్షిణ ఇటలీ, సిసిలీ ద్వీప ప్రదేశాల్లో క్రైస్తవ వేదంకు తన సొంత వ్యాఖ్యానాలతో అసలు సిద్ధాంతానికి వక్రభాష్యాలతో మతంలో కొంత అయోమయాన్ని సృష్టించాడు.

ప్రజలో కలిగిన ఈ అయోమయాన్ని పరిష్క రించేందుకు పోపుగారు గురు శ్రీ జాన్ పిసాన్ గారిని విచారణ జరిపే సంధాన కర్తగా పంపించారు.జాన్ గారు వక్రభాష్యాల్ని సమరంగా ఎదుర్కొని కతోలిక విశ్వాసంను నిలబెట్టారు. క్రీ||శ|| 1431లో వారు పానీ సువారి సభలో పరిశీలక బృందంలో ఒక ప్రధాన సలహా సభ్యునిగా ఏర్పాటు చేయబడ్డారు. క్రీ॥శ॥ 1439 నుండి జాగారు పోపుగారి దూతగా అనేక విదేశాలకు పంపబడినారు. వరుసగా వచ్చిన నలుగురు పోపుగార్ల హయాముల్లో కూడ వారు ఆ గొప్ప పదవి నిర్వహించారు. పోపుగారి దూతగా వారు పాలస్తీనా, పోలెండు, ఫ్రాన్సు, ఆస్ట్రియా మరియు బొహేమియా (చెకోస్లేవేకియా) దేశాల్లో దిగ్విజయంగా పర్యటించారు.

ఫ్రాన్సులో పూర్ క్లే సభను సంస్కరిస్తున్న పునీత కొలెట్టెయమ్మగార్ని కలసి వారిని బహుగా ప్రోత్సహించారు. అలాగే ఆయా దేశాల్లో కతోలిక సిద్ధాంతానికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన అనేక వితండవాదనలకు విరుగుడు సమాధానాలు, ప్రకటనలు గుప్పించి తప్పిపోయిన వారిని తిరిగి కతోలిక విశ్వాసంలోకి వచ్చేలా విశేష కృషి సల్పి పోపుగారి మన్ననలందుకున్నారు.క్రీ॥శ॥ 1453లో కాన్స్టాంట్ నోపుల్ నగరాన్ని తురుష్కులు వశపరచుకొనగా జాన్ కపిస్తాన్గారు ప్రధాన పాత్ర నిర్వహించారు. క్రైస్తవ రాజులందరిని భుజం తట్టిలేపి వారిని ఏకంచేయకలిగారు.తురకలను ఎదుర్కొనేలా చేసి విజయం సాధించి, వారి పాల బడకుండ హంగరీని, యూరపునంతటిని కాపాడకలిగారు మత యుద్ధాల్లో పాల్గొన్న క్రైస్తవ పోరాటయోధులకు అన్ని విధాల ప్రబోధచేసి వారిని కార్యోన్ముఖులను గావించారు. తురుష్కులు అధిక సంఖ్యలో ఉండి, వారికి అనుకూల పరిస్థితులు ఎన్నో ఉన్నాగాని క్రైస్తవ సైన్యంకు హున్యాది యానస్ నాయకత్వం వహించగా జాగారు స్వయంగా వామపక్ష సైన్యాన్ని నడిపించారు. సిలువ స్వరూపాన్ని చాలా ఎత్తుకు పైకి లేపి చూపుతూ సైన్యంకు ఛైర్యం నూరిపోశారు. బెల్ గ్రేడులో జరిగిన ఆ ఘోరయుద్ధంలో దేవుని తోడ్పాటువల్ల క్రైస్తవ సైన్యం గొప్ప విజయం చేజిక్కించుకుంది. ఈ విజయం పిమ్మట వారు కేవలం మూడు మాసాలు మాత్రమే జీవించి ఉన్నారు.

పునీత జాన్ కపిస్తోనొగారు ఆ దినాల్లో విజృంభించిన సమస్యాత్మక విషయాల్లో కలగ జేసుకొని సరిదిద్దకలిగారు. తమ ఉపన్యాసాలతో, ప్రభువాక్యంతో, తన వ్రాత పూతలతో తమలోను, శ్రీసభలోను మంచి నాయకుడుగా ఉన్నత స్థానంబడశారు. వారు ఆస్ట్రియాదేశంలో విల్లచ్ పట్టణంలో 1456 అక్టోబరు 23వ తేదీన శాశ్వతంగా ప్రభువునందు నిద్రించారు. అప్పటికి వారికి ప్లేగువ్యాధిగ్రస్తులలో పనిచేయడాన ఆ వ్యాధిసోకి చనిపోయి నారని ప్రతీతి. వారు క్రీ||శ|| 1690లో 8వ అలెగ్జాండరు పోపుగారిచే పునీతులుగా ప్రకటింపబడి యావత్ శ్రీ సభచే కొనియాడబడుచున్నారు. #rvatelugu #saint #dailysaint

Saint John was born at Capistrano, near Naples in Italy, in 1385. Having studied both secular and canon law, he became so skilled in it that his reputation spread over all of Italy. He was imprisoned during a war and abandoned by his protector for some time, during which his young wife died. He resolved while still in prison to serve in the future no other interests but those of God. His property was sold at his command, his ransom paid, and from his prison he entered a monastery near Peruse where the Rule of Saint Francis was observed in its purity.The superiors, fearing this vocation to be a passing fancy, tested him severely, even sending him away twice; but he remained day and night at the door, suffering joyfully all trials. His heroic perseverance disarmed their fears and severity, and he was admitted to religious profession.For seven years he practiced great austerities, cared for the sick in the hospitals, and preached on all sides the word of God. In this, say his biographers, he succeeded so admirably that few preachers in the course of all the centuries can be compared with him. He became a disciple of Saint Bernardine of Siena, assisting him in public conferences and discussions. Like many great servants of God he was calumniated, as though he had taught errors; he went to Rome to justify his teachings in the presence of the Pope and a group of cardinals, which he did admirably well, and they recognized the obvious innocence of the accused Saint.

Afterwards he preached all over Italy, and everywhere brought about the reform of lives. Five Popes in succession gave commissions to this remarkable Franciscan to represent them in important affairs, and he traveled to France, Austria, Poland and Germany. Everywhere his negotiations were crowned with success. But none of the Popes succeeded in raising him to the episcopal dignity; their efforts met an absolute resistance in his humility.His extraordinary qualities proved to be of great assistance to the Holy See in another circumstance. When Mohammed II was threatening Vienna and Rome, Saint John Capistran, at the bidding of Pope Callixtus III, enrolled for a crusade 70,000 Christians. In a vision he was assured of victory in the Name of Jesus and by the Cross he bore. Marching at the head of the crusaders, he entered Belgrade at the head of the army. This General of the Friars Minor won a remarkable victory in that year of 1455, when 40,000 of the enemies of the Christians perished, but virtually none among the latter.

He himself died the following year at the age of 71. He is regarded as a martyr, for enemies of the faith twice succeeded in giving him poison, which was ineffectual; he died only from the immense fatigue he had suffered in the defense of the city of Belgrade. An infinity of miracles followed his death. He was canonized in 1690.

Add new comment

1 + 1 =