SAINT OF THE DAY – OCTOBER 22 ధన్య తిమోతి జకార్డి |BLESSED TIMOTHY, GIACCORDO

 గురువు, ప్రచార మాధ్యమాల పాలక పోషకుడు, మతసాక్షి క్రీ||శ|| 1896 – 1948 తిమోతి జకార్డిగారు ఇటలీదేశంలోని అల్బో మేత్రాసనం నా జోల్ అనే ఊళ్లో క్రీ||శ|| 1896 జూన్ 3వ తేదీన ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు. పుట్టినరోజునే వారికి బప్తిస్మం ఇప్పించారు. వారు చదువుకునే రోజులనుండే ఒక మంచి గురువు కావాలని సువార్తను ఎల్లెడల చాటించాలని ఉవ్విళ్లూరుతుండేవారు. కాని వారు పేదతనంలోనే ఆర్ధిక ఇబ్బందులున్నాగాని కష్టపడి చదువుకున్నారు.

నా జోల్ విచారణకు ఫాదర్ జేమ్సు ఆల్బెరియోనెగారు నూతన గురువుగా విచ్చేశారు. తరచు పూజా సహాయక బాలుడుగా జకార్డోవారి కంట బడుతుండేవారు. అలా వారి అభిమాన పాత్రుడయ్యారు. ఒకరోజు జకార్డోకు అవకాశం దొరకగా విచారణ గురువుతో తన మనసును తొలిచే తీవ్రకోరికను తెల్పి భారం దించుకున్నారు. స్వామి, జకార్డోగారి దైవ పిలుపును గ్రహించినవారై బాలుని ఒక గురు శిక్షణాలయంలో చేర్పించి ఖర్చుల నిమిత్తం ఆర్ధిక సాయంకూడ అందించారు. అయితే కొన్నాళ్లయినాక జేమ్సు స్వామి జకార్డో చదువుకుంటున్న సెమినరీకి ఆథ్యాత్మిక మార్గదర్శకుడుగా బదిలి పై వచ్చారు. జకార్డోగారికి తగిన సూచనలతో చక్కని తర్ఫీదునిచ్చారు. తత్ఫలితంగా వారికి 13 ఏటనే బ్రహ్మచర్య దీక్షను పాటించడానికి మొదటి మాటపట్టును ఇచ్చారు. కామేతాసన్నంలో కూడ మరో కేంద్రగృహాన్ని నెలకొల్పి దానికి ఫాదర్ తిమోతి ఎరోగార్ని నియమించారు. చాలామంది గురువులకు అధిపతిగా జకార్డోగారు సమర్ధవంతంగా దైవ మానవ సేవలు పెంపొందేలా చేశారు. పాదర్ తిమోతి జకార్డోగారికి పత్రికా ప్రచురణలు, గ్రంథ ప్రచురణలు అంటే యిష్టం. అందుకే తమ సంస్థలోని సభ్యుల్లో సాహిత్య వ్యాసంగాన్ని బాగా ప్రోత్సహించారు. సాంకేతిక రంగాన్ని మెరుగుపరచారు. గ్రంథాలు, పత్రికలు సంపిణీకి చక్కని ఏర్పాట్లుగావించారు. వారు 'ఆల్బా'లోని కేంద్రగృహంలో సుపీరియరుగా ఉన్న కాలంలో 25 క్రొత్త యంత్రాల్ని కొని వారి ముద్రాక్షరశాలను ఆధునీకరించారు. అనుదిన పర్యవేక్షణ, వివిధ రంగాల అధికారులతో సమావేశాలు జరుపుతూ ఒక సంపాదక వర్గంతో నూతన కార్యాలయాన్ని తెరిచారు వారు ప్రచురణార్హమైన గ్రంధాల్ని ఎంపికచేసేవారు.

జకార్డో గురువర్యులులాగజెట్టా ది అల్బాపేర ఒక మేత్రాసన స్థాయి మాసపత్రికను నడిపారు. పిమ్మట బోధక గురువులకోసంవీతా పాస్తారాలె" (ఆధ్యాత్మిక జీవనం) అనే పత్రికను స్వీయ సంపాదకత్వంలో ప్రచురించేవారు. అందు మతం, వేదాంతం సంబంధించిన వ్యాసాలు కథనాలు వ్రాసి ముద్రింపజేసేవారు. “యూనియన్ ఆఫ్ కోపరేటర్స్అనే ప్రాంత సంపాదక వర్గంలో కూడ వారు సభ్యుత్వం కలిగి ఉండేవారు. ఫాదర్ తిమోతి జకార్డిగారు నిస్తంత్రీ (రేడియో) వార్తా ప్రచార రంగంలో తొలిసారిగా ప్రయత్నాలుచేశారు. సినిమాలద్వారా సువార్త ప్రచారం చేయడానికి అంకితులైన ఇద్దరు గురువులకు మంచి మార్గదర్శకులయ్యారు. అప్పట్లో సినిమాలంటే చులకనభావం ఉండేది. కాని జకార్డాగారు అశేష జనానికి అలవోకగా సువార్తనందించాలంటే చలనచిత్రం గొప్ప శక్తివంతమైన సాధనం అని నామ్మారు. వారి సహకారంతో రెండు వేదాంత కథా చిత్రాలుకూడ విడుదలై ప్రజాదరణ చూరగొన్నాయి.

గతంలో ఫాదర్ జకార్డిగారి ఆధ్యాత్మిక గురువైన జేమ్సు ఆల్బెరియోనెగారు పునీత పౌలుసంస్థను గురువులకొరకును, పిదప మహిళలకొరకుపునీత పౌలు మఠకన్యల సభను స్థాపించి నిర్వహింపబడేలా చర్యలుగైకొన్నారు. అయితే వారు రామునగరంలో నెలకొల్పిన కేంద్రీయ గృహం 'జనరల్ హౌస్ ఆఫ్ సొసైటీ'గా రూపొందించి దానికి 'వికారుజగ్రలు' అను అధిపతి స్థానాన్ని ఫాదర్ జకార్డోగారు క్రీ.శ|| 1919 అక్టోబరు 19వ తేదీన 'పునీత పౌలు సొసైటి' గురువుల సభకు ప్రథమ గురువుగా పట్టాభిషేకం పొందారు. తమ ఆథ్యాత్మిక గురువు అయిన ఫాదర్ జేమ్సు ఆల్బెరియోనెగారి సూచనమేరకు 'తిమోతి' అను నూతన నామధేయాన్ని స్వీకరించారు. ఫాదర్ తిమోతి జకార్డోగారుగా పిలువబడినారు. ఫాదర్ జేము ఆల్బెరియోనెగారు తమ ఆశయం మేరకు క్రీ|||| 1914లోముద్రణాపనివారి బృందం"ను స్థాపించారు. అదే క్రమంగా ఒక పెద్ద సొసైటీగా రూపొందింది. సంస్థ కేంద్రాన్ని వారు రోమునగరంలో కూడా ఏర్పరచారు. అప్పగించారు. మళ్లి "సిస్టర్స్ డిసైపుల్స్ ఆఫ్ డివైన్ మాస్టర్' (పరలోక తండ్రి అనుచర కన్య స్త్రీల సభ) అను మూడవ సంస్థను స్థాపించి దాని బాగోగులు చూడ్డానికి ఫాదర్ జకార్డాగారినే ఏర్పరచారు. మూడు సభల మఠవాసులంతా ఫాదర్ జకార్డిగారిని ఉన్నత వ్యక్తిత్వంగల సమర్ధ గురువుగా గౌరవించేవారు. “నేను జీవించేది క్రీస్తు కొరకేఅనే పునీత పౌలు గురుసభ ఆదర్శం జకార్డాగారిపట్ల యదార్ధమైంది. దివ్యసత్రసాద ఆరాధన, ధ్యానం, ప్రార్థన మరియమాత పట్ల పూజ్యభావం వారి రచనల్లో ద్యోతకమయ్యేవి.

మంచి చరిత్రకారుడుగా పేర్గాంచిన ఫాదర్ తిమోతి జకార్డిగారికి 'లుకేమియా' అనే వ్యాధిపీడిస్తుండేది. అందువల్ల వారు తమ పాలక పునీతులైన తిమోతిగారి పండుగరోజున మరియు పునీత పౌలు పరివర్తన ఉత్సవం రేపు అనగా క్రీ|||| 1948 జనవరి 24 తేదీన కాలధర్మం చెందారు. అనగా కేవలం తమ 52 ఏటనే వారు జీవితం చాలించారు క్రీ॥శ॥ 1954లో జపానులో సువార్తా సేవ పనిలోనిమగ్నమై క్రీస్తు ప్రేమను అందిస్తున్న ఒక మఠకన్య సిస్టర్ మరియ లూసియాన లాజరీని (ఇటలీ జాతీయరాలు) గార్కి క్షయవ్యాధి బాగా ముదిరి చనిపోయే స్థితికి చేరారు. వారిని పరీక్షించిన డాక్టరు ఆశలువదలుకున్నారు. అయితే 'సిస్టర్ డిసైపుల్స్ ఆఫ్ ది డివైన్ మాస్టర్మఠకన్యలు తిమోతి జకార్గో గురువర్యుల మధ్యవర్తిత్వాన్ని విశ్వసించి ప్రార్థనలు సల్పారు. అంతే రెండు వారాల్లో కన్య స్త్రీకి క్షయ మటుమాయమైంది. ఇది చూసిన డాక్టరుకూడ ప్రభువును నమ్మి జ్ఞానస్నానం పుచ్చు కున్నాడు. గొప్ప అద్భుతంద్వారా క్రీ|||| 1989 అక్టోబరు 22 తేదీన 2 జాన్ పౌలు పరిశుద్ధ పోపుగారు ఫాదర్ తిమోతి జకార్ప్ గురువర్యులకు 'ధన్యత' పట్టానిచ్చి సత్కరించారు. తిమోతి అంటే దేవుని గౌరవించుట అని అర్థం.

Blessed Timothy Giaccardo was born in Narzole (Piedmont), Italy, on June 13,1896. As a boy, he met Fr. James Alberione and entered the seminary of Alba. Sensitive to the needs of the times and open to the new instruments of evangelization, in 1917 he transferred, with the consent of his bishop, from the seminary of Alba to the newly-born Society of St. Paul. Fr. Giaccardo was the first Pauline priest. In January 1926, he was sent to Rome to initiate the Congregation's first branch house. In 1936, he returned to Alba to fill the position of superior of the Motherhouse. Vicar General of the Society of St. Paul, faithful collaborator of the Founder, Fr. Giaccardo tirelessly worked on behalf of the Pauline congregations, assisting in their birth and spiritual/apostolic development. Offering his life in order that the Congregation of the Pious Disciples of the Divine Master might receive official recognition by the Church, he died in Rome on January 24, 1948.

Add new comment

10 + 10 =