SAINT OF THE DAY – OCTOBER 21 పునీత హిలారియోను ఘనుడు|ST. HILARION, ABBOT

ఋషి, మఠశ్రేష్ఠుడు, వేదసాక్షి (క్రీ||శ|| 291 - 371) పునీత హిలారియోను ది గ్రేట్ గారు కూడ ఒక ఎడారి ఋషి పునీతుడు. వీరి గురించి క్రీ|||| 391లో పునీత జెరోముగారు ఎక్కువగా వ్రాశారు. హిలారియోనుగారు పాలెస్తీనాదేశంలో గాజా పట్టణంలో దబ్బర దేవుళ్లను మ్రొక్కేవారి ఇంట క్రీ|||| 291లో జన్మించారు. ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలో విద్యగడించారు. రోజుల్లో వారు ఏసుక్రీస్తు ప్రేమ సిద్దాంతంగూర్చి తెలుసుకున్నారు. లోక సంబంధమైన ఆశలు, ఆస్థిపాస్తులు విడిచి పెట్టి తనను వెంబడించమన్న క్రీస్తు బోధలపట్ల అధికంగా ఆకర్షితులయ్యారు.

జ్ఞానస్నానం పొంది క్రైస్తవుడుగా మారారుకూడ. ఆ రోజుల్లో ఈజిప్టులో అంకొంటెసు ప్రాంత గురువుగా పునీత పెద్ద అంతోని అను గొప్ప సన్యాసి ఉండేవారు వారి వద్ద శిష్యరికం చేస్తూ హిలారియోనుగారు రెండుమాసాలు అడవిలో కఠోర ఉపవాసము ప్రార్ధన ధ్యాన సముద్రంలో మునిగి ఉన్నారు. అటు పిమ్మట వారు తిరిగి పాలెస్తీనాలోని స్వగృహం చేరుకున్నారు. తల్లిదండ్రులు చనిపోవడంవల్ల వారు తమకు వారసత్వంగా వచ్చిన ధనము, ఆస్టులన్నింటిని పేదసాదలకు పంచి పెట్టారు. తనకొరకు చిన్న గుడిసె కట్టుకొని పూర్తి సన్యాసి జీవితం ఆరంభించారు. కట్టుబట్టలతో ఉన్న పేదరికంలో పవిత్ర జీవితం గడిపారు. పాలెస్తీనాలో బహుశా మొదటి మునీశ్వరుడు వీరేకావచ్చు. తమ జీవనోపాధి కోసం బుట్టలు అల్లేవారు. ప్రతిరోజు సూర్యాస్తమయం అయిన తర్వాత మాత్రం అల్పాహారం తీసుకునేవారు. కేవలం ఒక రొట్టెముక్క కొద్దిదుంపలు భుజించేవారు. క్రైస్తవ మత వ్యాపకంలో తన సమయంను వెచ్చించేవారు.

తమ తపఃశక్తివల్ల పునీత హిలారియోనుగారికి అద్భుతాలు చేసేశక్తిని దైవం ప్రసాదించారు. స్వస్థలు, దయ్యాలను వెళ్లగొట్టటం వారికి నిత్యకృత్యం. అనేకమంది అజ్ఞానులు మారుమనస్సు పొంది వారి సమక్షంలో క్రైస్తవ విశ్వాస జీవితంలోకి ప్రవేశించారు. వారి సలహాలు మార్గదర్శకత్వం కోసం ప్రజలు అధికంగా రాసాగారు. వందలు వేల సంఖ్యలో ఒక తీర్థయాత్రలా జనులు వారి వద్దకు వస్తుండేవారు. తనకు ఏకాంతంగా ప్రార్థించుకునే సమయం కూడా చిక్కేదికాదు. తనను అనుసరిస్తూ తనతో పాటే తపమాచరించే శిష్యులుకూడ ఎక్కువయ్యారు. వీటన్నిపట్ల విముఖత చెందిన హిలారియోనుగారు ఎటైనా పారిపోవాలని విఫల ప్రయత్నం చేశారు. నిరాహార దీక్షకు పూనుకోవడంతో వారి అనుచరులు ప్రక్కకు తొలగి వారిని ఏకాంతంగా జీవించడానికి తమ సహకారాన్ని అందించారు. వారు ఒక మఠసభ్యులుగా జీవించినట్లు చెప్పబడింది.

పునీత హిలారియోనుగారు క్రీ॥శ॥ 360లో తమ 69 ఏట ఒకసారి తమ గురువుగారైన పునీత అంతోని ది గ్రేట్ (క్రీ|||| 356లో చనిపోయారు) గారు నడయాడిన ప్రదేశాలను దర్శింప ఈజిప్టులోని అలెగ్జాండ్రియాకు చేరుకున్నారు. ఆరోజుల్లో అక్కడ వేదహింసలు జరుగుతుండేవి. తన పై కూడ జరిగిన ఒక ప్రాణాపాయ దాడినుండి క్షేమంగా తప్పించుకో కలిగారు. లిబియాలోని ఒక ఎడారికి పారిపోయి కొంతకాలం అక్కడే రహస్య క్రైస్తవ జీవితం జీవించారు.పునీత హిలారియోను ఋషి లిబియాలో ఉండగా ప్రాంతలో అనకొండవంటి పెద్ద పాము తిరుగాడుతుండేది. అది పశువుల్ని మనుష్యుల్నికూడ అమాంతం మ్రింగి వేస్తుండేది. దీనివల్ల ప్రజలు భయకంపితులయ్యేవారు. విషయం తెలుసుకున్న హిలారియోనుగారు ఒకరోజు ఏకదీక్షతో ప్రార్థనచేసి సర్పాన్ని ప్రేరేపించి ఒక కట్టెల ప్రోగులోకి దూరిపోయేలా చేశారు. వెంటనే పుల్లల ప్రోగుకు చుట్టు అగ్ని అంటించారు. పెద్ద అరపులతో పెనుగులాడుతూ భయంకర సర్పం మాడి సెపోయింది. సంగతిని పునీత జెరోముగారు వారు వ్రాసిన చరిత్రలో పేర్కొన్నారు.

డ్రాగన్ సర్పాన్ని పునీత హిలారియోనుగారు సంహరించిన దృశ్యాన్ని ఊహించి 14 శతాబ్దంలో పేట్రేలొరెన్ జెట్టి అనబడు గొప్ప చిత్ర లేఖకుడు ఒక అద్భుత చిత్రాన్ని పెయింటింగుగా గీశారు. కాకతాళీయంగా పునీత జార్జిగారు పునీత హిలారియోన్ గారు జీవించి ఉన్న రోజుల్లోనే లిబియాలోని సెలెనునగరంలో ఒక భయంకరమైన డ్రాగన్ సర్పాన్ని సంహరించినట్లు ఇతిహాస కథలు పేర్కొంటున్నాయి. అటు పిమ్మట పునీత హిలారియోనుగారు సిసిలీ వెళ్లి అక్కడ ఋషి జీవితం గడిపారు. ప్రాంతంలో ఉన్న కొందరు వారి అనుచర మునులు గుర్తించి తిరిగి దగ్గరయ్యారు. వారిని వదిలించుకుని ఏకాంతంగా జీవించే నిమిత్తం హిలారియోనుగారు అక్కడనుండి తప్పించు కునిపోయి చాలాదూరం ప్రయాణించి యుగోస్లావియాలోని దల్మాతియా పట్టణదాపు ఎడారిలో ప్రవేశించి మరియు అక్కడనుండి సైప్రసుదీవికి చేరుకున్నారు. అక్కడే ఒక కొండగుహలో వారి 80 ఏట క్రీ॥శ॥ 371లో దివంగతులయ్యారు. వారి పవిత్రకాయం 'మజుమ' పట్టణంకు తేబడి అక్కడ సమాధి కాబడింది. పశ్చిమ దేశాల్లో పునీత టూర్పు మార్టినుగారి వలెనే తూర్పు ప్రాంత శ్రీసభదేశాలలో పునీత హిలారియోనుగారు మొదటి మతసాక్షి ఋషి గురువుగా పునీతునిగా అధికార పూర్వకంగా గౌరవ మర్యాదలు సమర్పిస్తున్నారు. హిలరీ అనగా ఉల్లాసం అని అర్థం.

Saint Hilarion was born of pagan parents near Gaza, and was converted while studying grammar in Alexandria. He renounced games, the theater and all the vain amusements of young people, to attend the reunions of his fellow Christians. He desired to see the great Saint Anthony in the desert and went to Egypt, where he remained near him for two months. He carefully observed everything in his life and conduct — his affability, his gentleness towards others and his severity towards himself, then returned to Palestine with a few solitaries to settle his affairs. His father and mother had both died, and he kept nothing of his heritage for himself. At this time he was only fifteen years old.

Despite his youth and delicate health, he retired to a desert; he practiced severe mortification, tempted continually by the demons expending all their efforts to make him abandon this life of total renouncement. He redoubled his austerities, tilled the ground and, following the example of the Egyptian monks, made baskets of reeds and willow branches. He lived first in a cabin of reeds, then in one of clay, so low and narrow that it seemed more like a tomb than a lodging for a young man. He learned all of Holy Scripture by heart and repeated it with admirable devotion. When thieves approached him one day he told them he did not fear them, because he had nothing to lose, and death did not alarm him since he was ready to die. They were so touched by his answers they promised him to abandon their life of pillage.

He soon began to work miracles by his prayers, and visitors made their way to his former solitude. Several remained nearby to become his disciples, and thus gave rise to the monastic life in Palestine, of which Hilarion is regarded as the founder. Saint Anthony esteemed him highly, sometimes wrote him letters, and sent to him the sick persons who came to him from Syria, telling them they had no need to make so long a journey. Saint Hilarion was a master exorcist and healer of all illnesses, but he refused all remuneration for his assistance, saying to his visitors from the city that they were better placed than he to distribute in alms the money they were offering him. Frequently the scattered solitaries of Palestine came to him to listen to his instructions, and he also visited them. The pagans too gathered around him. His exhortations to abandon idolatry were so powerful that on one occasion a group of Saracens promised to convert, asking him to send them a priest to baptize them and establish a church. One day, accompanied by three thousand persons who were following him, he blessed the vine of a solitary who received him. The vine furnished a triple harvest and all in the crowd were well nourished.

Saint Hilarion found his solitude transformed into a city, and decided at the age of sixty-five to go elsewhere. His Palestinian disciples attempted to change his mind without success, and taking with him only forty monks, he set out for Egypt on foot. Saint Anthony had recently died, and he wished to visit the places where he had dwelt. After spending some time in Egypt, he went with only two religious to a village a few days' distance from Babylon. He remained only a short time there also, afterwards going elsewhere, and everywhere assisting those who had recourse to his prayers. In Sicily he delivered a demoniac, and then a crowd came to surround him once again. In Dalmatia he worked still more miracles, and saved a city from being engulfed by tidal waves raised by an earthquake. These traditions are still alive in the regions where he passed. He tried many times to live unknown but never could succeed.

Saint Hilarion died in 372 on the island of Cyprus, at the age of seventy years. His last words were: Go forth, my soul; why dost thou doubt? Nigh seventy years hast thou served God, and dost thou fear death? His body was found incorrupt some time afterwards, and was transported to Palestine to his original monastery. Saint Jerome was his original biographer.

Add new comment

2 + 1 =