SAINT OF THE DAY – OCTOBER 20 పునీత బెర్తిల్లా |ST. BERTILLA BOSCARDIN

ఇటాలియా కన్య స్త్రీ, నర్సు, మతసాక్షి క్రీ||శ|| 1888 - 1922.పునీత బెర్తిల్లమ్మగారు బాలయేసుని పునీత తెరేసమ్మ (లీసియక్సు లేక చిన్న తెరేసమ్మ) గారి 'చిన్నిమార్గం' అనుసరించిన కన్య స్త్రీ. మంచి ఆరోగ్య సౌష్ఠవంఉంది. కొద్దిపాటి తెలివితేటలున్నా అంతగా ముందుకు దూసుకువెళ్లే దూకుడుతనం లేదు. హెచ్చుతగ్గులు లేని స్థిర నిర్ణయాలు, స్థిర మనస్సుగల మహిళామణి. పరిశుద్ధతను నూరుశాతం కాపాడుకుంటు మిక్కిలి నమ్రతతో తన అనుదిన బాధ్యతలను నెరవేర్చి పిట్ట కొంచెము కూతఘనము అన్నట్లు మంచి పేరుతెచ్చుకున్న ఉన్నత వ్యక్తి.

అట్టి ఈ మహనీయురాలు ఇటలీలోని ట్రెందోల ఊరిలో పేదరైతు కుటుంబంలో క్రీIIశ|| 1888లో జన్మించారు. జ్ఞానస్నానంలో అన్ని ఫ్రాన్సెస్ అని నామకరణం చేయబడి 'అన్పెట్టా' అని ముద్దుగా పిలువబడేవారు. తమ ఇంటో పనిచేసుకుంటు వేరొక ఇంటిలోకూడ సేవకురాలిగా పాచిపనిచేసి పెట్టి తమ కుటుంబ పోషణ కోసం కొంత ధనాన్ని సంపాదిస్తూ పాఠశాలకు వెళ్లి చదువుకునేవారు. నెమ్మది స్వభావంగల బెస్ట్రాల్లమ్మగారిలోని అంతరంగాన్ని చదివి ఆ యముకు దైవపిలుపు ఉందని విచారణ చిన్నస్వామి ఫాదర్ డాన్ కపొవిల్లగారు మొదట బయట పెట్టారు. వారి మాటకు పెద్దస్వామి ఫాదర్ గ్రెసె గారు నవ్వి ఊరుకున్నారు కాని చిన్న స్వాములవారు ప్రయత్నించి ఆ బాలకను ఒక కాన్వెంటులో తీసుకొమ్మని కోరగా వారు కొన్ని కారణాలవల్ల అంగీకరించలేదు.

కాని అన్నిట్టాగార్కి 16 సం||ల ప్రాయంలో వైసెంజా పట్టణంలో చెల్సమ్మ మఠశ్రేష్ఠులుగా ఉన్న పునీత డోరతి కన్య స్త్రీల సభలో ప్రవేశం పొందారు. బెరిల్లమ్మగా క్రొత్త పేరును స్వీకరించారు. కన్య స్త్రీగా మారిన సిస్టర్ బెర్తిల్లా బొస్కార్టీనుగారు మొదట కాన్వెంటులో ఇంటిపని వంటపని చాకలిపని చేస్తూ తెలిసొపట్టణంలో వైద్య సహాయకురాలుగా 'నర్సు' పని నేర్చుకునేవారు. అక్కడ వారిసభవారికి ప్రత్యేకింపబడిన ఒక మున్సిపలు వైద్యశాల ఉండేది. ఈ వైద్యశాలలోకూడ వంటపని చూసుకునే బాధ్యత సిస్టర్ బెస్ట్రాల్లాగారికే ఉండేది. తీరిక వేళల్లో మాత్రం పిల్లలవార్డులో సేవలందించడానికి పురమాయింపబడ్డారు.

సిస్టర్ బెర్తిల్లాగారు క్షణం తీరిక లేకుండా బొంగరంలా తిరుగుతూ తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే ప్రార్థన ఉపవాసం ధ్యానంను మరచేవారుకాదు. ఏసును తన జ్ఞాన భర్తగా వేడుకునేవారు. వైద్యశాలలో రోగులుగా ఉన్న పిల్లల్ని తల్లిలా పరామర్శించి మందులు వేస్తుండేవారు. వారిని వారి ప్రక్కల్ని శుభ్రపరస్తుండేవారు. అధిక పనివల్ల బెర్తిల్లమ్మగారుకూడ వ్యాధిగ్రస్తులయ్యారు. క్రీ||శ|| 1910లో తమ 22వ ఏటనే ఆ యమ్మ రోగంతో కొంత సేపు బాగున్నా ఎక్కువ సేపు శారీరక నొప్పులతో బాధపడేవారు. కాని సర్వస్వం ఆ ఏసు ప్రభువే అని నమ్మేవారు. ఆ నొప్పులే దేహంలో దీర్ఘవ్యాధిగా మారి శస్త్ర చికిత్స చేయబడినాగాని వ్యాధికుదరక క్రీ||శ|| 1922 అక్టోబరు 10న తమ 34వ ఏటనే దేహంతులై తాము నమ్మిన ప్రభువు చెంతనే చేరుకుని సంతోష కిరీటధారి అయ్యారు.

బెరిల్లమ్మగారి మొదటి వర్ధంతి త్రివిసొ వైద్యశాలలోనే ఏర్పాటుచేయబడగా ప్రజలు విరివిగా హాజరై శ్రద్ధాంజలి ఘటించారు. త్రివిసొలో మొదట సమాధిచేయబడిన వారి పవిత్ర మృతదేహం తర్వాత వైసెంజా మఠానికి మార్చబడి అక్కడే సమాధికట్టడం నిర్మింపబడింది. ఈ రెండు ప్రదేశాలకు కూడ ప్రజలు అధికంగా హాజరై ఆయమ్మ పట్ల తమ భక్తి అభిమానాన్ని చాటారు. “పుణ్య జీవితానికి ఎన్నుకోబడిన ఆత్మ సిస్టర్ బెర్తిల్లా బొస్కార్డీను. ఇక్కడే వ్యాధికి గురియై నిజమైన ఒక దేవదూతలా మానవ బాధను భరించి ఎన్నో ఏండ్లు గడిపిన వీరోచిత దీనురాలు అని ప్రసంగీకులు నివాళి అర్పించారు.

బెర్తిల్లా బోస్కార్టినమ్మగార్కి క్రీ॥శ|| 1952లో 'ధన్యతా' పట్టా ఇవ్వబడగా ఆ సమావేశానికి ఆ యమ్మ బంధుమిత్రులు, ఆ యమ్మ చేతుల మీదుగా వైద్యసాయమందుకున్న అనేక మంది ప్రజలు హాజరై తమ ధన్యవాదాలర్పించు కున్నారు. క్రీ॥శ|| 1961లో 23వ పోప్ జాన్ గారు పునీత పట్టాను ప్రధానం చేసి శ్రీ సభను గౌరవించారు.బెర్త అంటే ప్రకాశించు వెలుగొందు అని అర్థం. నేడు ప్రపంచ ఆస్టియో పారాసిస్ డే. కాల్లియం సాంద్రత తగ్గిపోవడం వల్ల ఎముక కోడిగ్రుడ్లు పొలుసుమాదిరిగా బలహీనంగా తయారు కావడాన్నే, ఆస్టియో పారాసిస్ అంటారు. ఎముకడొల్ల లేక డోలు వ్యాధి అని దీనినంటారు. ఎముకల బలహీనత నివారణకు.

Anna Francesca Boscardin was born October 6, 1888 in Brendola, Italy. She lived a very difficult childhood in a poor peasant family with a violently abusive alcoholic father. She had very little education, and worked as a house servant as a girl and was considered not to be very intelligent. Her family nicknamed her “the goose” due to her lack of intelligence. However, things changed somewhat when she entered the Sisters of Saint Dorothy, Daughters of the Sacred Heart in 1904, taking the name Bertilla. After working in the convent’s kitchen and laundry for three years, she trained as a nurse.

She worked in the children’s ward of the sisters’ hospital in Treviso, and quickly became the children’s favorite due to her simple and gentle way. She cared for wounded Italian soldiers during World War I, even staying with patients while the area was being bombed. An envious supervisor reassigned Bertilla, now popular among the patients, to the hospital laundry. When her mother-general heard of this, she made Bertilla head of the children’s ward in 1919. Bertilla died three years later of cancer.She was canonized in 1961 by Pope John XXIII before a crowd that included many of her former patients, and many miracles have been reported at her tomb.

Add new comment

1 + 15 =