SAINT OF THE DAY – October 2 పవిత్ర కావలి సన్మనస్కులు | HOLY GUARDIAN  ANGELS

(ఒక్కొక్క మనిషిని ఆత్మ శరీర ఆపదలనుండి కాపాడుతూ మంచి పనులనే చేయుటలో సాయపడే కావలి దేవ దూతలను జ్ఞాపక పరచుకొనుట - 16వ శతాబ్దము) ఈ భూమిని మనిషిని సృష్టింపక మునుపే భగవంతుడు లెక్కలేనన్ని ఆత్మలి కలిగించారు. వీరినే దూతలు లేక సన్మనస్కులు అని బైబిలు పలుకుతుంది. ఈ జీవముగల శరీరములేని ఆత్మలకు స్వాభావికంగా చావులేదు. పరిశుద్ధమును సుఖమునైన

స్థితిలో సృష్టింపబడిన ఆత్మలువారు. దేవునియందే ఆనందించువారు. దేవుడు ఉన్నది మోక్షంలో. ఆ మోక్షమే వారికి బహుమానంగా ఇవ్వబడింది. స్వేచ్ఛాజీవులుగా దేవుని సదా సేవించుటయేవారి విధి. పిత పుత్ర పవిత్రాత్మ దేవునిలోని పుత్రుడు ఏసుక్రీస్తుగా భూలోకంలో శరీరధారియై యున్నాగాని దైవ సమానుడు. దేవుడే కాన సదాస్తుతి మహిమ ఆరాధనలకు పాత్రుడే. ఈ విషయం దైవం సన్మనస్కులకు ముందుగా ఎరిగించారని నమ్ముతున్నాం. ఆ సందర్భంలోనే లూసిఫరు అనబడే ఆత్మ నాయకత్వంలో కొన్ని ఆత్మలు శరీరధారి రూపదేవుని కొలువ తిరస్కరించారు. తామును చావులేని శాశ్వత సుఖ జీవులని, సౌందర్యములోను ఆనందములోను కొదువలేని వారలని, దేవుని విధేయించి సేవించుటయే విధిగా ఉండాల్సిన పనిలేదని తాము స్వేచ్ఛా జీవులమని గర్వముతో నాట్యమాడారు. అంతే దేవుని కోపాగ్నికి గురియై వారికి బహుమానంగా ఇవ్వబడిన మోక్షంనుండి గెంటివేయ బడ్డారు. దేవుడు దయచేసిన స్వర్గపుణ్యాలైన పరిశుద్ధత (సౌందర్యము), సుఖము (ఆనందము) తొలగింపబడి దైవ శాపానికి గురికాగా ఆ దుష్టాత్మలు దేవునితో సమరానికి దిగారు. మిఖాయేలు దూత నాయకత్వంలో లూసిఫరు దాని అనుచర ఆత్మలు ఓడింపబడి మోక్షంనుండి కూల్చివేయబడ్డాయి. వారినే సైతానులు పిశాచములని పిలుస్తాం. వారి నివాసం కోసం దేవుడు నరకం అనే లోకాన్ని సృష్టించారు.విధేయులైన ఆత్మల (దూతలు లేక సన్మనస్కుల)కు తనను సదా దర్శించుకొని లేక చూడ కలిగే భాగ్యాన్ని వరాన్ని దేవుడు అనుగ్రహించారు. పవిత్ర గ్రంథం చెప్తున్న.

అందుకే వారు ఏంజిల్స్ అనగా 'దూతలు' లేక దూతల'ని పిలువ బడుచున్నారు. వీరంతా రమారమి పది లక్షల మంది ఉండచ్చని వేదపండితులన్నారు. హిప్సోనగర పునీత అగస్తీనుగారు “దీన యాత్రికులమైన మనపట్ల సన్ననస్కులు జాగ్రత్తగా చూస్తుంటారు. మనపై జాలి చూపుతుంటారు, దేవుని ఆజ్ఞ చొప్పున వేగిరమున మనకు సాయమందిస్తుంటారు. మనకు ఇష్టమైన చోటకు ఎక్కడకు వెళ్లినా వారు మనకు తోడుగా ఉంటారు.” అని పలుకుచున్నారు. ఇక పునీత జెరోముగారు. “మానవుని ఆత్మ మిక్కిలి పరిశుద్ధంగా ఉండటం గౌరవ ప్రదమైనది. అందుకే అది జీవంపోసుకున్నది మొదలు ఒక్కోమనిషికి కావలి సన్మనస్కుని దేవుడు ఏర్పరచారు.” అంటున్నారు. అయితే పునీత బ్నెర్డుగారు “పరిశుద్ధ సన్మనస్కులను నీ స్నేహితులుగా చేసికో మనం ఎంత బలహీనంగా ఉన్నా, మన పరిస్థితి ఎంత విచారకరంగా ఉన్నా, ఎంత పెద్ద ఆపదలు చుట్టుముట్టి ఉన్నా ఈ కాపలి సన్మనస్కుల సంరక్షణలో మనం ఏ మాత్రం భయపడనక్కరలేదు” అని వక్కాణిస్తున్నారు.

కావలి సన్మనస్కులు మన ఆత్మ శరీరాల్ని అన్ని రకాల అపాయాలనుండి కాపాడతారు. సైతాను శోధనలను జయింప ప్రేరణ ప్రోత్సాహ సహాయాలందించి ఆదుకుంటారు. ముఖ్యంగా మరణావస్థలో, దేవుని సేవలో సదాలోచనలు, సర్రియలను చేయ ప్రేరేపిస్తారు. రాబోయే ఆత్మ కీడుల విషయమై హెచ్చరికలు చేస్తారు. దేవుని సింహాసనం ఎదుటకు గొంపోతారు. మనల్ని తమ సొంతమైన వారిగా భావించి కలసిపోతారు. మరణానంతరం మన ఆత్మలను ఉత్తరంచు స్థలం చేర్చ మార్గం చూపుతూ నడిపింప జేస్తారు. పాపాలన్నీ ప్రాయశ్చిత్తమై విశుద్ధ పరచబడిన పిమ్మట మన ఆత్మలను మోక్ష ద్వారం చెంతకు చేర్చుతారు. దేవుని తీర్పు సింహాసనం వద్దకు చేర్చేటంత మట్టుకే వారు తోడ్పడతారు.కావలి సన్మనస్కులైనట్టి వారు ఎంతోమంది పునీతులకు ప్రత్యక్షమై వారితో సంభాషించడం జరిగింది. రోమునగర పునీత ఫ్రాన్సెసమ్మగారు వారి మాటల్లో "దేవదూత ఆకారము కనబడురీతి ఎంతో మధురంగాను తేజస్సుతోను నిండి ఉంటుంది. గాజు వస్త్రంవలె ఉండు ఆ దేవదూత పరలోక పరిశుద్ధతను మాటల్లో వర్ణింపలేము. వారి ఒకే ఒక్క చూపు మన ఆత్మ ఉగ్రమైన భక్తి జ్వాలను రగిలింప జేస్తుంది" అని చెప్తున్నారు.పునీత బెర్నార్డుగారు విశ్వాసులకు ఇచ్చిన తమ ఉపదేశంలో ఇలా పేర్కొన్నారు. “నీ కావలి సన్మనస్కుని ఆదరించు. నీ భద్రతపట్ల చూపిన జాగరూకతకు కృతజ్ఞత చూపించు. వారి పై నమ్మికఉంచు. ప్రేమించు. ప్రతి కష్టంలోను, కీడులోను, శోధనలోను వారివైపు మరలి వారి సంరక్షణ సహాయానికై ప్రార్ధించు".

God does not abandon to what we call chance, any of His creatures. By His essence and providence He is everywhere present; not a sparrow falls to the ground, nor a hair from our heads, without His consent. He is not content, however, with assisting His creation daily and at every moment, with sustaining His handiwork, which without His continuous support would return to dust. His divine and infinite Love, not only maintaining the existence which He gives and perpetuates in living beings, has charged His Holy Angels with the ministry of watching and safeguarding each one of His rational creatures.The Angels, divided into nine hierarchies, have varied obligations. Their intelligence and prudence are penetrating like the beam of a lighthouse; so it appears even when we compare it to the best of human intelligences, which are like the light of a little candle in contrast. An Angel, visualizing an end to be attained, sees instantly the means necessary to achieve it, whereas we must pray, study, deliberate, inquire, and choose during many phases of effort, in order to reach our proposed ends.

Kingdoms have their Angels assigned to them; dignitaries of the Church and of the world have more than one Angel to guide them; and every child who enters into the world receives a Guardian Angel. Our Lord says in the Gospel: Beware lest you scandalize any of these little ones, for their Angels in heaven behold the face of My Father. Thus the existence of Guardian Angels is a dogma of the Christian faith, based on Holy Scripture itself.#rvatelugu #rvapastoralcare #saints

Add new comment

4 + 14 =