SAINT OF THE DAY – OCTOBER 19 పునీత అల్సంతర పేతురు | St. Peter of Alcantara

గురువు, మఠాధిపతి, వేదసాక్షి (క్రీ.శ.1499 - 1562) ఈయన స్పెయిను దేశంలోని ఎస్త్రి మదుర ప్రాంతంలో అల్సంతర నగరం నేలుచుండిన గవర్నరు గరవిటో కుమారునిగా క్రీ.శ. 1499లో ఉద్భవించాడు. స్థానికంగా ప్రాథమిక విద్య గడించి న్యాయశాస్త్ర విద్య కొరకు సలమాంక విశ్వవిద్యాలయంలో చేరాడు. కాని అతని దృష్టియంతయు ఆధ్యాత్మిక సన్యాసి జీవితంపై నిమగ్నమైయుండేది. ప్రాపంచిక విషయములు రోతగాను వ్యర్థంగాను అనిపించేవి. అందువల్ల క్రీ.శ. 1515లో తన 16వ ఏట అన్ని చదువులు విడిచి పెట్టాడు. తన ఆస్తినంతటిని అమ్మి పేదసాదలకు పంచి పెట్టాడు.

పిమ్మట మంజెరెట్సు పట్టణంలో ఉన్న ఫ్రాన్సిస్కను సన్యాసుల ఆశ్రమంలో ప్రవేశం పొందాడు. క్రీ.శ. 1521లో తన 22వ ఏట బదజోజు పట్టణంలో ఒక సన్యాస ఆశ్రమమం స్థాపించుటకు పంపబడినారు. క్రీ.శ. 1524లో తన 23వ ఏట తన చిరకాల వాంఛి తమగు గురుపట్టంతో అభిషేకింపబడినారు. ఎస్తె మదుర ప్రాంతమంతటా పర్యటించి వేదవ్యాప్తితో తన గురుత్వ సేవలందించాడు. ఉత్తమ బోధకుడుగా ఆదర్శవ్యక్తిగా, పేదల పక్షపాతిగా పేరు గడించాడు.

పిమ్మట రొబ్రెడిల్లో, షెనెన్నియ, లాపా పట్టణాల సన్యాసాశ్రమాలకు మఠాధిపతిగా సేవలందించాడు. ఆ పదవికి స్వస్థి పలికి పోర్చుగల్ లోని 3వ యోహాను రాజు ఆస్థానంలో కొంతకాలం గౌరవ గురుత్వ సేవలందించాడు. క్రీ.శ. 1538లో తన 37వ ఏట ఎ౧మదురలోని పునీత గెబ్రియేల్ ప్రాంతంకు ఎన్నుకోబడిన మంత్రిగా పనిచేశాడు. ఆ రోజులలో సన్యాసులందరు పాటింపవలసిన కఠిన నియమావళిని ప్రవేశ పెట్టాడు. ఇందుకు ప్లనెన్సియ మఠసన్యాసుల నుండి పెద్ద వ్యతిరేకత వచ్చుటతో తన మంత్రి పదవికి రాజీనామా చేశాడు. పోర్చుగల్లు అరణ్యంలోకి వెళ్లి ఒక సామాన్య సన్యాసి జీవితం జీవింపసాగాడు.

పేతురు పవిత్ర జీవితం, పేదరికం, పరిమితాహారం, సన్యాసి ఆదర్శ జీవితం ఆ కొండ ప్రాంత మునులను ఆకట్టుకొంది. వారు అనేక చిన్న చిన్న సంఘాలుగా నుండిరి. వారి కోరిక పై వారికి అధిపతిగా మార్గదర్శిగా పనిచేశారు. క్రీ.శ. 1555లో ఆఫీసును సభ నిబంధనలనే మరికొంచెం కఠినతరం చేసి తన అనుచరులందరిని ఒకే సంఘంగా ముందుకు నడిసించాడు. వీరినే అల్బంతర పేతురు మట సన్యాసులుగా పిల్చుట జరిగింది.

క్రీ.శ. 1560లో తన 59వ ఏట ఈయన అవిలాపురి పునీత తెరేసమ్మను కలసి ఆమెకు తన మత జీవిత విశేషాల్ని వివరించాడు. అందువల్లనే ఆమె తన పుస్తకంలో ఈయన గురించి వ్రాస్తూ "ఇది మానవ మేథస్సుకు అందనంత గొప్ప ఎకేషం. ఈ మఠాధిపతి గది ఇరుకుగా ముడుచు కొని పడుకోవలసినదగా ఉంది. మూడు రోజులకొకసారి మాత్రమే భోంచేసేవాడు. ఈయన కఠినతర సన్యాసి జీవితం ఎందరికో మాతృకయైనది. స్పెయినుదేశ నలుమూలలకు వ్యాపించింది. అని పేర్కొన్నారు.

దేవుడు పేతురుకు ప్రవచన వరం అనుగ్రహించాడు. అద్భుతాలు చేయటం, దైవధ్యానంలో నిలకడగా ఉండటం, మైమరచి తపస్సుచేసి దైవాశీర్వాదాలు పొందటంలో ఆదర్శ గురువయ్యాడు. పునీత ప్రాంచీసు బోర్జియా ఈయనకు ఆప్తమిత్రుడు. పునీత అవిలా తెరేసమ్మ ఈయనను గౌరవించి ప్రోత్సహించు రీతిగా ఈయన వ్రాసిన మఠ నియమావళిని తన కార్మెలైటు మఠకన్యలకు వర్తింపజేశారు. అల్సంతర పేతురు మోకరించి దేవుని ప్రార్థిస్తేనే ఎ౧మదుర మఠాలయంలో 1562 అక్టోబరు 18న తమ తుదిశ్వాస విడిచాడు. ఆయన నిత్య విశ్రాంతి కోసం వెళ్లారు" అని అవిలా తెరేసమ్మ శ్లాఘించారు.

ప్రార్ధన గురించి పునీత అల్సంతర పేతురు వ్రాసిన గ్రంథము అనేక ఇతర భాషలలోకి తర్జుమా చేయబడి ప్రసిద్ధి చెందాయి. ఈ ప్రార్థలన్ని పునీత ఫ్రాన్సిసు సాలెసు అధికంగా వాడుకున్నారు. క్రీ.శ. 1669లో 9వ క్లెమెంటు పోపుగారిచే పునీతపట్టాతో గౌరవింపబడగా 1862లో బ్రెజిలు దేశ పాలక పునీతునిగా ప్రకటింపబడి వందింపబడుచున్నారు. ఈయన రాత్రి జాగరణలతో అధికంగా ప్రార్థించే వారికి, రాత్రుళ్ళు నిద్రకాని కాపలాకాయు నైట్ వాచ్ మెను పాలక సంరక్షుడయ్యాడు. పీటరులేక పేతురు అను గ్రీకు భాషాపదంకు శిల, రాయి అర్థం.

Saint Peter was born in 1499 near the Portuguese border of Spain. While still a youth of sixteen, he left his home at Alcantara and entered a convent of Discalced Franciscans near Valencia. He rose quickly to high posts in the Order, as a guardian, a definitor, and then Superior of the Province of Saint Gabriel. But his thirst for penance was still unappeased, and in 1539, being then forty years old, he founded the Congregation of Saint Joseph of the Strict Observance, to conserve the letter of the Rule of Saint Francis. He suffered great tribulations to conserve that Rule in its integrity. Eventually Saint Peter himself, the year before his death, raised it to the status of a province under obedience to the Minister General of the entire Seraphic Order. The Reform he instituted has since been extended even to the farthest Orient and the Indies; it is believed God ordained that it repair the ravages to the faith of the sixteenth century.

The modesty of Saint Peter remains proverbial in the Franciscan Order; never did he raise his eyes to look at the non-essentials of his interior life with God. His fast was constant and severe; he lived perpetually on bread and water alone, even during his illnesses. He devised a sort of harness to keep him upright on his seat during the short hour and a half of sleep which he took every day, for forty years. He acknowledged to Saint Teresa of Avila that this mortification was the one which cost him the most. The cells of the friars of Saint Joseph resembled graves rather than dwelling-places. That of Saint Peter himself was four and a half feet in length, so that he could never lie down; his sackcloth habit and a cloak were his only garments; he never covered his head or feet. In the bitter winter he would open the door and window of his cell in order that, by closing them again, he might be grateful for the shelter of his cell. Among those whom he guided to perfection we may name Saint Teresa, who fully appreciated this remarkable director. He read her soul, approved her spirit of prayer, and strengthened her to carry out her reforms.

Everywhere he could do so, he planted crosses, for the Passion of Our Lord was engraved in his heart. Wherever they were to be placed, even on mountains, and however heavy they might be, he went to the destined sites carrying them on his shoulders. From these heights he would then preach the mysteries of the Cross, afterwards remaining in prayer there. Shepherds saw him several times in the air, at the height of the highest trees of the forests. Never did he go anywhere except on foot, even in his old age. He was often seen prostrated before a large crucifix, shedding torrents of tears; and he was found in ecstasy once at the height of the traverse of a crucifix. Saint Peter died at the age of sixty-three, repeating with the Psalmist, I rejoiced when it was said unto me, let us go unto the house of the Lord! The date was October 18, 1562; he was kneeling in prayer.

Add new comment

2 + 4 =