SAINT OF THE DAY – OCTOBER 17 పునీత అంతియోకు ఇన్యాసి|ST. IGNANTIUS OF ANTIOCH

(పీఠాధిపతి, లేఖకుడు, వేదసాక్షి, ఆది క్రైస్తవ ఆచార్యుడు క్రీ||శ|| 55 - 117)ఇన్యాసి లేక ఇగ్నేషియస్ లేక ఇన్నయ్యగారు సిరియా ప్రాంతవాసి. వీరు సుమారు క్రీ||శ|| 55లో జన్మించినట్టు తెలియ వస్తుంది. జన్మతః వీరి పేరు తియోపోరస్. అపోసులుడును, సువార్తీకుడైన పునిత యోహానుగారికి వీరు మంచి శిష్యులు. అసలు సిరియాలోని అంతియోకు నగరానికి స్వయంగా మన తొలిపోపు అపోస్తలుడు పునీత పేతురుగారు పీఠాధిపతిగా ఉన్నారు. వీరి తర్వాత ఎవోడియ గారు పనిచేశారు. వీరి అనంతరం పునీత ఇన్యాసిగారే అంతియోకు పీఠానికి కాబోయే పీఠాధిపతియని జగద్గురువులు పునీత పేతురుగారే ముందస్తుగా నిర్ణయించారు. పైగా ఇన్యాసివారు 40 సం||లు ఆదర్శవంతమైన సువార్తా సేవ చేస్తారని భవిష్యత్తు విన్పించారు కూడా. అట్లే పునీత ఇన్యాసివారు అంతియోకు నగరానికి మూడవ పీఠాధిపతి అయ్యారు.

ఆ రోజుల్లో యూదులు, విగ్రహారాధకులు క్రైస్తవుల పై పగబూని ఉన్నారు. మత ద్రోహులుగా నిర్ణయించి హింసించి ప్రాణాలు తీస్తున్నారు. దోమిషియన్ (దొమితియన్) చక్రవర్తి ఏలుతున్న రోజుల్లో అనగా క్రీ||శ|| 81 నుండి 96 వరకు క్రైస్తవులపై హింస అతి దారుణంగా ఉండేది. క్రైస్తవులు భక్తి విశ్వాసాలనుండి తొలగిపోకుండే నిమిత్తం బిషప్ ఇన్యాసిగారు క్రైస్తవుల్లో తిరిగి ధైర్యం చెప్పి వారిని దృఢపరిచారు. తన అనుదిన ప్రార్థన, ఉపదేశం, ఉపవాసంతో తన చిన్నమందను కాపాడుకున్నారు. దొమిషియాన్ చక్రవర్తి తరువాత సార్వా చక్రవర్తి పాలించాడు పదిహేను మాసాలు హింసలు తగ్గాయి. ఆ పిమ్మట ట్రాజన్ చక్రవర్తి పాలనకు వచ్చాడు. ఈయన కాలంలో వేదసాక్షి మరణాలు అత్యధికమయ్యాయి. తను నమ్మే దేవుళ్ల విగ్రహాల్ని పూజించని క్రైస్తవులను చంపేయమని, క్రైస్తవుల పై ఏ చిన్న పిర్యాదువున్నా హతమార్చమని తన నల్ల సముద్ర ప్రాంత గవర్నరును ఆదేశించాడు.

ఈ ట్రాజన్ చక్రవర్తి క్రీ||శ|| 115లో ఇన్యాసిగారిని బంధీని గావించాడు. “ఎవరు నువ్వు ? దుష్టాత్మవా, నా ఆజ్ఞలనే ధిక్కరించి ఇతరలను ప్రోత్సహించి క్రైస్తవులుగా మారుస్తావా ? వారిని నాశనం పట్టిస్తావా ?” అన్నాడు. అందుకు ఇన్యాసిగారు ఎగేసియా, త్రల్లెస్ వంటి ఆసియా మైనరు ప్రాంత పురాతన నగరాల క్రైస్తవులును కంగా వారిని కలుసుకున్నారు. ఆయా సంఘాలకు వ్రాసిన లేఖలను వారి పతినిధులకు అందజేశారు. ఇన్యాసిగారు తమ సందేశాలలో “క్రైస్తవులందరు రాధిపతులు గురువులతో సఖ్యతకలిగి, ప్రార్థన సమావేశాలు తరచు జరుపుకుంటు ఐదువులె దీనులై వినయ విధేయతలతో కష్టగాయాలను ధిక్కరించక భరించుడ”నియు వారి ఉత్సాహాన్ని శ్లాఘిస్తూ, “శ్రీసభ విరోధుల అభూతకల్పనల బోధలకు మోసపోక, భిన్నమతావలంబికులు కాకుండా విశ్వాసులై తరించండని" ఉద్భోధించారు.

అలాగే పునీత ఇన్యాసిగారు వ్రాసిన ఏడు లేఖల్లో ఒకటి రోమునగర విశ్వాసులకు వ్రాసింది. అందువారు తన వేదసాక్షి మరణాన్ని నిలుపుదలచేసే ప్రయత్నాలేమీ చేయవద్దని అర్ధించారు.రోములో అప్పటికే ఎంతో ధనవంతులు పలుకుబడిగలవారు క్రైస్తవులుగా ఉన్నారు. తన శిక్షను తగ్గించే ప్రయత్నాలేమీ చేపట్టవద్దని వారిని కోరారు. ఎట్టకేలకు వీరు ప్రయాణిస్తున్న ఓడ ఇటలీ తీరాన్ని చుట్టి ట్రోస్, నేపుల్స్ రేవులను దాటి రోమునగరం చేరుకుంది. వీరు సుమారు క్రీ||శ|| 117 డిసెంబరు 20న పవిత్ర రోములో కాలిడినారు. విశ్వాసులు తండోపతండాలుగా వచ్చి ఇన్యాసివారిని కలసికొని మహదానందపడ్డారు. కాని వారిని కోల్పోబోతున్నారని తమ ప్రగాఢ సంతాపం వెలుబుచ్చారు. విడిపిస్తామని ఉర్రూతలూగారు. ఇన్యాసిగారు వారిని ఓదార్చుతూ తనను విడిపించే ప్రయత్నాలు మాత్రం చేయవలదని బ్రతిమాలారు. తన యెడల సానుభూతి చూపిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇన్యాసివారు క్రూరజంతువులకు బలికాబోయేముందు “నా విశ్వాసం కోసం మరణించేందుకు ఆతురతగా ఉన్నాను” అని వెల్లడించారు. “నేను ప్రభువుయొక్క గోధుమగింజను. ప్రభువైన ఏసుక్రీస్తుకు స్వచ్చమైన ఆహారంగా మారేందుకు సింహాల పండ్లచేత పిండికాబడాలి” అనేమాటల్ని వారి ఉత్సవం రోజున నిర్వహించే బలిపూజ ప్రార్థనలో శ్రీసభ పొందుపరచింది. ఏసు నామాన్ని వారు ఉచ్చరిస్తుండగా ఆకలితో నకనకలాడే రెండు క్రూర సింహాల్ని 'కొలొస్సెయుమ్' బోనులోనుండి ఆ నిస్సహాయ మహనీయుని పైకి వదలివేశారు. ఆ మరుక్షణమే ఇన్యాసివారి శరీరంను వేడి నెత్తురు చిమ్ముతుండగా ప్రాణం అనంతవాయువుల్లో కలసిపోయింది. ఆ విధంగా వారు తమకు వేదసాక్షి మరణం కావాలని కోరుకున్న దైవ ప్రార్థన ఆలకింపబడి నట్లయ్యింది.

అంతియోకు నుండి ఇన్యాసివారితో అనుసరించిన ఇద్దరు శిష్యులు వారి సహసో పేతమైన వేదసాక్షి మరణాన్ని గ్రంథస్తం చేసినట్లు చరిత్ర వివరిస్తుంది. వారు ఇన్యాసివారి అవశేషాల్ని ప్రోగుచేసికొని అంతియోకుకు చేరుకున్నారు. అక్కడే ఖననం చేసి ప్రజలందరితో కలసి కొనియాడినారు. ఆ వేదసాక్షిని మరో మూడువందల ఏండ్ల పిమ్మట పునీత జెరోముగారు అంతియోకును దర్శించినప్పుడు ఇన్యాసి వారి అవశేషాల్ని డాఖి నిగేటు బయట ఒక సమాధుల దొడ్డిలో భద్రపరచబడినట్లు పేర్కొన్నారు. క్రీ||శ|| 637లో ఈ అవశేషాల్ని రోమాపురికి గొనిపోయి అక్కడ పునీత క్లెమెంటుగారి దేవళంలో భద్రపరచినట్లు చెప్పబడింది.

ఏసుప్రభువు మోక్షారోహణమైన తరువాత కన్యమరియాంబ తల్లి సువార్తికుడైన యోహానుగారి సంరక్షణలోనే ఉండేవారు. ఈ యోహానుగారి శిష్యుడైన పునీత ఇన్యాసిగారు మరియమాతతో విశ్వాసం విషయమై ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపినట్లు తెలియవస్తుంది. రోమునగరానికి తమ వేదసాక్షి మరణయాత్ర సమయంలో వేరు వేరు సంఘాలకు వ్రాసిన లేఖల్లో లభ్యమైన ఏడు లేఖలనుబట్టి ఇన్యాసివారు క్రీస్తు దైవశాస్త్రం, శ్రీసభ రాజ్యంగం, క్రైస్తవ జీవితాచరణం గూర్చి నిర్వచించారు. క్రీస్తు మోక్షారోహణమైన పిమ్మట 85 సం||లకు నూతన నిబంధన లేఖలకు దీటుగా లేఖలు వ్రాసినవారు పునీత ఇన్యాసివారే. కన్యమరియ నిష్కళంక ఉద్భవం, త్రియేక దైవ సిద్ధాంతంగూర్చికూడ వక్కాణించారు. క్రీస్తు స్వభావం గూర్చి మాట్లాడుతూ “శరీరము ఆత్మకు సంబంధించి ఒక వైద్యుడు. వారు జన్మించినవారు మరియు జన్మింపనివారు. నరావతారియైన దేవుడు.

మరణంద్వారా నిజజీవితం చూపినవారు కన్యమరియ కన్నకుమారుడు నిజ దేవుని నిత్యపుత్రుడు. మొదట శ్రమలతో మరణం పొందారు పిమ్మట మరణాన్ని శాశ్వతంగా జయించారు. వారే మన ప్రభువైన ఏసుక్రీస్తు" అని వ్రాశారు ఇన్యాసిగారు దివ్యసత్రసాదంగూర్చి “క్రీస్తు శరీరము దైవ ప్రసాదము. నిత్య జీవ ఔషధము” అన్నారు. శ్రీసభ యెడల పీఠాధిపతులయెడల వినయము విధేయత చూపడం మన నిజ అపోస్తోలిక ఆచారం అన్నారు.ఇన్యాసిగారు స్మిర్నా వాసులకు వ్రాసిన లేఖలో “క్రీస్తు అని చెప్పబడిన చోటల్లా “కతోలిక శ్రీసభ” అని కూడా మొదటిసారిగా వాడారు. “కతోలిక” అనగా “సర్వజన సమ్మతమైన విశ్వమునకు చెందిన” అని అర్ధం. అందుకే 'విశ్వ శ్రీసభ' అందరికి ఆమోదయోగ్యమైన ఈ లోకంలో యాత్రచేయు దైవసభగా పేర్కొనబడుతుంది. గొంతు సంబంధమైన రోగాలు వచ్చినప్పుడు వీరిని ప్రార్థిస్తే ఉపశమనం కలుగు తుందని భక్తుల విశ్వాసం. ఇన్యాసి అనగా మండే అగ్ని, రగిలే జ్వాల ఆరని మంట, శిఖవెలుగు అని అర్థం.

Saint Ignatius, Bishop of Antioch, was the disciple of Saint John the Evangelist. Believing that the Church on earth should resemble that of the heavenly Jerusalem of which Saint John wrote in his Apocalypse, he established singing in choirs in his church at Antioch, after a vision of the celestial choirs who sang in that manner. When the emperor Domitian persecuted the Church, Saint Ignatius obtained peace for his own flock by fasting and prayer, although for his own part he desired to suffer with Christ, and to prove himself a perfect disciple.

The Roman emperors often visited Antioch, one of the cities of first importance of the empire. In 107, the eighth year of the reign of the emperor Trajan, he came to Antioch and forced the Christians to choose between apostasy and death. Saint Ignatius, who had already governed that church for forty years, continued to fortify it against apostasy, and did not flee. Arrested and brought before the emperor, the latter addressed him: Who are you, poor devil, to set our commands at naught? Call not poor devil, Ignatius answered, one who bears God within him. And when the emperor asked him what he meant by that, Ignatius explained that he bore in his heart Christ, crucified for his sake. Change your ideas, and I will make you a priest of the great Jupiter, and you will be called father' by the Senate. What could such honors matter to me, a priest of Christ, who offer Him every day a sacrifice of praise, and am ready to offer myself to Him also? To whom? To that Jesus who was crucified by Pontius Pilate? Yes, and with whom sin was crucified, and the devil, its author, vanquished.

The questions and the courageous replies continued for a time that day and also on the following one. Saint Ignatius said, I will not sacrifice; I fear neither torments nor death, because I desire to go quickly to God. Thereupon the emperor condemned him to be torn to pieces by wild beasts in Rome. Saint Ignatius blessed God, who had so honored him, binding him in the same chains as Paul, His apostle. When his people wept, he told them to place their hope in the sovereign Pastor, who never abandons His flock. On passing through the city of Smyrna, he exhorted the faithful, who were grieved at his fate, to remain true to Christ until death, and he gave some of them who were going to Rome a letter for the Christians of the capital of the Christian world. This letter is still extant. He writes: I fear your charity, I fear you have an affection too human for me. You might prevent me from dying, but by so doing, you would oppose my happiness. Suffer me to be immolated while the altar is ready; give thanks to God... If when I arrive among you I should have the weakness to seem to have other sentiments, do not believe me; believe only what I am writing to you now. This letter of Saint Ignatius has encouraged all generations of Christians in their combats.

He journeyed to Rome, guarded by soldiers, and with no fear but of losing the martyr's crown. Three of his disciples, who accompanied him and were eyewitnesses of the spectacle, wrote the acts of his martyrdom: His face shining with joy, he reassured them as the lions were released, saying: I am the wheat of Christ, I will be ground by the teeth of the beasts and made into flour to be a good bread for my Lord Jesus Christ! He was devoured by lions in the Roman amphitheater. The wild beasts left nothing of his body except a few bones, which were reverently treasured at Antioch until their removal in the year 637 to the Church of Saint Clement in Rome. After the martyr's death, several Christians saw him in vision, in prayer to Christ, and interceding for them.

Add new comment

7 + 0 =