SAINT OF THE DAY – OCTOBER 16 పునీత మార్గరేట్ మేరి అలకోక్వె |ST. MARGARET MARY ALACOQUE

(ఫ్రాన్సుదేశ మఠకన్య, ఏసు తిరుహృదయ భక్తురాలు ఫ్రాన్సు పాలక పునీతురాలు, మతసాక్షి క్రీ||శ|| 1647 - 1690) ప్రొటెస్టెంటు మతం, జేన్సెనిజం విడ్డూరంగా విస్తరించి కతోలిక క్రైస్తవ విశ్వాసం ఇంగ్లాండులో సన్నగిల్లుతున్న రోజులవి. ఫ్రాన్సులో కూడ లౌకిక రాజైన 14వ లూయి ఏలడంవల్ల 17వ శతాబ్దంలో శ్రీసభ విశ్వాస వెలుగు కొడిగట్టింది. అట్టి దుస్థితిలో ఆ వెలుగును ప్రజ్వరిల్ల చేయడానికి ఫ్రెంచి కన్యకామణియైన మార్గరేట్ మేరి అలకోక్వెగార్ని దేవుడు ఎన్నుకున్నారు. వీరినే మర్గరీత మరియమ్మగారనికూడ పిలుస్తాం.

పునీత మార్గరేట్ మేరిగారు ఫ్రాన్సులోని బర్గండి మండలంలో యల్ హౌట్ కౌర్ పట్టణంలో 1647 జూలై 22న జన్మించారు. తండ్రి క్లాడ్ అలకోక్వెకాగా తల్లి ఫిలిబెర్ట్ లామిన్. క్లాడ్ నోటరీ అనగా దస్తావేజులు, ఇతర ప్రమాణ పత్రాల పై ధృవీకరణ చేసేవృత్తిలో ఉండేవారు. ఆయన మరణానంతరం మార్గరేట్ మేరి తన 8వ ఏట ఛరోల్స్ పట్టణంలోని పూర్ క్లేర్స్ పాఠశాలలో చేర్పింపబడ్డారు. తన విద్యాకాలంలోనే అయిదేళ్లు వాతపురోగంవల్ల మంచంపట్టారు. తన విద్యను మాత్రం ఎలాగోలా పూర్తిచేశారు. వారు తమ 15వ ఏటనుండే దివ్యసత్రసాదమందలి ప్రభు ఏసుపట్ల అపారభక్తి ప్రపత్తులు పెంపొందించుకున్నారు.

వివాహమాడ తిరస్కరించి పారె-లె-మోనియల్ పట్టణంలో నెలకొన్న విజిటేషను కాన్వెంటులో 1671లో ప్రవేశం పొందారు. మరుసటి సంవత్సరమే తమ 25వ ఏట కన్యస్త్రీగా మాటపట్టు స్వీకరించారు. వారికి గత 5 సం||ల నుండి అనగా వారి 20 ఏళ్ల ప్రాయంనుండే క్రీస్తు ప్రభువు తరచు వారికి దర్శనమవుతుండేవారు. 1673 డిసెంబరు 27నుండి వరుసగా మార్గరేట్ మేరిగారికి ప్రభువు కనిపించడం మొదలైంది. ఆ దర్శనాలలో ప్రభువు తన పవిత్ర హృదయంపట భక్తిని వ్యాపింపజేయ ఆయమ్మ ఒక సాధనంగా పనిచేయాలని కోరారు. ఒకసారి ఆమె గాఢ ధ్యాన సముద్రంలో మునిగి ఉండగా క్రీస్తు కనిపించి తన గౌరవార్థం తొమ్మిది శుక్రవారాలలో సత్రసాదంలో కొని పవిత్ర ఆరాధనా ఘడియలు పాటించాలని కోరారు. మరియు పవిత్ర హృదయపండగను స్థాపించి ఘనంగా కొనియాడచేయాలని కూడా కోరారు. ప్రేమాగ్ని కురిపించే తమ హృదయంపట గల నిందావమానాలు తొలగింపకలగాలని ఆదేశించారు. తమ పవిత్ర హృదయ ఆశీర్వాదాలు పొందాలని చెప్పారు.

ఏసుప్రభుని ఆశయాల్ని మార్గరేట్ మేరిగారు తమ మఠశ్రేష్ఠురాలమ్మ మదర్ దె సౌమెయిన్ గారికి ఎరిగించారు. ఆ ఆశయం నెరవేర్పుకై ఆయమ్మ బహుగా ప్రయత్నించారు. కాని వారి సభలోని ఒక వేదాంతుల బృందాన్ని ఒప్పించడం సాధ్యపడలేదు. వారు ప్రభు దర్శనాల్నికూడ ఒక ఫార్సు అన్నట్టు మాట్లాడారు. ఆ సందర్భంలో మదరుగార్కి ధన్యక్లాడ్ లా కొలంబియేర్ ఏసు సభగురువు మద్దతు లభించింది. ఆ స్వామి సభ కాన్వెంటుకు ఆత్మ గురువుగా ఉండేవారు. వారు ప్రభు దర్శనాలు యదార్ధాలని ప్రకటించారు. ఇంతలో 1683లో ఆ వ్యతిరేక వర్గపు ప్రభావం సమసిపోయింది. పైగా అప్పుడు జరిగిన సభ సుపీరియర్ పదవికై ఎన్నికలలో విజిటేషను మఠ శ్రేష్ఠురాలమ్మగా మదర్ మెలిన్ బాధ్యతలు స్వీక రించారు. వారు మార్గరేట్ మేరిగార్ని తమ సహాయకురాలుగా ఎన్నుకున్నారు. తర్వాత అనతికాలంలోనే మార్గరేట్ మేరిగారు నోవిస్ మిసెస్ గా పదోన్నతి పొందారు. ఆ హోదాలో ఆయమ్మ తమ కాన్వెంటులో ప్రైవేటుగా ఏసు పవిత్ర హృదయ పండుగను కొనియాడ ఆదేశించి 1686లో తొలిసారిగా పండుగ జరుపుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలు సలిపారు. మరో రెండేండ్ల పిదప పారె-లె-మొనియల్ పట్టణంలో పవిత్ర ఏసు హృదయంకు అంకితమైన అందమైన దేవళం నిర్మింపబడింది. విజిటేషను సభగల కాన్వెంటు లన్నింటిలో కూడ ఏసు పవిత్ర హృదయ పండుగను కొనియాడుట ఆరంభింపబడింది. ఇలా విస్తరింపబడి మార్గరేట్ మేరిగారి ద్వారా ప్రభువు ఆశయం నెరవేరింది.

సిస్టర్ మార్గరేట్ మేరి అలకోక్వెగారు తమ 47 సం||ల ప్రాయంలోనే 1690 అక్టోబరు 17న పారే-లె-మోనియల్ పట్టణ కాన్వెంటులోనే ప్రభు పవిత్ర హృదయంలో తమ ప్రాణాల్ని విడిచి పెట్టారు. పవిత్ర గురుపుంగవులైన పునీత జాన్ యూదె గారు మరియు ధన్య క్లాడ్ లా కొలంబియేర్ యస్.జె.గారు మరియు పునీత మార్గరేట్ మేరిగారితో కలిపి ఈ ముగ్గురు “ఏసు పవిత్ర హృదయ పునీతులు” అని పేర్కొనబడ్డారు. క్రీ||శ|| 1765లో 13వ క్లెమెంటు పరిశుద్ధ పోపుగారు ఏసుపవిత్ర హృదయ పండుగను గుర్తించి శ్రీ సభ యందంతట కొనియాడ ఆశించారు. ఇది మార్గరేట్ మేరిగారి 75 సం||ల మరణానంతరం ప్రకటింపబడి ప్రసిద్ధిగాంచింది. క్రీ||శ|| 1920లో 15వ బెనడిక్ట్ పోపుగారి ద్వారా మార్గరేట్ గార్కి పునీత పట్టా ఇవ్వబడింది. ఫ్రాన్సుదేశంలో సమాధిగల వారి పుణ్యక్షేత్రం ప్రజల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. ఫ్రాన్సు పాలక పునీతురాలుగా వారు పేరెన్నికగన్నారు. మార్గరెట్ లేక మర్గరీత అంటే ముత్యం అని అర్థం.

Saint Margaret Mary, a soul of divine predilection, was born at Terreau in Burgundy, on July 22, 1647. During her infancy she showed a wonderfully sensitive revulsion to the very idea of sin, and while still a young child always recited the entire Rosary every day. She lost her father at the age of eight years, and her mother placed her with the Poor Clares. She was often sick and for four years was bedridden, losing almost entirely the use of her members. She made a vow to Our Lady to become one of Her daughters if She cured her, and was suddenly entirely well.

She was of a gay temperament and her heart became easily attached to human affections. God began her purification when the charge of her mother's house was confided to persons who reduced the family to a sort of servitude. Margaret Mary turned to God for strength and consolation when she was accused of various crimes she had not committed. In short, the Saint of the Sacred Heart learned to suffer for Christ, with patience, what innocence can suffer in such situations.

She desired to be a religious, but her mother could not bear to hear a word of that desire. Finally God came to her assistance through a Franciscan priest, who told her brother that he would answer to God for the vocation of his sister. In 1671 she entered the Order of the Visitation of Mary, at Paray-le-Monial, and was professed the following year. She followed all the practices of the monastery in perfect obedience, spending as much time as she could in the chapel with her Lord. After sanctifying her by many trials, Jesus appeared to her in numerous visions, displaying to her His Sacred Heart, sometimes burning as a furnace, and sometimes torn and bleeding on account of the coldness and sins of men. Behold this Heart which has so loved men, and been so little loved by them in return!

In 1675, she was told by Our Lord that she, with the aid of Father Claude de la Colombiere of the Society of Jesus, was to be His instrument for instituting the feast of the Sacred Heart, and for spreading that devotion everywhere. This was not accomplished without great sufferings. The good Jesuit did all in his power to make known and loved the Heart of Jesus, but when it seemed all obstacles were about to disappear, his credit diminished, and his Superiors sent him to England. He returned to France exhausted and soon died.

Saint Margaret Mary was for a time Mistress of Novices, and in this office exercised a true apostolate, working to win for the Heart of Jesus the hearts of the young girls who were aspiring to religious consecration. She was persecuted when she sent one of them home, not having seen in her the indications of a genuine vocation; the family attempted to have her deposed. She remained in the charge but was deprived of Holy Communion on the First Friday of the month. This practice was one of Our Lord's specific requests; for souls who communicate nine First Fridays in succession, He promised the most wonderful graces. The demons also persecuted her visibly; nonetheless her entire Community was finally won over to devotion to the Divine Heart.

Saint Margaret Mary died at the age of forty-two years, on October 17, 1690, and everywhere was heard in the city: The Saint is dead! The Saint is dead! She was beatified in 1864 by Pope Pius IX, and canonized in 1920 by Pope Benedict XV.

Add new comment

2 + 10 =