SAINT OF THE DAY – OCTOBER 15 పునీత అవిలా తెరేసమ్మ|ST. TERESA OF AVILA

(స్పెయిన్ కార్మెలుసభ కన్యస్త్రీ, మొదటి మహిళా శ్రీసభ పండితురాలు, స్పెయిన్ పాలక పునీతురాలు, మతసాక్షి క్రీ||శ|| 1515 - 1582)

పునీత తెరేసమ్మగారు స్పెయినుదేశంలోని అవిలా నగరంలో 1515 మార్చి 28 లోకంలో కళ్లు తెరిచారు. తండ్రి పేరు అలోన్నొ సాంచెజ్ దె సెపెడ. ఈయన రెండవ భార్య అయిన బీట్రిచ్ దవిలా అహుమడ యే ఆమె తల్లి. చిన్న తనంలో తెరేసమ్మగారు పునీత అగస్టీను మఠకన్యలు నిర్వహించే పాఠశాలలో చదువుకుంటుండగా ఆమె అనారోగ్యంను బట్టి 1532లో పాఠశాలనుండి పంపివేయబడ్డారు.

తెరేసమ్మగారు తమ ప్రాథమిక విద్యా నంతరం ఒక కన్యస్త్రీ కావాలని ఆశించారు. 1536లో 21 ఏట అవిలా నగరంలోని కార్మెలు మఠకన్యల సభలో ప్రవేశించారు. ఒక ఏడాది పిమ్మట వారికి మాటపట్టు, సభ ప్రత్యేక దుస్తులు ఇవ్వ బడ్డాయి. భక్తికి మారు పేరుగా యమ్మ పేర్గాంచారు. కాని దురదృష్టవశాతు 1538లో తీవ్ర జబ్బువల్ల విశ్రాంతికై ఇంటికి వెళ్లారు. తిరిగి 1540లో తమ 25 సం|| ప్రాయంలో తిరిగి మఠంలో ప్రవేశించి అప్పగింపబడిన బాధ్యతలు నిర్వర్తించారు.

క్రీ|||| 1555 - 56 మధ్య తెరేసమ్మగారికి తరచు ఏవో దర్శనాలు కలిగేవి. ఏవో సందేశాలు కూడ విన్పించేవి. అందుకువారికి అవేమి అర్థంకాక అతివేదనకు గురయ్యారు. క్రీ|||| 1557లో పునీత అలెయంతర పీటరు గురువర్యులు వారికి ఆత్మ గురువుగా నియమితులయ్యారు. ఆత్మ గురువు సలహాపై తెరేసమ్మగార్కి ఓదార్పుకలిగింది. దర్శనాలు మాటలు తనను ప్రోత్సహించేవేయని అర్ధమైంది. తమ మఠంలో కన్యస్త్రీలు ఎక్కువ స్వేచ్ఛగా ఉండుట తెరేసమ్మగార్కి నచ్చలేదు. అందుకు తానే నడుంకట్టి కొందరు శ్రేయోభిలాషులు కాదన్నా వినకుండ 1562లో అవిలా నగరంలో అనేక గట్టి కట్టుబాట్లతో పునీత యోసేపు కాన్వెంటును ఆరంభించారు. గొప్ప ఆథ్యాత్మిక భక్తి జీవితం కాన్వెంటు కన్యామణుల ధ్యేయం అయ్యింది.

క్రీ॥శ॥ 1567లో కార్మెలు మఠంకు జ్ఞానమార్గ చూపరియైన ఫాదర్ రుబెయోగారి అనుజ్ఞతో తెరేసమ్మగారు గట్టి కట్టుబాట్లతో మరికొన్ని కాన్వెంటులను తెరిచారు. మొత్తం 16 కాన్వెంటులు నిర్వహించారు. తెరేసమ్మగారు రెండవ కాన్వెంటును మెడినొ దెల్ కేంపో అనుచోట ప్రారంభించేటప్పుడు వారికి అక్కడున్న ఒక యువ గురువు పునీత జాన్ ఆఫ్ ది క్రాస్ (సిలువ యోహాన్) గారితో పరిచయమైంది. వీరునూ గొప్ప వేదాంతపండితులు దైవచిత్తంవల్ల ఫాదర్ సిలువ యోహాన్ గారి అజిమాయిషీలో తెరేసమ్మగారు పురుషులకోసం గట్టి కట్టుబాట్లతో ఒక కార్మెల్ సన్యాసుల మఠంను 1568లో దురుయేలో పట్టణంలో నెలకొల్పి నిర్వహింపజేశారు. ఇలా మరికొన్ని పురుషుల కోసం మఠాలు స్థాపించారు.

అవిలా తెరేసమ్మగారు ఒక మంచి పేరున్న మఠకన్యగా స్పెయిన్ దేశం నలుమూలల కలియ తిరిగారు. కార్మెలుసభను సమూలంగా సంస్కరింప అవిశ్రాంత కృషిసల్పారు. అయితే తెరేసమ్మగారు ఏర్పరుస్తున్న కఠినతర కట్టుబాట్లకు కినిసిన కొందరు కన్యస్త్రీలు వ్యతిరేక వర్గంగా తయారై క్రీ॥శ॥ 1575లో పియా సెంజా నగరంలో జరిగిన కార్మెలు మఠ సర్వసభ్య మహాసభలో తమ పిర్యాదును అభ్యంతరాలను గట్టిగా విన్పించారు. తత్ఫలితంగా కార్మెలు మఠ జ్ఞానమార్గచూపరి ఫాదర్ రుబెయోగారు తెరేసమ్మగారి సంస్కరణ వర్గంను కట్టుదిట్టం చేశారు.

ఈ వర్గాల పెనుగులాట కార్మెలుసభలో అయిదేళ్ల వరకు కొనసాగాయి. 1580లో 13 గ్రెగోరి పోపుగారు 2 ఫిలిప్ రాజు సిఫారసు పై పాదరక్షలు లేకుండా ఉండే సంస్కరణను పాటించే మఠకన్యలకు వేరుగా ఒక ప్రోవిన్సును ఏర్పరచారు. అయిదు సం|| కాలంలో పునీత అవిలా తెరేసమ్మగారు స్పెయిన్ దేశాటన చేస్తూనే కొన్ని అమూల్యమైన లేఖలు, గ్రంథాలు లిఖించారు. అవి అద్భుతమైన ఆథ్యాత్మిక సాహిత్యంగా ఆవిర్భవించాయి. వాటిల్లో ఆత్మకథ (1565), పరిపూర్ణతకు బాట (1573), ఆంతరంగిక కోట (1577) దైవ ప్రేమతలంపులు అనేవి ముఖ్య మైనవి.

స్వాభావికంగా అవిలా తెరేసమ్మగారు దృఢ విశ్వాసం కలవారు. జ్ఞానానికి మారు పేరు. పట్టుదల చురుకుదలతో లోతైన ఆత్మీయ జీవితంకు అంకితమైనవారు. పవిత్ర ధ్యానంతో క్రైస్తవ మత వ్యాప్తికి ఉన్నత జీవిత శిఖరాలనధిరోహించిన ధీరవనిత. చరిత్ర సృష్టించిన మహిళామణిదీపం. ఇట్టి భక్తురాలు మరణశయ్య పై ఉండగా దివ్యసత్రసాదం ఇచ్చుటకు గురువు దగ్గరకురాగా యమ్మ నా ప్రభూ ! మనం ఒకరికొకరం చూసుకోడానికి ఇప్పుడుసమయమైందిఅని పలికి దివ్య సత్రసాదంలోకొన్నారు. పిమ్మట స్పెయిన్ దేశంలోనే అల్బా దె టోర్మస్ పట్టణ కాన్వెంటులో తమ 67 ఏట క్రీ|||| 1582 అక్టోబరు 4 (గ్రెగోరియన్ కేలండరు ప్రకారం అక్టోబరు 14) దేవుని సమక్షంకు చేరుకున్నారు.

క్రీ|||| 1622లో 15 గ్రెగొరి పోపుగారిచే పునీత పట్టా ప్రధానం చేయబడ్డారు. 1970లో 6 పౌలు పోపుగారిచే వారు శ్రీసభ పండితురాలుగా ప్రకటింపబడ్డారు. విధంగా ప్రకటింపబడిన తొలి మహిళా పునీతురాలుగా పేరొందారు. వారి శరీరం శిధిలం కాకుండా నేటికి తాజాగా ఉండటం విశేషం. వార్ని స్పెయిన్ దేశ పాలక పునీతురాలుగా గౌరవిస్తున్నారు. వారి మధ్యవర్తిత్వాన ప్రార్థించిన వారికి తలనొప్పి, తలపోటువ్యాధి త్వరగా నివారణమవుతున్నట్లు భక్తులు సాక్ష్యమిచ్చారు.

By their fruits you will know them, says Our Lord of those who claim to be His followers. The fruits which remain of the life, labors and prayer of Saint Teresa of Avila bear to her virtue a living and enduring testimony which none can refuse to admit. She herself wrote her life and many other celebrated spiritual works, and much more can still be said of this soul of predilection, whose writings and examples have led so many souls to high sanctity.Born in 1515 in the kingdom of Castile in Spain, she was the youngest child of a virtuous nobleman. When she was seven years old, Teresa fled from her home with one of her young brothers, in the hope of going to Africa and receiving the palm of martyrdom. Brought back and asked the reason for her flight, she replied: I want to see God, and I must die before I can see Him. She then began, with her same brother, Rodriguez, to build a hermitage in the garden, and was often heard repeating: Forever, forever! She lost her mother at the age of twelve years, and was led by worldly companions into various frivolities. Her father decided to place her in a boarding convent, and she obeyed without any inclination for this kind of life. Grace came to her assistance with the good guidance of the Sisters, and she decided to enter religion in the Carmelite monastery of the Incarnation at Avila.

For a time frivolous conversations there, too, checked her progress toward perfection, but finally in her thirty-first year, she abandoned herself entirely to God. A vision showed her the very place in hell to which her apparently light faults would have led her, and she was told by Our Lord that all her conversation must be with heaven. Ever afterwards she lived in the deepest distrust of herself. When she was named Prioress against her will at the monastery of the Incarnation, she succeeded in conciliating even the most hostile hearts by placing a statue of Our Lady in the seat she would ordinarily have occupied, to preside over the Community.

God enlightened her to understand that He desired the reform of her Order, and her heart was pierced with divine love. The Superior General gave her full permission to found as many houses as might become feasible. She dreaded nothing so much as delusion in the decisions she would make in difficult situations; we can well understand this, knowing she founded seventeen convents for the Sisters, and that fifteen others for the Fathers of the Reform were established during her lifetime, with the aid of Saint John of the Cross. To the end of her life she acted only under obedience to her confessors, and this practice both made her strong and preserved her from error. Journeying in those days was far from comfortable and even perilous, but nothing could stop the Saint from accomplishing the holy Will of God. When the cart was overturned one day and she had a broken leg, her sense of humor became very evident by her remark: Dear Lord, if this is how You treat Your friends, it is no wonder You have so few! She died October 4, 1582, and was canonized in 1622.

The history of her mortal remains is as extraordinary as that of her life. After nine months in a wooden coffin, caved in from the excess weight above it, the body was perfectly conserved, though the clothing had rotted. A fine perfume it exuded spread throughout the entire monastery of the nuns, when they reclothed it. Parts of it were later removed as relics, including the heart showing the marks of the Transverberation, and her left arm. At the last exhumation in 1914, the body was found to remain in the same condition as when it was seen previously, still recognizable and very fragrant with the same intense perfume

Add new comment

1 + 10 =