SAINT OF THE DAY – OCTOBER 10 పునీత ఫ్రాన్సిస్ బోర్జియా| ST. FRANCIS BORGIA

(స్పెయిన్ దేశ ఏసుసభ గురువు, బోధకుడు, సువార్త ప్రచారకుడు క్రీ||శ|| 1510 - 1572) బోర్జియా లేక బోర్గియా అనే పేరుకు చరిత్రాత్మక అర్థం కుట్ర, హత్య, మోసం అని. అయితే ఈ పేరుగల ఈ వ్యక్తి ఎలా పునీతుడయ్యారు? వంశపారంపర్యంగా, పరిస్థితులను బట్టి సంక్రమించిన ఈ పేరునుబట్టి మనిషి వ్యక్తిత్వం ఉండనక్కర లేదు. కాని ఆ మనిషిచేసే పనులనుబట్టి దేవుని కృప అపారంగా పొందకలగడమే తన శక్తి కి గల కారణం. ఫ్రాన్సిస్ బోర్జియాగారు స్పెయిన్ దేశంలోని అరగాన్ ప్రాంతానికి రాజుగా ఉండిన పెర్డినాండ్ యొక్క మనుమడు. వీరి తండ్రి గాండియా రాజ్యానికి ప్రభువు. ఫ్రాన్సిస్ బోర్జియాగారు క్రీ॥శ|| 1510లో పుట్టారు.

ధనము, పేరు ప్రతిష్ఠలు, అన్ని సౌకర్యాలున్నప్పటికి వారు ఈ లోక ఆస్తిపాస్తులపై వ్యామోహం పెంచుకోలేదు. ప్రభువుపట్ల భయభక్తులతో పెరిగారు. మంచి తెలివితేటలు, విచక్షణ కలిగి, ఎలాంటి పటాటోపంలేక ప్రతి ఒక్కరితో కలివిడిగా మాట్లాడేవారు. దీన్నిబట్టి క్రీ||శ|| 1528లో వారి 18వ ఏటనే 5వ చార్లెస్ చక్రవర్తి ఆస్థానంలో ఉన్నత రాజకీయ పదవిని కట్టబెట్టారు. ఫ్రాన్సిస్ బోర్జియాగారు ఎంతో చాకచక్యంతో విధులు నిర్వర్తించడం, క్రమశిక్షణగల జీవితం జీవించడం చక్రవర్తికి సంతృప్తి కలిగించింది. నియమనిష్ఠలకు ప్రాధాన్యతనిచ్చే చక్రవర్తికి గల మంచి స్నేహితులు శ్రేయోభిలాషుల్లో ఎలియానెల్ దె కాస్ట్రో స్ అనే యువతి ఒకరు. ఈమె కూడ మంచి భక్తి పరురాలు, పరోపకారి కావడం చూసి ఫ్రాన్సిస్ బోర్జియాగారితో వివాహం జరిపించడమైనది. ఈ యువ దంపతుల్ని చక్రవర్తి అభిమానించి, రాజ భవనం వ్యవహారాల పర్యవేక్షకులుగా నియమించాడు.

చక్రవర్తి ఆశల మేరకు ఫ్రాన్సిసుగారు పదేళ్ల పాటు రాజభవనం ఆస్థానంలో తమ అమూల్య సేవలందించి మంచి పేరు గడించారు. సంతృప్తి చెందిన చక్రవర్తి, ఫ్రాన్సిసుగారిని 'కతానియా' ప్రాంతానికి రాజ ప్రతినిధిగా నియమించారు. ఆ ప్రాంతంలో రాజోద్యోగులు లంచగొండులై ప్రజలకు అన్యాయంచేస్తూ చక్రవర్తికి చెడ్డ పేరుతెచ్చారు. అట్టి దుస్థితిలో ఫ్రాన్సిసుగారు రాజోద్యోగులకు తన బోధలు, ప్రవర్తనతో సంస్కరించారు. న్యాయం నీతి నెలకొనేలా ఉత్తమ పాలననందించి ప్రజామన్ననలందారు. కరువుకాటకాలతో అలమటిస్తున్న పేద ప్రజానీకం పట్ల పెన్నిధిగా చక్రవర్తినుండి తగినంత సహాయం అందేలా చేయకలిగారు. ఇలా నాలుగు సంవత్సరాలపాటు అవినీతి రహితంగా తమ సేవలను కొనసాగించారు.

క్రీ||శ|| 1546లో బోర్జియాగారి సతీమణి అనారోగ్యంవల్ల స్వర్గస్తురాలైంది. అప్పటికే వారికి ఆయిదుగురు సంతానం. వారి యెడల తమ బాధ్యతలను కుటుంబలకప్పగించి, వైరాగ్యం సంతరించుకున్న ఫ్రాన్సిసుగారు తన జీవిత పరమార్ధం ఏమిటని ప్రశ్నించుకున్నారు. సువార్తా ప్రచారం ద్వారా క్రీస్తు రక్షణ కార్యాన్ని రపాలని నిశ్చయించారు. గతంలోనే వ్యక్తిగతంగా వేదశాస్త్రం లాటిను నేర్చుకున్న ఆఫీసుగారు పునీత లయోలా ఇన్యాసివారిచే క్రొత్తగా స్థాపింపబడిన ఏసుసభలో శ్రీశ 1548లో రహస్య సభ్యుడుగా దీక్షపూని ఉన్నారు. ఎంతో సమర్ధవంతంగా తాను పాలనచేస్తున్న కతానియా ప్రాంత రాజప్రతినిధి పదవిని తమ కుమారునికి ఇపించేలా చక్రవర్తిని ఒప్పించుకుని తామిక లౌకిక సంప్రదాయంనుండి వెలుపలకు వచ్చారు. ఆథ్యాత్మిక సేవల్లో ప్రవేశించి క్రీ||శ|| 1551లో పవిత్ర గురుపట్టాభిషిక్తులై మఠవాసం ప్రారంభించారు.

అనేక గుప్త శక్తియుక్తులు, అనుభవం కలిగియున్న ఫ్రాన్సిస్ బోర్జియాగారు ఏ మాత్రం గర్వం లేకుండా ఎంతో వినమ్రతతో ప్రార్థనా బోధనా జీవితం కొనసాగించారు. ఈ విధంగా అనతికాలంలోనే ఏసుసభలో ప్రముఖ గురువుగా గుర్తింపు పొందారు. వీరు స్పెయిన్, పోర్చుగల్, ఇండీస్ ప్రాంతాలలో ఏసుసభ కమిస్సరీ జనరల్ గా నియుక్తులయ్యారుకూడ. ఈ సందర్భంలో ఫ్రాన్సిసుగారు అనేక కళాశాలల్ని నిర్మింపజేశారు. ఇరవై నొవిషియేటులను ప్రారంభించారు. దేవుడనుగ్రహించిన విశ్వాస కృపావరాలతో తర్వాత సభ వికార్ జనరల్ గా నియమితులై తమ విలువైన సేవలు అందించారు. అప్పటి సభ జనరల్ ఫాదర్ లెయినెజ్ గారి మరణానంతరం ఈ ఫాదర్ బోర్జియోగారే సభ జనరల్ గా ఎన్నికయ్యారు.

అప్పటి దొమినికన్ పోపు పునీత 5వ పయస్ (భక్తినాధ) గారు బోర్జియాగారి శక్తి సామర్థ్యాల్ని గుర్తించారు. బాల్యదశలో ఉన్న ఏసుసభను అభివృద్ధిపరచి, పటిష్ఠపరచింది బోర్జియాగారి పాలనలోనే. యూరపు ఖండమందంతటా విద్యారంగ వికాసానికి 32 కళాశాలల్ని ప్రారంభించారు. మంచి విద్య, తర్ఫీదు ఇవ్వబడిన అనేకమంది ఔత్సాహిక ఏసుసభ గురువుల్ని విదేశాలకు సయితము పంపించారు. వీరు మఠాధిపతిగా ఉన్న రోజుల్లోనే 66 మంది ఏసుసభ గురువులు వేదసాక్షి మరణం పొందారు.

ఆ రోజుల్లో శ్రీసభను రూపుమాపాలనుకుంటున్న టర్కీ మహమ్మదీయులను ఎదుర్కొనేందుకు భూ మార్గం ద్వారా దండయాత్ర చేయడానికి స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్సు రాజ్యాల్ని ఒప్పించేందుకు జగద్గురువు తరపున దౌత్య వ్యవహారాలు జరిపే అలంలోనే బోరియాగారు క్రీ॥శ|| 1572 అక్టోబరు 10న పరలోక ప్రాప్తినొందారు. వారిని అనితులుగా ప్రకటించి పోర్చుగల్ దేశ పాలక పునీతులుగా శ్రీసభ ఏర్పాటుచేసింది.

#rvatelugu #saint #dailysaint

Saint Francis Borgia, named for Francis of Assisi at his birth in 1510, was placed under the tutelage of his uncle, Archbishop of Saragossa, after the death of his mother when he was ten years old. Soon he had to go to the court of Spain, as he was destined to be one of the great lords of that nation. There he remained Christian, modest and virtuous. His noble and beautiful appearance soon brought upon him snares which he succeeded in escaping, setting for himself regimes of prayer and study to escape from the dangers. He wore a hair shirt, and never would enter into any of those games of chance which cause the loss not only of money but of time, the spirit of devotion, and peace of soul. The Empress arranged for him to marry Eleanor de Castro of Portugal, who like himself was very pious. They were blessed with eight children, five sons and three daughters, who continued to practice the virtue of their parents.

Having become the Duke of Gandia after his father's death, he became one of the richest and most honored nobles in Spain. In 1539, there was laid upon him the sad duty of escorting the mortal remains of his once beautiful sovereign, the Empress Isabella, who had died still young, to the royal burial ground at Granada. The coffin had to be opened for him, that he might verify the body before it was placed in the tomb; and so unrecognizable, so astonishing a sight met his eyes that he vowed never again to serve any earthly sovereign, subject to so drastic and terrible a change.

It was many years before he could follow the call of his Lord; the emperor named him Captain-General of Catalonia, and sent him to bring to justice a group of bandits who had ravaged the countryside. The poor found in him strong protection against oppression. Vices were banished by his ordinances; he endowed poor girls and assisted families ruined by misery and reversals; he delivered debtors from prisons by paying what they owed. He was in effect the very Christian Viceroy of the Emperor. Saint Francis was relieved of this duty when he asked the Emperor, after the death of his father, to return and govern his subjects at Gandia. In Gandia he again did much public good; he built monasteries, founded hospitals, helped the poor in every possible way. But suddenly, his wife was taken from him. He was told by God that this loss was for both his and her own advantage, and amid his tears he offered his own life and that of his children, if that would please the Eternal Master.

After making a retreat according to the Exercises of Saint Ignatius, under Blessed Peter Favre, he made the vows of a Jesuit privately until he could see to the establishment of his children. When he went to Rome with one of them, it was rumored he would be made a cardinal like two of his brothers. But he wished to avoid all dignities, and succeeded in doing so by leaving Rome as soon as possible. Saint Ignatius made him his Vicar General for Spain, Portugal, and the East Indies, and there was scarcely a city of Spain and Portugal where he did not establish colleges or houses of the Company of Jesus. At the death of Saint Ignatius two years later, the Order chose him to be its General. Then his journeys became countless; to narrate them all would be impossibility.

The Turks were threatening Christendom, and Pope Saint Pius V commissioned two cardinal-legates to go and assemble the European Christian princes into a league for its defense. The holy Pope chose Francis to accompany one of the Cardinals and, worn out as he was, the Saint obeyed at once. The fatigues of the embassy exhausted what little life was left to him. Saint Francis died in the same year as Saint Pius V, happy to do so in the service of God and the Church, when he returned to Rome in October, 1572.

 

Add new comment

1 + 8 =