SAINT OF THE DAY – November 9 పవిత్ర రక్షకుని బృహత్ దేవాలయ ప్రతిష్టోత్సవం|DEIDCATION OF LATERAN BASILICA

(క్రీ||శ|| 324) శ్రీసభ తొలి మూడు శతాబ్దలలో విపరీతమైన వేదహింసలకు గురి అయ్యింది. క్రైస్తవులు ఏదోక గృహంలో రహస్యంగా కూడి దైవారాధన సలిపి దివ్యసత్రసాదం లోకేనే వారు. కొన్నిసార్లు స్మశానాల్లో సమాధులు ఉంచు భూ గృహాల్లో సమావేశమయ్యేవారు. క్రీ||శ|| 117 సం||లో ట్రాజన్ చక్రవర్తి, 250ల్లో డేసియస్ చక్రవర్తి క్రీ||శ|| 303 నుండి 311 వరకు దియోక్లేషియన్ చక్రవర్తి క్రైస్తవులపట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహిరించి క్రైస్తవ మతం అణచివేతకు శాయశక్తులా కృషిచేశారు. వందలాది క్రైస్తవ విశ్వాసుల్ని క్రూరంగా వధించారు.

అయితే ప్రభువు కృపవల్ల రోమురాజ్యానికి కాస్ స్టెంటైన్ చక్రవర్తి ఏలుబడికి వచ్చి క్రీ॥శ|| 313 నుండి 337 వరకు పరిపాలించాడు. ఈయన పాలన క్రైస్తవ మతంకు స్వర్ణయుగం అవవచ్చు. ఈయన కతోలిక వేదంకు మద్దతు ఇచ్చాడు. చివరి దశలో బాప్టిజం పొందాడు. ఈ చక్రవర్తి రోములోని లాటరన్ రాజ భవనాన్ని దేవాలయంగా వాడుకోడానికి క్రీ||శ|| 313లో పునీత మిత్తి ఆదెస్ పోపుగార్కి కానుకగా ఇచ్చివేశారు. ఆ భవనానికి ఒక దేవాలయ హంగులు సమకూర్చి 1వ సిల్వెస్టర్ పోపుగారు క్రీ|శ|| 324 నవంబరు 9వ తేదీన ఆశీర్వదించి ప్రతిష్టాపనగావించారు. పునీత బప్తిస్మ యోహాను మరియు సువార్తీకుడైన పునీత యోహాను పేరట రక్షక దేవుని బసిలికా (పెద్ద దేవాలయం)గా శ్రీ సభకు అంకితం గావించారు. అప్పటినుండి అది “అన్ని క్రైస్తవ దేవాలయాలకు తల్లి మరియు తల"గా పేర్కొనబడింది.

రోమునగర ప్రజలంతా ఈ బసిలికాలోనే జ్ఞానస్నానాలు పొందారు. ఆత్మకార్యాలు నెరవేర్చుకున్నారు. ఈ దేవాలయం ప్రక్కనే జగదురుపుల నివాసగృహం ఉండేది. 4వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు 5 శ్రీ సభ మహాసభలు 20 సినడ్ అనగా పీఠాధిపతుల మహాసభలు జరిపింపబడ్డాయి. 12వ శతాబ్దం వరకు పునీత జాన్ లాటరస్ దేవళంగా పిలువబడేది.ఈ సుప్రసిద్ధ పుణ్యక్షేత్ర దేవాలయంలో పునీత పేతురు పునీత పౌలుగారు పవిత్ర మృత అవశేషాల్ని వారి వెండి బొమ్మల్లో భద్రపరచి అలంకరింపజేశారు. పునీత పేతురుగారు పూజ కొరకు వాడిన ఒక చెక్కబల్ల ఇక్కడే అమర్చబడింది. ప్రభువు కడరాత్రి విందు సందర్భంగా మొదటి దివ్యసత్రసాదము మోపబడిన పవిత్రబల్లకూడ ఈ పుణ్యక్షేత్ర దేవాలయంలోనే నెలకొల్పబడింది. ఈ దేవాలయాన్ని ఇంకా పెద్దగా విస్తరణ జరిపి పునర్నిర్మింపచేశారు.

అయితే 14వ శతాబ్దంలో ఆ బసిలికాను రోమునగరంలోనే ఒక పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుండగా పరిశుద్ధ పోపుగారి నివాసము పరిపాలనా యంత్రాంగము ఇటలీలోనే వాటికను మహానగరం (చిన్న స్వతంత్ర రాజ్యం )కు మార్చబడింది. కతోలిక దేవాలయాలన్నీ దైవ కృపావర నిలయాలుగా శ్రీ సభ సంపూర్ణ గౌరవం అందిస్తుంది. దాని ప్రజలే “జీవపురాళ్లు"గా “దైవ మందిరాలు"గా ప్రభు ఆరాధనకు ఈ దేవాలయాలలో సమావేశమవుతుంది. ఇక్కడే దేవుని వాక్యం ప్రకటింపబడుతోంది. దివ్య సంస్కారాలు ఈ మందిర గోడల మధ్యనే గౌరవంగా జరుపబడుతున్నాయి. నూతన దేవాలయాలు నిర్మించి ఆశీర్వదించి ప్రతిష్ఠంచే సందర్భంలో మనం దాని పవిత్రతను పునరుద్ఘాటిస్తుంటాం. ప్రతి దేవాలయం దేవుని నివాస మందిరంగా, జపాలయంగా, దేవుని ప్రేమ పనిచేస్తూ దైవ పజలందరినీ దైవరాజ్య పవిత్ర నగరం జెరుసలేము కేంద్రంగా ఒక బృహత్ కుటుంబంగా జీవింప సంసిద్ధం చేస్తుంది.

The residence of the Popes which was named the Lateran Palace was built by Lateranus Palutius, whom Nero put to death to seize his goods. It was given in the year 313 by Constantine the Great to Saint Miltiades, Pope, and was inhabited by his successors until 1308, when they moved to Avignon. The Lateran Basilica built by Constantine near the palace of the same name, is the first Basilica of the West. Twelve councils, four of which were ecumenical, have assembled there, the first in 649, the last in 1512.

If for several centuries the Popes have no longer dwelt in the Palace, the primacy of the Basilica is not thereby altered; it remains the head of all churches. Saint Peter Damian wrote that just as the Saviour is the Head of the elect, the church which bears His name is the head of all the churches. Those of Saints Peter and Paul, to its left and its right, are the two arms by which this sovereign and universal Church embraces the entire earth, saving all who desire salvation, warming them, protecting them in its maternal womb.The Divine Office narrates the dedication of the Church by the Pope of Peace, Saint Sylvester:

It was the Blessed Pope Sylvester who established the rites observed by the Roman Church for the consecration of churches and altars. From the time of the Apostles there had been certain places dedicated to God, which some called oratories, and others, churches. There, on the first day of the week, the assembly was held, and there the Christian people were accustomed to pray, to hear the Word of God, and to receive the Eucharist. But never had these places been consecrated so solemnly; nor had a fixed altar been placed there which, anointed with sacred chrism, was the symbol of Our Lord Jesus Christ, who for us is altar, victim and Pontiff. But when the Emperor Constantine through the sacrament of Baptism had obtained health of body and salvation of soul, a law was issued by him which for the first time permitted that everywhere in the world Christians might build churches. Not satisfied to establish this edict, the prince wanted to give an example and inaugurate the holy labors. Thus in his own Lateran palace, he dedicated a church to the Saviour, and founded the attached baptistry under the name of Saint John the Baptist, in the place where he himself, baptized by Saint Sylvester, had been cured of leprosy. It is this church which the Pontiff consecrated in the fifth of the ides of November; and we celebrate the commemoration on that day, when for the first time in Rome a church was thus publicly consecrated, and where a painting of the Saviour was visible on the wall before the eyes of the Roman people.

When the Lateran Church was partially ruined by fires, enemy invasions, and earthquakes, it was always rebuilt with great zeal by the Sovereign Pontiffs. In 1726, after one such restoration, Pope Benedict XIII consecrated it anew and assigned the commemoration of that event to the present day. The church was afterwards enlarged and beautified by Popes Pius IX and Leo XIII.

Add new comment

1 + 0 =