SAINT OF THE DAY – November 6 పునీత డెమెట్రియాను |ST. DEMETRIAN

సైప్రసులోని కైత్రి లేక కిర్కా పీఠాధిపతి, మతసాక్షి క్రీ||శ|| 835 - 912 సైప్రసుదేశంలో 9వ శతాబ్దంలో జీవించిన గొప్ప పీఠాధిపతి పునీత డెమెట్రియాను గారు. వారి పవిత్ర జీవితంనుబట్టి, వ్యాధుల నివారణ స్వస్థతానుగ్రహంను బట్టి అదికంగా గౌరవింపబడి వందింపబడుచున్నారు. వృద్ధాప్యంలోకూడ వారు పోరాటయోధుడుగా ఎక్కడికైన వెళ్లగల సాహసికుడుగా పేర్గాంచారు. దాదాపు 25 సం॥లు బిషప్పుగా సేవలందించి అనుభవశాలిగా ప్రసిద్ది చెందియుండగా సెరాసెనులనబడు దొంగలముఠా సైప్రసు పై దండెత్తి అనేకమంది క్రైస్తవులను చెరపట్టి మానవ బానిసలుగా అమ్మడానికి తీసికొనిపోయారు.

సాధు స్వభావియైన డెమెట్రియాను బిషప్పుగారిలో పౌరుషం ఉప్పొంగింది. దైవ బిడ్డలను ఎలాగైనా విడిపించాలని అత్యంత ధైర్య సాహసాలతో ఆ దొంగల ముఠాను అనుసరించి వెళ్లారు. వారితో బేరమాడి సర్దిచెప్పి క్రైస్తవులందరిని విడిపించుకురావడం ఆ రోజుల్లో గొప్ప విశేషంగా అందరూ చెప్పుకున్నారు. చెడును ఎదుర్కోవడంలో ధైర్యం ప్రదర్శించాలి, దేవుడే ముందుకు నడిపిస్తారు జయం ప్రసాదిస్తారని వారిహితబోధ. వారు క్రీ||శ|| 912లో చనిపోగా ప్రజలందరు దుఃఖ సాగరంలో మునిగి ప్రార్థనలు సలిపారు. వారి మధ్యవర్తిత్వాన అనేక అద్భుతాలు నెరవేరాయి. రోగాలు సమసిపోయాయి. వైరుధ్యాలు పోయి శాంతి చేకూరింది.

Cypriot bishop, highly venerated on Cyprus. Demetrius was born in Sika, Cyprus. He became a monk at St. Anthony's Monastery when his wife died, and he was ordained. Demetrian served as abbot of the monastery for forty years and then became bishop of Khytri despite his objections. He ruled for twenty-five years. During a Saracen raid on Cyprus, Demetrian obtained the release of Christian captives who were destined to become slaves.

 

 

 

Add new comment

9 + 6 =