SAINT OF THE DAY – November 5 పునీత బెర్తిలియమ్మ |ST. BERTILIA

ఫ్రెంచి బెనడిక్టు మఠకన్య, చెల్స్ మఠ పెద్ద (క్రీ||శ| - 692) “నీ జీవితంలో నీకు మార్గదర్శకులెవరు ?” అని ఒక ఆధ్యాత్మిక లేఖకుడు పశిస్తున్నాడు. అలాగే “నీ స్నేహితులెవరో చెప్పు..... నీవు ఎలాంటి వాడవో చెబుతాను” అనే ఒక సామెతకూడ ఉంది. ఒకరు లేక అనేకమంది పునీతులు నీకు మార్గదర్శకులు లేక స్నేహితులైతే అంతకంటే భాగ్యం ఇంకేమి ఉంటుంది.?

పునీత బెర్తిల్లా ఫ్రాన్సుదేశంలోని సోయిస్సన్సు మండలంలో 7వ శతాబ్దంలో జన్మించి జీవించారు. అప్పుడు 1వ దగోబట్టురాజు ఫ్రాన్సురాజ్యంను పాలిస్తుండేవాడు. బెర్తిల్లగారు ఊహ ఎరిగినప్పటినుండి ఈ లోకంలోని కీడులు, రోగాలు, లోపాలు, స్వార్థపు ఆశలు, మోసాలు ఎన్నో గమనించారు. అందుకే వారు ఈ లోకంపట్ల విరక్తి చెంది పరలోకం వైపు దృష్టి సారించారు. తన నిర్ణయాన్ని వెంటనే తమ తల్లిదండ్రులకు చెప్పసాహసించలేదు. దగ్గరలో ఉన్న రోయెను పీఠాధినేత పునీత ఓయెనుగార్కి విన్నవించుకున్నారు. వారు తండ్రి ప్రేమతో ఆ యమ్మను ప్రోత్సహిస్తూ ప్రార్థన పట్టుదలతో జీవితాశయం సఫలంచేసుకొమ్మని దీవించారు.

అటు పిమ్మట బిషప్పుగారు బెర్తిల్లగారి తల్లిదండ్రులకు ఆ యమ్మ దైవ పిలుపునుగూర్చి చెప్పి సంయమనం పాటించి అడ్డు చెప్పకండని హితబోధగావించారు. అప్పుడు వారు బెర్తిల్లగారిని జొర్రెపట్టణంకు పంపించారు. దాపులోనే మేక్సుగ్రామంలో పునీత కొలుంబనుగారి నిబంధనావళిలో ఏర్పరచబడిన మఠాలయం ఒకటుంది. అక్కడ చేరిన ఆ యమ్మ సన్యాసిని జీవితం గడపడంలో శ్రేష్ఠతరమైన శిక్షణ గడించారు. బెర్తి ల్లాగారి వినమ్రత, అంకితభావం, కలుపుగోలుతనంతో సిస్టర్లు అందరిని ఆకర్షించారు. అందరికి మంచి స్నేహితురాలై మంచి మార్గదర్శక సూచనలు అందించేవారు. వారికి ఉన్న ధర్మగుణం, విశాలదృక్పథం,

జ్ఞానంను బట్టి మఠశ్రేష్ఠురాలమ్మగారు వారిని మఠకన్యగా మాటపట్టు తీసికొని మఠపాలనలో తమ సహాయకురాలినిగా చేసుకున్నారు. ఇంతలో 2వ క్లోవియస్ (ఫ్రాన్సురాజు)కు ఆంగ్లేయ భార్య అయిన పునీత బెతిన్‌సుగారు చెల్సుపట్టణంలో ఒక మఠాన్ని పునరుద్దరించి అందులో ఉండి దైవ సేవ చేసుకునేందుకు మంచి కన్యస్త్రీల బృందాన్ని పంపించవలసిందిగా జోర్రె  పట్టణ మఠశ్రేష్ఠురాలమ్మను అర్థించారు. అందువల్ల వారు పునీత బెర్తిల్ల మఠ పెద్దగా ఒక మఠకన్యల బృందాన్ని చెల్సు మఠంకు పంపించారు.

వీరి రాకలో చెల్పు పట్టణంలోని మఠం అన్ని విధాలుగా అభివృద్ధిగాంచింది. స్థానిక మరియు విదేశీ యువతులను ఆకర్షించింది. పుణ్య జీవితంలో కన్యస్త్రీలు సంఘంలో ఆదర్శప్రాయులై తరించారు. అయితే పునీత రాణి తన భర్తను కోల్పోయి వితంతువు కాగా క్రీ॥శ॥ 655లో ఈ మఠంలోనే ప్రవేశించి బెర్తిల్లా మఠశ్రేష్ఠురాలమ్మగారి పవిత్ర హస్తాలు మీదుగా సభ ఉడుపులు స్వీకరించి ధరించారు. విధేయత, దైవాంకిత జీవితంలో పునీతురాలయ్యారు. పునీత బెర్తిలమ్మగారి మఠంలోనే ఎతెల్ హెర్ రాజు చనిపోగా ఆయన రాణి పునీత హెరెస్వితగారు తమ ఆస్టు ఏంజిల్సు రాజ్యంను వీడి పూర్తి అణకువ భక్తి విశ్వాసాలతో ప్రవేశించారు. ఈ పుణ్య వితంతువులతో దేవయిష్ట ప్రాసాద జీవితం జీవించి తోడి కన్యస్త్రీలకు ఉత్సాహం ప్రోత్సాహం నిలకడ నిబ్బరం నింపుతూ సలహాలు సూచనలతో దైవం దెసకు నడిపిస్తూ క్రీ॥శ|| 692లో మఠ పెద్ద బెస్ట్రాల్లమ్మ తమ ఈ లోక జీవితాన్ని ముగించుకున్నారు. పునీతులయ్యారు. బెర్త అనగా వెలుగొందు ప్రజ్వలించు, ప్రకాశించు అని అర్థం.

Saint Bertilla was born during the seventh century, of one of the most illustrious Christian families in the region of Soissons. As she grew up she learned to despise the world and earnestly desired to renounce it. Before telling her parents of her aspirations, she first consulted Saint Owen, by whom she was encouraged in her resolution. The Saint's parents were then made acquainted by her counselor with her desire, which God inclined them not to oppose. They conducted her to Jouarre, a large monastery four leagues distant from Meaux, where she was received with great joy and formed in the strictest practices of monastic perfection.

She was named to receive visitors, then assigned to the care of the sick; in all her duties gentleness was joined with firmness, mercy with justice, humility with courage, and prudence with simplicity. She seemed to be the servant of each of her Sisters, and acquitted herself with such great charity and edification that she was chosen to be Prioress by the Abbess, to assist her in her administrative duties.

When the Queen of France, Saint Bathilda, wished to build the abbey of Chelles and retire there herself, she asked the Abbess of Jouarre to give her several religious and an Abbess to begin the new foundation. Saint Bertilla was placed in charge of the little group. The Archbishop of Lyons conducted the nuns to Chelles for the benediction of the monastery, which the Abbess then governed for forty-six years with both vigor and discretion. Saint Bathilda became one of her subjects, as did also a Queen of England, Heresvida, who came to seek at Chelles the peace which the world cannot give. Saint Bertilla's humility only increased when she saw these and other royal ladies, attracted by her reputation of sanctity, obedient to her commandments.

The holy Abbess died in November, 692, after a life which God did not see fit to close by martyrdom, as she ardently desired. She was, however, her own executioner by the rigors to which she subjected her flesh, wishing all her life long to appease the justice of God, irritated by the offenses which never cease to cause suffering to His divine Son. Saint Bertilla was buried beside Saint Bathilda, in the abbatial church.

Add new comment

4 + 2 =