SAINT OF THE DAY – November 22 పునీత సిసీలియ| ST. CECILIA, MARTYR

రోమను కన్య, సంగీత కళాకారులు, గాయకులు, సంగీత సాధనాల తయారీదారులు, కవుల పాలక పునీతురాలు వేదసాక్షి, 2వ -3వ శతాబ్దం) శ్రీసభ తొలి సంవత్సరాలనుండే వేదసాక్షిగా మరణించిన పునీత సిసీలియగారు క్రైస్తవాళిచే భక్తి పూర్వకంగా కీర్తింపబడుతున్నారు. దివ్య పూజార్చనాకాండలో పేర్కొనబడుతున్న ఏడుగురు పవిత్ర హతసాక్షుల నామాలలో వీరిదికూడ ఒకటి. రెండవ శతాబ్దం అంతంలో రోమునగరంలోని ఒక ధనిక కుటుంబంలో ఉన్నత వంశంలో పునీత సిసీలియగారు జన్మించారు. ఆ కాలంలో రోమను సామ్రాజ్యాన్ని అలెగ్జాండర్ సెవేరస్ చక్రవర్తి పాలించేవాడు. చిన్నతనం నుండి సిసీలియగారికి సంగీతమంటే మక్కువ ఎక్కువ. అందులో గొప్ప ప్రావీణ్యాన్ని సంపాదించారు కూడా. వారు కలవారి కుటుంబంకు చెందినాగాని, క్రైస్తవ ఆదర్శాలతో పెరిగారు. దైవ సేవకోసం ఒక కన్యగా పరిశుద్ధ జీవితం గడుప నిశ్చయించుకున్నారు. ఉపవాసాలు ఆచరిస్తూ అన్ని రకాల జప, తప, దాన కృత్యాల్ని నిర్వహించేవారు. సిసీలియగారికి యుక్తవయుస్సురాగా వారి ఇష్టాన్ని జీవితాశయాన్ని తల్లి దండ్రులు లెక్క పెట్టక వలేరియన్ అనే ఒక ధనవంతుడు అందగాడైన అన్యునికి వివాహం నిర్ణయించారు. వారు నిర్ణయించిన ప్రకారం పెండ్లి రోజు రానే వచ్చింది. పెండ్లితంతు యథావిథిగా కొనసాగుతుండగా సిసీలియమ్మగారు అతిథులకు దూరంగా కూర్చుని మదిలో ప్రార్థనచేసుకుంటూ మరొకసారి ప్రమాణం చేసి, దేవునికి తనను తాను అర్పించుకున్నారు. తల్లిదండ్రులను నొప్పింపలేక ఎలానో పెండ్లికూతురు ఒక బొమ్మలా మారిపోయింది. పెండ్లితంతు ముగిశాక బంధువులంతా ఎవరిది వారు వెళ్లిపోయారు. ఆ రాత్రి భర్త వలేరియన్ తో ఒంటరిగా మిగిలిపోయింది. ఆ సమయంలో సిసీలియమ్మగారు తమ భర్తతో ఇలా చెప్పారు. “ఒక రహస్యాన్ని - వెల్లడిద్దామని ఉంది. నన్ను దేవునికి అర్పించుకున్నాను. నన్ను నిరంతర దేవదూత కాపలా కాస్తూ ఉంటారు. నన్ను మీరు తాకినట్లయితే తర్వాత బాధపడాల్సి వస్తుంది. అయితే నా కన్యత్వాన్ని మీరు గౌరవిస్తే, ఆ దూత నన్ను ప్రేమించినట్లుగానే మిమ్మల్నికూడ ప్రేమిస్తారు.”

ఈ పలుకులు విన్న వలేరియన్లో సందేహం, భయం, కోపం ముప్పరిగొన్నాయి. "సరే ఆ దేవదూతను నాకు చూపించినట్లయితే నీ కోరికను మన్నిస్తాను” అని సిసీలియగారితో అన్నాడు. “మీరు సజీవులైన నిజ ఏక దేవుని నమ్మి జ్ఞానస్నానం స్వీకరించినట్లయితే మీరు ఆ దేవదూతను చూడగలరు" అని వారు సమాధానమిచ్చారు. అందుకు వలేరియన్ సమ్మతించాడు. భార్య సూచనలమేరకు అర్బన్ అను పేరుగల బిషప్పుగార్ని కలిశాడు. ఆ రోజుల్లో తొలినాటి క్రైస్తవులపై జరుగుతున్నదురాచారాలను బట్టి అర్బన్ గారు ఊరిబయట వేదసాక్షుల సమాధుల స్థలంలో దాగుకొని ప్రార్థనలు సల్పుతూ రహస్యంగా ఆథ్యాత్మిక సేవలందిస్తున్నారు. విషయాన్ని తెలుసుకుని అర్బను బిషప్పుగారు వలేరియనుకు జ్ఞానస్నానం ఇచ్చారు.

యువకుడైన వలేరియన్ ఆతురతతో భార్య సిసీలియగారి వద్దకు వచ్చాడు. ఆశ్చర్యం. ఆయమ్మ ప్రక్కనే ధగదాయమాన రెక్కలతో ఒక దేవదూత వినయంతో నిలబడి ఉండటం దర్శించాడు. ఆ దేవదూత గులాబీలు, లిల్లిపువ్వులతో అల్లిన మాలలను వలేరియన్ మెడలో అలంకరించాడు. వారిరువురి పై పుష్పాలు వెదజల్లాడు. తనకు జరిగిన ఈ గౌరవానికి, తన అంతరంగంలో అనిర్వచనీయంగా పెల్లుబికే ఆనందానికి విస్మయం చెందాడు. తన భౌతిక శరీరంకూడ గాలిలో తేలిపోతున్నట్లు గొప్ప అనుభూతికి అబ్బుర పడ్డాడు. తన సోదరుడైన త్రిబూర్షియసన్ను కూడ మార్చి క్రైస్తవునిగా జ్ఞానస్నానం పొందేలా చేశాడు.

పిమ్మట ఎంతో మారుమనస్సు పొందిన అన్నదమ్ములిరువురూ క్రైస్తవ సంఘానికి తమ శాయశక్తులా అంకితాత్ములై కృషిచేశారు. క్రైస్తవ వేదహింసలు అధికంగా ఉన్న ఆ దినాల్లో అల్మాచియస్ తీర్పరిగా క్రీస్తు అనుచరులకు మరణశిక్ష విధిస్తుండేవాడు. అలా వేదసాక్షులైన క్రైస్తవ విశ్యాసులందరిని తగు భక్తి శ్రద్ధలతో భూస్థాపితం చేయడం పుణ్యకార్యంగా పెట్టుకున్నారా సోదరద్వయం. అయితే దబ్బర దేవతయైన జూపిటర్కు మొక్కడానికి నిర్ద్వంద్వంగా తిరస్కరించినందుకు ఆ అన్నదమ్ములకు కూడ మరణశిక్ష విధింపబడింది. వీరితలలను నరికించడానికి మాక్సిమస్ అను రోమను అధికారి నియమింపబడ్డాడు. వారిని నరికేటప్పుడు వారి నుండి ప్రదర్శితమైన అత్యద్భుత దృశ్యంకుగాను కలతచెంది, పశ్చాత్తాపుడై తానునూ క్రైస్తవంకు సాక్ష్యం పలికాడు. దాంతో మాక్సిమస్ కు కూడ వేదసాక్షి మరణం ప్రాప్తించింది. శోకతప్తయైన సిసీలియమ్మగారు దేవుని పై విశ్వాసముంచి ఆ వేదసాక్షులు మువ్వురికి భూస్థాపిత కార్యక్రమాల్ని నెరవేర్చారు. అందుకు సిసీలియమ్మగార పై కూడ విచారణ జరిగింది. తీర్పరి అల్మాచియస్ ఆయమ్మగార్కి అనేక బెదిరంపులతో నచ్చజెప్పచూశాడు. కాని “ఏసుక్రీస్తే నిజ ఎకదైవం, క్రైస్తవ మతమే నిజ ఏకమతం" అని చెక్కు చెదరని విశ్వాసంతో బల్ల

గ్రుద్ది చెప్పడం చూసి, వారికిని మరణశిక్ష విధింపబడింది. అందుకై ఆమె ముక్కు నోరు మూయబడి ఆమె స్నానాలగదిలోనే శిక్ష అమలకు తీర్పు ఇవ్వబడింది. ఈ శిక్ష సిసీలియమ్మగారియందు విఫలమైంది. దాంతో తల తీసివేయబడ అనుజ ఇవ్వబడింది. ఇది అమలు చేసేభటుడు పదునైన పెద్ద కత్తితో సిసీలియమ్మగారి మెడపై మూడు కత్తి వేటులు బలంగా వేశాడు. మూడు బలమైన గాట్లు పడ్డాయి కాని మరణింపలేదు. చట్టప్రకారం నాలుగవ వేటు వేయడానికి వీలులేనందున భటుడు నిష్క్రమించాడు. ఆ గాట్ల బాధతో రక్తం స్రవిస్తుండగా మూడు దినాలు ఆ యమ్మగారు చావు బ్రతుకుల మధ్య విలవిల్లాడారు. “క్రీస్తుకోసం మరణించే దానికంటే ఏదీకూడా నన్ను ఎక్కువ ఆనందపరచదు” అని సందేశమిచ్చారు. మరియు తనను శిక్షించిన వారిని మన్నిస్తూ “నా ఏసుక్రీస్తు ప్రభువు వధువును నేను" అని ప్రకటించారు.

రోమునగరంలోని ఎంతో మంది విశ్వాసులు ఆయమ్మగార్ని సందర్శించి వెళ్లారు. ఆ ప్రాణాపాయ స్థితిలో కూడ సిసీలియమ్మగారు తమకుగల వస్తు సామాగ్రినంతా పేదలకు దానం చేశారు. తమ పెద్ద నివాస గృహాన్ని క్రైస్తవారాధనా కార్యక్రమాలకై స్థానిక బిషప్పుగార్కి స్వాధీనపరచారు. వారి వేదసాక్షి మరణానంతరం వారి భౌతిక శరీరాన్ని సిసిలీలోని పునీత కల్లిస్టరి సమాధుల ఆవరణలో భూస్థాపితం చేశారు. పునీత సిసీలియ దేవాలయంకూడ నిర్మంపబడి వారియొక్కయు వారి భర్త, మరిది మరియు మాక్సిమస్ వారల అవశేషాలన్నీ ఆ దేవాలయంలో భద్రపర్చబడ్డాయి. ఇందుకు 1వ పాస్కల్ జగద్గురువులు ఎంతో కృషిచేసి సుమారు 2,300 మంది అజ్ఞాత వేదసాక్షులకు వెలుగు కల్పించారు క్రీ||శ|| 817లో. క్రీ||శ|| 1599లో ఆయమ్మ సమాధిని త్రవ్విచూడగా అది చెక్కుచెదరక నిద్రిస్తున్నట్లుంది.

పునీత సిసీలియమ్మగారికి చిహ్నంగా ఒక సంగీత పనిముట్టు చూపింపబడుతోంది. ఈ కన్య గొప్ప “వాడని పుష్పం" వేదసాక్షి. ఈమె తన ప్రక్కన నిలిచిన తన కావలిదూత దేవుని స్తుతిస్తుండగా ఆలకించి, తానూ దేవుని స్తుతించింది. అందుకే ఆయమ్మను సంగీత కళాకారులు, గాయకులు, సంగీత సాధనాల తయారీదారులు, కవులకు పాలక పునీతురాలుగా శ్రీసభ ఏర్పాటుచేసింది. సెశీలియ లేక సిసిలియా అనగా గ్రుడ్డి అని అర్థం.

It is under the emperor Alexander Severus that this young Saint, one of the most fragrant flowers of Christian virginity and martyrdom, suffered for the Faith she had chosen; to choose it was at that moment as certain an end to earthly felicity as it is a guarantee, at every epoch, of the eternal felicity of those who remain faithful to it. Cecilia was the daughter of an illustrious patrician, and was the only Christian of her family; she was permitted to attend the reunions held in the catacombs by the Christians, either through her parents' condescension or out of indifference. She continually kept a copy of the holy Gospel hidden under her clothing over her heart. Her parents obliged her, however, despite her vow of virginity, which most probably they knew nothing of, to marry the young Valerian, whom she esteemed as noble and good, but who was still pagan.

During the evening of the wedding day, with the music of the nuptial feast still in the air, Cecilia, this intelligent, beautiful, and noble Roman maiden, renewed her vow. When the new spouses found themselves alone, she gently said to Valerian, Dear friend, I have a secret to confide to you, but will you promise me to keep it? He promised her solemnly that nothing would ever make him reveal it, and she continued, Listen: an Angel of God watches over me, for I belong to God. If he sees that you would approach me under the influence of a sensual love, his anger will be inflamed, and you will succumb to the blows of his vengeance. But if you love me with a perfect love and conserve my virginity inviolable, he will love you as he loves me, and will lavish on you, too, his favors. Valerian replied that if he might see this Angel, he would certainly correspond to her wishes, and Cecilia answered, Valerian, if you consent to be purified in the fountain which wells up eternally; if you will believe in the unique, living and true God who reigns in heaven, you will be able to see the Angel. And to his questions concerning this water and who might bestow it, she directed him to a certain holy old man named Urban.

That holy Pontiff rejoiced exceedingly when Valerian came to him the same night, to be instructed and baptized; his long prayer touched the young man greatly, and he too rejoiced with an entirely new joy in his new-found and veritable faith, so far above the religion of the pagans. He returned to his house, and on entering the room where Cecilia had continued to pray for the remainder of the night, he saw the Angel waiting, with two crowns of roses and lilies, which he would place on the head of each of them. Cecilia understood at once that if the lilies symbolized their virginity, the roses foretold for them both the grace of martyrdom. Valerian was told he might ask any grace at all of God, who was very pleased with him; and he requested that his brother Tiburtius might also receive the grace he had obtained; and the conversion of Tiburtius soon afterwards became a reality.

The two brothers, who were very wealthy, began to aid the families which had lost their support through the martyrdom of the fathers, spouses, and sons; they saw to the burial of the Christians, and continually braved the same fate as these victims. In effect they were soon captured, and their testimony was such as to convert a young officer chosen to conduct them to the site of their martyrdom. He succeeded in delaying it for a day, and took them to his house, where before the day was ended he had decided to receive Baptism with his entire family and household. The two brothers offered their heads to the sword; and soon afterward the officer they had won for Christ followed them to the eternal divine kingdom. It was Cecilia who saw to the burial of all three martyrs. She then distributed to the poor all the valuable objects of her house, in order that the property of Valerian might not be confiscated according to current Roman law, and knowing that her own time was close at hand.

She was soon arrested and arraigned, but having asked a delay after her interrogation, she assembled those who had heard her with admiration and instructed them in the faith; the Pontiff Urban baptized a large number of them. The death appointed for her was suffocation by steam. Saint Cecilia remained unharmed and calm, for a day and a night, in the calderium, or place of hot baths, in her own palace, despite a fire heated to seven times its ordinary violence. Finally, an executioner was sent to dispatch her by the sword; he struck with trembling hand the three blows which the law allowed, and left her still alive. For two days and nights Cecilia would lie with her head half severed, on the pavement of her bath, fully sensible and joyfully awaiting her crown. When her neophytes came to bury her after the departure of the executioner, they found her alive and smiling. They surrounded her there, not daring to touch her, for three days, having collected the precious blood from her wounds. On the third day, after the holy Pontiff Urban had come to bless her, the agony ended, and in the year 177 the virgin Saint gave back her glorious soul to Christ. It was the Supreme Pontiff who presided at her funeral; she was placed in a coffin in the position in which she had lain, as we often see her pictured, and interred in the vault prepared by Saint Callixtus for the Church's pontiffs. The authentic acts of her life and martyrdom were prepared by Pope Anteros in the year 235. When the tomb was opened in 1599 her body was entirely intact still.

Add new comment

2 + 4 =