SAINT OF THE DAY – November 17 హంగరీ దేశ పునీత ఎలిజబెత్|ST. ELIZABETH OF HUNGARY

(రాణి, వితంతువు, లౌకిక ఫ్రాన్సిస్క న్ సభ పాలక పునీతురాలు, రొట్టె తయారీ దారులు, నర్సులు, పరామర్శచేయు పరిచారకుల పాలక పునీతులు, మతసాక్షి,క్రీ||శ|| 1207 - 1231) హంగేరి దేశ పునీత ఎలిజబెత్ గారి ఆదర్శం ఎంత మహత్తరమైనది ! ఒక రాజుకు భార్యగా యువరాజుకు తల్లిగా ఒక పునీతగా ప్రసిద్దిచెందింది. ఆమె జీవితమే మన మనస్సుల్లో హత్తుకునే గొప్ప సందేశం. హృదయాల్లో ప్రభావంచూపే అమూల్యమైన గుణపాఠం. తద్వారా మన జీవితాల్లో దేవునికి మొదటి స్థానమిస్తాం. వారిని సంపూర్ణంగా ప్రేమిస్తాం. అలాగే మన ఇరుగు పొరుగు వారిని కూడ క్రీస్తుకోసం ప్రేమిస్తామనడంలో సందేహం లేదు.

ఎలిజబెత్ తండ్రి పేరు 2 అంద్రియ రాజు. హంగేరిదేశ పాలకుడు. తల్లి రాణీ జెత్రుత. హంగేరిలోని పోస్సోని అనే ఊళ్లో క్రీ|||| 1207లో ఎలిజబెత్ జన్మించారు. వీరికి నాలుగేండ్ల ప్రాయంలో జర్మనీలోని ప్రఖ్యాత 'తూరింజియా' విజ్ఞాన కేద్రంలో విద్యనభ్యసించేందుకు చేర్పించారు. రోజుల్లో చిన్నప్పుడే ఫలానా అమ్మాయిని ఫలానా అబ్బాయికిచ్చి భవిష్యత్తులో వారికి యుక్తవయస్సు వచ్చాక పెండ్లి జరిపిస్తామని ఒప్పందాలు కుదిరేవి. అలాగే జర్మనీలోని తూరింజియా రాజకుమారుడు హెర్మను ఎలిజబెత్ గారినిచ్చి వివాహం జరిపించాలని పెద్దలు నిశ్చయించారు. బాల్యం నుండి ఎలిజబెత్ దైవభక్తిలోను, పుణ్య కార్యాలు ఆచరించడంలోను ఎక్కువ శ్రద్ధ కనబరిచేవారు.

వీరికి 7 సంవత్సరాల ప్రాయమున్నప్పుడు తల్లి జెత్రుత పరమపదించింది. పెండ్లాడబోయే రాకుమారుడు హెర్మన్ కూడ అకస్మాత్తుగా మరణం సంభవించింది. సమయంలో బాల్యంనుండి భక్తితో వర్ధిల్లుచుండిన వారి రెండవ రాకుమారుడు, పదకొండేండ్ల లూయిస్ కు ఎలజబెత్ నివ్వాలని నిశ్చయించారు.ఆ ప్రకారంగా లూయిస్ కు 21 సం||లు ఎలిజబెత్ గారికి 14 సం||లప్పుడు వారికి వివాహమయ్యింది.ఆ దంపతులిద్దరూ ఎంతో ఆదర్శవంతంగా తమ దాంపత్య జీవితాన్ని కొనసాగించారు. భగవంతుని కృపవల్ల వారికి హెర్మన్ పేరుతో ఒక అబ్బాయి ముగ్గురు అమ్మాయిలు కలిగారు. కాని కొడుకు పుణ్యకార్యాలు చేయడు, ఉపవాసముండడు. ప్రార్థనచేయటం మాత్రం ఎలిజబెత్ గారు విడనాడలేదు. వారు చేసే ప్రతి పనికి లూయిజ్ పూర్తి మద్దతు అందించేవాడు. వారు పేదలవద్దకు వెళ్లి, వారిని ఆదుకోవడం, రోగులను పరామర్శించటాన్ని లూయిజ్ శ్లాఘించేవాడు. ఎలిజబెత్ గారికి వివాహమైన మొదటి సంవత్సరంలో జర్మనీకి ఫ్రాన్సిస్కన్ సభ సన్యాసులు రావడంతో, ఎలిజబెత్ ఫ్రాన్సిస్ వారి లౌకికసభ అయిన మూడవ సభలో చేరారు. సంఘటన ఫ్రాన్సిస్ అస్సిసిగారికి ఎంతో ప్రోత్సాహం, ఊరట అందించింది

క్రీ|||| 1231 నవంబరు 17 వీరు స్వర్గస్తులయ్యారు. అప్పటికి వీరి వయస్సు కేవలము 24 ఏండ్లు. వీరి మరణానంతరం వీరి సమాధి వద్ద అనేక అద్భుతాలు జరిగాయి. నాలుగేండ్ల అనంతరం 9 గ్రెగొరి పోప్ గారు వీరికి పునీత పట్టానిచ్చి గౌరవించారు. పునీత ఫ్రాన్సిస్ అస్సీసిగారు పునీత క్లేర్ గారి మధ్య పునీత ఎలిజబెత్ గారు నిలబడిన చిత్రపటాలు వెలువరింపబడ్డాయి. అస్పీసిలోని పునీత ఫ్రాన్సిసుగారి బసిలికా గుడిలో కిటికీ అద్దాల్లో వీరి చిత్తరువు చోటుచేసుకోబడి గౌరవింపబడ్డారు.క్రీ|||| 1539 వరకు వీరి సమాధి గొప్ప పుణ్యక్షేత్రంగా ప్రఖ్యాతిగాంచింది. తర్వాత ప్రొటెస్టెంట్ ఉద్యమకారులు వీరి సమాధిని పెకలించి పవిత్ర అవశేషాల్ని తీసుకువెళ్లారు. పునీత హంగేరీ ఎలిజబెత్ గారు ఫ్రాన్సిసుసభ సభ్యులకు,రొట్టెలు తయారు చేసేవారికి పాలక పునీతులుగా ఉన్నారు. ఎలిజబెత్ అనగా దేవుడు చేసిన ప్రమాణం, దైవారాధకుడు అని అర్థం.

Elizabeth was the daughter of the just and pious Andrew II, king of Hungary, the niece of Saint Hedwig, and the sister of the virtuous Bela IV, king of Hungary, who became the father of Saint Cunegundes and of Saint Margaret of Hungary, a Dominican nun. Another of her brothers was Coloman, King of Galicia and prince of Russia, who led an angelic life amid the multiple affairs of the world and the troubles of war.

She was betrothed in infancy to Louis, Landgrave of Thuringia, and brought up from the age of four in his father's court. Never could she bear to adopt the ornaments of the court for her own usage, and she took pleasure only in prayer. She would remove her royal crown when she entered the church, saying she was in the presence of the Saviour who wore a crown of thorns. As she grew older, she employed the jewels offered her for the benefit of the poor. Not content with receiving numbers of them daily in her palace, and relieving all in distress, she built several hospitals, where she herself served the sick, bathing them, feeding them, dressing their wounds and ulcers. The relatives of her fiancé tried to prevent the marriage, saying she was fit only for a cloister; but the young prince said he would not accept gold in the quantity of a nearby mountain, if it were offered him to abandon his resolution to marry Elizabeth.

Once as she was carrying in the folds of her mantle some provisions for the poor, she met her husband returning from the hunt. Astonished to see her bending under the weight of her burden, he opened the mantle and found in it nothing but beautiful red and white roses, though it was not the season for flowers. He told her to continue on her way, and took one of the marvelous roses, which he conserved all his life. She never ceased to edify him in all of her works. One of her twelve excellent Christian maxims, by which she regulated all her conduct was, Often recall that you are the work of the hands of God and act accordingly, in such a way as to be eternally with Him.

When her pious young husband died in Sicily on his way to a Crusade with the Emperor Frederick, she was cruelly driven from her palace by her brother-in-law. Those whom she had aided showed nothing but coldness for her; God was to purify His Saint by harsh tribulations. She was forced to wander through the streets with her little children, a prey to hunger and cold. The bishop of Bamberg, her maternal uncle, finally forced the cruel prince to ask pardon for his ill treatment of her, but she voluntarily renounced the grandeurs of the world, and went to live in a small house she had prepared in the city of Marburgh. There she practiced the greatest austerities. She welcomed all her sufferings, and continued to be the mother of the poor, distributing all of the heritage eventually conceded to her, and converting many by her holy life. She died in 1231, at the age of twenty-four

Add new comment

12 + 2 =