SAINT OF THE DAY – November 16 పునీత స్కాట్ లాండ్ మర్గరీతమ్మ |ST. MARGARET OF SCOTLAND

(రాణి మరియు స్కాట్ లాండ్ పాలక పునీతురాలు క్రీ|||| 1046 - 1093) ఇంగ్లాండు రాజైన ఎడ్మండు కుమారుడు ఎడ్వర్డు (వీరు దేశ బహిష్కుతులయినారు) కాగా యువరాజు ఎడ్వర్డు జర్మనీ యువరాణి అయిన అగతమ్మను పెండ్లాడాడు. అగతమ్మ హంగేరీ దేశరాజైన పునీత స్టెఫెనుగారి సోదరుడు లేక సోదరీ బిడ్డ. అయితే ఎడ్వర్డు, అగతమ్మల ముద్దుల బిడ్డగా పునీత మర్గరీతమ్మగారు క్రీ|||| 1046లో హంగేరి దేశంలో రాజ భవంతిలో జన్మించింది. అక్కడే పునీత స్టెఫెనుగారి రాజ భవనంలో తిరుగాడుతూ పెరిగింది. వీరి కుటుంబం హంగేరి నుండి తిరిగి ఇంగ్లాండు చేరుకుంది.

కాని క్రీ|||| 1066లో హేస్టింగ్సు యుద్ధంలో శత్రురాజులు విజయం సాధించడంతో వీరి రాజకుటుంబం తిరిగి పారిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో స్కాట్లాండులోని 3 మాల్కం రాజు రాజకుటుంబానికి ఆశ్రయం కల్పించాడు. క్రీ|||| 1070లో 24 సం|| ప్రాయంలో యువ మర్గరీతమ్మగారు స్కాట్లాండురాజైన 3 మాల్కంనే వివాహమాడారుఆరుగురు కుమారులు ఇద్దరు కుమార్తెలు కలిగారు. మగరీతమ్మగారు తన భర్తపట్ల అధిక ప్రభావం చూపించారు. భర్త కోప తాపాలకు లోనుకాకుండా పని ఆలోచనలకు ప్రేరణ నిచ్చేవారు. ఆ అమ్మ మాతృకవల్ల రాజు సత్పరిపాలకులుగా పేరు సాధించుకున్నారు. సత్యవేదాన్ని సద్విద్యను ప్రజలకు బాగా అందుబాటులోకి తేకలిగారు. ఉత్తమ సంస్కృతి, దాతృత్వ కార్యాల్ని ప్రజలకు అబ్బేలా చేయకలిగారు. ఆ అమ్మ సూచనల మేరకు అనేక దేవాలయాల్ని వెలయింపచేయడమైంది.

రాణి మర్గరీతమ్మగారు తమకువలె తమ పిల్లల్ని కూడ విశ్వాసంలోను ప్రేమలోను క్రమశిక్షణలోను పెంచారు. రాబోయే రోజులు రాణీలగు పిల్లలో తల్లి సుగుణాలైన పట్టుదల, ప్రార్థన, పేదలపట్ల ఆదరణ లక్షణాలు పెంపొందసాగాయి. తల్లి వారసత్వమైన ఆథ్యాత్మిక సంపదలు వారికి సమకూరాయి. ఆ అమ్మ తమ పిల్లలకు క్రింది జీవిత సూత్రాలను బోధించారు. -ఒక్కనాడైన పాపంకు లొంగిపోయేబదులు వేయి పర్యాయాలైనా మరణించాలి. - అతి పవిత్ర దేవుని గౌరవించి పూజించాలి. -దేవుని తల్లి కన్యమరియాంబ పట్ల గౌరవ మర్యాదలు ప్రదర్శించాలి. - పేదలపట్ల ఆదరణ కలిగి దిక్కులేని వారి సంరక్షణకు వారి అవసరాలు తీర్చడానికి దాన ధర్మ స్వభావం ప్రదర్శించాలి. 

  • - దుర్భాషలను ద్వేషించాలి.
  • -ఆత్మ అపరిశుభ్రతను అసహ్యించుకోవాలి.
  • - మచ్చలేని జీవితం గడిపే మనుష్యులతోనే సంభాషించాలి. వారి తీర్పుల్ని,సలహాల్ని పాటించాలి.
  • - కతోలిక విశ్వాసాన్ని కాపాడటంలో స్థిరంగా దృఢంగా చపలత్వం లేకుండా ఉండాలి.

ఆదర్శ క్రైస్తవ పుణ్యాలకు మర్గరీతమ్మ మార్గదర్శకమయ్యారు.  పునీత మర్గరీతమ్మగారు క్రీ|||| 1093 నవంబరు 16 తేదీన దీర్ఘనిద్రకు ఉపక్రమించి పరలోక రాజ్యం చేరుకున్నారు. మార్గరేట్ లేక మర్గరీత అంటే ముత్యం, రత్నం అని అర్థం.

Saint Margaret's name signifies pearl, a fitting name, says Theodoric, her confessor and her first biographer, for one such as she. Her soul was like a precious pearl; a life spent amidst the luxury of a royal court never dimmed its luster or estranged it from Him who had bought it with His blood. She was the granddaughter of an English king; in 1070 she became the bride of Malcolm of Scotland, thereafter reigning as Queen until her death in 1093.

How did she become a Saint in a position where sanctity is so difficult? First, she burned with zeal for the house of God. She built churches and monasteries; she occupied herself by making vestments; she could not rest until she saw the laws of God and His Church observed throughout her realm. Next, amid a thousand cares, she found time to converse with God, ordering her piety with such sweetness and discretion that she won her husband to sanctity like her own. He would rise at night to pray with her; he loved to kiss the holy books she used, and sometimes would take them away with him, bringing them back later to his wife covered with jewels. Lastly, despite Saint Margaret's great virtue, she wept constantly over her sins and begged her confessor to correct her faults.

Saint Margaret did not neglect her duties in the world even if she was not of the world. God blessed this marriage with eight children, six princes and two princesses who did not fail to respond to their mother's teaching and examples. Never was there a better mother; she spared no pains in their education, and their sanctity was the fruit of her prudence and her zeal. And never was there a better queen. She was the most trusted counselor of her husband, who always found her counsels of great utility, and she labored with him for the spiritual and material improvement of the land. Malcolm, after having pacified his domains for several years, saw to the building of the cathedral of Durham and founded a monastery at Dumfermlin.

Living in the midst of all the world's pleasures, Saint Margaret sighed for the true homeland and viewed death as a release. On her deathbed she learned that her husband and their eldest son had been slain in battle. She thanked God for sending this last affliction as a penance for her sins. After receiving Holy Viaticum, she repeated the prayer from the Missal, O Lord Jesus Christ, who by Thy death didst give life to the world, deliver me. And at the words deliver me, says her biographer, her soul took flight to Christ, in 1093, in her forty-seventh year.

Add new comment

5 + 3 =