SAINT OF THE DAY – November 14 పునీత లారెన్సు ఓటూల్ (లార్కన్)|ST. LAWRENCE O TOOL

ఐరిష్ శాంతి స్థాపకుడు, డబ్లిన్ అగ్రపీఠాధిపతి క్రీ||శ|| 1125 - 1180 పునీత లారెన్సుగారు ఐర్లాండుదేశంలో డెర్మెట్ కోట దాపునగల కిళ్తేరు గ్రామంలో క్రీ॥శ॥ 1125లో పుట్టారు. తండ్రి ముర్రేయుల నాయకుడైన ముర్తాగ్. తన కుమారుని పది సంవత్సరాల ప్రాయంలో లీయోనిస్టరు రాజైన డెర్మోట్ మెక్ ముర్కాడ్ ఆస్థానంలో 2 సం||లు తాకట్టుగా విడిచి పెట్టి పోయాడు. ఆ పిల్లవానియెడ రాజు చాలా అమానుషంగా ప్రవరి వాడు. చిన్న పొరపాటుకుకూడ శిక్షించేవాడు. రెండు సం||లు ఇలాగే గడు పోయాయి. అనంతరం ఒప్పందం ప్రకారం ఆ బాలుని గైండాలాఫ్ పట్టణంలోని బిషప్పుగారి వద్దకు పంపించబడ్డాడు. ఆ పీఠం విక్లో అనే చిన్న రాజ్యంలో ఉండేది.

పెరుగుతున్న లారెన్సు బాలుడు గొప్ప భక్తి విశ్వాసాలు ప్రదర్శిస్తూ, పవిత్రాలు అనుగ్రహాలతో నింపబడి ఆదర్శ పుణ్యాత్ముడుగా జీవించాడు. అటు పిమ్మట ఒక సన్యాసి గురువుగా అభిషేకం పొందాడు. ఇంతలో బిషప్ అస్తమించగా పీఠంతోపాటు స్థానిక మఠాలయంకు కూడ ఖాళీ అయ్యింది. క్రీ||శ|| 1150లో మఠాలయంకు అధిపతిగా ఎంపికచేయబడ్డారు. అప్పటికి వారి వయస్సు కేవలం 25 సం||లు.

వారి మేత్రాసనం ఆదాయపరంగా ధనవంతమైనది. కాని ప్రధాన మఠాధిపతి లారెన్సుగారు మాత్రం పేదరికానికే ప్రాధాన్యతనిస్తూ ఆదాయాన్ని పేదలు అనాథలకు పంచి పెడుతుండేవారు. తమ మఠంలోని సభ్యులను పుణ్య జీవితంలో నడుపుతూ క్రైస్తవ విశ్వాసం ప్రబలంచేశారు. కాగా క్రీ||శ|| 1161లో పునీత లారెన్సుగారు డబ్లిన్ మెట్రోపాలిటను (అగ్ర) పీఠంకు అధిపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. వారు తమ శాయశక్తులా క్రైస్తవ మత వ్యాప్తికి కృషిచేశారు. గురువులు విశ్వాసులకు కఠిన నిబంధనలతో క్రమ శిక్షణలో కొనసాగింపజేశారు.

క్రీ||శ|| 1171లో ఆర్చిబిషప్ లారెన్సుగారు తమ మేత్రాసన సమస్యల విషయమై మాట్లాడేందుకు ఇంగ్లాండును పాలించే 2వ హెన్రి రాజును కలిసేందుకు వెళ్లారు. అప్పట్లో రాజు కాంటర్బరి పట్టణంలో నివాసముండేవారు. కాంటర్బరీలో కాలుమోపిన లారెన్సుగారికి అడుగడున సన్మానాలే. ముఖ్యంగా అక్కడ ఉన్న క్రైస్ట్ చర్చికి చెందిన బెనెడిక్టుసభ గురువులు వారికి సాదరంతో ఆతిథ్యమిచ్చారు. ఆ మరుసటి రోజు లారెన్సుగారు పూజా వస్త్రాలతో పూజచేయడానికి పీఠం వద్దకు వెళ్తుండగా ఒక వెట్టివాడు ప్రక్కనున్న ఒక వ్యక్తి తల పై చావు దెబ్బకొట్టాడు. తల పగిలి రక్తం కారుతోంది. అది ఆపడం వల్లకానిపని. కాని లారెన్సుగారు వెంటనే నీళ్లు తెప్పించి ఆశీర్వదించి ఆ నీటితో గాయాన్ని కడుగగా అతడు వెంటనే స్వస్థత పొందాడు. వెర్రివాడుకూడ బాగయ్యాడు. అటుపిమ్మట బిషప్ లారెన్సుగారు యధావిధిగా దివ్యబలిపూజను అర్పించారు.

క్రీ||శ|| 1175లో ఐర్లాండు నియంత రోడ్ రిక్ రాజు చేష్టలకు ఇంగ్లాండు 2వ హెన్రిరాజుకు అవమానం జరుగగా యుద్దంకు దారితీసింది. అప్పుడు లారెన్సు గారే ఇంగ్లాండు వచ్చి రాజుతో శాంతి చర్చలు జరిపి సఫలుడయ్యారు. హెన్రిరాజు లారెన్సుగారి భక్తి విశ్వాసాలు, న్యాయం, పెద్దరికంకు ఎంతో మెచ్చుకున్నారు. వారు ఎట్లా చెబితే అట్లా అని సమ్మతి నమ్మకం తెలియజేసి శాంతి స్థాపకులయ్యారు. తిరుగు ప్రయాణంలో లారెన్సుగారు నార్మండి పొలిమేరల్లోని 'యు' అనుగ్రామంలో క్రీ||శ|| 1180 నవంబరు 14న మరణించారు. వారి భౌతిక కాయాన్ని 'యు' మఠాశ్రమంలోనే ఖననంచేశారు. లారెన్సునే లాటిను భాషలో లారెల్ అంటారు. లారెల్ అనగా తళతళలాడే పెద్ద ఆకులు గల తమాల వృక్షం, విజయ సూచికం అని అర్థం .

Saint Laurence was the son of the king of Leinster in Ireland, born about the year 1125. His birth caused such great joy to his father, that in thanksgiving, to honor Christ, he pardoned a vassal who was an enemy and even chose him for sponsor of the child. They were stopped on the way to church by a man who was regarded as a prophet, and who told them in verse that the child would be magnificent on earth and glorious in heaven, and that his name must be Laurence. Though the king had decided otherwise, the infant was indeed given that name of predilection.

When only ten years old, his father delivered him up as a hostage to a rival prince who required this gage of his sincerity when there was a question of a treaty of peace, but who treated the child with great inhumanity, leaving him to suffer hunger and cold and other incommodities until his health was nearly ruined. His father, hearing of this, by menaces obliged the tyrant to put him temporarily in the hands of the Bishop of Glendenoch in the county of Wicklow. The holy youth was soon cured and, by his fidelity in corresponding with the divine grace, he grew to be a model of virtues. When his father came for him, he declared he desired to enter into the service of the Church and remain with the good bishop. To this his father willingly agreed.

On the death of the bishop, who was also Abbot of a monastery of the same city, Saint Laurence was chosen Abbot in 1150, though only twenty years old, and doubting his competence. Nonetheless he governed with a paternal spirit, employing all his revenues during a famine in the province, to procure food for the needy, remedies for the sick, and aid of all kinds for the unfortunate. Never did he use his revenues, even when prosperity returned, for anything but care of the poor, repairs for ruined or decrepit churches or the construction of new ones, and the foundation of hospitals. When the see of Glendenoch became vacant once more in 1161, it was Saint Laurence who was chosen to fill it; and although he could not resolve to accept that new dignity, he was obliged soon afterwards to become Archbishop of Dublin, and he was told that to refuse would be to resist the Will of God.

He established a regular life for the Canons of his cathedral, according to the example of Saint Augustine, and he himself followed all the rules with exactitude, sharing their table, their prayer and their silence. Each year he made a retreat of forty days in a cavern a few miles from the city, fasting on bread, water and vegetables. When he came forth afterwards he preached with so much zeal against the disorders of the province, that even hardened hearts could not resist the force of his words.

About the year 1171 Saint Laurence was obliged, for the affairs of his diocese, to go to England to see the king, Henry II, who was then at Canterbury. He was received by the Benedictine monks of Christ Church with the greatest honor and respect. On the following day, as the holy Archbishop was advancing to the altar to officiate, a maniac, who had heard much of his sanctity and who thought it would be a gift to the Church to make of him another martyr in the likeness of Saint Thomas Becket, struck him a violent blow on the head. All present concluded that he was mortally wounded; but the Saint recovered his senses and asked for some water, which he blessed. He then requested that the wound be washed with it, and the blood was immediately stanched; and the archbishop celebrated Mass. He obtained the offender's pardon from the king. His prayers brought about many miracles, including the return to their senses for those who had become alienated, a miracle rare in the history of religion. After he attended a General Council in Rome in 1179, the Pope made him his legate for all of Ireland, and he visited all its provinces to re-establish ecclesiastical discipline everywhere.

In 1175 Henry II of England became offended with Roderick, the monarch of Ireland, and Saint Laurence undertook another journey to England to negotiate a reconciliation between them. Henry was so moved by his piety, charity and prudence that he granted him everything he asked, and left the whole negotiation to his discretion. Saint Laurence died while still in France, in the city of Eu on the border of Normandy and Picardy. He was unable to make a testament, as this perfect Archbishop had given all he had, and literally had nothing to leave to others. He ended his journey here below on the 14th of November, 1180, and was buried in the church of the abbey at Eu.

Add new comment

8 + 0 =